బెంగుళూరు : ఇకపై మద్యంబాబులు దుకాణాల ముందు కిలోమీటర్ల కొద్దీ క్యూలు కట్టక్కర్లేదు. మీకు నచ్చిన వైన్‌షాప్, బార్, పబ్.. ఇలా ఏదో ఓ షాప్‌లో వెళ్లి మద్యం కొనుగోలు చేయోచ్చు. ఈ మేరకు కర్ణాటక ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. లాక్‌డౌన్ కారణంగా పేరుకుపోయిన తమ స్టాక్‌ను క్లియర్ చేసుకోవడానికి మద్యం విక్రయాలు జరుపుకోవడానికి వైన్ షాపుల తరహాలోనే క్లబ్బులు, బార్‌లు, రెస్టారెంట్‌లకు అనుమతినిచ్చింది. (మద్యం ఎక్కువ తాగాడని హత్య )
తాజా ఉత్తర్వుల ప్రకారం నేటి నుంచి మే 17 వరకు ఆయా దుకాణాలు రిటైల్ ధరలకు (ఎమ్ఆర్‌పి) మద్యం విక్రయాలు జరుపుకోవచ్చు. అయితే కంటైన్‌మెంట్ జోన్లు మినహా మిగతా ప్రాంతాల్లో మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుంది. అలాగే మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం లాంటి నిబంధనలు తప్పక పాటించాలి. ఉల్లంఘించిన వారి దుకాణాల లైసెన్సులు రద్దు చేస్తామని అధికారులు తెలిపారు. ఆరు నెలల షెల్ఫ్ లైఫ్ ఉన్న బీర్ లాంటివి సరైన సమయంలో విక్రయించకపోతే ఆ స్టాక్ పనికిరాకుండా పోతుందని బార్ సంఘాలు ప్రభుత్వానికి విన్నవించాయి. ఈ నేపథ్యంలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7 వరకు మద్యం విక్రయించడానికి అనుమతినిస్తూ కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment