రాశీఖన్నా.. పాలరాతి బొమ్మ.
ఆ రాతికి ఏ డ్రెస్ పొదిగినా..
పాల రాశి బొమ్మ అయిపోతుంది.
ఇక్కడి మీరు చూస్తున్నవి..
సెలెక్టెడ్ డిజైన్స్.
సెలెక్టెడ్ అంటే.. మీ కోసం కూడా..
సెలక్ట్ చేసి తెచ్చినవి.
ధరించి చూడండి..
మీరూ.. సౌందర్య రాశి అవ్వండి.
►షిఫాన్ ఫ్యాబ్రిక్ మీద మిర్రర్ వర్క్ చేసిన ఈ డ్రెస్‌ని రీ–మిక్స్ సాంగ్‌కి ఎంపిక చేశాం. దాండియా వంటి సంప్రదాయ డ్యాన్స్‌లకు ఇలాంటి డ్రెస్ బాగా నప్పుతుంది.
►ఈ మింట్ బ్లష్ గౌన్‌ని ఒక ప్రముఖ మ్యాగజీన్ షూట్‌కి ఎంపిక చేశాం. గ్లామర్ కోసం నెక్‌లైన్ పొడవుగా ఉన్నది తీసుకున్నాం. వెస్ట్రన్ పార్టీలకు ఇలాంటి డ్రెస్‌ని ఎంపిక చేసుకునేవారు నెక్‌లైన్ తక్కువ ఉన్నది ఎంపిక చేసుకోవచ్చు.
►ఇది ఇకత్ ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసిన డ్రెస్. ఇది ఈజీ టు వేర్. చేనేత ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసిన డ్రెస్‌లను ఏ సందర్భానికైనా వాడచ్చు. అన్ని రకాల బాడీ టైప్స్‌కి, ముఖ్యంగా క్యాజువల్ వేర్‌కి కరెక్ట్ ఔట్‌ఫిట్.
►అవార్డు ఫంక్షన్‌కు డాలీ జె డిజైన్ చేసిన గౌన్ ఇది. పెద్ద పెద్ద ఈవెంట్స్‌కీ ఇలాంటి డ్రెస్సింగ్ స్టైలిష్‌గా ఉంటుంది. అయితే, చర్మ రంగుకు తగ్గట్టు రంగుల ఎంపికలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.
► ఈ తరహా డ్రెస్ ధరించాలంటే ఇంతే ఎత్తు, ఇంతే బరువు ఉండాలనే నియమం ఏమీ లేదు. ఏ డ్రెస్ ధరించినా అసౌకర్యంగా అనిపించకపోవడం, కాన్ఫిడెంట్‌గా ఉండేలా చూసుకోవాలి.
► ఫ్లోర్‌ని తాకినట్టు పొడవుగా, నడుము దగ్గర చిన్న కట్ ఉండే దీనిని కట్ డౌన్ ఉంటారు. క్యాజువల్ ఈవెంట్స్‌కి, బర్త్‌డే, గెట్ టు గెదర్ వంటి సింపుల్ పార్టీలకు ఈ తరహా డ్రెస్‌ను ఎంచుకోవాలి. దీనికి ఈ వయసు వారే ధరించాలనే కొలమానాలు ఏవీ లేవు. క్రేప్, జార్జెట్ కాంబినేషన్‌లోనూ ఈ డ్రెస్‌ని డిజైన్ చేయించుకోవచ్చు.
► ఈ డ్రెస్‌కి టాప్ అండ్ బాటమ్ ప్రింట్ మెటీరియల్‌ను ఎంచుకోవాలి. దీని పైన ప్లెయిన్ జార్జెట్ లాంగ్ కేప్ ధరించాలి. ఈవెనింగ్ ఈవెంట్స్‌కి ఈ తరహా డ్రెస్సింగ్ స్టైలిష్‌గా ఉంటుంది. దీనికి ఫ్యాన్సీ జువెల్రీ, సింపుల్ హెయిర్ స్టైల్ నప్పుతుంది.
► ఇది నికషా అనార్కలీ డిజైన్ చేసిన లాంగ్ అనార్కలీ డ్రెస్. సినిమా ముహూర్త పూజ కోసం ఈ డ్రెస్‌ని ఎంపికచేశాం. దీనిని ఏ సంప్రదాయ వేడుకకైనా ధరించవచ్చు. ప్లెయిన్ షిఫాన్
►ఫ్యాబ్రిక్ మీద థ్రెడ్ వర్క్ చేశారు. ఛాతీభాగం, అంచుభాగం ఎంబ్రాయిడరీ వర్క్ హైలైట్‌గా నిలిచింది.
► రిధిమా కొల్లారే డిజైన్ చేసిన డ్రెస్ ఇది. దీనిని సినిమా ఆడియో లాంచ్‌కి ఎంపిక చేశాం. ప్రింటెడ్ రా సిల్క్ లెహెంగా మీదుగా కేప్‌ని నడుము దగ్గర కనెక్ట్ చేస్తూ నెట్ మెటీరియల్ ఉపయోగించారు. దీనిపైన మిర్రర్ వర్క్ చేయడంతో కళగా మారిపోయింది ఇండో వెస్ట్రన్ లుక్ కోసం ఈ తరహా డ్రెస్సింగ్‌ని ఎంపిక చేశాం. దీనిని గెట్ టు గెదర్ వంటి వెస్ట్రన్ పార్టీలతో పాటు సంప్రదాయ వేడుకకూ ఉపయోగించవచ్చు.
నీరజ కోన సినీ తారల డ్రెస్ స్టైలిస్ట్
కాస్ట్యూమ్ డిజైనర్
పాల రాశి బొమ్మ
Published Fri, Sep 15 2017 12:13 AM | Last Updated on Tue, Sep 19 2017 4:33 PM
Advertisement
Advertisement