MLC somu virraju
-
టీడీపీపై సోము వీర్రాజు ఫైర్..!
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వ నిధుల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట మారుస్తున్నారని బీజేపీ ఎమ్మెల్సీ, సీనియర్ నేత సోము వీర్రాజు మండిపడ్డారు. ఏపీకి కేంద్రం ఎక్కువసాయం చేసిందని స్వయంగా సీఎం చంద్రబాబే చెప్పారని గుర్తుచేశారు. ఇప్పుడెందుకు ఆయన మాట మారుస్తున్నారని ప్రశ్నించారు. కేంద్రం నిధుల విషయంలో టీడీపీ నేతలు చేస్తున్న అసత్య ప్రచారానికి తెరదించుతామని ఆయన అన్నారు. విజయవాడలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదాను ఐదేళ్లు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ఎందుకు విభజన బిల్లులో చేర్చలేదని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా అంశాన్ని విభజన బిల్లులో చేర్చలేదని, కేవలం పరిశీలిస్తామని మాత్రమే చెప్పారని, అందుకే కేంద్రం ఆర్థిక సాయం చేసేందుకు ముందుకొచ్చిందని అన్నారు. విభజన బిల్లులో పేర్కొన్న కేంద్ర సంస్థలను ఏపీలో నెలకొల్పామన్నారు. ప్రత్యేక ప్యాకేజీపై చంద్రబాబు మాటమారుస్తున్నారని తెలిపారు. కేంద్రం అన్నీ ఇచ్చిందని, సంతృప్తిగా ఉన్నామని సీఎం చంద్రబాబుతోపాటు కేంద్రమంత్రి సుజనా చౌదరి గతంలో పేర్కొన్నారని, కేంద్రాన్ని ఇంతకంటే అడగలేమని సుజనా చౌదరి చెప్పారని గుర్తుచేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. ఏపీకి 16 యూనివర్సిటీలు మంజూరు చేశాం రాజధాని నిర్మాణానికి రూ. 2500 కోట్లు ఇచ్చాం ప్రత్యేక హోదాకు బదులుగా ఇచ్చే నిధులను రాష్ట్రవ్యాప్తంగా వినియోగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వద్ద ప్రణాళిక ఉందా? ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రణాళికను విడుదల చేయాలి ప్రత్యేక హోదా లేదని పెట్టుబడిదారులెవరూ వెనక్కి వెళ్లడం లేదు రాష్ట్రానికి వేలకోట్ల పెట్టుబడులు వచ్చాయని స్వయంగా చంద్రబాబే చెప్పారు విశాఖలో రైల్వేజోన్ ఏర్పాటుకు కేంద్రం సిద్ధంగా ఉంది దుగరాజుపట్నం పోర్టు విషయంలో స్థలం చూపించాలని కేంద్రం రాష్ట్రాన్ని ఎప్పుడో కోరింది కానీ రాష్ట్ర ప్రభుత్వమే ఇప్పటివరకు స్పందించలేదు కడపలో స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు అంశం కేంద్రం పరిశీలనలో ఉంది దీనిపై కేంద్రం ఇప్పటికే కొంత కసరత్తు ప్రారంభించింది విభజన చట్టంలో ఉన్నదానికంటే కేంద్రం ఎక్కువే చేస్తోంది రాష్ట్రంలో నిరంతర విద్యుత్ సరఫరా కేంద్రం వల్లే సాధ్యమైంది వెనుకబడిన జిల్లాలకు కేంద్రం ఇప్పటివరకు రూ. 1500 కోట్లు ఇచ్చింది వాటిని ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారో రాష్ట్ర ప్రభుత్వం చెప్పలేదు విభజన చట్టంలోని హామీలను పదేళ్లలో పూర్తి చేయాల్సి ఉంది కానీ కేంద్రం ఇప్పటికే చాలా చేసేసింది పోలవరం నిర్మాణానికి కేంద్రం కట్టుబడి ఉంది కాంగ్రెస్ ఒప్పుకోకపోయినా.. పోలవరం కోసం ముంపు మండలాలను మేం ఏపీలో కలిపాం 2019 కల్లా పోలవరాన్ని పూర్తి చేస్తామని గడ్కరీ చెప్పారు.. ఈ విషయంలో ఎవరికీ అనుమానాలు అక్కరలేదు -
'మంత్రిగారితో చెప్పినా తీయించలేకపోయారు'
-
'మంత్రిగారితో చెప్పినా తీయించలేకపోయారు'
అమరావతి: మద్యం అమ్మకాలపై మంత్రికి ఫిర్యాదు చేసినా బెల్టుషాపులను తీయించలేక లేకపోయారని, ఆదాయం కోసం అడ్డదారులు తొక్కుతున్నారని బీజేపీ ఎమ్మెల్సీ సోమువీర్రాజు ఆరోపించారు. అమరావతిలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. '5 కోట్ల మంది జనాభాలో కోటి మంది మద్యం తాగుతున్నారు. కోటి మంది రోజుకు ఒక్కొక్కరు రూ.30 చొప్పున అదనంగా కోల్పోతున్నారు. అంటే నెలకు రూ.900 కోట్లు, ఏడాదికి 10,000 కోట్ల రూపాయలను ఎక్సైజ్ డిపార్ట్ మెంట్, సారా సిండికేట్ దోచేస్తున్నాయి' అని చెప్పారు. కాకినాడలో మత్స్యకారులు ఉండే ఒక ప్రాంతంలో 25 బెల్టు షాపులున్నాయని, ఎక్సైజ్ కమిషనర్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్‌తో మాట్లాడినా పట్టించుకోలేదని తెలిపారు. మంత్రిగారితో చెప్పినా బెల్టుషాపులను తీయించలేక పోయారని, ఆదాయం తగ్గిపోతుందేమోనన్న భయంతో బెల్టు షాపులను తీయకపోవడం దారుణమని ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. -
టీడీపీపై బీజేపీ ఏపీ నేత రుసరుస
-
టీడీపీపై బీజేపీ ఏపీ నేత రుసరుస
అమరావతి: తమ పార్టీ కార్యకర్తలను టీడీపీ ప్రభుత్వం అసలు పట్టించుకోవడం లేదని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ కార్యకర్తలకు ఇళ్లు కేటాయించడం లేదని, సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసే ఇళ్లను కూడా తమ పార్టీ శ్రేణులకు ఇవ్వడం లేదని, వాటికి ఎన్టీఆర్ పేరు పెడుతున్నారని విమర్శించారు. ఇకనైనా ఇలాంటి విధానాన్ని విడనాడాలని టీడీపీకి సూచించారు. అలాగే కేంద్ర పథకాలకు సంబంధించిన పోస్టర్లు, బ్యానర్లలో తెలంగాణలో ప్రధానమంత్రి ఫొటో పెడుతున్నారని, కానీ, ఏపీలో మాత్రం అలా చేయడం లేదని ఆక్షేపించారు. టీడీపీ మిత్రపక్షమైనా ప్రభుత్వ పథకాల్లో ప్రధాని మోదీ ఫొటో పెట్టకపోవడం బాధాకరమన్నారు. మనమంతా భరత మాత బిడ్డలమని, ఉత్తరం, దక్షిణం అన్న వాదనలొద్దని హితవు పలికారు.