స్లీవ్స్‌ అండ్‌ స్టయిల్స్‌ | Chosen Blouse Design Must Be Unique In Order For The Beauty To Look Double | Sakshi
Sakshi News home page

స్లీవ్స్‌ అండ్‌ స్టయిల్స్‌

Published Fri, Jan 24 2020 2:00 AM | Last Updated on Fri, Jan 24 2020 2:00 AM

Chosen Blouse Design Must Be Unique In Order For The Beauty To Look Double - Sakshi

పెళ్లి కూతురు చీర అనగానే మన మదిలో కంచిపట్టు పేరే మెదులుతుంది. కంచి పట్టు అందం రెట్టింపులుగా కనిపించాలంటే ఎంచుకున్న బ్లౌజ్‌ డిజైన్‌ ప్రత్యేకంగా ఉండాలి. కలర్‌ కాంబినేషన్‌ సరిగ్గా కుదరాలి. అందుకు వేల డిజైన్లను పరిశీలిస్తారు. లేదంటే, గ్రాండ్‌గా కనిపించాలని బ్లౌజ్‌ అంతా ఎంబ్రాయిడరీ వర్క్‌తో నింపేస్తారు. పెళ్లి చీరకు తగిన బ్లౌజ్‌ మ్యాచ్‌ చేసుకునేలా మన దగ్గరే సరైన సమాధానం ఉంటే ఎంపిక ఇంకా సులువు అవుతుంది.

‘బ్లౌజ్‌పై ఎలాంటి వర్క్‌ అయితే బాగుంటుందో చెప్పడానికి ముందు చీరలో ఉన్న డిజైన్, కలర్‌ కాంబినేషన్స్‌ చూసుకుంటాం. ఆ చీరపై ఉన్న థీమ్‌ డిజైన్‌ బ్లౌజ్‌పై ఎలా చూపుతామో కస్టమర్‌కి ఒక స్టోరీలా వివరంగా చెబుతాం. దీంతో ఆ బ్లౌజ్‌ డిజైన్‌ మరెక్కడా లేనివిధంగా రూపుదిద్దుకుంటుంది. ఒకసారి వాడి ఆరేడేళ్ల తర్వాత కూడా ఆ బ్లౌజ్‌ను బయటకు తీస్తే ఈ వర్క్‌ ఇప్పుడు ట్రెండ్‌లో లేదు కదా అనే ఫీల్‌ ధరించినవారికి రాకూడదని కోరుకుంటాను.
– భార్గవి అమిరినేని, ఫ్యాషన్‌ డిజైనర్, హైదరాబాద్‌
www.instagram.com/bhargavi.amirineni

కలర్‌ కాంబినేషన్‌
►పెళ్లి అనగానే సాధారణంగా అందరికీ గుర్తుకువచ్చే కామన్‌ కలర్స్‌ ... ఎరుపు, నీలం, పచ్చ, పింక్, గోల్డ్‌

►సాధారణంగా బ్లౌజ్‌లు ఎంచుకునేటప్పుడు మూడు రకాలుగా ఆలోచన చేస్తాం. ఒకటి: శారీ కలర్‌లోనే ఉండేది. రెండు: పూర్తి కాంట్రాస్ట్‌. మూడు: అన్నింటికీ వాడే గోల్డ్‌ కలర్‌. వీటిలో ఏది ప్రత్యేకంగా ఉంటుందో చూసుకోవాలి. పెళ్లి కూతురు బ్లౌజ్‌ అయితే చీరకు కాంట్రాస్ట్‌ కలర్‌ ఎంచుకుంటాం. లేదంటే గోల్డ్‌ ఆలోవర్‌ వర్క్‌ తీసుకుంటాం

►మేనిరంగును బట్టి తెల్లగా ఉండేవారు కాంతిమంతమైన రంగులు, రంగు తక్కువ ఉన్నవారు లేత రంగు చీరలు అని ఎంపిక చేసుకుంటారు. కొందరు చామనచాయగా ఉన్నా బ్రైట్‌ కలర్స్‌ ధరించాలనుకుంటారు. వీళ్లు ముదురు రంగు చీరలు ఎంచుకున్నప్పుడు కొద్దిగా లేత రంగు బ్లౌజ్‌ను మ్యాచ్‌ చేసుకోవాలి. దీనివల్ల ఆ కలర్‌ ఫేస్‌ మీద ప్రతిబింబిస్తుంది

