Beer sales
-
ఎండల దెబ్బకు తెలంగాణలో భారీగా పెరిగిన బీర్ల విక్రయాలు
-
పొంగుతున్న బీరు! ఎండల తీవ్రతతో పెరిగిన అమ్మకాలు
సాక్షి, హైదరబాద్: గ్రేటర్లో బీర్ల అమ్మకాలు పెరిగాయి. ప్రతీ వేసవిలో సాధారణంగానే బీర్లకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. మద్యం ప్రియులు లిక్కర్‌కు బదులు చల్లటి బీర్ల వైపు మొగ్గు చూపుతారు. వేసవి తాపం నుంచి ఊరట పొందేందుకు వీటిని ఆశ్రయిస్తారు. పెరిగిన బీర్ల అమ్మకాల మేరకు ఉత్పత్తి మాత్రం పెరగడం లేదు. ప్రతిరోజూ గ్రేటర్లో 60 వేల నుంచి 80 వేల కేస్లకు పైగా బీర్లు అమ్ముడవుతున్నట్లు అంచనా. మరో 20 వేల కేస్లకు డిమాండ్ ఉన్నప్పటికీ కొరత దృష్ట్యా వినియోగదారులకు అందడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వంద కేస్ల కోసం ఆర్డర్ చేసే వైన్ షాపులకు 70 కేస్ల వరకే లభిస్తున్నట్లు వైన్‌షాపుల నిర్వాహకులు తెలిపారు. ఏప్రిల్ నెలలోనే కొరత ఇలా ఉంటే మే నెలంతా బీర్ల డిమాండ్‌ను ఎదుర్కోవడం ఎలా అని వ్యాపారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే నెల మరింత డిమాండ్.. బీర్ కంపెనీల నుంచి ప్రస్తుతం రోజుకు లక్షన్నర నుంచి 2 లక్షల కేస్ల వరకు అందుతున్నాయని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రతిరోజూ లక్షన్నర నుంచి 2 లక్షల కేస్లు అమ్ముడవుతున్నట్లు అంచనా. గ్రేటర్‌లోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోనే సగానికి ఎక్కువగా బీర్ల విక్రయాలు జరుగుతున్నాయి. గతేడాది ఏప్రిల్‌లో గ్రేటర్లో సుమారు 12 లక్షల కేస్‌లకుపైగా బీర్ల అమ్మకాలు జరిగాయి. ఈసారి 15 లక్షల కేస్లకు పైగా డిమాండ్ ఉండే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మే నెలలో ఈ డిమాండ్ మరింత పెరగనుంది. ఈ మేరకు ఉత్పత్తి పెరగడం లేదని అధికారులు చెబుతున్నారు. ‘ఇప్పటి వరకు సాధారణ రోజుల్లోలాగే బీర్ల ఉత్పత్తి ఉంది. డిమాండ్ మేరకు పెరగలేదు. కానీ.. ఎండలు తీవ్రమయ్యే కొద్దీ ఉత్పత్తి పెంచాల్సి ఉంటుంది. ఈ మేరకు కంపెనీలు బీర్లను అందజేస్తాయా? లేదా? అనే అంశంపై సందిగ్ధత నెలకొంది’ అని ఒక అధికారి వివరించారు. మరోవైపు బీర్ల అమ్మకాలు పెరగడంతో మద్యం విక్రయాలు కొంత మేరకు తగ్గుముఖం పట్టినట్లు వైన్‌షాపుల నిర్వాహకులు చెప్పారు. బకాయిల పెండింగ్.. వినియోగదారుల డిమాండ్ మేరకు లక్షల కొద్దీ కేస్ల బీర్లను ఉత్పత్తి చేసే కంపెనీలు కొన్ని రోజులుగా ఉత్పత్తిని తగ్గించాయి. ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు పెండింగ్‌లో ఉండడమే ఇందుకు కారణమని వ్యాపార వర్గాలు తెలిపారు. దాదాపు రూ.4 వేల కోట్లు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. దీంతో 8 కంపెనీలు తమ ఉత్పత్తిని తగ్గించుకున్నాయి. సిబ్బంది సంఖ్యను కూడా తగ్గించారు. ఒకవైపు బీర్ల అమ్మకాలు గణనీయంగా పెరుగుతుండగా.. మరోవైపు వీటి తయారీ సంస్థలు ఉత్పత్తులను తగ్గించడం గమనార్హం. వేసవి కారణంగా నీటి ఎద్దడి కూడా బీర్ల తయారీకి ఇబ్బందిగా మారిందని పలు కంపెనీల నిర్వాహకులు చెబుతున్నారు. ‘రోజుకు లక్షన్నర నుంచి 2 లక్షల కేసుల బీర్లను ప్రస్తుతం తయారు చేస్తున్నాం. కానీ ఇదే సమయంలో గతంలో 2 లక్షల కేస్లకు పైగా కూడా ఉత్పత్తి జరిగింది. డిమాండ్ మేరకు ఉత్పత్తి పెరగాల్సి ఉండగా, వివిధ కారణాల దృష్ట్యా అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది’ అని ఒక కంపెనీ నిర్వాహకుడు విస్మయం వ్యక్తం చేశారు. 40 లక్షల లీటర్ల నీళ్లు బీర్ల ఉత్పత్తికి అవసరమని, కొద్దిరోజులుగా నీటి లభ్యత తగ్గడంతోనూ బీర్ల ఉత్పత్తిపై ప్రభావం పడిందని పేర్కొన్నారు. -
అందం చూపించొద్దన్నారు.. మందు కూడా పాయే; ఏమిటీ కర్మ?
మాములుగా ఫుట్‌బాల్ మ్యాచ్‌ల్లో లిక్కర్(మద్యం) ఏరులై పారుతుంది. మ్యాచ్‌కు వచ్చే అభిమానులు బీర్లు తాగుతూ ఫుల్‌గా ఎంజాయ్ చేయడం చూస్తుంటాం. అవి శ్రుతిమించిన సందర్భాలు కూడా కోకొల్లలు. కానీ అలా చేస్తేనే ఫుట్‌బాల్ మ్యాచ్‌లు ఫుల్ కిక్కుగా ఉంటాయి. ఖతార్ వేదికగా జరగనున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో మాత్రం శుక్రవారం మద్యం ప్రియులకు చేదువార్త చెప్పారు అక్కడి నిర్వాహకులు. మ్యాచ్‌లు జరగనున్న స్టేడియాల్లో బీర్లు అమ్మడం నిషేధమని ఖతార్ దేశ ప్రభుత్వం పేర్కొంది. కావాలంటే స్టేడియాలకు దూరంగా బయట బీర్లను అమ్ముకోవచ్చు అని తమ ప్రకటనలో తెలిపింది. ఇది కఠినంగా అమలు చేయాలని స్టేడియం సిబ్బందిని ఆదేశించింది. కానీ ఫుల్బాల్ వరల్డ్‌కప్ ఆతిథ్య హక్కులు పొందే సమయంలో ఫిఫా వాణిజ్య ఒప్పందాలను గౌరవిస్తామని ఖతార్ అంగీకరించింది. ఆతిథ్య హక్కులు పొందే సమయంలో అన్ని వాణిజ్య ఒప్పందాలను అంగీకరిస్తామని చెప్పి.. ఇప్పుడిలా చేయడం ఏంటని ఫిఫా నిర్వాహకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖతార్ ఒక ఇస్లామిక్ దేశం. అసలు బహిరంగంగా మద్యం తాగడం అక్కడ పూర్తిగా నిషేధం. అయితే ప్రతిష్టాత్మక ఫిఫా వరల్డ్‌కప్ కావడంతో ఖతార్ కూడా కొన్ని నిబంధనలను సవరించింది. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగడంపై నిషేధం అలాగే ఉన్నా.. మ్యాచ్‌లకు వచ్చే అభిమానులు స్టేడియాల్లో బీర్లను తాగేందుకు అనుమతించింది. కానీ స్టేడియంలో బీర్ల అమ్మకాలు జరపొద్దని మాత్రం స్పష్టంగా చెప్పింది. ఒకసారి ఆతిథ్య హక్కుల పొందాకా ఫిఫా కూడా ఈ విషయంలో ఏం చేయలేదు. ఖతార్ దేశ నియమాలను ఎవరైనా ఆచరించాల్సిందే అన్న విషయం మరోసారి అవగతమైంది. ఇక బీర్లు తయారు చేసే సంస్థ అయిన బడ్వైజర్తో(Budwizer Brand) ఫిఫాకు ఎన్నో ఏళ్లుగా ఒప్పందం ఉంది. ఇందులో భాగంగా వరల్డ్‌కప్ సమయంలో స్టేడియాల దగ్గర బడ్వైజర్ బీర్లు అమ్ముతుంటారు.స్టేడియాల్లోనే ఫ్యాన్స్ బీర్లు తాగుతూ మ్యాచ్‌లు చూస్తుంటారు. అయితే తాజాగా అందిన సమాచారం ప్రకారం.. అన్ని స్టేడియాల నుంచి బీర్లను నిషేధించే అవకాశం ఉంది. ప్రస్తుతం మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చే 8 స్టేడియాల దగ్గర బడ్వైజర్ స్టాండ్స్ ఉన్నాయి. అయితే వీటిని స్టేడియాలకు దూరంగా తరలించాలని ఖతార్ నిర్వాహకులు పేర్కొన్నారు. ఇక 2009లోనే ఖతార్ ఈ వరల్డ్‌కప్ ఆతిథ్య హక్కులను పొందింది. ఆల్కహాల్ పాలసీ ప్రకారం.. కార్పొరేట్ క్లైంట్లకు మాత్రమే స్టేడియాల్లోని రెస్టారెంట్లు, లాంజ్లలోనే షాంపేన్, వైన్స్, స్పిరిట్స్ ఇస్తారు. ఇక హైఎండ్ హోటల్స్, క్రూయిజ్ షిప్స్‌లలో ఉండే ఫ్యాన్స్ కూడా వివిధ రకాలైన ఆల్కహాల్ డ్రింక్స్‌ను కొనుగోలు చేసుకోవచ్చు. ఖతార్‌లో బహిరంగంగా మద్యం తాగితే జైలు శిక్షతో పాటు భారీ జరిమానాలు విధిస్తారు. అయితే వరల్డ్ కప్ జరిగే సమయాల్లో మాత్రం ఇలాంటివి చూసీ చూడనట్లు ఉంటామని ఖతార్ సెక్యూరిటీ ఆపరేషన్స్ హెడ్ ఇప్పటికే ప్రకటించారు. తాగి గొడవలకు దిగితే మాత్రం అరెస్టులు తప్పవని హెచ్చరించారు. ఇక మ్యాచ్‌కు వచ్చే మహిళలు, యువతులు ఎట్టి పరిస్థితుల్లోనూ కురచ దుస్తులు వేసుకోవద్దని.. బాడీ పార్ట్స్ కనిపించేలా దుస్తులు ధరిస్తే జైలుకు పంపిస్తామని గురువారం ప్రకటించారు. తాజాగా బీర్ల అమ్మకాలపై కూడా నిషేధం విధించడం అభిమానులకు మింగుడు పడని విషయం. ''అందం చూడొద్దన్నారు.. ఇప్పుడు మందును కూడా దూరం చేశారు.. ఏంటి మాకు ఈ పరిస్థితి'' అంటూ అభిమానులు గోల చేస్తున్నారు. చదవండి: ఫిఫా చరిత్రలోనే తొలిసారి.. ఫైటర్ జెట్స్ సాయంతో ఖతార్‌కు అన్న అడుగు పడింది.. ఇప్పుడు తమ్ముడి వంతు FIFA: అందాల విందు కష్టమే.. అసభ్యకర దుస్తులు ధరిస్తే జైలుకే -
కరోనా అదుపు.. మందుబాబుల జోరు.. గరిష్ట స్థాయిలో అమ్మకాలు
సాక్షి, ముంబై: రాష్ట్రంలో రెండో, మూడో దశ కరోనా వైరస్ నియంత్రణలోకి రాగానే మద్యం విక్రయాలు జోరందుకున్నాయి. 2021–22 ఆర్ధిక సంవత్సరంలో రాష్ట్రంలోని మద్యం ప్రియులు ఏకంగా 23.58 కోట్ల లీటర్ల విదేశీ మద్యం, 34.83 కోట్ల లీటర్ల దేశీ మద్యాన్ని, అలాగే 23.13 లక్షల లీటర్ల బీరు, 0.86 లక్షల లీటర్ల వైను సేవించినట్లు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ వద్ద నమోదైన వివరాలను బట్టి తెలిసింది. 2020 మార్చిలో విధించిన లాక్డౌన్ కారణంగా వైన్ షాపులు, బార్లు పూర్తిగా మూసి ఉన్నాయి. ఆ తరువాత దశలవారీగా లాక్డౌన్ నియమాలు సడలించడంతో సమయపాలన పాటి స్తూ అప్పుడప్పుడు వైన్ షాపులు తెరిచి ఉండేవి. కాని ఈ ఏడాది జనవరి నుంచి లాక్డౌన్ ఆంక్షలు పూర్తిగా ఎత్తివేయడంతో మద్యం విక్రయాలు మరింత జోరందుకున్నాయి. విదేశీ మద్యంతో పోలిస్తే బీర్ల విక్రయం కొంతమేర తగ్గింది. కాని గత పదేళ్లతో పోలిస్తే ఈ ఆర్ధిక సంవత్సరంలో మద్యం విక్రయాలు పెరిగాయని రికార్డులను బట్టి స్పష్టమైతోంది. 2012–13 ఆర్ధిక సంవత్సరంలో 80.55 లక్షల లీటర్ల మద్యం అమ్ముడుపోగా రూ.9,297 కోట్ల ఆదాయం వచ్చింది. అదే 2021–22 ఆర్ధిక సంవత్సరంలో 82.4 కోట్ల లీటర్ల మద్యం విక్రయం కాగా రూ.17,177 కోట్ల ఆదాయం వచ్చినట్లు రాష్ట్ర ఆదాయ పన్ను వద్ద నమోదైన రికార్డులను బట్టి తెలిసింది. చదవండి: ఢిల్లీలో కుప్పకూలిన భవనం.. మద్యం విక్రయాలతో పాటు బార్లు, వైన్ షాపుల లైసెన్స్ రిన్యూవల్, కొత్త లైసెన్స్‌లు జారీ, మద్యం స్మగ్లింగ్ లపై చేసిన దాడులు, పన్నులు తదితరాల వల్ల వచ్చిన ఆదాయం కొన్ని వేల కోట్ల రూపాయల్లో ఉంటుంది. 2021–22 ఆర్ధిక సంవత్సరంలో మద్యం స్మగ్లింగ్, అక్రమంగా మద్యం తయారుచేయడం, అనుమతి లేకుండా విక్రయించడం తది తరా కారణాలవల్ల పట్టుబడ్డ 34,849 మందికి పోలీసులు బేడీలు వేశారు. పదేళ్లతో పోలీస్తే ఇంతపెద్ద సంఖ్యలో నింధితులు పట్టుబడడం ఇదే ప్రథమం. -
హైదరాబాద్‌లో ఎండలు దంచికొడితే చిల్డ్ బీర్ పొంగాల్సిందే!
సాక్షి, సిటీబ్యూరో(హైదరాబాద్): కొద్ది రోజులుగా ఎండలు మండిపోతున్నాయి. వేసవి తాపంతో అల్లాడుతున్న మద్యం ప్రియులు బార్లు, వైన్‌షాపుల వద్ద బారులు తీరుతున్నారు. నిప్పులు చెరిగే ఎండల బారి నుంచి ఉపశమనం కోసం చిల్డ్ బీర్‌ను ఆశ్రయిస్తున్నారు. దీంతో గత రెండు నెలలుగా గ్రేటర్లో బీర్ల అమ్మకాలు ఊపందుకున్నాయి. సాధారణ రోజుల్లో ‘కిక్’నిచ్చే మద్యం అమ్మకాలు తగ్గుముఖం పట్టగా బీర్ల అమ్మకాలు మాత్రం భారీగా పెరిగినట్లు ఆబ్కారీ వర్గాలు తెలిపాయి. మార్చి, ఏప్రిల్ నెలలో ఇప్పటి వరకు గ్రేటర్‌లోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 21,68,537 కేస్ల బీర్ల విక్రయాలు జరిగాయి. అమ్మకాల్లో రంగారెడ్డి జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. ఆ ఒక్క జిల్లాలోనే ఈ నెలలో ఇప్పటి వరకు 7.57 లక్షల కేస్‌లకుపైగా బీర్లు అమ్ముడైనట్లు అధికారులు తెలిపారు. చదవండి👉: కన్నతండ్రి కళ్ల ముందే విగతజీవిలా మారితే.. దిక్కులు పిక్కటిల్లేలా చేసిన రోదన వేసవి ప్రభావంతో.. వేసవి దృష్ట్యా మద్యం అమ్మకాలు మాత్రం తగ్గుముఖం పట్టాయి. గత నెలలో హైదరాబాద్‌లో 2.7 లక్షల కేస్లకు పైగా మద్యం విక్రయాలు జరగగా ఈ నెలలో ఇప్పటి వరకు 1.85 లక్షల కేస్లు మాత్రమే అమ్ముడయ్యాయి. రంగారెడ్డి జిల్లాలోనూ మద్యం విక్రయాలు 4.33 లక్షల కేస్ల నుంచి ఈ నెలలో 3.97 లక్షల కేస్లకు తగ్గాయి. మేడ్చల్ జిల్లాలోనూ మద్యం అమ్మకాలపై వేసవి ప్రభావం పడింది. మార్చిలో 82 వేలకుపైగా విక్రయించగా ఈ నెలలో 79 వేలకు పైగా మద్యం కేస్లు అమ్ముడయ్యాయి. ఆదాయంలోనూ ఈ తేడా కొట్టొచ్చినట్లు ఉంది. గత నెలలో రంగారెడ్డి జిల్లాలో అన్ని రకాల మద్యం, బీర్ల అమ్మకాలపై రూ.389 కోట్లకు పైగా ఆదాయం లభించింది. ఈ నెలలో ఇప్పటి వరకు రూ.398.32 కోట్ల ఆదాయం లభించినట్లు అధికారులు తెలిపారు. గ్రేటర్‌లోని మూడు జిల్లాల పరిధిలో బీర్ల అమ్మకాలే టాప్ గేర్‌లో దూసుకెళ్తున్నాయి. మే నెలలోనూ ఇదే హవా..? మరోవైపు వచ్చే మే నెలలోనూ ఐఎంఎల్ లిక్కర్ కంటే బీర్ల అమ్మకాలే ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్లు ఎక్సైజ్ అధికారులు అంచనా వేస్తున్నారు. గతేడాది ఏప్రిల్ నెలలో రాష్ట్రవ్యాప్తంగా 19.30 లక్షల కేస్ల బీర్ల విక్రయాలు జరిగాయి. ఈ నెలలో ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 32.72 లక్షల కేస్ల బీర్లు అమ్ముడు కావడం గమనార్హం. మే నెలలోనూ అమ్మకాల్లో ఇదే ఒరవడి కొనసాగనుంది. -
కొత్త ఏడాది ఊపుతో తెగ తాగేశారు.. మొత్తం రూ.2,901 కోట్ల మద్యం..
సాక్షి, హైదరాబాద్: పెరిగిన చలి, కొత్త ఏడాది ఊపుతో గతేడాది చివర్లో మందుబాబులు కేసులకు కేసులు మందు, బీర్లు లాగించేశారు. డిసెంబర్ చివరి 4 రోజుల్లో రాష్ట్రంలోని మద్యం డిపోల నుంచి సుమారు రూ.600 కోట్ల విలువైన మద్యం మార్కెట్లోకి వెళ్లింది. 2021, డిసెంబర్ 31న దాదాపు రూ.171 కోట్ల మద్యం అమ్ముడుపో వడం గమనార్హం. ఇక, డిసెంబర్ నెల మొత్తం మీద రూ.2,901 కోట్ల మద్యం విక్రయాలు జరిగినట్లు ఎక్సైజ్ శాఖ లెక్కలు చెబుతున్నాయి. ఈ నెలలో 40.11 లక్షల కేసుల లిక్కర్, 33.93 లక్షల కేసుల బీర్లు అమ్ముడయ్యాయని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఇది 27 శాతం ఎక్కువ. గత ఏడాది డిసెంబర్లో 33.23 లక్షల కేసుల లిక్కర్, 26.66 లక్షల కేసుల బీర్లు అమ్ముడయ్యాయి. వీటి విలువ రూ.2,276 కోట్లు. ఇక, 2021 సంవత్సరం మొత్తం మీద 2.73 కోట్ల లిక్కర్ కేసులు, 2.45 కోట్ల బీర్ కేసులు అమ్ముడయ్యాయి. వీటి విలువ రూ. 18,868 కోట్ల పైమాటే. అదే 2020లో రూ.16,254 కోట్ల విలువైన మద్యం అమ్ముడయింది. 2020తో పోలిస్తే 2021లో 16 శాతం ఎక్కువ మద్యం విక్రయాలు జరిగినట్లు ఎౖMð్సజ్ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. చదవండి: అరుదైన రాయి.. కాపాడుకోవాలోయి -
Hyderabad: పెరుగుతున్న ‘కిక్కు’.. ముందుంది అసలైన పండుగ.. తగ్గేదే లే!
సాక్షి, హైదరాబాద్: నగరంలో మద్యం అమ్మకాలు ఊపందుకున్నాయి. కొద్ది రోజులుగా వైన్‌షాపులు, బార్లు, రెస్టారెంట్లు కళకళలాడుతున్నాయి. కోవిడ్ చాలా వరకు తగ్గుముఖం పట్టడంతో బార్లకు వెళ్లి మద్యం సేవించే వినియోగదారుల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు ఎక్సైజ్ అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. గతంలో కోవిడ్ ఆంక్షల దృష్ట్యా చాలా మంది ఇళ్లకే పరిమితమయ్యారు. తక్కువ మోతాదులో ఇళ్ల వద్దనే వినియోగించేవారు. బార్లు తెరిచి ఉన్నప్పటికీ ధైర్యంగా వెళ్లేందుకు వెనుకడుగు వేశారు. కానీ క్రమంగా వైరస్ ఉధృతి తగ్గిపోవడం, ఇంచుమించు సాధారణ పరిస్థితులు నెలకొనడంతో వినియోగం పెరిగింది. అలాగే పర్మిట్ రూమ్‌లు సైతం మందుబాబులతో నిండుగా కనిపిస్తున్నాయి. దీంతో ఈ 6 నెలల్లో 29 శాతం వరకు మద్యం అమ్మకాలు పెరిగినట్లు అంచనా. సర్కార్ ఆదాయం సైతం అదేస్థాయిలో పెరిగింది. మరోవైపు మద్యం అమ్మకాల్లో రంగారెడ్డి, నల్గొండ మొదటి రెండు స్థానంలో నిలవగా హైదరాబాద్ మూడో స్థానంలో ఉంది. నగరంలో 18,25,276 కేసుల మద్యం అమ్ముడైంది. చదవండి: చారిత్రక వేదిక.. సరదాల వేడుక: అసదుద్దీన్‌కు కేటీఆర్ సూచన 56 శాతం పెరిగిన బీర్ల వినియోగం కోవిడ్ కాలంలో బీర్ల వినియోగం చాలా వరకు పడిపోయింది. అమ్మకాలు లేకపోవడంతో తయారీ సంస్థలు బీర్ల ఉత్పత్తిని సైతం తగ్గించాయి. శీతల పానీయాలు, బీర్లు సేవించడం వల్ల కోవిడ్ సోకే అవకాశం ఉండవచ్చునన్న వార్తలతో బీర్బలులు బాటిల్ పక్కన పెట్టేశారు. కానీ సెప్టెంబర్ నుంచి బీర్ల అమ్మకాలు అనూహ్యంగా పెరిగాయి. ఈ ఒక్క నెలలోనే 56 శాతం వరకు అమ్ముడైనట్లు అధికారులు తెలిపారు. 7,016,500 కేసుల విక్రయాలు జరిగాయి. బీర్ల అమ్మకాలను ప్రోత్సహించేందుకు ఒక్కో బాటిల్ పైన రూ.10 వరకు తగ్గించారు. ధరల తగ్గింపు కంటే కోవిడ్ భయం తొలగిపోవడం వల్లనే వినియోగం పెరిగినట్లు ఎక్సైజ్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ఆదాయంలోనూ మూడో స్థానం... ►ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రాష్ట్రంలో రూ.14,320 కోట్ల అమ్మం అమ్మకాలు జరిగాయి. ►రంగారెడ్డి జిల్లా మొదటి స్థానంలో నిలిచింది. ఈ ఒక్క జిల్లా నుంచే రూ.3.247 కోట్ల ఆదాయం లభించింది. ►రెండో స్థానంలో ఉన్న నల్గొండ జిల్లాలో మద్యం అమ్మకాలపైన రూ.1,599 కోట్ల ఆదాయం లభించింది. ►ఆ తరువాత మూడో స్థానంలో ఉన్న హైదరాబాద్ మద్యం ఆదాయం రూ.1510 కోట్లు ►దసరా అమ్మకాలతో ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. చదవండి: ‘చదువు ఇష్టం లేదు.. ఆటలే ఇష్టం..ప్లీజ్ మాకోసం వెతకొద్దు’ -
26 రోజులు.. రూ. 1,865 కోట్లు
సాక్షి, హైదరాబాద్: కరోనా లాక్డౌన్ నిబంధనలు సడలించిన తొలి నెలలో మద్యం అమ్మకాలు ఆశించిన స్థాయిలోనే జరిగాయి. గత నెల ఆరో తేదీన రాష్ట్రంలో వైన్ షాపులు తెరిచేందుకు ప్రభుత్వం అనుమతివ్వగా... 31 నాటికి (26 రోజుల్లో) రూ.1,864.95 కోట్ల విలువైన మద్యం కొనుగోళ్లు జరిగాయని గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో రూ.800 కోట్ల విలువైన బీర్లు, రూ. 1,000 కోట్ల విలువైన లిక్కర్ అమ్ముడు పోయాయి. కాగా, ఎండలు మండిపోయిన మే నెలలో బీర్ల అమ్మకాలు తగ్గాయని లెక్కలు చెబుతున్నాయి. లిక్కర్ మాత్రం ఎప్పటిలాగే అమ్ముడుపోవడం గమనార్హం. తొలిరోజు సగటు కొనసాగింపు మే నెల మద్యం అమ్మకాలను పరిశీలిస్తే వైన్ షాపులు తెరిచిన మొదటి రోజు మే 6న రూ.72 కోట్ల విలువైన మద్యం లిక్కర్ డిపోల నుంచి బయటకు వెళ్ళింది. తొలిరోజు కొనుగోళ్లు ఈ నెలంతా కొనసాగగా, నెల ముగిసే సమయానికి సగటున రోజుకు రూ.71 కోట్ల ఆదాయం లభించింది. ప్రతి పది రోజుల తర్వాతి కొనుగోళ్లలో పెరుగుదల కనిపించింది. మే 16న రూ.100 కోట్లు, 26న ఈ నెలలోనే అత్యదికంగా రూ.140 కోట్లకు పైగా విలువైన సరుకు డిపోల నుంచి షాపులకు వెళ్ళింది. మే నెలలో అత్యధికంగా ఈ రోజే ఎక్కువ కొనుగోళ్లు జరగడం గమనార్హం. ఇక మే నెల చివరి రోజున రూ. 62 కోట్ల మద్యం అమ్ముడయింది. బీర్.... బేర్ మే నెలలో బీర్ ప్రియుల్లో ఉత్సాహం తగ్గిందని అమ్మకాలు చెబుతున్నాయి. సాధారణంగా రాష్ట్రంలో రోజుకు లక్ష కేసుల బీర్లు, 1.30 లక్షల కేసుల లిక్కర్ అమ్ముడవుతుంది. అదే ఎండాకాలంలో అయితే బీర్ల అమ్మకాలు ఇంకా ఎక్కువగా ఉంటాయి. మే నెలలో మరీ ఎక్కువగా రోజుకు 1.5లక్షలకు పైగా సగటున 50 లక్షల కేసుల బీర్ అమ్ముడుపోతుంది. కానీ ఈ మే నెలలో రోజుకు సగటున అమ్ముడైన బీర్ కేసుల సంఖ్య 90 వేలు మాత్రమే. మే నెలలో ఇంత తక్కువ స్థాయిలో బీర్లు అమ్ముడుపోవడం ఆశ్చర్యంగా ఉందని ఎక్సైజ్ వర్గాలే అంటున్నాయి. గత నెలలో లిక్కర్ డిపోల నుంచి అమ్ముడుపోయిన మద్యం వివరాలు -
బీరు.. యమ జోరు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో బీర్ల విక్రయాలు అనూహ్యంగా పెరిగాయి. గతంలో ఎన్నడూ లేనంతగా అమ్మకాలు ఏకంగా రెండింతలు పెరగడం ఎక్సైజ్ శాఖనే ఆశ్చర్యపరిచింది. నూతన సంవత్సరం వేడుకలు జరిగే డిసెంబర్, జనవరి నెలల కన్నా.. మార్చిలో రెండు రెట్లు అధికంగా బీర్ల విక్రయాలు జరగడం గమనార్హం. వేసవి కావడంతో చల్లదనం కోసం తాగుతున్నారు అనుకున్నా.. గత విక్రయాలతో పోలిస్తే ఎక్కువగానే ఉంటున్నాయి. ఐపీఎల్, ఎన్నికలే కారణం.. వేసవి మొదలైనప్పటి నుంచి బీరు బాటిళ్ల విక్రయాలు పెరగడం అత్యంత సహజం. కానీ, ఈసారి మార్చిలో రెండింతలు పెరగడానికి రెండు కారణాలు ఉన్నాయి. వీటిలో మొదటిది ఐపీఎల్ మ్యాచ్‌లు కాగా, రెండోది పార్లమెంటు ఎన్నికలు. మార్చి రెండో వారంలో ఐపీఎల్ మ్యాచ్‌లు మొదలుకావడంతో బీర్ల కొనుగోళ్లు ఊపందుకుంది. దీనికితోడు అదే సమయంలో పార్లమెంటు ఎన్నికలకు షెడ్యూలు విడుదలైంది. దీంతో అటు బార్ అండ్ రెస్టారెంట్లు, పబ్‌లు ఓ వైపు, రాజకీయ పార్టీలు మరోవైపు భారీగా బీర్లను కొనుగోలు చేశాయి. ఈ కొనుగోళ్లలో రాజకీయ పార్టీల వాటానే అధికంగా ఉందని సమాచారం. తమ కార్యకర్తలకు, యువతకు పంచేందుకు కేసుల కొద్దీ బీర్లను పంచారు. వేసవి కావడంతో మద్యం బాటిళ్లకు బదులుగా బీర్లను ఎంచుకోవడమే దీనికి కారణం. ఫలితంగా బీర్ల కేసులు రికార్డు స్థాయిలో కొనుగోలు చేశారు. సాధారణంగా ఎక్సైజ్ శాఖ విక్రయాల ప్రకారం.. ఐఎమ్ఎల్ (ఇండియన్ మేడ్ లిక్కర్) అంటే బ్రాండీ వైన్ తదితరాలతో కలపకుండా బీర్లను ప్రత్యేకంగా గణిస్తారు. సాధారణంగా తెలంగాణ ఎక్సైజ్ శాఖ మద్యం విక్రయాలు నెలకు సగటున రూ.1,500 నుంచి రూ.1,700 కోట్లుగా ఉంటుంది. వివిధ కాలాల్ని బట్టి వీటిలో మద్యం, బీర్ల విక్రయాలు మారుతుంటాయి. గత 4 నెలల మద్యం విక్రయాలను పరిశీలిస్తే.. బీర్ల కేసులు పెరగడం గమనించవచ్చు. -
వీధి వీధికో బీరు పార్లర్!
