Embroidery Work
-
ఎంబ్రాయిడరీ చీరలో సంజీదా.. చూస్తే ఫిదా అయిపోతారు! (ఫొటోలు)
-
హామ్స్టెక్ కొత్త డిజైన్లు.. ఎంబ్రాయిడరీ వర్క్ కాంబినేషన్లో..
పున్నమి వెన్నెల వెలుగు పాల నురగలా ఉంటుంది. ఆకాశం నీలంగా ఉంటుంది. ఈ రెండింటి కాంబినేషన్‌కి తారల కాంతుల ఎంబ్రాయిడరీ జతగా చేరితే చూడచక్కని కళ కళ్లకు కడుతుంది. అది సల్వార్ సెట్ అయినా.. పలాజో కట్ అయినా చీరకట్టు అయినా టాప్ టు బాటమ్ వెలుగులు విరజిమ్ముతాయి. కరోనా కాలంనుంచి ఇప్పుడిప్పుడే ప్రపంచం ఊపిరి పీల్చుకుంటోంది. సృజనాత్మకత కొత్తగా ముస్తాబు అవుతోంది. ప్లెయిన్ కాటన్, సిల్క్, క్రేప్.. క్లాత్‌ను అధునాతనమైన డిజైన్లతో మెరిపించవచ్చని చూపుతున్నారు నవ డిజైనర్లు. ఎంబ్రాయిడరీ, అప్లిక్, మిర్రర్ వర్క్, మోటిఫ్స్, క్లే అండ్ వాల్ ఆర్ట్, పెయింటింగ్.. ఈ అన్నింటి కాంబినేషన్‌తో హామ్స్టెక్ నవ డిజైనర్ల చేతుల్లో రూపుదిద్దుకున్నాయి. భారతీయ సంస్కృతి, శాస్త్రీయ నృత్య రూపాలు, స్థానిక తెగల జీవనం, శిల్పాలు, దేవాలయాల నిర్మాణం.. ఇవన్నీ అంతర్లీనంగా దుస్తులపై కనిపిస్తే ఎలా ఉంటాయో ఈ డిజైన్స్‌లో తీర్చిదిద్దారు. చదవండి: Punam Rai: ఆడపిల్లంటే ఇలా ఉండాలి.. సమాజం అంత అందమైనదేం కాదు!! -
స్లీవ్స్ అండ్ స్టయిల్స్
పెళ్లి కూతురు చీర అనగానే మన మదిలో కంచిపట్టు పేరే మెదులుతుంది. కంచి పట్టు అందం రెట్టింపులుగా కనిపించాలంటే ఎంచుకున్న బ్లౌజ్ డిజైన్ ప్రత్యేకంగా ఉండాలి. కలర్ కాంబినేషన్ సరిగ్గా కుదరాలి. అందుకు వేల డిజైన్లను పరిశీలిస్తారు. లేదంటే, గ్రాండ్‌గా కనిపించాలని బ్లౌజ్ అంతా ఎంబ్రాయిడరీ వర్క్‌తో నింపేస్తారు. పెళ్లి చీరకు తగిన బ్లౌజ్ మ్యాచ్ చేసుకునేలా మన దగ్గరే సరైన సమాధానం ఉంటే ఎంపిక ఇంకా సులువు అవుతుంది. ‘బ్లౌజ్‌పై ఎలాంటి వర్క్ అయితే బాగుంటుందో చెప్పడానికి ముందు చీరలో ఉన్న డిజైన్, కలర్ కాంబినేషన్స్ చూసుకుంటాం. ఆ చీరపై ఉన్న థీమ్ డిజైన్ బ్లౌజ్‌పై ఎలా చూపుతామో కస్టమర్‌కి ఒక స్టోరీలా వివరంగా చెబుతాం. దీంతో ఆ బ్లౌజ్ డిజైన్ మరెక్కడా లేనివిధంగా రూపుదిద్దుకుంటుంది. ఒకసారి వాడి ఆరేడేళ్ల తర్వాత కూడా ఆ బ్లౌజ్‌ను బయటకు తీస్తే ఈ వర్క్ ఇప్పుడు ట్రెండ్‌లో లేదు కదా అనే ఫీల్ ధరించినవారికి రాకూడదని కోరుకుంటాను. – భార్గవి అమిరినేని, ఫ్యాషన్ డిజైనర్, హైదరాబాద్ www.instagram.com/bhargavi.amirineni కలర్ కాంబినేషన్ ►పెళ్లి అనగానే సాధారణంగా అందరికీ గుర్తుకువచ్చే కామన్ కలర్స్ ... ఎరుపు, నీలం, పచ్చ, పింక్, గోల్డ్ ►సాధారణంగా బ్లౌజ్‌లు ఎంచుకునేటప్పుడు మూడు రకాలుగా ఆలోచన చేస్తాం. ఒకటి: శారీ కలర్లోనే ఉండేది. రెండు: పూర్తి కాంట్రాస్ట్. మూడు: అన్నింటికీ వాడే గోల్డ్ కలర్. వీటిలో ఏది ప్రత్యేకంగా ఉంటుందో చూసుకోవాలి. పెళ్లి కూతురు బ్లౌజ్ అయితే చీరకు కాంట్రాస్ట్ కలర్ ఎంచుకుంటాం. లేదంటే గోల్డ్ ఆలోవర్ వర్క్ తీసుకుంటాం ►మేనిరంగును బట్టి తెల్లగా ఉండేవారు కాంతిమంతమైన రంగులు, రంగు తక్కువ ఉన్నవారు లేత రంగు చీరలు అని ఎంపిక చేసుకుంటారు. కొందరు చామనచాయగా ఉన్నా బ్రైట్ కలర్స్ ధరించాలనుకుంటారు. వీళ్లు ముదురు రంగు చీరలు ఎంచుకున్నప్పుడు కొద్దిగా లేత రంగు బ్లౌజ్‌ను మ్యాచ్ చేసుకోవాలి. దీనివల్ల ఆ కలర్ ఫేస్ మీద ప్రతిబింబిస్తుంది ►చీరలో జరీ డిజైన్ శాతం ఎక్కువ ఉంటే బాగా బ్రైట్ కలర్ బ్లౌజ్ తీసుకోవాలి. కంచిపట్టులో కలర్ ఎక్కువ ఉంటే దానిని కాస్త డల్ చేయడానికి బ్లౌజ్లో ఎక్కువ వర్క్ తీసుకోవాలి ►పెద్ద బార్డర్ చీరలకు మోచేతుల(ఎల్బో)వరకు స్లీవ్స్ బాగుంటాయి. చిన్న బార్డర్ అయితే మోచేతుల వరకు చేతుల డిజైన్ పాటు కొంత కుచ్చులు వచ్చేలా డిజైన్ చేయించుకోవచ్చు. లేదంటే అంచు పెద్దగా ఉంటే మోచేతుల వరకు అంచుతోనే డిజైన్ చేసుకోవచ్చు. పొడవుగా ఉన్నవారికి: మోచేతుల కిందవరకు 3/4 స్లీవ్స్ బాగుంటాయి. వీటి మీద సింపుల్ డిజైన్ చేయించుకోవచ్చు పొడవు తక్కువ ఉన్నవారు: మోచేతుల వరకు స్లీవ్స్, లైన్స్ వచ్చేలా ఎంబ్రాయిడరీ, కరెక్ట్ ఫిటింగ్‌తో ఉంటే పొడుగ్గా కనిపిస్తారు. అలాగే, బాడీ పార్ట్‌కి ఒక కలర్, స్లీవ్స్‌కి మరో కలర్ ఫ్యాబ్రిక్ తీసుకున్నా పొడవు కనిపిస్తారు. వీళ్లు బ్లౌజ్ లెంగ్త్ పొట్టిగా ఉండాలనుకోకూడదు. సాధారణ పొడవు, డీప్ నెక్స్ బాగుంటాయి ►భుజ భాగం సన్నగా ఉంటే లేయర్డ్ బ్లౌజ్ వేసుకుంటే వెడల్పుగా కనిపిస్తారు ఎంబ్రాయిడరీ: ఎంత ఎంబ్రాయిడరీ చేయించుకుంటే అంత గ్రాండ్‌గా కనిపిస్తాం’ అనుకుంటారు చాలా మంది. అది సరైనది కాదు ∙బ్లౌజ్ డిజైన్‌కి జరీ తక్కువ గ్లిట్టర్ ఉన్నది వాడాలి. కానీ, వేసుకున్నప్పుడు వర్క్ షైన్ అవ్వాలి. చిన్న నెక్లైన్, ఆలోవర్ వర్క్ అయినా డిజైన్ని శారీలోంచి తీసుకుంటే ఎక్కడా కాపీ కాదు. ప్లెయిన్ బ్లౌజ్: కంచిపట్టు చీరలోనే ప్యూర్ టిష్యూ ప్లెయిన్ బ్లౌజ్ పార్ట్ ఉంటుంది కాబట్టి దీంతో హై నెక్ ఇచ్చి లాంగ్ స్లీవ్స్‌తో డిజైన్ చేయించుకోవచ్చు. అయితే అప్పుడు ధరించే నగలు ప్రత్యేకంగా ఉండాలి. ప్రత్యేకమైన జ్యువెలరీ ఉన్నప్పుడు బ్లౌజ్‌కి ఎంబ్రాయిడరీ హంగులు అక్కర్లేదు. స్పెషల్ జ్యువెలరీ లేదనుకున్నప్పుడు కంచిపట్టుకు ప్లెయిన్ బ్లౌజ్ సెట్ అవ్వదు. -
బోర్కొట్టేస్తే పడైండి
మనమంటే పట్టనివాళ్లు కూడా మన బట్టల్ని పట్టేస్తారు. అంటే... మనకు లేని ఫేస్‌వ్యాల్యూ... మన బట్టలకు ఉంటుందనేగా! ఆ వ్యాల్యూని కాపాడుకోవాలి. మన ‘వేర్’ బోర్ కొట్టించకుండా జాగ్రత్తపడాలి. కానీ ఎంతని జాగ్రత్త పడతాం... కొత్తవి వెంటవెంటనే పాతవైపోతుంటే? ఉపాయం ఉంది. బట్టల్ని తీసుకెళ్లి రంగుల్లో ప‘డై’ండి! వార్డ్రోబ్ తెరిస్తే బోలెడన్ని దుస్తులు హ్యాంగర్లకు వేళ్లాడుతుంటాయి. కాని దేనిని తీసినా వేసుకోబుద్ధి కాదు. అలాగని నెలకోసారి కొత్త దుస్తులు కొనడమూ సాధ్యమయ్యే పని కాదు? మరి ఏం చేయాలి? పాతవాటినే కొత్తగా మార్చేయాలి. వైట్ షర్టుని సెమీ కలర్ షర్టుగా మార్చేయాలి. నీలిరంగు డెనిమ్ షర్టుకి మరో రంగు అద్దేయాలి. అలాగే ప్యాంట్లు కూడ. అదెలాగో చూద్దాం! డై చేయాలంటే..! డై చేయడానికి ఒక ట్రే = ఒక కప్పు =ఉప్పు = డై కలర్(మనకు కావాలన్న రంగు) = గ్లవ్స్ కావాలి. ట్రేలో డైలాన్ డైయింగ్ కలర్ పౌడర్ వేసి(కొంత పౌడర్ని పక్కన ఉంచుకోవాలి) అందులో నాలుగుకప్పుల వేడి నీటిని పోయాలి. ఆ నీటిలో నాలుగు టేబుల్ స్పూన్ల ఉప్పు కలపాలి. రంగు పౌడర్ నీటిలో పూర్తిగా కరిగిన తర్వాత ట్రేలో ముప్పావు భాగం నిండేలా నీటిని పోయాలి. దీంతో రంగు పలుచబడుతుంది. ఇప్పుడు టీ షర్టును కింది పావు భాగాన్ని(పై భాగంలో కలర్ రావాలంటే పై భాగాన్ని) రంగులో మునిగేటట్లు చేయాలి. ఈ పనంతా చేతికి గ్లవ్స్ వేసుకుని చేయాలి. రంగు నీటిలో ఒక నిమిషం పాటు ఉంచిన తర్వాత షర్టుని మెల్లగా తీయాలి. కలర్ లైట్‌గా కావాలంటే రంగు నీటిలో నుంచి తీసిన తర్వాత షర్టుని చన్నీటిలో ముంచి తీసి పిండేయాలి. నీరు కారిపోయే వరకు ఆరేయాలి. కొంత తేమ ఉండగానే ముందుగా తీసి పక్కన ఉంచుకున్న రంగుపొడిని వేళ్లతో తీసుకుని షర్టు మీద పరుచుకునేటట్లు చల్లి (మరింత ఆకర్షణీయంగా ఉండడానికి మాత్రమే ఇలా చేయాలి తప్ప తప్పనిసరి కాదు) పూర్తిగా ఆరనివ్వాలి. ఇలా చేస్తే రంగు పూర్తిగా పట్టేస్తుంది. రంగుపొడి షర్టుకి పట్టేయగా మిగిలినది రాలిపోవడానికి వీలుగా షర్టుని మరోసారి నీటిలో ముంచి ఆరేయాలి. డిప్ డై టీ షర్టు రెడీ. రంగు పౌడర్ని పైన చల్లకుండా ఉంటే కలర్ అద్దిన మేర సాదాగా ఉంటుంది. పైన పౌడర్ చల్లినట్లయితే రంగురేణువులు అందంగా కనిపిస్తాయి. మరింత అందంగా కనిపించాలంటే డిజైన్ వున్న దుస్తువులకు డై చేయవచ్చు. డై చేసిన తరువాత ఎంబ్రాయిడరీ వర్క్ చేసుకోవచ్చు.