►చీరలో జరీ డిజైన్‌ శాతం ఎక్కువ ఉంటే బాగా బ్రైట్‌ కలర్‌ బ్లౌజ్‌ తీసుకోవాలి. కంచిపట్టులో కలర్‌ ఎక్కువ ఉంటే దానిని కాస్త డల్‌ చేయడానికి బ్లౌజ్‌లో ఎక్కువ వర్క్‌ తీసుకోవాలి

►పెద్ద బార్డర్‌ చీరలకు మోచేతుల(ఎల్బో)వరకు స్లీవ్స్‌ బాగుంటాయి. చిన్న బార్డర్‌ అయితే మోచేతుల వరకు చేతుల డిజైన్‌ పాటు కొంత కుచ్చులు వచ్చేలా డిజైన్‌ చేయించుకోవచ్చు. లేదంటే అంచు పెద్దగా ఉంటే మోచేతుల వరకు అంచుతోనే డిజైన్‌ చేసుకోవచ్చు.

పొడవుగా ఉన్నవారికి: మోచేతుల కిందవరకు 3/4  స్లీవ్స్‌ బాగుంటాయి. వీటి మీద సింపుల్‌ డిజైన్‌ చేయించుకోవచ్చు

పొడవు తక్కువ ఉన్నవారు: మోచేతుల వరకు స్లీవ్స్, లైన్స్‌ వచ్చేలా ఎంబ్రాయిడరీ, కరెక్ట్‌ ఫిటింగ్‌తో ఉంటే పొడుగ్గా కనిపిస్తారు. అలాగే, బాడీ పార్ట్‌కి ఒక కలర్, స్లీవ్స్‌కి మరో కలర్‌ ఫ్యాబ్రిక్‌ తీసుకున్నా పొడవు కనిపిస్తారు. వీళ్లు బ్లౌజ్‌ లెంగ్త్‌ పొట్టిగా ఉండాలనుకోకూడదు. సాధారణ పొడవు, డీప్‌ నెక్స్‌ బాగుంటాయి
►భుజ భాగం సన్నగా ఉంటే లేయర్డ్‌ బ్లౌజ్‌ వేసుకుంటే వెడల్పుగా కనిపిస్తారు

ఎంబ్రాయిడరీ: ఎంత ఎంబ్రాయిడరీ చేయించుకుంటే అంత గ్రాండ్‌గా కనిపిస్తాం’ అనుకుంటారు చాలా మంది. అది సరైనది కాదు ∙బ్లౌజ్‌ డిజైన్‌కి జరీ తక్కువ గ్లిట్టర్‌ ఉన్నది వాడాలి. కానీ, వేసుకున్నప్పుడు వర్క్‌ షైన్‌ అవ్వాలి. చిన్న నెక్‌లైన్, ఆలోవర్‌ వర్క్‌ అయినా డిజైన్‌ని శారీలోంచి తీసుకుంటే ఎక్కడా కాపీ కాదు.

ప్లెయిన్‌ బ్లౌజ్‌: కంచిపట్టు చీరలోనే ప్యూర్‌ టిష్యూ ప్లెయిన్‌ బ్లౌజ్‌ పార్ట్‌ ఉంటుంది కాబట్టి దీంతో హై నెక్‌ ఇచ్చి లాంగ్‌ స్లీవ్స్‌తో డిజైన్‌ చేయించుకోవచ్చు. అయితే అప్పుడు ధరించే నగలు ప్రత్యేకంగా ఉండాలి. ప్రత్యేకమైన జ్యువెలరీ ఉన్నప్పుడు బ్లౌజ్‌కి ఎంబ్రాయిడరీ హంగులు అక్కర్లేదు. స్పెషల్‌ జ్యువెలరీ లేదనుకున్నప్పుడు కంచిపట్టుకు ప్లెయిన్‌ బ్లౌజ్‌ సెట్‌ అవ్వదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement