సాక్షి, హైదరాబాద్: దసరా పండుగను పురస్కరించుకొని మద్యం ఏడురోజులు ఏరులైంది. రికార్డుస్థాయిలో అమ్మకాలు సాగాయి. తెలంగాణలో అత్యంత ఘనంగా జరుపుకునే ఈ పండుగను పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా గత ఏడు రోజుల్లో మద్యం విక్రయాలు రూ.1,100 కోట్లు దాటాయి. అక్టోబర్ 2 (గాంధీ జయంతి), అక్టోబర్ 5(దసరా)న రెండురోజులు రాష్ట్రంలోని మద్యం డిపోలకు సెలవులుండగా, గత ఏడు పనిదినాల్లో కలిపి ఈ మేరకు మద్యం డిపోల నుంచి వైన్‌షాపులకు చేరిందని గణాంకాలు చెబుతున్నాయి.
ఇందులో సెప్టెంబర్ 30న రికార్డుస్థాయిలో రూ.313 కోట్లకుపైగా మద్యం అమ్మకాలు సాగాయి. అయితే, సెప్టెంబర్ నెలాఖరులో వైన్‌షాపుల యజమానులు లిక్కర్‌కు ఎక్కువ ఇండెంట్ పెట్టి బీర్లు తగ్గించారు. గత ఏడు పనిదినాల్లో అమ్ముడైన మద్యం గణాంకాలను జిల్లాలవారీగా పరిశీలిస్తే అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో రూ.500 కోట్ల మేర మద్యం అమ్ముడైంది. వరంగల్ అర్బన్ (149.02 కోట్లు), నల్లగొండ (124.44 కోట్లు), కరీంనగర్ (111.44 కోట్లు), హైదరాబాద్ (108.24కోట్లు) జిల్లాల్లో రికార్డు స్థాయిలో మద్యం విక్రయించారు.
Comments
Please login to add a commentAdd a comment