విక్రమ్
సినిమా సినిమాకు విభిన్నంగా కనబడుతుంటారు కొందరు హీరోలు. విక్రమ్ విషయానికి వస్తే ఒక్క సినిమాలోనే విభిన్నమైన గెటప్స్‌లో కనిపిస్తుంటారు. రకరకాల పాత్రలు చేసి ప్రేక్షకులను థ్రిల్ చేస్తుంటారు. ఇది వరకు ‘అపరిచితుడు, మల్లన్న, ఐ, ఇంకొక్కడు’ వంటి సినిమాల్లో రకరకాల గెటప్స్‌లో కనిపించారు. ఇక త్వరలో నటిం^è నున్న కొత్త చిత్రంలో ఏకంగా 25 గెటప్స్‌లో కనిపిస్తారని తెలిసింది.
అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో విక్రమ్ హీరోగా ఈ సినిమా తెరకెక్కనుంది. ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటించనున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడు. విక్రమ్ 25 గెటప్స్ కోసం ఓ అమెరికన్ కంపెనీ వర్క్ చేస్తోంది. ఈ సినిమా ప్రకటించినప్పుడు విడుదల చేసిన పోస్టర్‌లో కూడా విక్రమ్ పలు గెటప్స్‌లో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment