ఆంధ్రప్రదేశ్ లో విచ్చలవిడి మద్యం అమ్మకాలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం దారుణమని వైఎస్సార్ సీపీ నాయకురాలు వాసిరెడ్డి పద్మ అన్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ... బీచ్ పార్లర్ల పేరుతో సముద్రతీర ప్రాంతాల్లో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని తెలిపారు. ఏపీని చంద్రబాబు మద్యాంధ్రప్రదేశ్ గా మారుస్తున్నారని మండిపడ్డారు. పాదయాత్ర సందర్భంగా మహిళలకు ఏం చెప్పారో గుర్తు చేసుకోవాలని సూచించారు. రెండున్నర కోట్ల మహిళల గోడు మీకు వినపడడం లేదా అని ప్రశ్నించారు.