Desiging
-
ఉద్యోగం కోసం పాత పద్దతి.. నెట్టింట్లో ఫోటోలు వైరల్
సాధారణంగా ఉద్యోగం కోసం అప్లై చేయాలంటే.. ఎవరైనా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటారు. టెక్నాలజీ బాగా పెరిగిన తరుణంలో జాబ్ కోసం లెటర్స్ పంపించడం వంటివి ఎప్పుడో కనుమరుగైపోయాయి. కానీ ఇటీవల ఓ వ్యక్తి ఉద్యోగం కోసం లెటర్ పంపించినట్లు తెలిసింది. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.ఏఐను ఉపయోగించి రెజ్యూమ్‌లు తయారు చేస్తున్న ఈ కాలంలో.. ఒక వ్యక్తి పోస్ట్ ద్వారా డిజైనర్ ఉద్యోగానికి అప్లై చేస్తూ ఓ లెటర్ రాసి స్విగ్గీ డిజైన్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ 'సప్తర్షి ప్రకాష్'కు పంపించారు. లేఖను అందుకున్న తరువాత ఆయన ఆశ్చర్యానికి గురయ్యారు. లెటర్ ఫోటోలను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు.ఫోటోలను ఎక్స్ ఖాతాలో షేర్ చేస్తూ.. భౌతికంగా ఒక లేఖను స్వీకరించాను. డిజిటల్ యుగంలో స్కూల్ డేస్ గుర్తు చేశారు. ప్రస్తుతం డిజైనర్ ఉద్యోగానికి సంస్థలో ఎటువంటి ఓపెనింగ్స్ లేదు. కానీ దయ చేసిన నాకు ఈమెయిల్ చేయండి. నేను మీ ఆలోచనను చూడాలనుకుంటున్నాను. డిజైన్ ఓపెనింగ్స్ గురించి ఎవరికైనా తెలిస్తే.. తెలియజేయండి అంటూ స్విగ్గీ డిజైన్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ ట్వీట్ చేశారు.ఇదీ చదవండి: రూ.123 కోట్లు విరాళం: ఎవరీ షన్నా ఖాన్..ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లలో కొందరు ఉద్యోగార్ధుల సృజనాత్మకత & నిబద్ధతను తెగ పొగిడేస్తున్నారు. ఈ డిజిటల్ యుగంలో కాగితాన్ని ఉపయోగించి ఉద్యోగానికి పోస్ట్ చేయడం.. చూడటానికి రిఫ్రెష్‌గా ఉందని ఒకరు వెల్లడించారు. ఇలా ఒక్కొక్కరు తమకు తోచిన విధంగా కామెంట్స్ చేస్తున్నారు.Received a physical letter from a designer wanting to join @Swiggy with a concept. In a digital age, this old-school approach stood outTo the sender: We may not have a role now, but please email me—I’d love to see your idea! 😄If anyone knows of design openings, please share! pic.twitter.com/WSGDaX0fsP— Saptarshi Prakash (@saptarshipr) October 30, 2024 -
ఫుల్కారీ ఎంబ్రాయిడరీలో విభిన్న డిజైన్లు..
మన దేశీయ సంప్రదాయ కళలప్రాముఖ్యత ఎంతటిదో మనకు తెలిసిందే. పంజాబ్ ‘ఫుల్కారీ కళ’కు ప్రసిద్ధి. వారి సంప్రదాయ వేడుకలలో ప్రధానంగా కనిపిస్తుంది. ‘పూల కళ’గా పేరొందిన ఈ వర్క్ దుపట్టాలు, చీరలమీదనే కాదు ఆధునిక డ్రెస్సుల మీద, ఇతర యాక్సెసరీస్‌లోనూ కనువిందు చేస్తోంది. నక్షత్రాల్లా మెరిసి΄ోతూ ఆకర్షణీయంగా కనిపించే ఈ కళ పండగల వేళ మరింత ప్రత్యేకతను చాటుతోంది. ఫ్యాషన్ వేదికల మీదా కనువిందు చేస్తోంది.ఒక్కోప్రాంతానికి ఒక్కో విశిష్టత ఉన్నట్టే ఒక్కో కళ కూడా తన ప్రత్యేకతను చూపుతుంటుంది. హిందీలో ‘ఫూల్’ అంటే పువ్వు అని అర్థం. వేదకాలంలోనూ ఈ జానపద కళ మూలాలున్నాయని చెబుతుంటారు. అయితే, 15వ శతాబ్దంలో పంజాబ్‌లోని మహిళల ద్వారా మొదలైందని తెలుస్తుంది. వివాహాలు ఇతర వేడుకలలో మహిళలు ఫుల్కారీలు ధరించడం, బహుమతులు ఇవ్వడం అక్కడి సంప్రదాయం. ఇది పూర్తిగా గృహసంబంధమైన దేశీయ కళ. ఖద్దరు క్లాత్‌పైన రంగు రంగుల సిల్క్, కాటన్ దారాలతో ఎంబ్రాయిడరీ చేస్తారు. రేఖాగణితంలోని జామెట్రీని ఈ డిజైన్లు ΄ోలి ఉంటాయి.ఎవర్గ్రీన్ ఆర్ట్ వర్క్..ఫుల్కారీ కండువాలు, శాలువాలు, దుపట్టాలకు మాత్రమే పరిమితంగా ఉండేది. కానీ నేడు కుర్తాలు, లెహంగాలు, జాకెట్లు, స్టోల్స్, చీరలు, ష్రగ్‌లు, స్కర్ట్లు, కఫ్తాన్లు, ఫ్యూజన్ అవుట్ఫిట్లు, ΄ాదరక్షలు, బెల్ట్‌లు, హెయిర్ బ్యాండ్స్, బ్యాగ్‌లు, ΄ûచ్‌లు, క్లచ్‌లు, గొడుగుల డిజైన్లలోనూ.. ఫుల్కారీ కళ కనిపిస్తోంది.విభిన్న డిజైన్లు..ఈ డిజైన్లలో బాగ్, ఛమాస్, నీలక్, చోప్.. వంటి 52 రకాల ఫుల్కారీలు ఉన్నాయి. అయితే, వీటిలో కొన్ని మాత్రమే ఇప్పుడు వాడుకలో ఉన్నాయి. గతంలో ఈ ఎంబ్రాయిడరీని స్త్రీలు చేతులతో చేసేవారు. ఇప్పుడు యంత్రాలు, ఆధునిక పద్ధతులలో కొత్త వస్తువులను ఉపయోగిస్తున్నారు. ఈ కళ టెక్నిక్స్‌ని చాలా మంది ఆధునిక డిజైనర్లు గ్లోబల్ మార్కెట్‌ను చేరుకోవడానికి ఎంచుకుంటున్నారు.యాక్ససరీస్లోనూ ఫుల్కారీ వర్క్ప్రకృతితో ప్రేమ..ఫుల్కారీ మూలాంశాలకు ప్రేరణ ప్రకృతియే. తల్లీకూతుళ్ల అనుబంధం, జంతువులు, పక్షులు, ఉద్యానవనాలు, బంతి, మల్లెలు, నెమలి, ఆవ పూలు... స్త్రీల భావోద్వేగాలకు అద్దం పడుతున్నాయా అన్నట్టు ఈ కళ సృజనాత్మకతకు అద్దం పడుతుంది.సంప్రదాయ రంగులు..ఫుల్కారీ కళలో రంగుల వాడకం చాలా ముఖ్యమైన ΄ాత్ర ΄ోషిస్తుంది. సాంప్రదాయకంగా నాలుగు రంగులు మాత్రమే ఉపయోగిస్తారు. కాబోయే వధువులకు ఎరుపు, రోజువారీ వాడకంలో నీలం, నలుపు, ముదురు షేడ్స్ ఉపయోగిస్తారు. ఉత్సాహాన్ని సూచించడానికి ఎరుపు, శక్తి కోసం నారింజ, సంతానోత్పత్తికి ఆకుపచ్చ రంగును వాడతారు. -
Prachi Bhatia: జీవితాన్ని అలంకరించుకుంది
అరకొర ఆర్థిక పరిస్థితులు బాల్యాన్ని సర్దుకు పొమ్మన్నాయి. ఏమీ తెలియని పసిమనసు కూడా పరిస్థితులకు తలొంచక తప్పలేదు. తన వయసుతో పాటు కుటుంబ ఆర్థికభారం పెరిగిపోతుంటే చూడలేకపోయింది. డిగ్రీలోనే సంపాదనకు నడుం బిగించి, 28 ఏళ్లకే సక్సెస్‌పుల్ ఎంట్రప్రెన్యూర్‌గా రాణిస్తోంది ప్రాచీ భాటియా. ఘజియాబాద్‌కు చెందిన ప్రాచీ భాటియా దిగువ మధ్యతరగతి కుటుంబంలో పుట్టింది. తండ్రి జర్నలిస్టు, తల్లి గృహిణి. తండ్రికొచ్చే కొద్దిపాటి ఆదాయమే కుటుంబానికి ఆధారం. ఆ ఆదాయం ఏమూలకూ సరిపోయేది కాదు. ప్రాచీ స్కూలు ఫీజులు కట్టడం కూడా చాలా కష్టంగా ఉండేది. ఎప్పుడూ స్కూల్లో అందరికంటే ఆలస్యంగా ఫీజు చెల్లించేవారు. ఇంతటి గడ్డు పరిస్థితుల్లో సైతం ఇంటర్మీడియట్ పూర్తిచేసిన ప్రాచీ ... తనకెంతో ఇష్టమైన డిజైనింగ్ డిగ్రీ చేయాలనుకుంది. అనుకున్నట్టుగానే ఢిల్లీ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (ఎన్ఐఎఫ్టీ) లో సీటు సంపాదించింది. కానీ అక్కడ హాస్టల్ ఫీజు, ఇతర ఖర్చులకు డబ్బులు లేక ఎన్ఐఎఫ్టీలో చేరలేదు. గురుగామ్‌లోని జీడీ గోయెంకా యూనివర్శిటీలో చేరింది. ► సంపాదిస్తూనే కాలేజీ టాపర్ అతి కష్టంమీద డిగ్రీలో చేరిన ప్రాచీ.. ఒకపక్క చదువుకుంటూనే మరోపక్క చిన్న వ్యాపారం ప్రారంభించింది. కుటుంబానికి ఆర్థి కంగా సాయపడేందుకు.. గిఫ్ట్స్ తయారు చేసి విక్రయించేది. ఫొటో ఆల్బమ్స్, ఫొటో ప్రింటెడ్ ల్యాంప్స్, హ్యాండ్‌మేడ్ కార్డ్స్, రోజెస్ వంటివి తయారు చేసి ఫేస్బుక్ పేజీలో పోస్టు చేసేది. ఇలా విక్రయిస్తూ నెలకు ఐదువేల రూపాయల దాకా సంపాదించేది. వాటిలో కొంత ఇంట్లో ఇచ్చి మిగతావి దాచుకునేది. ఆర్ట్స్, క్రాఫ్ట్స్ మీద ఆసక్తి ఉండడంతో సర్టిఫికెట్ కోర్సులు చేసేది. మరోపక్క డిగ్రీ చదువుతూ వచ్చే స్కాలర్‌షిప్‌తో తన ఎడ్యుకేషన్ లోన్ కట్టేది. ఇవన్నీ చేస్తూ కూడా డిగ్రీలో కాలేజ్ టాపర్‌గా నిలిచింది ప్రాచీ. ► ఎంప్లాయీ నుంచి ఎంట్రప్రెన్యూర్‌గా డిగ్రీ పూర్తవగానే ప్రాచీ గురుగామ్‌లోని ఓ ఎక్స్‌పోర్ట్స్ కంపెనీలో అసిస్టెంట్ డిజైనర్‌గా చేరింది. కొన్నాళ్లు పనిచేశాక.. మరో బహుళ జాతి కంపెనీలో డిజైనర్‌గా ఉద్యోగావకాశం వచ్చింది. అందులోచేరిన కొద్దిరోజులకే ‘‘ఒకరి కింద నేనెందుకు పనిచేయాలి? నేనే ఏదైనా కొత్తగా ప్రారంభించవచ్చు కదా!’’ అనుకుని వెంటనే ఉద్యోగం వదిలేసింది. అప్పటిదాకా చేసిన ఉద్యోగ అనుభవ పాఠాలతో 24 ఏళ్ల వయసులో సొంతంగా ‘చౌఖట్’ పేరిట హోండెకార్ బ్రాండ్‌ను స్థాపించింది. అప్పటివరకు దాచుకున్న లక్ష రూపాయలను పెట్టుబడిగా పెట్టి.. ఇంటి అలంకరణలో ఉపయోగించే∙ఉత్పత్తులను పేపర్ మీద డిజైన్ చేసి, మొరాదాబాద్, జైపూర్, నోయిడాలలోని కళాకారులతో రకరకాల కళాఖండాలను తయారు చేయించేది. తయారైన ఉత్పత్తులను ఫోటోషూట్ చేసి తన సొంత వెబ్సైట్లో పెట్టి విక్రయించడం మొదలు పెట్టింది. విక్రయాలు కాస్త మందకొడిగా ఉండడంతో.. ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో ప్రకటనలు ఇచ్చింది. వీటిద్వారా చౌఖట్కు గుర్తింపు రావడంతో వ్యాపారం ఊపందుకుంది. దీంతో తన మార్కెటింగ్ బడ్జెట్ నెలకు యాభైవేలకు చేరింది. తొలిఏడాది మూడు లక్షలు, రెండో ఏడాది పదకొండు లక్షలు. దురదృష్టవశాత్తూ మూడో ఏడాది కరోనా కారణంగా ఆశించినంత ఆదాయం రాలేదు. దాంతో ప్రాచీ తన ఐడియాలతో వ్యాపారం పుంజుకునేలా చేయడంతో... గతేడాది (నాలుగో సంవత్సరం) ఒక్కసారిగా 35.5 లక్షలకు చేరింది. ఐదు వందల నుంచి ఇరవై వేల రూపాయల ధరల్లో ఉన్న 70 రకాల ఛౌఖట్ ఉత్పత్తులకు దేశవ్యాప్తంగా ఆర్డర్లు వస్తున్నాయి. తను డిజైన్ చేసిన వస్తువులను స్కూటీ మీద మోసుకెళ్లిన ప్రాచీ ఇటీవలే తన సొంత డబ్బులతో కారు కొనుక్కుంది. ► రాయి శిల్పంగా మారినట్టు.. ‘‘నేను నడిచిన దారిలో అనేక బెదిరింపులు, వయసు వివక్షలు వంటి అనేక ఇబ్బందులు, సమస్యలు, ఒత్తిళ్లు ఎదురయ్యేవి. అయితే ఉలి దెబ్బలకు రాయి శిల్పంగా మారినట్లు వీటన్నింటిని భరిస్తూనే ఈ స్థాయికి వచ్చాను. భవిష్యత్‌లో చౌఖట్ టర్నోవర్‌ను నాలుగు వందల కోట్లకు తీసుకెళ్లాలి. ఇంటి అలంకరణ వస్తువులు కావాలంటే కస్టమర్లు నా చౌఖట్ను ఎంచుకునే స్థాయికి ఎదుగుతాను’’ అని ప్రాచీ సగర్వంగా చెబుతోంది. -
స్లీవ్స్ అండ్ స్టయిల్స్
పెళ్లి కూతురు చీర అనగానే మన మదిలో కంచిపట్టు పేరే మెదులుతుంది. కంచి పట్టు అందం రెట్టింపులుగా కనిపించాలంటే ఎంచుకున్న బ్లౌజ్ డిజైన్ ప్రత్యేకంగా ఉండాలి. కలర్ కాంబినేషన్ సరిగ్గా కుదరాలి. అందుకు వేల డిజైన్లను పరిశీలిస్తారు. లేదంటే, గ్రాండ్‌గా కనిపించాలని బ్లౌజ్ అంతా ఎంబ్రాయిడరీ వర్క్‌తో నింపేస్తారు. పెళ్లి చీరకు తగిన బ్లౌజ్ మ్యాచ్ చేసుకునేలా మన దగ్గరే సరైన సమాధానం ఉంటే ఎంపిక ఇంకా సులువు అవుతుంది. ‘బ్లౌజ్‌పై ఎలాంటి వర్క్ అయితే బాగుంటుందో చెప్పడానికి ముందు చీరలో ఉన్న డిజైన్, కలర్ కాంబినేషన్స్ చూసుకుంటాం. ఆ చీరపై ఉన్న థీమ్ డిజైన్ బ్లౌజ్‌పై ఎలా చూపుతామో కస్టమర్‌కి ఒక స్టోరీలా వివరంగా చెబుతాం. దీంతో ఆ బ్లౌజ్ డిజైన్ మరెక్కడా లేనివిధంగా రూపుదిద్దుకుంటుంది. ఒకసారి వాడి ఆరేడేళ్ల తర్వాత కూడా ఆ బ్లౌజ్‌ను బయటకు తీస్తే ఈ వర్క్ ఇప్పుడు ట్రెండ్‌లో లేదు కదా అనే ఫీల్ ధరించినవారికి రాకూడదని కోరుకుంటాను. – భార్గవి అమిరినేని, ఫ్యాషన్ డిజైనర్, హైదరాబాద్ www.instagram.com/bhargavi.amirineni కలర్ కాంబినేషన్ ►పెళ్లి అనగానే సాధారణంగా అందరికీ గుర్తుకువచ్చే కామన్ కలర్స్ ... ఎరుపు, నీలం, పచ్చ, పింక్, గోల్డ్ ►సాధారణంగా బ్లౌజ్‌లు ఎంచుకునేటప్పుడు మూడు రకాలుగా ఆలోచన చేస్తాం. ఒకటి: శారీ కలర్లోనే ఉండేది. రెండు: పూర్తి కాంట్రాస్ట్. మూడు: అన్నింటికీ వాడే గోల్డ్ కలర్. వీటిలో ఏది ప్రత్యేకంగా ఉంటుందో చూసుకోవాలి. పెళ్లి కూతురు బ్లౌజ్ అయితే చీరకు కాంట్రాస్ట్ కలర్ ఎంచుకుంటాం. లేదంటే గోల్డ్ ఆలోవర్ వర్క్ తీసుకుంటాం ►మేనిరంగును బట్టి తెల్లగా ఉండేవారు కాంతిమంతమైన రంగులు, రంగు తక్కువ ఉన్నవారు లేత రంగు చీరలు అని ఎంపిక చేసుకుంటారు. కొందరు చామనచాయగా ఉన్నా బ్రైట్ కలర్స్ ధరించాలనుకుంటారు. వీళ్లు ముదురు రంగు చీరలు ఎంచుకున్నప్పుడు కొద్దిగా లేత రంగు బ్లౌజ్‌ను మ్యాచ్ చేసుకోవాలి. దీనివల్ల ఆ కలర్ ఫేస్ మీద ప్రతిబింబిస్తుంది ►చీరలో జరీ డిజైన్ శాతం ఎక్కువ ఉంటే బాగా బ్రైట్ కలర్ బ్లౌజ్ తీసుకోవాలి. కంచిపట్టులో కలర్ ఎక్కువ ఉంటే దానిని కాస్త డల్ చేయడానికి బ్లౌజ్లో ఎక్కువ వర్క్ తీసుకోవాలి ►పెద్ద బార్డర్ చీరలకు మోచేతుల(ఎల్బో)వరకు స్లీవ్స్ బాగుంటాయి. చిన్న బార్డర్ అయితే మోచేతుల వరకు చేతుల డిజైన్ పాటు కొంత కుచ్చులు వచ్చేలా డిజైన్ చేయించుకోవచ్చు. లేదంటే అంచు పెద్దగా ఉంటే మోచేతుల వరకు అంచుతోనే డిజైన్ చేసుకోవచ్చు. పొడవుగా ఉన్నవారికి: మోచేతుల కిందవరకు 3/4 స్లీవ్స్ బాగుంటాయి. వీటి మీద సింపుల్ డిజైన్ చేయించుకోవచ్చు పొడవు తక్కువ ఉన్నవారు: మోచేతుల వరకు స్లీవ్స్, లైన్స్ వచ్చేలా ఎంబ్రాయిడరీ, కరెక్ట్ ఫిటింగ్‌తో ఉంటే పొడుగ్గా కనిపిస్తారు. అలాగే, బాడీ పార్ట్‌కి ఒక కలర్, స్లీవ్స్‌కి మరో కలర్ ఫ్యాబ్రిక్ తీసుకున్నా పొడవు కనిపిస్తారు. వీళ్లు బ్లౌజ్ లెంగ్త్ పొట్టిగా ఉండాలనుకోకూడదు. సాధారణ పొడవు, డీప్ నెక్స్ బాగుంటాయి ►భుజ భాగం సన్నగా ఉంటే లేయర్డ్ బ్లౌజ్ వేసుకుంటే వెడల్పుగా కనిపిస్తారు ఎంబ్రాయిడరీ: ఎంత ఎంబ్రాయిడరీ చేయించుకుంటే అంత గ్రాండ్‌గా కనిపిస్తాం’ అనుకుంటారు చాలా మంది. అది సరైనది కాదు ∙బ్లౌజ్ డిజైన్‌కి జరీ తక్కువ గ్లిట్టర్ ఉన్నది వాడాలి. కానీ, వేసుకున్నప్పుడు వర్క్ షైన్ అవ్వాలి. చిన్న నెక్లైన్, ఆలోవర్ వర్క్ అయినా డిజైన్ని శారీలోంచి తీసుకుంటే ఎక్కడా కాపీ కాదు. ప్లెయిన్ బ్లౌజ్: కంచిపట్టు చీరలోనే ప్యూర్ టిష్యూ ప్లెయిన్ బ్లౌజ్ పార్ట్ ఉంటుంది కాబట్టి దీంతో హై నెక్ ఇచ్చి లాంగ్ స్లీవ్స్‌తో డిజైన్ చేయించుకోవచ్చు. అయితే అప్పుడు ధరించే నగలు ప్రత్యేకంగా ఉండాలి. ప్రత్యేకమైన జ్యువెలరీ ఉన్నప్పుడు బ్లౌజ్‌కి ఎంబ్రాయిడరీ హంగులు అక్కర్లేదు. స్పెషల్ జ్యువెలరీ లేదనుకున్నప్పుడు కంచిపట్టుకు ప్లెయిన్ బ్లౌజ్ సెట్ అవ్వదు. -
డిండి.. ఈసారికి ఇంతేలెండీ!
