Dress Designs
-
నిన్న.. నేడు.. రేపటి స్టైల్
ఒకరేమో నిన్నటి తరం ఇష్టాలను తెలిసున్నవారు మరొకరు నేటి తరపు ఆసక్తులను ఒంటపట్టించుకున్నవారు. ఈ ఇద్దరూ తూరుపు పశ్చిమానికి వారధులుగా ఇండోవెస్ట్రన్ డ్రెస్ డిజైన్స్‌తో సినీ స్టార్స్‌ను కూడా ఆకట్టుకుంటున్నారు. హైదరాబాద్ వాసులైన ఈ అత్తాకోడళ్ల పేర్లు శివానీ సింఘానియా, మాన్సీ సింఘానియా. అత్త తన డిజైన్స్‌ని కోడలికి నేర్పిస్తుంటే.. కోడలు నేటి ట్రెండ్‌ని అత్తకు పరిచయం చేస్తుంది. ఇద్దరూ కలిసి ఒకే రంగంలో రాణిస్తూ పాతికమందికి ఉపాధి కల్పిస్తున్నారు. డిజైన్స్ తెలుసుకుంటూ.. కోడలు మాన్సీ మాట్లాడుతూ.. ‘నేను ఎంబీయే చేశాను. డ్రెస్ డిజైన్స్‌ని ఎంపిక చేసుకోవడంలో ఇష్టంతో పాటు ఈ తరం ఎలాంటి మోడల్స్‌ని ఇష్టపడుతుందో తెలుసు. అయితే, ఈ రంగంలోకి వస్తాను అనుకోలేదు. నా పెళ్లికి మా అత్తగారే డిజైనర్. అవి నాకు చాలా బాగా నచ్యాయి. పెళ్లయ్యాక మా అత్తగారు శివానీ దగ్గర డిజైన్స్‌కు సంబంధించి కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటూ వాటి రూపకల్పనలో ఉంటున్నాను. మా కలెక్షన్లో బ్రైడల్, కాంటెంపరరీ, వెస్ట్రన్, ఇండో–వెస్టర్న్– క్లాసిక్ వేర్లలో స్ట్రెయిట్ కట్ ΄్యాటర్న్స్, మినిమలిస్ట్ ఎంబ్రాయిడరీ ప్రత్యేకంగా ఉంటాయి. వింటేజ్ స్టైల్స్‌తో పాటు మోడర్న్ డ్రెస్సుల రూపకల్పన మా ప్రత్యేకత’ ’ అని వివరిస్తుంది మాన్సీ. సెల్ఫ్ డిజైనర్‌ని.. వ్యక్తిగత శైలి, క్లిష్టమైన డిజైన్స్, హ్యాండ్ ఎంబ్రాయిడరీ తమ ప్రత్యేకతలు అని చెబుతారు ఈ అత్తాకోడళ్లు. బాలీవుడ్ స్టార్ సోహా ఆలీఖాన్, సోనాక్షి, మోడల్స్, ప్రముఖ గాయకులతో కలిసి తమ క్రియేషన్స్‌తో వేదికలపైన ప్రదర్శించామని వివరించారు. ‘‘నేను చదువుకున్నది ఇంటర్మీడియెట్ వరకు. కానీ ఈ రంగంలో ఉన్న ఆసక్తి నన్ను ఎంతోమందికి పరిచయం చేసింది. ఇంట్లో ఖాళీ సమయాల్లో పెయింట్స్, పెన్సిల్ డ్రాయింగ్ చేసేదాన్ని. కొన్నాళ్లకు ఆ డ్రాయింగ్స్‌ని టైలర్‌కి చూపించి మోడల్ డ్రెస్సులు తయారు చేయమని చె΄్పాను. మొదట మా ఇంట్లో అమ్మాయిలకు, బంధువులకు డిజైన్ చేసి ఇస్తూ, ఈ రంగంలోకి వచ్చేశాను. ఆ విధంగా ఫ్యాషన్ డిజైనింగ్‌ని సొంతంగా నేర్చుకున్నాను. నా డిజైన్స్ మామూలు వారి దగ్గర నుంచి టాలీవుడ్, బాలీవుడ్ స్టార్స్ కూడా మెచ్చుకోవడం ఎంతో ఆనందాన్నిస్తుంది. ప్రతి అమ్మాయి మా దుస్తుల్లో ఒక దివ్వెలా వెలిగి΄ోవాలని ఊహించి తొమ్మిదేళ్ల క్రితం బంజారాహిల్స్‌లో కనక్ పేరుతో డ్రెస్ డిజైన్ స్టూడియో ్రపారంభించాం’ అని వివరిస్తారు శివాని. -
Ruchi Varma: ఉద్యోగం మానేశానని ఇంట్లోవాళ్లు మాట్లాడలేదు..
సొంతంగా ఏదైనా సాధించాలనే కల అందరిలోనూ ఉంటుంది. ఆ కల కోసం నిరంతరం శ్రమిస్తేనే అనుకున్న ఫలితాలను అందుకోగలం. కానీ, కుటుంబ బాధ్యతలలో చాలా వరకు కలలు కల్లలుగానే ఉండిపోతాయి. ఉద్యోగం చేస్తున్న రుచివర్మ పరిస్థితి మొదట్లో అలాగే ఉండేది. వ్యాపారం వద్దని అడ్డుకున్న కుటుంబాన్ని మెప్పించింది, కాబోయే తల్లులకు డ్రెస్ డిజైన్స్ పేరుతో రెండున్నర లక్షలతో మొదలు వ్యాపారం మొదలుపెట్టి, రెండేళ్లలో ఏడాదికి 5 కోట్ల టర్నోవర్ చేరుకునేలా కృషి చేసింది. ఉద్యోగం వదులుకున్న పరిస్థితి నుంచి నలుగురికి ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదిగిన తన తపన నేడు ఎంతో మందికి స్ఫూర్తినిస్తోంది. ‘‘మాది బీహార్‌లోని దర్భంగా పట్టణం. మాది మధ్యతరగతి కుటుంబం. నాన్న బ్యాంకు ఉద్యోగి, అమ్మ గృహిణి. ముగ్గురు అక్కచెల్లెళ్లం. దర్భంగా నుండి ముంబైకి ఫ్యాషన్ డిజైనర్‌గా నా ప్రయాణం సాగింది. ► అమ్మ కోరుకున్నదని.. ప్రతి తల్లిదండ్రిలాగే మా అమ్మ కూడా మేం ముగ్గురం అక్కాచెల్లెళ్లం ఇంజనీర్లు కావాలని కోరుకునేది. ఆమె కల నెరవేర్చడానికి చాలా ప్రయత్నించాను. కానీ, ఆ కోచింగ్ ఖర్చు భరించడం పెద్ద విషయంగా అనిపించింది. అమ్మనాన్నల గురించి ఆలోచించినప్పుడు నా మనసులో చాలా గందరగోళం ఏర్పడింది. ఇవన్నీ ఆలోచించి నా శక్తి మేరకు ప్రయత్నించి, ఆ కోచింగ్ నుంచి ఆరు నెలల్లో తిరిగి వచ్చేశాను. ► ఫ్యాషన్ పరిశ్రమ వైపు మనసు దర్భంగా భూమి కళలకు ప్రసిద్ధి. మా ఇంటి పక్కన టైలర్‌గా పనిచేసే ఆమె వర్క్ నన్ను బాగా ఆకట్టుకునేది. ఈ విషయం ఇంట్లో చెప్పలేకపోయాను. ధైర్యం తెచ్చుకుని నాకు ఆర్ట్స్ అంటే ఆసక్తి ఉందని, ఇంజినీరింగ్ చదవలేనని నాన్నకు చెప్పాను. నాన్న అంతా గ్రహించి, ఏ చదువు కావాలో దానినే ఎంచుకోమన్నారు. దీంతో నేను నిఫ్ట్‌లో చేరాను. ► ప్రతి నిర్ణయమూ కష్టమే నిఫ్ట్ పరీక్షలో పాసయ్యాక ముంబైకి వెళ్లాలనే నిర్ణయం కష్టమే అయ్యింది. ఒంటరిగానా?! అని భయపడ్డారు. కానీ, కొన్ని రోజుల ప్రయత్నంలో నా ఇష్టమే గెలిచింది. అది నా జీవితాన్ని మార్చింది. కాలేజీ నుంచి వెళ్లి ఓ ఎక్స్పోర్ట్ హౌజ్‌లో జాయిన్ అయ్యాను. అక్కడ మెటర్నిటీ వేర్ డిజైన్ చేసే అవకాశం వచ్చింది. మూడేళ్లపాటు ఆ ఎక్స్పోర్ట్ హౌస్‌లో పనిచేసి చాలా నేర్చుకున్నాను. ఆఫీసు, ఫ్యాక్టరీ ఒకే చోట ఉండడం వల్ల డిజైనింగ్ కాకుండా ప్రింటింగ్, స్టిచింగ్, శాంపిల్, ప్రొడక్షన్ నేర్చుకున్నాను. ఆ వర్క్ నాకు చాలా ఉపయోగపడింది. ► ఎక్కడో ఏదో లోటు. 2012 లో మొదటి ఉద్యోగం వస్తే 2019 నాటికి, నేను నాలుగు కంపెనీలలో డిజైనర్ నుండి సీనియర్ డిజైనర్ స్థానానికి చేరుకున్నాను. ఉద్యోగం చేస్తున్నాను కానీ సంతృప్తి మాత్రం లభించలేదు. పని పెరుగుతూ వచ్చింది. స్థిర జీతం అలవాటుగా మారింది. కానీ ఎప్పుడూ ఏదో మిస్ అవుతున్నట్లు అనిపిస్తుంది. బాల్యంలో టైలర్ ఆంటీని స్ఫూర్తిగా తీసుకుంటే టెన్త్ క్లాస్ వచ్చేనాటికి ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా నా ఆదర్శంగా ఉండేవారు. ‘నేను కూడా నా సొంత బ్రాండ్‌ని ప్రారంభించాలనుండేది. నేను ఉద్యోగం కోసమే ఈ కోర్సు ఎంచుకోలేదు.. ఎలా?’ అనే ఆలోచనలు నన్ను కుదురుగా ఉండనిచ్చేవి కావు. ► ఇంట్లో వాళ్లు మాట్లాడలేదు... 2019లో ఉద్యోగం మానేయాలని నిర్ణయించుకున్నాను. ఉద్యోగం మానేసినట్లు తల్లిదండ్రులు, భర్తకు చెప్పినప్పుడు వారు సంతోషించలేదు. మొదట నా భర్త చాలా నిరాకరించాడు. తరువాత నా తల్లిదండ్రులు కూడా సెటిల్డ్ లైఫ్ ను ఎందుకు వదిలేయాలి అనే మాటలే. ఇంట్లో ఉన్నవాళ్లంతా బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన వాళ్లే కాబట్టి వాళ్లకు నా బాధ అర్థం కాకుండాపోయింది. నేనే ఓ రోజు నిర్ణయం తీసుకుని ఉద్యోగం వదిలేశాను. ఉద్యోగం మానేసినందుకు నా భర్త కొన్ని రోజులు మాట్లాడలేదు. రీసెర్చ్ వర్క్ చేశాక, వచ్చే 34 నెలల ప్లానింగ్‌ని మా అమ్మనాన్నలకు చెప్పాను, అప్పుడు వాళ్ళు కొద్దిగా కన్విన్స్అయ్యారు. నేను రంగంలోకి దిగగానే అసలు గొడవ మొదలైంది. ► చులకనగా మాట్లాడేవారు.. ఈ రంగంలోకి రాకముందే చాలా పరిశోధనలు మొదలుపెట్టాను. మార్కెట్లో ఏ సెక్షన్ కు డిమాండ్ పెరుగుతుందో కనిపించింది. కాబోయే తల్లుల దుస్తుల విషయంలో చాలా లోటు కనిపించింది. ఇంతకు ముందు ఇదే రంగంలో పనిచేశాను కాబట్టి కొంచెం ఆత్మవిశ్వాసం వచ్చి ఈ ప్రొడక్ట్‌ని ఎంచుకున్నాను. అయితే, రంగంలోకి దిగగానే అసలు గొడవ మొదలైంది. వన్ మ్యాన్ ఆర్మీలా అన్నీ నేనే చేయాల్సి వచ్చింది. ఇప్పటి వరకు కేవలం డిజైనింగ్ వర్క్ మాత్రమే చేశాను. కానీ ఇప్పుడు ప్రొడక్షన్ లైన్, లోగో డిజైనింగ్, ప్యాకేజింగ్, డెలివరీ ఫైనాన్స్లాంటివన్నీ చేశాను. ఎందుకంటే నా దగ్గర బడ్జెట్ తక్కువగా ఉంది, కాబట్టి ఇక్కడ అతిపెద్ద సమస్య ఏర్పడింది. నా అవస్థ చూసి ఎగతాళి చేసినవారున్నారు. చులకనగా మాట్లాడినవారున్నారు. ‘ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్లకు డ్రెస్ డిజైన్స్ ఏంటి?!’ అని నాతో పని చేయడానికి వర్కర్స్ నిరాకరించేవారు. దీంతో పెద్ద ఇబ్బందిని ఎదుర్కొన్నాను. కానీ, నా పట్టుదలను వదిలిపెట్టలేదు. రెండేళ్లలో 2.5 లక్షల వ్యాపారం కోట్లకు కోవిడ్ కాలం అందరికీ కష్టంగా ఉండేది. దీంతో ఆఫ్‌లైన్ పనులు ప్రారంభం కాలేదు. అప్పుడు నా వ్యాపారం ఆఫ్‌లైన్ లో మాత్రమే చేయాలని ఆలోచించాను. ఇది నాకు ప్రయోజనకరంగా మారింది. కొన్ని ఆన్లైన్ మార్కెటింగ్ సైట్స్‌తో మాట్లాడాను. ముందు నా ప్రతిపాదనను వాళ్లు అంగీకరించలేదు. దీంతో నా సొంత సైట్లో ‘ఆరుమి’పేరుతో కాబోయే తల్లుల కోసం చేసిన నా డిజైన్స్ పెట్టాను. ప్రారంభించిన 24 గంటల్లోనే ఆర్డర్లు రావడం మొదలయింది. ఈ రోజు నా బ్రాండ్ అన్ని ఆన్లైన్ మార్కెట్లోనూ సేల్ అవుతోంది’’ అని వివరించే రుచివర్మ ప్రయాణం ఎంతోమందికి స్ఫూర్తినిస్తుంది. -
హామ్స్టెక్ కొత్త డిజైన్లు.. ఎంబ్రాయిడరీ వర్క్ కాంబినేషన్లో..
పున్నమి వెన్నెల వెలుగు పాల నురగలా ఉంటుంది. ఆకాశం నీలంగా ఉంటుంది. ఈ రెండింటి కాంబినేషన్‌కి తారల కాంతుల ఎంబ్రాయిడరీ జతగా చేరితే చూడచక్కని కళ కళ్లకు కడుతుంది. అది సల్వార్ సెట్ అయినా.. పలాజో కట్ అయినా చీరకట్టు అయినా టాప్ టు బాటమ్ వెలుగులు విరజిమ్ముతాయి. కరోనా కాలంనుంచి ఇప్పుడిప్పుడే ప్రపంచం ఊపిరి పీల్చుకుంటోంది. సృజనాత్మకత కొత్తగా ముస్తాబు అవుతోంది. ప్లెయిన్ కాటన్, సిల్క్, క్రేప్.. క్లాత్‌ను అధునాతనమైన డిజైన్లతో మెరిపించవచ్చని చూపుతున్నారు నవ డిజైనర్లు. ఎంబ్రాయిడరీ, అప్లిక్, మిర్రర్ వర్క్, మోటిఫ్స్, క్లే అండ్ వాల్ ఆర్ట్, పెయింటింగ్.. ఈ అన్నింటి కాంబినేషన్‌తో హామ్స్టెక్ నవ డిజైనర్ల చేతుల్లో రూపుదిద్దుకున్నాయి. భారతీయ సంస్కృతి, శాస్త్రీయ నృత్య రూపాలు, స్థానిక తెగల జీవనం, శిల్పాలు, దేవాలయాల నిర్మాణం.. ఇవన్నీ అంతర్లీనంగా దుస్తులపై కనిపిస్తే ఎలా ఉంటాయో ఈ డిజైన్స్‌లో తీర్చిదిద్దారు. చదవండి: Punam Rai: ఆడపిల్లంటే ఇలా ఉండాలి.. సమాజం అంత అందమైనదేం కాదు!! -
Fashion: చేనేతలతో సీజన్ వేర్
విధుల్లో వినూత్నం సౌకర్యంలో సమున్నతం సింప్లీ సూపర్బ్ అనిపించే చేనేతలదే ఈ సీజన్ అంతా! కరోనా సెకండ్ వేవ్ స్టార్ట్ అయ్యింది. తప్పనిసరి అనుకున్న సంస్థల్లో ఉద్యోగులు తమ విధులను నిర్వరిస్తున్నారు. ఇది వేసవి కాలం కూడా. సీజన్‌కి తగ్గట్టు చికాకు కలిగించని క్లాత్‌తో డిజైన్ చేసిన డ్రెస్ ధరిస్తే మేనికి హాయిగా ఉంటుంది. అలాగే, మాస్క్, శానిటైజర్ వంటివి వెంట తీసుకెళ్లాల్సిన పరిస్థితి. ఇలాంటప్పుడు డ్రెస్సుల మీదకు దుపట్టా లాంటివి ధరించాలన్నా కొంత ఇబ్బందే. వీటన్నింటికి పరిష్కారంగానే ఫ్యాషన్ డిజైనర్ హేమంత్ సిరీ ఆంధ్ర చేనేత బొబ్బిలి, తెలంగాణ చేనేత నారాయణ్‌పేట్ చీరలతో చేసిన డ్రెస్ డిజైన్స్ ఇవి. సింపుల్‌గా, ప్రత్యేకంగా కనిపించాలనుకునేవారు ఇలా బ్లేజర్ స్టైల్ లాంగ్ కుర్తా డిజైన్ని రెడీ చేసుకోవచ్చు. నారాయణ్‌పేట్ శారీస్‌కి బార్డర్ ఉంటుంది. దీనిని కూడా డిజైన్‌లో భాగం చేసుకోవచ్చు. చేతుల చుట్టూ అలాగే ఒక వైపు కుర్తా లెంగ్త్ బార్డర్‌ను జత చేసుకుంటే డ్రెస్ ప్రత్యేకంగా కనిపిస్తుంది. డ్రెస్ ప్రత్యేకతలు ►బ్లేజర్ స్టైల్ లాంగ్ కుర్తా. ►మాస్క్, చిన్న శానిటైజర్ బాటిల్, ఫోన్ వంటివి క్యారీ చేయడానికి పాకెట్స్. ►మోచేతుల భాగంలో హ్యాండ్ స్లిట్స్ ►స్ట్రెయిట్ కట్ పాయింట్ ఉద్యోగినులకు, టీనేజర్స్‌కి ఈ స్టైల్ సూట్స్ ప్రత్యేకమైన అందాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. -హేమంత్ సిరీ, ఫ్యాషన్ డిజైనర్, హైదరాబాద్ -
కాదెవరూ ఫ్యాషన్‌కు అనర్హం
సాక్షి, హైదరాబాద్: మీరెప్పుడైనా లావుగా, బొద్దుగా ఉన్నవాళ్లు మోడల్స్‌గా ఉండటం చూశారా ? అన్నీ ప్రముఖ షాపింగ్ మాల్స్‌లోనూ, ఈ-కామర్స్ సంస్థల్లోనూ కాస్త సన్నగా, నాజూకుగా ఉన్నవారినే మోడల్స్‌గా తీసుకొని తమ బ్రాండ్స్‌ను ప్రమోట్ చేసుకుంటారు. అయితే ఈ సాంప్రదాయ పద్దతికి మేము వ్యతిరేకం అంటోంది యునైటెడ్ కింగ్డామ్ (యూకే)కి చెందిన ‘ప్రిటీ లిటిల్‌థింగ్’ (పీఎల్టీ) అనే రిటైల్ సంస్థ. తమ ఉత్పత్తులను స్థూలకాయులకు చేరువ చేసేందుకు హెయిలీ బాల్డవిన్ అనే సంస్థతో ప్రిటీ లిటిల్‌థింగ్ జతకట్టింది. దీనికై నాజూకుగా ఉన్న మోడల్స్‌తో పాటు బొద్దుగా (ప్లస్ సైజ్) ఉన్న పలువురిని ఎంపిక చేసింది. ఇది కాస్తా వైరల్ కావడంతో నెటిజన్లు ట్విటర్లో ప్రశంశల జల్లు కురిపిస్తున్నారు. ఆన్లైన్ సంస్థలు స్థూలకాయులకు సరిపడా సైజు దుస్తులను సరిగా చూపలేకపోవడంతో దుస్తుల ఎంపికలో వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అక్కడక్కడా దొరికినప్పటికీ అవి అంతగా సంతృప్తిని ఇవ్వడం లేదని అంటున్నారు. ఈ సందర్భంలో వెలుగులోకి వచ్చిన ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ, వారికి కావాల్సిన దుస్తులను విభిన్న సైజుల్లో ఉన్న మోడల్స్ ద్వారా చేరువ చేస్తామని అంటోంది. అంటే ఇకపై లావుగా కనిపించే మోడల్స్ ఫోటోలు సైతం ఆ సంస్థ వెబ్సైట్లో కనిపించనున్నాయి. బొద్దుగా ఉన్నవారు ఏ బెరుకు లేకుండా తమకు సరిపడా దుస్తులను ఎంపిక చేసుకోవచ్చు. నెటిజన్లంతా ఈ మార్పును ఆహ్వానించడమే గాక, ఈ నిర్ణయం తీసుకున్న పీఎల్టీ సంస్థను ప్రశంసిస్తున్నారు. మహిళలు దీన్ని ట్విటర్లో షేర్ చేస్తూ ఇదో మంచి ఉద్యమమని అభిప్రాయపడుతున్నారు. -
పాల రాశి బొమ్మ
రాశీఖన్నా.. పాలరాతి బొమ్మ. ఆ రాతికి ఏ డ్రెస్ పొదిగినా.. పాల రాశి బొమ్మ అయిపోతుంది. ఇక్కడి మీరు చూస్తున్నవి.. సెలెక్టెడ్ డిజైన్స్. సెలెక్టెడ్ అంటే.. మీ కోసం కూడా.. సెలక్ట్ చేసి తెచ్చినవి. ధరించి చూడండి.. మీరూ.. సౌందర్య రాశి అవ్వండి. ►షిఫాన్ ఫ్యాబ్రిక్ మీద మిర్రర్ వర్క్ చేసిన ఈ డ్రెస్‌ని రీ–మిక్స్ సాంగ్‌కి ఎంపిక చేశాం. దాండియా వంటి సంప్రదాయ డ్యాన్స్‌లకు ఇలాంటి డ్రెస్ బాగా నప్పుతుంది. ►ఈ మింట్ బ్లష్ గౌన్ని ఒక ప్రముఖ మ్యాగజీన్ షూట్‌కి ఎంపిక చేశాం. గ్లామర్ కోసం నెక్లైన్ పొడవుగా ఉన్నది తీసుకున్నాం. వెస్ట్రన్ పార్టీలకు ఇలాంటి డ్రెస్‌ని ఎంపిక చేసుకునేవారు నెక్లైన్ తక్కువ ఉన్నది ఎంపిక చేసుకోవచ్చు. ►ఇది ఇకత్ ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసిన డ్రెస్. ఇది ఈజీ టు వేర్. చేనేత ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసిన డ్రెస్‌లను ఏ సందర్భానికైనా వాడచ్చు. అన్ని రకాల బాడీ టైప్స్‌కి, ముఖ్యంగా క్యాజువల్ వేర్కి కరెక్ట్ ఔట్ఫిట్. ►అవార్డు ఫంక్షన్‌కు డాలీ జె డిజైన్ చేసిన గౌన్ ఇది. పెద్ద పెద్ద ఈవెంట్స్కీ ఇలాంటి డ్రెస్సింగ్ స్టైలిష్‌గా ఉంటుంది. అయితే, చర్మ రంగుకు తగ్గట్టు రంగుల ఎంపికలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ► ఈ తరహా డ్రెస్ ధరించాలంటే ఇంతే ఎత్తు, ఇంతే బరువు ఉండాలనే నియమం ఏమీ లేదు. ఏ డ్రెస్ ధరించినా అసౌకర్యంగా అనిపించకపోవడం, కాన్ఫిడెంట్‌గా ఉండేలా చూసుకోవాలి. ► ఫ్లోర్‌ని తాకినట్టు పొడవుగా, నడుము దగ్గర చిన్న కట్ ఉండే దీనిని కట్ డౌన్ ఉంటారు. క్యాజువల్ ఈవెంట్స్‌కి, బర్త్‌డే, గెట్ టు గెదర్ వంటి సింపుల్ పార్టీలకు ఈ తరహా డ్రెస్‌ను ఎంచుకోవాలి. దీనికి ఈ వయసు వారే ధరించాలనే కొలమానాలు ఏవీ లేవు. క్రేప్, జార్జెట్ కాంబినేషన్లోనూ ఈ డ్రెస్‌ని డిజైన్ చేయించుకోవచ్చు. ► ఈ డ్రెస్‌కి టాప్ అండ్ బాటమ్ ప్రింట్ మెటీరియల్‌ను ఎంచుకోవాలి. దీని పైన ప్లెయిన్ జార్జెట్ లాంగ్ కేప్ ధరించాలి. ఈవెనింగ్ ఈవెంట్స్‌కి ఈ తరహా డ్రెస్సింగ్ స్టైలిష్‌గా ఉంటుంది. దీనికి ఫ్యాన్సీ జువెల్రీ, సింపుల్ హెయిర్ స్టైల్ నప్పుతుంది. ► ఇది నికషా అనార్కలీ డిజైన్ చేసిన లాంగ్ అనార్కలీ డ్రెస్. సినిమా ముహూర్త పూజ కోసం ఈ డ్రెస్‌ని ఎంపికచేశాం. దీనిని ఏ సంప్రదాయ వేడుకకైనా ధరించవచ్చు. ప్లెయిన్ షిఫాన్ ►ఫ్యాబ్రిక్ మీద థ్రెడ్ వర్క్ చేశారు. ఛాతీభాగం, అంచుభాగం ఎంబ్రాయిడరీ వర్క్ హైలైట్‌గా నిలిచింది. ► రిధిమా కొల్లారే డిజైన్ చేసిన డ్రెస్ ఇది. దీనిని సినిమా ఆడియో లాంచ్‌కి ఎంపిక చేశాం. ప్రింటెడ్ రా సిల్క్ లెహెంగా మీదుగా కేప్‌ని నడుము దగ్గర కనెక్ట్ చేస్తూ నెట్ మెటీరియల్ ఉపయోగించారు. దీనిపైన మిర్రర్ వర్క్ చేయడంతో కళగా మారిపోయింది ఇండో వెస్ట్రన్ లుక్ కోసం ఈ తరహా డ్రెస్సింగ్‌ని ఎంపిక చేశాం. దీనిని గెట్ టు గెదర్ వంటి వెస్ట్రన్ పార్టీలతో పాటు సంప్రదాయ వేడుకకూ ఉపయోగించవచ్చు. నీరజ కోన సినీ తారల డ్రెస్ స్టైలిస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ -
ఇండో-వెస్ట్రన్ బాలానందం...
ఏ పార్టీకైనా, ఏ ఇంటికైనా కళ తెచ్చేది పిల్లల నవ్వులే! వేడుకేదైనా ఉందంటే పెద్దలు పది రోజుల ముందుగానే కావల్సిన అలంకరణ వస్తువులన్నీ సిద్ధం చేసుకుంటారు. ఇప్పుడు ఈ శ్రద్ధ పిల్లలపైనా పెట్టాల్సిందే! ఇటీవల పిల్లల అలంకరణలోనూ చాలా మార్పులు వచ్చాయి. ఇండో-వెస్ట్రన్ స్టైల్లో ఉండే వస్త్రాలంకరణ, ఇతర అలంకరణ వస్తువులు పెద్దలను సైతం ఆకట్టుకుంటున్నాయి. అయితే సౌకర్యం, మన్నిక, ఆకర్షణీయం... ఈ మూడింటిని దృష్టిలో ఉంచుకొని పిల్లలను తయారుచేస్తే రోజంతా వారి నవ్వులతో పెద్దలూ మురిసిపోవచ్చు. మెడ పొడవుగా ఉంటే... చైనీస్ కాలర్ నెక్ బాగుంటుంది. డ్రెస్ డిజైన్లలో ఇటీవల ఎక్కువ ఫ్లెయిర్ ఉన్న చుడీదార్లు, గౌన్లను అమ్మాయిలు బాగా ఇష్టపడుతున్నారు. అయితే అమ్మాయిలు బాగా సన్నగా ఉండి, పొడవుగా ఉంటే బాటమ్‌గా పటియాలా, బొద్దుగా ఉంటే చుడీని ఎంచుకోవడం మంచిది. వీటిని దృష్టిలో పెట్టుకొని అమ్మాయిలకు డ్రెస్ డిజైనింగ్ చేయవచ్చు. ఎప్పుడూ కంఫర్ట్‌గా కనిపించాలంటే స్పోర్టివ్ లుక్‌తో కనిపించే క్యాజువల్ డ్రెస్‌ను ఎంపిక చేయాలి. మెత్తటి ఫ్యాబ్రిక్... నెట్టెడ్, రా సిల్క్, షిఫాన్, బెనారస్... చాలా మార్కెట్లో ఫ్యాబ్రిక్స్ ఎన్నో ఉన్నాయి. అయితే పిల్లల చర్మానికి తగ్గట్టు మల్మల్, మెత్తటి నెటెడ్, లినెన్, డెనిమ్.. ఫ్యాబ్రిక్స్ బాగా నప్పుతాయి. వీటిలోనే కాంతిమంతమైన రంగులను ఎంచుకోవడం మంచిది. తెలుపు-నలుపు-ఎరుపు రెట్రో స్టైల్ అనిపించేలా పోల్కా డాట్స్ ప్రింట్లు గల ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసిన దుస్తులు పిల్లలను ఎప్పుడూ ఆకర్షణీయంగా చూపుతాయి. ఈ తరహా దుస్తులు సాయంకాలం పాశ్చాత్య వేడుకలకు అందంగా అమరుతాయి. చలికాలంలో వెచ్చని ఫ్యాషన్... వెచ్చగా ఉండటానికి స్వెటర్ వేస్తే చాలనుకునే రోజులు మారిపోయాయి. ఊలు ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసిన గౌన్లు, ఓవర్కోట్లు, షగ్స్,్ర క్యాప్స్.. రంగురంగుల్లో పిల్లలను చూపించడానికి ఉవ్విళ్లూరుతున్నాయి. ఈ తరహా దుస్తులను ఎవరికి వారు తమకు నచ్చిన డిజైన్లు చేసుకోవడానికి వీలుగా ఉన్ని మెటీరియల్ కూడా మార్కెట్లో అందుబాటులో లభిస్తోంది. ఆధునికం...: చెక్స్ షర్ట్స్, ప్లెయిన్స్తో మిక్స్ అండ్ మ్యాచ్‌గా కలిపి ధరించి ఆధునికతకు కొత్త భాష్యం చెప్పడానికి ఈ దుస్తులు ముందుంటున్నాయి. అడ్డం, నిలువు మల్టీకలర్ చారలు ఈ దుస్తులలో ప్రధానంగా చోటుచేసుకుంటున్నాయి. సంప్రదాయ దుస్తులు: గౌను, సల్వార్-కమీజు, గాగ్రా-చోళీ, లంగా- జాకెట్టు, ధోతీ- కుర్తా.. ఇవన్నీ సంప్రదాయ దుస్తులు. పెద్దవారిలానే పిల్లల సంప్రదాయ దుస్తుల్లోనూ ఎక్కువ రంగులు, మెత్తటి ఫ్యాబిక్స్, మెరిసే అంచులు.. ఉండేలా రూపొందిస్తున్నారు డిజైనర్లు. ముఖ్యంగా చలికాలపు డల్ వాతావరణానికి ఇవి సరికొత్తగా జీవం పోస్తున్నాయి. సౌకర్యం...: సాధారణ చొక్కా, షార్ట్ ధరించినా కలర్ఫుల్గా, స్టైల్‌గా కనిపించాలంటే ఒక చిన్న స్కార్ఫ్‌తో రూపుమార్చేయవచ్చు.ఆటలకు, అల్లరికి సౌకర్యవంతమైన డ్రెస్గానే కాకుండా గెట్ టుగెదర్ పార్టీలకు ఆకర్షణీయంగా ఉంటుంది. బొద్దుగా ఉంటే... పిల్లలు బొద్దుగా ఉంటే వారి దుస్తుల్లో ఫ్రంట్ నెక్ వెడల్పుగా కాకుండా సన్నటి డీప్ నెక్కి ప్రాధాన్యత ఇస్తే చూడముచ్చటగా ఉంటారు. బ్రాడ్ నెక్ కావాలంటే దీంట్లో ‘యోక్ నెక్’ డిజైన్ చేసుకోవాలి. మరిన్ని సూచనలు... ⇔ డ్రెస్ పైన అనవసరమైన, బరువైన అలంకరణ ఉండకూడదు. ⇔ డ్రెస్ లోపలివైపు మెత్తని కాటన్ లైనింగ్ తప్పనిసరి. ⇔ జరీ ఎంబ్రాయిడరీ, స్టోన్స్.. దుస్తులు పిల్లలకు అసౌకర్యాన్ని కలిగిస్తాయి. సాధ్యమైనంతవరకు దారంతో చేసిన ఎంబ్రాయిడరీ, రంగు రంగుల పూసలను డిజైనింగ్‌లో వాడవచ్చు. మీరు ఎంపిక చేసిన డ్రెస్‌లో పిల్లలు రోజంతా సంతోషంగా నవ్వుతూ ఉన్నారంటే వారికి ఆ వేషధారణ సౌకర్యంగా ఉన్నట్టు. సంతోషంగా ఉంటేనే ధరించిన దుస్తులకు కొత్త అందం తెచ్చినట్టు.