Ajay jnanamuttu
-
లక్కీ చాన్స్
కన్నడ చిత్రం ‘కేజీఎఫ్: చాప్టర్ 1’ ఎంత సంచలన విజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. హీరోగా నటించిన యశ్ కెరీర్‌కు ఈ సినిమా మంచి మైలేజ్‌ని ఇచ్చింది. కానీ ఇదే సినిమాలో హీరోయిన్గా నటించిన శ్రీనిధి శెట్టికి మాత్రం చెప్పుకోదగ్గ అవకాశాలేం రాలేదు. హీరోయిన్ పాత్రకు పెద్దగా ప్రాముఖ్యత లేకపోవడం, పైగా ఇది యాక్షన్ సినిమా కావడంతో శ్రీనిధికి పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ ఓ అద్భుత అవకాశం ఆమెను వెతుక్కుంటూ వచ్చింది. కోలీవుడ్ ఎంట్రీకి దారి చూపింది. విక్రమ్ హీరోగా అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్గా శ్రీనిధిని తీసుకున్నారు. ‘‘విక్రమ్ సార్‌తో నటించే గొప్ప అవకాశం వచ్చినందుకు సంతోషంగా ఉంది. అజయ్‌గారికి థ్యాంక్స్’’ అన్నారు శ్రీనిధి. -
వెండితెర గ్రౌండ్లో...
గ్రౌండ్లో బంతులను బ్యాట్స్‌మెన్ వైపు విసురుతుంటారు క్రికెటర్స్ హర్బజన్ సింగ్, ఇర్ఫాన్ పటాన్. ఇప్పుడు ఈ ఇద్దరు ఇండియన్ బౌలర్లు రూటు మార్చారు. తమిళ సినిమాల్లో కీలక పాత్రల్లో ఈ ఇద్దరూ నటించబోతున్నట్టు ప్రకటించారు. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో విక్రమ్ ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాలో ఇర్ఫాన్ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. అలాగే కమెడియన్ సంతానం త్రిపాత్రాభినయం చేస్తున్న సినిమా ‘డిక్కీలోనా’. ఈ సినిమాలో హర్బజన్ నటిస్తున్నారు. గ్రౌండ్లో వికెట్లు తీసిన ఈ బౌలర్స్, థియేటర్స్‌లో టికెట్లు ఎలా తెంపిస్తారో వేచి చూడాలి. -
25 గెటప్స్‌లో!
సినిమా సినిమాకు విభిన్నంగా కనబడుతుంటారు కొందరు హీరోలు. విక్రమ్ విషయానికి వస్తే ఒక్క సినిమాలోనే విభిన్నమైన గెటప్స్‌లో కనిపిస్తుంటారు. రకరకాల పాత్రలు చేసి ప్రేక్షకులను థ్రిల్ చేస్తుంటారు. ఇది వరకు ‘అపరిచితుడు, మల్లన్న, ఐ, ఇంకొక్కడు’ వంటి సినిమాల్లో రకరకాల గెటప్స్‌లో కనిపించారు. ఇక త్వరలో నటిం^è నున్న కొత్త చిత్రంలో ఏకంగా 25 గెటప్స్‌లో కనిపిస్తారని తెలిసింది. అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో విక్రమ్ హీరోగా ఈ సినిమా తెరకెక్కనుంది. ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా నటించనున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీత దర్శకుడు. విక్రమ్ 25 గెటప్స్ కోసం ఓ అమెరికన్ కంపెనీ వర్క్ చేస్తోంది. ఈ సినిమా ప్రకటించినప్పుడు విడుదల చేసిన పోస్టర్లో కూడా విక్రమ్ పలు గెటప్స్‌లో ఉన్నారు. -
ఇమైక్కా నోడిగళ్ కోసం భారీ సెట్
సాధారణంగా కొన్ని చిత్రాలు ప్రేక్షకులకు ఉత్సాహాన్నిస్తాయి. మరికొన్ని వినోదాన్ని అందిస్తాయి. ఇక తక్కువ చిత్రాలు మాత్రమే థియేటర్లలో ప్రేక్షకుల్ని కదలకుండా కట్టి పడేస్తాయి. అలాంటి చిత్రంగా ఇమైక్కా నోడిగళ్ ఉంటుందంటున్నారు ఆ చిత్ర దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు. తొలి చిత్రం డిమాంటీ కాలనీతోనే అనూహ్య విజయాన్ని సొంతం చేసుకున్న ఈయన దర్శకుడు ఏఆర్.మురుగదాస్ స్కూల్ నుంచి వచ్చిన విషయం తెలిసిందే. యువ నటుడు అధర్వ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో టాలీవుడ్ పాపులర్ నటి రాశీఖన్నా హీరోయిన్గా తమిళ చిత్ర సీమకు పరిచయం అవుతున్నారు. కాగా ప్రముఖ నటి నయనతార కీలక పాత్రలో నటించడం విశేషం. క్యామియో ఫిలింస్ పతాకంపై సీజే.జయకుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రం శుక్రవారం ఉదయం చెన్నైలోని ఎంజీఆర్ ఫిలిం సిటీలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మాట్లాడుతూ ఎంజీఆర్ ఫిలింసిటీలో ఈ చిత్రం కోసం బ్రహ్మాండమైన సెట్‌ను వేసి చిత్రీకరణ జరుపుతున్నట్లు వెల్లడించారు. అత్యుత్తమ సాంకేతిక నిపుణులు పనిచేస్తున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్లో నిర్మిస్తున్నట్లు తెలిపారు. ప్రారంభానికి ముందే ఇమైక్కా నోడిగళ్ చిత్రం ఇటు చిత్ర వర్గాల్లోనూ, అటు అభిమానుల్లోనూ భారీ అంచనాలను ఏర్పరచిందన్నారు. వాటిని కచ్చితంగా రీచ్ అవుతుందనే విశ్వాసాన్ని నిర్మాత సీజే.జయకుమార్ వ్యక్తం చేశారు. -
అధర్వకు అక్కగా నయన్
తాను నటిస్తే ఆ చిత్రం హిట్టే అన్నంత స్థాయికి ఎదిగిన నటి నయనతార. అంత అగ్రనాయకిగా రాణిస్తున్నా టాప్ హీరోల నుంచి కుర్ర హీరోల వరకూ నటించడానికి సై అంటున్నారు. మరో పక్క హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రాల్లోనూ నటించి సక్సెస్ అవుతున్నారు. ఇటీవల విక్రమ్‌తో జత కట్టిన ఇరుముగన్ మంచి విజయాన్ని సాధించింది. కార్తీ హీరోగా నటిస్తున్న కాష్మోరా చిత్రం దీపావళికి విడుదల కానుంది. కాగా తాజాగా యువ నటుడు అధర్వతో కలిసి నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఇంతకు ముందు నయనతార ప్రధాన పాత్రలో నటించిన మాయ చిత్రంతో మ్యాజిక్ చేసిన దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ చిత్రానికి ఇమైకా నోడిగళ్ అనే టైటిల్‌ను నిర్ణయించారు. కాగా ఇంతకు ముందు దొంగపోలీస్, ఒరనాళ్ కూత్తు వంటి చిత్రాలను నిర్మించిన క్యామియో ఫిలింస్ సంస్థ నిర్మిస్తున్న తాజా చిత్రం ఇది. అయితే ఈ చిత్రాలు ఆశించిన విజయాలను సాధించకపోవడంతో ఈసారి మంచి కమర్షియల్ అంశాలతో కూడిన కథగా ఆ ఇమైకా నోడిగళ్ చిత్రాన్ని నిర్మించనున్నట్లు తెలిసింది. కాగా ఇందులో నయనతార నటుడు అధర్వకు అక్కగా నటించనున్నట్లు సమాచారం. ఇంతకు ముందు మాయ చిత్రంలో నయన్‌ను తల్లిగా చూపించి సక్సెస్ అయిన దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు ఈ సారి అక్కగా ఎలాంటి డైనమిక్ పాత్రలో చూపించనున్నారన్నది వేచి చూడాల్సిందే.