![Telangana Highest Liquor Sales In December Last 4 Days - Sakshi](/styles/webp/s3/article_images/2022/01/2/beers.jpg.webp?itok=CV9ieMYH)
సాక్షి, హైదరాబాద్: పెరిగిన చలి, కొత్త ఏడాది ఊపుతో గతేడాది చివర్లో మందుబాబులు కేసులకు కేసులు మందు, బీర్లు లాగించేశారు. డిసెంబర్ చివరి 4 రోజుల్లో రాష్ట్రంలోని మద్యం డిపోల నుంచి సుమారు రూ.600 కోట్ల విలువైన మద్యం మార్కెట్‌లోకి వెళ్లింది. 2021, డిసెంబర్ 31న దాదాపు రూ.171 కోట్ల మద్యం అమ్ముడుపో వడం గమనార్హం. ఇక, డిసెంబర్ నెల మొత్తం మీద రూ.2,901 కోట్ల మద్యం విక్రయాలు జరిగినట్లు ఎక్సైజ్ శాఖ లెక్కలు చెబుతున్నాయి. ఈ నెలలో 40.11 లక్షల కేసుల లిక్కర్, 33.93 లక్షల కేసుల బీర్లు అమ్ముడయ్యాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
గత ఏడాదితో పోలిస్తే ఇది 27 శాతం ఎక్కువ. గత ఏడాది డిసెంబర్‌లో 33.23 లక్షల కేసుల లిక్కర్, 26.66 లక్షల కేసుల బీర్లు అమ్ముడయ్యాయి. వీటి విలువ రూ.2,276 కోట్లు. ఇక, 2021 సంవత్సరం మొత్తం మీద 2.73 కోట్ల లిక్కర్ కేసులు, 2.45 కోట్ల బీర్ కేసులు అమ్ముడయ్యాయి. వీటి విలువ రూ. 18,868 కోట్ల పైమాటే. అదే 2020లో రూ.16,254 కోట్ల విలువైన మద్యం అమ్ముడయింది. 2020తో పోలిస్తే 2021లో 16 శాతం ఎక్కువ మద్యం విక్రయాలు జరిగినట్లు ఎౖMð్సజ్ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
చదవండి: అరుదైన రాయి.. కాపాడుకోవాలోయి
Comments
Please login to add a commentAdd a comment