పున్నమి వెన్నెల వెలుగు పాల నురగలా ఉంటుంది. ఆకాశం నీలంగా ఉంటుంది. ఈ రెండింటి కాంబినేషన్‌కి తారల కాంతుల ఎంబ్రాయిడరీ జతగా చేరితే చూడచక్కని కళ కళ్లకు కడుతుంది. అది సల్వార్ సెట్ అయినా.. పలాజో కట్ అయినా చీరకట్టు అయినా టాప్ టు బాటమ్ వెలుగులు విరజిమ్ముతాయి.
కరోనా కాలంనుంచి ఇప్పుడిప్పుడే ప్రపంచం ఊపిరి పీల్చుకుంటోంది. సృజనాత్మకత కొత్తగా ముస్తాబు అవుతోంది. ప్లెయిన్ కాటన్, సిల్క్, క్రేప్.. క్లాత్‌ను అధునాతనమైన డిజైన్లతో మెరిపించవచ్చని చూపుతున్నారు నవ డిజైనర్లు.
ఎంబ్రాయిడరీ, అప్లిక్, మిర్రర్ వర్క్, మోటిఫ్స్, క్లే అండ్ వాల్ ఆర్ట్, పెయింటింగ్.. ఈ అన్నింటి కాంబినేషన్‌తో హామ్‌స్టెక్ నవ డిజైనర్ల చేతుల్లో రూపుదిద్దుకున్నాయి. భారతీయ సంస్కృతి, శాస్త్రీయ నృత్య రూపాలు, స్థానిక తెగల జీవనం, శిల్పాలు, దేవాలయాల నిర్మాణం.. ఇవన్నీ అంతర్లీనంగా దుస్తులపై కనిపిస్తే ఎలా ఉంటాయో ఈ డిజైన్స్‌లో తీర్చిదిద్దారు.
చదవండి: Punam Rai: ఆడపిల్లంటే ఇలా ఉండాలి.. సమాజం అంత అందమైనదేం కాదు!!
Comments
Please login to add a commentAdd a comment