
'మంత్రిగారితో చెప్పినా తీయించలేకపోయారు'
మద్యం అమ్మకాలపై మంత్రికి ఫిర్యాదు చేసినా బెల్టుషాపులను తీయించలేక లేకపోయారని, ఆదాయం కోసం అడ్డదారులు తొక్కుతున్నారని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆరోపించారు.
అమరావతి: మద్యం అమ్మకాలపై మంత్రికి ఫిర్యాదు చేసినా బెల్టుషాపులను తీయించలేక లేకపోయారని, ఆదాయం కోసం అడ్డదారులు తొక్కుతున్నారని బీజేపీ ఎమ్మెల్సీ సోమువీర్రాజు ఆరోపించారు. అమరావతిలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. '5 కోట్ల మంది జనాభాలో కోటి మంది మద్యం తాగుతున్నారు. కోటి మంది రోజుకు ఒక్కొక్కరు రూ.30 చొప్పున అదనంగా కోల్పోతున్నారు. అంటే నెలకు రూ.900 కోట్లు, ఏడాదికి 10,000 కోట్ల రూపాయలను ఎక్సైజ్ డిపార్ట్ మెంట్, సారా సిండికేట్ దోచేస్తున్నాయి' అని చెప్పారు.
కాకినాడలో మత్స్యకారులు ఉండే ఒక ప్రాంతంలో 25 బెల్టు షాపులున్నాయని, ఎక్సైజ్ కమిషనర్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్‌తో మాట్లాడినా పట్టించుకోలేదని తెలిపారు. మంత్రిగారితో చెప్పినా బెల్టుషాపులను తీయించలేక పోయారని, ఆదాయం తగ్గిపోతుందేమోనన్న భయంతో బెల్టు షాపులను తీయకపోవడం దారుణమని ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.