సాక్షి, అమరావతి: మద్యం మహమ్మారి మత్తులో యువత జోగుతోందని ప్రజా సంఘాల, మద్య వ్యతిరేక పోరాట కమిటీ నేతలు గగ్గోలు పెడుతున్నా..పట్టించుకోని ప్రభుత్వం ఖజానా నింపుకోవడానికే అత్యధిక ప్రాధాన్యత నిస్తుండడం పలు విమర్శలకు దారితీస్తోంది. ఇప్పటికే రాష్ట్ర ప్రజానీకం ఆరోగ్యాన్ని కొల్లగొడుతున్న 4,380 మద్యం షాపులు, 800 బార్లు సరిపోవన్నట్లు.. ఎక్కడపడితే అక్కడ..ఎప్పుడు పడితే అప్పుడు తాగేందుకు మద్యం ప్రియులకోసం మైక్రో బ్రూవరీ బార్లను ఏర్పాటు చేసేందుకు సర్కారు తలుపులు బార్లా తెరిచింది. బీరు, వైన్ అమ్మకాల్లో దక్షిణాది రాష్ట్రాల్లో ఏపీ రెండో స్థానంలో ఉంది. తెలంగాణ మొదటి స్థానంలో ఉండగా, ఈ ర్యాంకును అధిగమించేందుకు ఏపీలో బీరు అమ్మకాలు పెరిగేలా ఈ మైక్రో బ్రూవరీలను సర్కారు ఏర్పాటు చేయనుందని సమాచారం. ఈ మైక్రో బ్రూవరీ బార్లలో రెడీ టూ డ్రింక్ పేరిట బీరు, వైన్ అమ్మకాలు చేపట్టనుంది. ఇప్పటికే విజయవాడ, విశాఖపట్టణంలో ఈ మైక్రో బ్రూవరీలను ఏర్పాటు చేసింది. ఈ తరహా మైక్రో బ్రూవరీ బార్లను రాష్ట్ర వ్యాప్తంగా ఇబ్బడి ముబ్బడిగా ఏర్పాటు చేసి మద్యం ఉత్పత్తుల అమ్మకాల ద్వారా ఖజానా నింపుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేయనుంది. అయితే ఇంతవరకు మైక్రో బ్రూవరీలపై నిబంధనలు (గైడ్ లైన్స్) రూపొందించకుండానే విజయవాడ, విశాఖలలో మైక్రో బ్రూవరీలను ఏర్పాటు చేయడం విమర్శల పాలవుతోంది. రాయలసీమ మంత్రి తనయుడి ఒత్తిడితోనే.. రాయలసీమ ప్రాంతానికి చెందిన ఓ మంత్రి తనయుడు ఎక్సైజ్ శాఖలోనూ తలదూర్చి చక్రం తిప్పుతున్నారు. విజయవాడ నగరంలో సదరు మంత్రి తనయుడు సొంతంగా మైక్రో బ్రూవరీ ఏర్పాటు చేసి వ్యాపారం సాగిస్తున్నారు. పాశ్చాత్య పోకడగా సాగుతున్న ఈ పార్లర్లో బీరు అమ్మకాల పర్యవేక్షణ చేసేందుకు ఎక్సైజ్ అధికారులు అటు వైపు కన్నెత్తి చూడటం లేదు. ఈ మైక్రో బ్రూవరీల అనుమతుల ముసుగులో నూతన బార్లకు అనుమతులు ఇవ్వడం గమనార్హం. -
పెరిగిన బీర్ల అమ్మకాలు
సాక్షి, హైదరాబాద్: బీర్ల వినియోగంలో తెలంగాణ దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచింది. రాష్ట్రంలో ఏప్రిల్ నెలలో 47 లక్షల కేసుల విక్రయాలు జరగ్గా.. సగటున రోజుకు 1.56 లక్షల కేసుల బీర్లు అమ్ముడవుతున్నాయి. ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే రోజుకు రూ.17 కోట్ల విలువైన బీర్ల అమ్మకాలు జరుగుతున్నట్లు అంచనా. అంచనాలకు మించి డిమాండ్ పెరగడంతో బీర్ల ఎగుమతులను తాత్కాలికంగా నిలిపివేసిన టీఎస్‌బీసీఎల్.. పక్క రాష్ట్రాల నుంచి రోజుకు 45 వేల కేసుల చొప్పున దిగుమతి చేసుకుంటోంది. ఆంధ్రప్రదేశ్ మన తరువాత స్థానంలో ఉంది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 17 శాతం అధికంగా విక్రయాలు జరిగినట్లు టీఎస్‌బీసీఎల్ నివేదికలు చెబుతున్నాయి. అయితే, బార్లు, పబ్‌లకు వెళ్తున్న యువతరంలో 60 శాతం మంది టీనేజ్ యువతే అని తేలడం ఆందోళన కలిగించే అంశమని నిపుణులు అంటున్నారు. తల్లిదండ్రులిచ్చే పాకెట్‌మనీతో యువత జల్సా చేస్తున్నట్లు తేలిందని.. దీనిపై తల్లిదండ్రులు ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. ‘పిల్లలు ఎటు వెళ్తున్నారో.. ఏం చేస్తున్నారో’నిఘా పెట్టాలని సూచిస్తున్నారు. -
బీర్ అమ్మకాల్లో తెలంగాణ టాప్
-
ఆబ్కారీ శాఖలో కాసుల గలగల
రెండు నెలల్లోనే రూ. 2,391 కోట్ల ఆదాయం సాక్షి, హైదరాబాద్: ఆర్థిక సంవత్సరం ఆరంభమైన రెండు నెలల్లోనే ఆబ్కారీ శాఖ రికార్డు స్థాయి ఆదాయం సమకూర్చుకుంది. వేసవి కాలంలో పెరిగిన బీర్ల అమ్మకాలు, మద్యం దుకాణాల లెసైన్సు ఫీజు వాయిదాల మొత్తంతో పాటు డిస్టిలరీలు, బ్రూవరీల నుంచి ఎక్సైజ్ సుంకాల వసూళ్లతో రూ. 2,391. 17 కోట్ల రెవెన్యూ సాధించింది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ బడ్జెట్ అంచనాల్లో ఆబ్కారీ శాఖకు నిర్దేశించిన మొత్తం కన్నా ఇది 6 శాతం ఎక్కువ కావడం గమనార్హం. ఆబ్కారీ శాఖ సాధించిన రూ. 2391. 17 కోట్ల రెవెన్యూ నుంచి ‘వ్యాట్ బై ఎక్సైజ్’ రూపంలో ప్రభుత్వ ఖజానాకు నేరుగా రూ. 1,540 కోట్లు చేరనుండగా, మిగతా మొత్తం వివిధ పద్దుల రూపంలో జమ కానుంది. వార్షిక లక్ష్యం రూ. 