సాక్షి, ప్రతినిధి,రంగారెడ్డి: కరువు నేలకు ఇప్పట్లో సాగునీటి భాగ్యం లేనట్లే. ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాలతో పాటు యాదాద్రి జిల్లా సంస్థాన్ నారాయణపూర్ మండలాన్ని సస్యశ్యామలం చేసేందుకు ఉద్దేశించిన రాచకొండ ఎత్తిపోతల(డిండి) ప్రాజెక్టు డిజైన్ ఖరారుకు గ్రహణం వీడడం లేదు. దీంతో సేద్యపు జలాల కోసం ఇక్కడి రైతాంగం మరికొన్నాళ్లు ఎదురుచూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. లక్ష ఎకరాల సాగు లక్ష్యంగా.. 50 నుంచి 100 చెరువులు, కుంటలను కృష్ణా జలాలతో నింపాలని ప్రభుత్వం నిర్ణయించింది. డిండి ప్రాజెక్టు నుంచి శివన్నగూడెం రిజర్వాయర్‌కు నీటిని తరలించి అటు నుంచి రాచకొండ ఎత్తిపోతలతో 0.10 టీఎంసీల నీటిని సాగు అవసరాలకు వినియోగించుకునేలా ఈస్కీ (ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా) ప్రతిపాదనలు తయారు చేసింది. రూట్ మ్యాప్ సర్వే, డీపీఆర్ తయారీ కోసం ఈ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1.72 కోట్ల నిధులు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు సర్వే పూర్తి చేసిన ఈస్కీ.. ప్రాజెక్టు రిపోర్టును చీఫ్ ఇంజ నీర్కు అప్పగించింది. ఈ డిజైన్‌ను పరిశీలించిన చీఫ్ ఇంజనీర్ స్వల్ప మార్పులను సూచించారు. దీంతో మరోసారి ప్రాజెక్టు స్వరూపం మార్చడానికి ఇంజనీర్ల బృందం కసరత్తు చేస్తోంది. ఇప్పట్లో కష్టమే.. రాచకొండ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు డిజైన్ కొలిక్కి రాకపోవడంతో ఈ పథకం ఇప్పట్లో పట్టాలెక్కడం కష్టంగానే కనిపిస్తోంది. శాసనసభ ఎన్నికలకు నగారా మోగడంతో ప్రాజెక్టుకు మోక్షం లేనట్టే. వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరిగితే డిండి ప్రాజెక్టుకు అంకురార్పణ చేయాలని ప్రభుత్వం భావించినా ప్రస్తుత పరిస్థితులతో ముందుకు కదల్లేని పరిస్థితి తలెత్తింది. ప్రాజెక్టు స్వరూపం ఇలా.. నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం శివన్నగూడెం వద్ద ప్రస్తుతం నిర్మిస్తున్న బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి నీటిని 4 కిలోమీటర్ల గ్రావిటీ కాలువ, 4.50 కి.మీల సొరంగం ద్వారా యాదాద్రి జిల్లా సంస్థాన్ నారాయణపూర్ మండలం వావిల్లపల్లి పైభాగాన 2.20 టీఎంసీల నీటి సామర్థ్యంతో ఒక రిజర్వాయర్, అక్కడి నుంచి లిఫ్ట్ ద్వారా ఆరుట్ల శివారులో 2.62 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో రెండో రిజర్వాయర్, ఇబ్రహీంపట్నం మండలం పెద్దతుల్ల, యాచారం మండలం గునుగల్ గ్రామాల మధ్య ... ఒక టీఎంసీ కెపాసిటీతో మూడో రిజర్వాయర్‌ను నిర్మించే విధంగా ఈస్కీ ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది. ఈ రిపోర్టు, రూట్ మ్యాప్‌ను పరిశీలించిన నీటి పారుదల శాఖ చీఫ్ ఇంజనీర్ వెంకటేశం గ్రావిటీ కాల్వల నిర్మాణంపై కొన్ని సూచనలు చేసింది. ఆ సూచనల ప్రకారం ఈస్కీ మరోమారు ప్రాజెక్టు స్వరూపాన్ని తయారు చేసే పనిలో నిమగ్నమైంది. నిధులకు ఢోకాలేదు ఈస్కీ బృందం రూపొందించిన డిజైన్‌లో ఇరిగేషన్ శాఖ చీఫ్ ఇంజనీర్ కొన్ని సూచనలు చేశారు. దీనికి అనుగుణంగా మరోసారి రూట్ మ్యాప్‌ను తయారు చేసే పనిలో ఈస్కీ నిమగ్నమైంది. త్వరలో ఇది కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. –శ్యాంప్రసాద్‌రెడ్డి, రిటైర్డ్ ఇంజనీర్ల ఫోరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
ఫ్యాషన్.. సెన్సేషన్
ఫ్యాషన్ డిజైనింగ్ వైపు యువత చూపు నగరంలో 50పైకు పైగా బొటిక్స్ సెంటర్లు పది వరకు డిజైనింగ్ కోర్సుల నిర్వహణ ఒక్క డిజైన్ క్లిక్ అయితే చాలు స్టార్ డమ్ స్మార్ట్ సిటీ యువత ఫ్యాషన్ డిజైనింగ్ వైపు పరుగులెడుతోంది. నిన్నా మొన్నటి వరకు ఇంటర్ పూర్తవగానే ఇంజినీరింగ్, ఎంబీబీఎస్ వైపు వెళ్లేందుకు ఆసక్తి చూపిన విద్యార్థుల ఆలోచనల్లో ప్రస్తుతం మార్పు వచ్చింది. నిత్యం మారుతున్న పోకడలకు తగ్గట్టు సజనాత్మకత ఉన్న ఫ్యాషన్ డిజైనర్లకు మంచి కెరీర్ దక్కే అవకాశాలుంటున్న నేపథ్యంలో.. ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సుల్లో చేరేందుకు ఉత్సాహం కనబరుస్తున్నారు. ఈ క్రమంలో మహా నగరంలో డిజైనర్ బొటిక్స్ సంఖ్య పెరుగుతోంది. ఈ బొటిక్స్‌ను కొందరు డిజైనర్లు సొంతంగా నిర్వహిస్తుంటే.. మరికొందరు ప్రత్యేక కలెక్షన్ రూపకల్పనలో బిజీగా ఉన్నారు. ఇటీవల నిర్వహించిన ఫ్యాషన్ షో.. మిస్ ఆంధ్ర పోటీల్లో మగవలు ధరించిన డ్రెస్ల్లో చాలా మట్టుకు ఇక్కడ డిజైన్ చేసినవంటే అతిశయోక్తి కాదు. సాగర్‌నగర్ : ప్రస్తుతం యువత ఫంక్షన్లలో ప్రత్యేకంగా కనిపించేందుకు ఒక్కో రకమైన డిజైనర్ దుస్తులను ధరిస్తోంది. ఆయా సందర్భాలకు తగ్గట్టుగా దుస్తులను రూపొందించే డిజైనర్ బొటిక్స్ సంఖ్య నగరంలో రోజురోజుకూ పెరుగుతోంది. ఈ బొటిక్స్లో డిజైనర్లు దుస్తులను రూపొందించడమే కాదు.. వాటిని ధరించే వారి ఎత్తు, బరువు, రంగు వంటి వాటిని బట్టి సరిపోయే దుస్తుల వర్ణాలను సైతం సూచిస్తున్నారు. ఇక వాటిపై కావాల్సిన యాక్సరీస్ కూడా అందుబాటులో ఉంచుతున్నారు. సిటీలో మొత్తం 50పైకు పైగా బొటిక్స్ సెంటర్లు ఉన్నాయి. వాటిలో పది వరకూ డిజైనింగ్ కోర్సులతో పాటు కలెక్షన్లు ఉన్నాయి. ద్వారకానగర్, ఎంవీపీ కాలనీ, ఆశీల్‌మెట్ట, దొండపర్తి, డైమండ్ పార్కు, ఏరియాలో పేరొందిన బొటిక్స్ డిజైనింగ్ సెంటర్లున్నాయి. కోర్సు పూర్తి కాగానే క్యాంపస్ అవకాశాలు.. ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు పూర్తి కాగానే క్యాంపస్ అవకాశాలు లభిస్తున్నాయి. ప్రస్తుతం అన్ని ఫ్యాషన్ డిజైనింగ్ కళాశాలలు తమ విద్యార్థులతో ఫ్యాషన్ షోలు నిర్వహిస్తున్నాయి. దీంతో ఫ్యాషన్ డిజైనింగ్ కాలేజీ నుంచే కెరీర్‌ను విద్యార్థులు ప్రారంభిస్తున్నాయి. ఇక తమదైన డిజైన్లను ప్రదర్శించడానికి కూడా ప్రస్తుతం నగరంలో అనేక అవకాశాలున్నాయి. అనేక కార్పొరేట్ సంస్థలు ఫ్యాషన్ షోలకు స్పాన్సర్లగా ఉంటూ డిజైనర్లును ప్రొత్సహిస్తున్నాయి. ఈ షోలలో డిజైనర్ల కలెక్షన్ ఒక్కసారి క్లిక్ అయితే చాలు వారికంటూ సొంతం బ్రాండ్‌నేమ్ ఏర్పడిపోతుంది. అంతేకాదు బ్లెండర్స్ ఫ్రైడ్ ఫ్యాషన్ టూర్ తరహా ఫ్యాషన్ ఈవెంట్స్‌లలో అంతర్జాతీయ ర్యాంప్‌లపై కూడా వారి కలెక్షన్లను ప్రదర్శించే అవకాశం లభిస్తుంది. ఆసక్తితో వచ్చి.. సొంతంగా బొటిక్ ప్రారంభం ఎంబీఏ, ఎంసీఏ, చదువు పూర్తి చేసిన వారు ఫ్యాషన్ డిజైనింగ్‌పై ఉన్న ఆసక్తితో బొటిక్‌ను సొంతంగా ప్రారంభిస్తున్నారు. ఈ రంగంలోకి రావడానికి గల కారణాన్ని ‘సాక్షి’ ప్రశ్నించినప్పుడు ‘నాకు చిన్నప్పటి నుంచే రకరకాల దుస్తులు డిజైన్ చేయాలనే ఆసక్తి ఉండేది. అందుకే నా వార్డ్‌రోబ్‌లో ఎప్పుడూ సరికొత్త కలెక్షన్ డ్రస్‌లు ఉండేవి. ప్రతి సందర్భానికి ప్రత్యేక తరహా దుస్తులను డిజైన్ చేసే బొటిక్‌లు విశాఖలో ఎక్కువగా ఏర్పడుతున్నాయి. ప్రస్తుతం మా బొటిక్స్లో ఎనిమిది మంది డిజైనర్లు పనిచేస్తున్నారు. సెలబ్రెటీలతోపాటు సాధారణ ఉద్యోగినులు కూడా డిజైనర్ దుస్తుల కోసం మా బొటిక్‌కి వస్తున్నారని ఓ ఫ్యాషన్ డిజైనర్ నిర్వాహకురాలు తెలిపారు. సృజన ఉంటే.. విజయాలు మీ వెంటే... సరికొత్తగా ఆలోచించ గలిగితే ఈ రంగంలో నిలదొక్కుకొని ఓ బ్రాండ్‌నేమ్‌ను తెచ్చుకోవడం అంత కష్టమేంకాదు. ప్రస్తుతం చీరలను కూడా ఫ్యాషనబుల్‌గా ధరించడానికి మహిళలు ఆసక్తి చూపుతున్నారు. కేవలం మోడ్రన్ దుస్తుల డిజైనింగ్ మాత్రమే కాదు బ్లౌజ్‌లను కూడా ఫ్యాషన్ డిజైనర్లు తమ కలెక్షన్లో అందుబాటులో ఉంచుతున్నారు. ఒక్క కలెక్షన్ క్లిక్ అయితే చాలు సెలబ్రేటీల వ్యక్తిగత డిజైనర్లగా, లేదంటే అంతర్జాతీయ బ్రాండ్ల డిజైనర్లగా మారిపోవవచ్చు. ప్రస్తుతం అనేక కార్పొరేట్ సంస్థలు ఫ్యాషన్ షోలకు స్పాన్సర్ షిప్ అందించడానికి ముందుకొస్తున్నాయి. గతంలో ముంబయి, బెంగళూరులోనే ఫ్యాషన్ డిజైనింగ్‌కు ఎక్కువ ఆదరణ ఉండేది. ప్రస్తుతం విశాఖ స్మార్ట్‌సిటీలో ఈ తరహా డిజైనింగ్‌లు క్రమేణా పెరుగుతున్నాయి. –ప్రత్యూష్, ఫ్యాషన్ డిజైన్ నిర్వాహకురాలు