ఫుల్కారీ నక్షత్రాలు..
ఇండోవెస్ట్రన్ డ్రెస్సులకీ కళ తెచ్చే ఫుల్కారీ
ఫూల్కారీ ఎంబ్రాయిడరీతో డిజైన్ చేసిన దుపట్టా
మన దేశీయ సంప్రదాయ కళలప్రాముఖ్యత ఎంతటిదో మనకు తెలిసిందే. పంజాబ్ ‘ఫుల్కారీ కళ’కు ప్రసిద్ధి. వారి సంప్రదాయ వేడుకలలో ప్రధానంగా కనిపిస్తుంది. ‘పూల కళ’గా పేరొందిన ఈ వర్క్ దుపట్టాలు, చీరలమీదనే కాదు ఆధునిక డ్రెస్సుల మీద, ఇతర యాక్సెసరీస్‌లోనూ కనువిందు చేస్తోంది. నక్షత్రాల్లా మెరిసి΄ోతూ ఆకర్షణీయంగా కనిపించే ఈ కళ పండగల వేళ మరింత ప్రత్యేకతను చాటుతోంది. ఫ్యాషన్ వేదికల మీదా కనువిందు చేస్తోంది.
ఒక్కోప్రాంతానికి ఒక్కో విశిష్టత ఉన్నట్టే ఒక్కో కళ కూడా తన ప్రత్యేకతను చూపుతుంటుంది. హిందీలో ‘ఫూల్’ అంటే పువ్వు అని అర్థం. వేదకాలంలోనూ ఈ జానపద కళ మూలాలున్నాయని చెబుతుంటారు. అయితే, 15వ శతాబ్దంలో పంజాబ్‌లోని మహిళల ద్వారా మొదలైందని తెలుస్తుంది. వివాహాలు ఇతర వేడుకలలో మహిళలు ఫుల్కారీలు ధరించడం, బహుమతులు ఇవ్వడం అక్కడి సంప్రదాయం. ఇది పూర్తిగా గృహసంబంధమైన దేశీయ కళ. ఖద్దరు క్లాత్‌పైన రంగు రంగుల సిల్క్, కాటన్ దారాలతో ఎంబ్రాయిడరీ చేస్తారు. రేఖాగణితంలోని జామెట్రీని ఈ డిజైన్లు ΄ోలి ఉంటాయి.
ఎవర్‌గ్రీన్ ఆర్ట్ వర్క్..
ఫుల్కారీ కండువాలు, శాలువాలు, దుపట్టాలకు మాత్రమే పరిమితంగా ఉండేది. కానీ నేడు కుర్తాలు, లెహంగాలు, జాకెట్లు, స్టోల్స్, చీరలు, ష్రగ్‌లు, స్కర్ట్‌లు, కఫ్తాన్లు, ఫ్యూజన్ అవుట్‌ఫిట్‌లు, ΄ాదరక్షలు, బెల్ట్‌లు, హెయిర్ బ్యాండ్స్, బ్యాగ్‌లు, ΄ûచ్‌లు, క్లచ్‌లు, గొడుగుల డిజైన్లలోనూ.. ఫుల్కారీ కళ కనిపిస్తోంది.
విభిన్న డిజైన్లు..
ఈ డిజైన్లలో బాగ్, ఛమాస్, నీలక్, చోప్.. వంటి 52 రకాల ఫుల్కారీలు ఉన్నాయి. అయితే, వీటిలో కొన్ని మాత్రమే ఇప్పుడు వాడుకలో ఉన్నాయి. గతంలో ఈ ఎంబ్రాయిడరీని స్త్రీలు చేతులతో చేసేవారు. ఇప్పుడు యంత్రాలు, ఆధునిక పద్ధతులలో కొత్త వస్తువులను ఉపయోగిస్తున్నారు. ఈ కళ టెక్నిక్స్‌ని చాలా మంది ఆధునిక డిజైనర్లు గ్లోబల్ మార్కెట్‌ను చేరుకోవడానికి ఎంచుకుంటున్నారు.
యాక్ససరీస్‌లోనూ ఫుల్కారీ వర్క్
ప్రకృతితో ప్రేమ..
ఫుల్కారీ మూలాంశాలకు ప్రేరణ ప్రకృతియే. తల్లీకూతుళ్ల అనుబంధం, జంతువులు, పక్షులు, ఉద్యానవనాలు, బంతి, మల్లెలు, నెమలి, ఆవ పూలు... స్త్రీల భావోద్వేగాలకు అద్దం పడుతున్నాయా అన్నట్టు ఈ కళ సృజనాత్మకతకు అద్దం పడుతుంది.
సంప్రదాయ రంగులు..
ఫుల్కారీ కళలో రంగుల వాడకం చాలా ముఖ్యమైన ΄ాత్ర ΄ోషిస్తుంది. సాంప్రదాయకంగా నాలుగు రంగులు మాత్రమే ఉపయోగిస్తారు. కాబోయే వధువులకు ఎరుపు, రోజువారీ వాడకంలో నీలం, నలుపు, ముదురు షేడ్స్ ఉపయోగిస్తారు. ఉత్సాహాన్ని సూచించడానికి ఎరుపు, శక్తి కోసం నారింజ, సంతానోత్పత్తికి ఆకుపచ్చ రంగును వాడతారు.
Comments
Please login to add a commentAdd a comment