14,161 కోట్లు మద్యం అమ్మకాల ద్వారా 2016 -17 ఆర్థిక సంవత్సరానికి రూ. 14,161 కోట్ల లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించింది. ఇది 2015-16 ఆర్థిక సంవత్సరం సాధించిన రెవెన్యూ మొత్తం రూ. 12,200.79 కన్నా సుమారు రూ. 2వేల కోట్లు అధికం కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఆర్థిక సంవత్సరం తొలి నెల నుంచే ఎక్సైజ్ కమిషనర్ ఆర్.వి. చంద్రవదన్ జిల్లాల వారీగా లక్ష్యాలను నిర్దేశించి వసూళ్లకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ నెలలో బడ్జెట్ అంచనాల లక్ష్యాని కన్నా 16 శాతం వృద్ధితో రూ. 969.29 కోట్లు రెవెన్యూ సాధించింది. ఇక మేలో రూ. 1,421 .86 కోట్లు సమకూరాయి. దీంతో రెండు నెలల్లోనే రూ. 2,391 కోట్లు వసూలయ్యాయి. మే నెలాఖరులోగా చెల్లించాల్సిన మద్యం దుకాణాల మూడో విడత లెసైన్సు ఫీజు వాయిదా కింద రూ. 498 కోట్లు సమకూరగా, బ్రూవరీలు, డిస్టిలరీల నుంచి ఎక్సైజ్ సుంకం కింద రెండు నెలల్లో రూ. 301 కోట్లు వసూలయింది. ఇతర మార్గాల ద్వారా మరో 14.44 కోట్లు ఎక్సైజ్ శాఖకు వచ్చి చేరింది. కాగా జూన్ నెలాఖరులోగా బార్ల లెసైన్సులను రెన్యువల్ చేయించుకోవలసి ఉంది. రాష్ట్రంలోని 804 బార్లు, 17 క్లబ్బులు, 9 పర్యాటక ప్రాంతాలోని బార్ల నుంచి లెసైన్సు ఫీజు వసూలు చేయాల్సి ఉంది. ఈ లెక్కన జూన్‌లో కూడా దాదాపు రూ. 1,400 కోట్ల వరకు వసూలయ్యే అవకాశం ఉంది. -
బీరు పారుతోంది!
♦ 50 రోజుల్లో 5 కోట్ల లీటర్లు స్వాహా ♦ గత రెండున్నర నెలల్లో రూ. వెయ్యి కోట్ల విక్రయాలు ♦ రంగారెడ్డి జిల్లాలో ఏప్రిల్‌లో10 లక్షల కేసులు హాంఫట్ ♦ ఈ నెల వర్షాల వల్ల స్వల్పంగా తగ్గిన డిమాండ్ సాక్షి, హైదరాబాద్: గతంలో ఎన్నడూలేని విధంగా ఈ వేసవిలో బీర్ల అమ్మకాలు రికార్డు సృష్టించాయి. ఏప్రిల్‌లో వేసవి ఎండలు మండిపోవడంతో మందుబాబులు చల్లని బీర్ల కోసం ఎగబడ్డారు. దీంతో రాష్ట్రంలో 50 రోజుల్లో ఏకంగా 5 కోట్ల లీటర్ల బీర్లను గుటకాయ స్వాహా చేశారు. ఏప్రిల్‌లో ఏకంగా 3.5 కోట్ల లీటర్ల బీర్లను తాగేసిన బీరుప్రియులు ఈ నెలలో ఇప్పటివరకు 1.5 కోట్ల లీటర్ల మేర బీర్లు లాగించేశారు. ఈ నెలలో అడపాదడపా వర్షాలు కురవడంతో బీర్ల డిమాండ్ కొంత తగ్గినప్పటికీ నెలాఖరుకల్లా మళ్లీ పెరిగే అవకాశం ఉందని తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ అధికారులు చెబుతున్నారు. వేసవి బీర్ల అమ్మకాల్లో రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లా టాప్‌లో నిలిచింది. ఐటీ కంపెనీలతోపాటు కార్పొరేట్ కంపెనీలు అధికంగా ఉండటంతో రంగారెడ్డి జిల్లా పరిధిలోని ప్రాంతాల్లో ఉన్న మద్యం దుకాణాలు, బార్లలో ఏప్రిల్‌లోనే 10 లక్షల కేసుల బీర్ల విక్రయాలు జరిగాయి. మేలోనూ బీర్ల విక్రయాల్లో దాదాపు అదే జోరు కొనసాగింది. 3 నెలల్లో 96 లక్షల కేసుల బీర్ల విక్రయాలు గతేడాది ఏప్రిల్‌లో 29.27 లక్షల కేసులు (ఒక కేసులో 7,800 ఎంఎల్) బీర్ల విక్రయాలు జరగ్గా ఈ సంవత్సరం ఏప్రిల్‌లో 44.9 లక్షల కేసుల బీర్లు అమ్ముడయ్యాయి. మార్చి నుంచే రాష్ట్రంలో ఎండలు, వడగాడ్పుల తీవ్రత పెరగడంతో మద్యం ప్రియులు కూడా బీర్లను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో మార్చి, ఏప్రిల్, మే (19వ తేదీ వరకు)లలో 96 లక్షల కేసుల బీర్ల విక్రయాలు జరిగాయి. మార్చిలో 31 లక్షల కేసుల బీర్ల విక్రయాలు జరగ్గా మేలో 19 రోజుల్లో 20 లక్షల కేసులు అమ్ముడయ్యాయి. ఈ రెండున్నర నెలల్లో జరిగిన విక్రయాల విలువ సుమారు రూ. 1,000 కోట్లు కావడం విశేషం. ఏప్రిల్‌లో భారీగా రెవెన్యూ బీర్ల అమ్మకాలు గణనీయంగా పెరగడంతో ఏప్రిల్‌లో ఆబ్కారీ శాఖకు రూ. 1,217 కోట్ల రెవెన్యూ సమకూరింది. గతేడాది ఏప్రిల్‌లో రూ. 888.63 కోట్ల రెవెన్యూ రాగా ఈసారి దాదాపు రూ. 350 కోట్లు అదనంగా సమకూరింది. మేలో ఇప్పటివరకు రూ. 614 కోట్ల రెవెన్యూ వచ్చింది. రాష్ట్రంలోని 2,144 మద్యం దుకాణాల లెసైన్సుల మూడో విడత రెన్యూవల్స్‌కు గడువు దగ్గర పడడంతో ఈ నెలాఖరు వరకు టీఎస్‌బీసీఎల్ నుంచి విక్రయాలు ఉండవని ఓ అధికారి తెలిపారు. అయినా గతేడాది కన్నా వృద్ధిరేటు ఉంటుందని తెలిపారు. -
తెగ తాగేస్తున్నారు!
► గత ఏడాదితో పోలిస్తే భారీగా పెరిగిన బీరు విక్రయాలు ► వేసవిలో చల్లదనం కోసం అధికంగా ► బీరునే సేవిస్తున్న మద్యం ప్రియులు ► విక్రయాల్లో ఏకంగా 54 శాతం పెరుగుదల.. ► ఏప్రిల్ , మేలో మరింత పెరిగే అవకాశం ► డిమాండ్ నేపథ్యంలో అధిక ధర వసూలు చేస్తున్న వ్యాపారులు గత ఏడాది మార్చిలో బీరు అమ్మకాలు : 97 వేల కేసులు ఈ ఏడాది మార్చిలో అమ్మకాలు: 1.50 లక్షల కేసులు పెరిగిన అమ్మకాల శాతం : 54 బీరు అమ్మకాల ద్వారా ఒక నెలలో ఎక్సైజ్ శాఖకు అదనపు ఆదాయం: రూ.59 లక్షలు (సాక్షిప్రతినిధి, అనంతపురం) అసలే వేసవి. ఆపై ఎండలు మండుతున్నాయి. ఈ ఏడాది గరిష్టంగా 48 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వేసవి తాపాన్ని తట్టుకునేందుకు సాధారణ ప్రజలు మజ్జిగ, నన్నారి, కొబ్బరినీళ్లు, తాటిముంజలు, పుచ్చకాయలు వంటివి తీసుకుంటుంటే..మద్యం ప్రియులు మాత్రం బీరు బాటిళ్లను ఖాళీ చేసేస్తున్నారు. గతేడాదితో పోల్చితే ఈసారి బీరు అమ్మకాలు ఏకంగా 54 శాతం పెరిగాయి. దీన్నిబట్టే ‘అనంత’లో బీరు జోరు ఏస్థాయిలో ఉందో ఇట్టే తెలుస్తోంది. జిల్లా వ్యాప్తంగా 238 మద్యం దుకాణాలు ఉన్నాయి. బార్అండ్ రెస్టారెంట్లు తొమ్మిది ఉన్నాయి. వీటిలో 2015 మార్చిలో 97 వేల బీరు కేసులను విక్రయించారు. ఈ ఏడాది 1.50 లక్షల కేసులు అమ్మారు. అంటే 53వేల కేసులు అధికంగా విక్రయించారు. బీరు అమ్మకాల అమాంతం పెరగడంతో ఎక్సైజ్ శాఖకు కూడా భారీ ఆదాయం వస్తోంది. బీరు బాటిల్ ధర రూ.110. గతేడాది మార్చిలో బీరు అమ్మకాల ద్వారా రూ.1.06 కోట్ల ఆదాయం రాగా.. ఈ ఏడాది రూ.1.65 కోట్లు వచ్చింది. అంటే ఒక నెలలోనే కేవలం బీరు అమ్మకాల ద్వారా రూ.59 లక్షల అదనపు ఆదాయం చేకూరింది. ఈ నెలతో పాటు మేలో కూడా ఎండతీవ్రత ఎక్కువగా ఉండే అవకాశముంది. దీంతో బీరు అమ్మకాలు మరింత పెరిగే అవకాశం ఉందని ఎక్సైజ్ అధికారులు చెబుతున్నారు. బాటిల్‌పై రూ.10 పెంచి విక్రయాలు బీరుకు డిమాండ్ పెరగడంతో మద్యం వ్యాపారులు బాటిల్‌పై రూ.10 పెంచి రూ.120కి విక్రయిస్తున్నారు. దాబాల్లో దీని ధర మరింత ఎక్కువగా ఉంది.‘అనంత’తో పాటు జిల్లా వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో దాబాలు అధికంగా ఉన్నాయి. వీటిలో మరో రూ.10 అదనంగా వసూలు చేస్తున్నారు. బీరు అమ్మకాలు ఓవైపు జోరందుకుంటుంటే ఐఎంఎల్( ఇండియన్ మేడ్ లిక్కర్) అమ్మకాలు మాత్రం తగ్గాయి. 2015 మార్చిలో 1.40 లక్షల కేసుల మద్యం విక్రయిస్తే, ఈసారి 1.43 లక్షల కేసులు విక్రయించారు. మూడు వేల కేసులు మాత్రమే పెరిగాయి. బీరు విక్రయాలతో పోలిస్తే ఇది పెద్ద పెరుగుదల కాదు. బీరు తాగినా ప్రమాదమే బీరైనా, లిక్కరైనా ఆల్కహాల్ ఉంటుంది. ఆల్కహాల్ ఆరోగ్యానికి మంచిది కాదు. కాకపోతే లిక్కర్‌తో పోలిస్తే బీరులో ఆల్కహాల్ శాతం తక్కువ. వేసవిలో బీరు మంచిదనుకోవడం పొరపాటు. అధికంగా బీరు సేవిస్తే లివర్ దెబ్బతింటుంది. నరాల బలహీనత వస్తుంది. మనిషిలో సత్తువ తగ్గుతుంది. కాబట్టి బీరైనా, లిక్కరైనా మద్యానికి దూరంగా ఉండటమే మంచిది. - డాక్టర్ వైవీ రావు, ఆర్ఎంఓ, సర్వజనాస్పత్రి