
సాక్షి, వరంగల్ రూరల్ : మేడారం సమ్మక్క– సారలమ్మ జాతరలో మద్యం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. జాతర సందర్భంగా ఎక్సైజ్ శాఖ అధికారులు 22 షాపుల ఏర్పాటుకు ఈనెల 2 నుంచి 8వ తేదీ వరకు అనుమతి ఇచ్చారు. ఒక్కో మద్యం షాపు రోజుకు రూ.9 వేల అద్దె చొప్పున ఏడు రోజులకు రూ.12.5 లక్షల ఆదాయం ఎక్సైజ్ శాఖకు లభించింది. ఇప్పటి వరకు రూ.4.57 కోట్ల విలువైన మద్యం విక్రయాలు జరిగాయి. కాగా, గత జాతరలో రూ.3.53 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి.