ఇమైక్కా నోడిగళ్ కోసం భారీ సెట్ | Heavy set for nodigal imaikka | Sakshi
Sakshi News home page

ఇమైక్కా నోడిగళ్ కోసం భారీ సెట్

Published Sat, Oct 22 2016 2:25 AM | Last Updated on Mon, Sep 4 2017 5:54 PM

ఇమైక్కా నోడిగళ్ కోసం భారీ సెట్

ఇమైక్కా నోడిగళ్ కోసం భారీ సెట్

సాధారణంగా కొన్ని చిత్రాలు ప్రేక్షకులకు ఉత్సాహాన్నిస్తాయి. మరికొన్ని వినోదాన్ని అందిస్తాయి. ఇక తక్కువ చిత్రాలు మాత్రమే థియేటర్లలో ప్రేక్షకుల్ని కదలకుండా కట్టి పడేస్తాయి. అలాంటి చిత్రంగా ఇమైక్కా నోడిగళ్ ఉంటుందంటున్నారు ఆ చిత్ర దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు. తొలి చిత్రం డిమాంటీ కాలనీతోనే అనూహ్య విజయాన్ని సొంతం చేసుకున్న ఈయన దర్శకుడు ఏఆర్.మురుగదాస్  స్కూల్ నుంచి వచ్చిన విషయం తెలిసిందే. యువ నటుడు అధర్వ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో టాలీవుడ్ పాపులర్ నటి రాశీఖన్నా హీరోయిన్‌గా తమిళ చిత్ర సీమకు పరిచయం అవుతున్నారు.

కాగా ప్రముఖ నటి నయనతార కీలక పాత్రలో నటించడం విశేషం. క్యామియో ఫిలింస్ పతాకంపై సీజే.జయకుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రం శుక్రవారం ఉదయం చెన్నైలోని ఎంజీఆర్ ఫిలిం సిటీలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మాట్లాడుతూ ఎంజీఆర్ ఫిలింసిటీలో ఈ చిత్రం కోసం బ్రహ్మాండమైన సెట్‌ను వేసి చిత్రీకరణ జరుపుతున్నట్లు వెల్లడించారు. అత్యుత్తమ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌లో నిర్మిస్తున్నట్లు తెలిపారు. ప్రారంభానికి ముందే ఇమైక్కా నోడిగళ్ చిత్రం ఇటు చిత్ర వర్గాల్లోనూ, అటు అభిమానుల్లోనూ భారీ అంచనాలను ఏర్పరచిందన్నారు. వాటిని కచ్చితంగా రీచ్ అవుతుందనే విశ్వాసాన్ని నిర్మాత సీజే.జయకుమార్ వ్యక్తం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement