ఉద్యోగం కోసం పాత పద్దతి.. నెట్టింట్లో ఫోటోలు వైరల్ | Job Seeker Send Letter And Impresses Top Swiggy Executive | Sakshi
Sakshi News home page

ఉద్యోగం కోసం పాత పద్దతి.. నెట్టింట్లో ఫోటోలు వైరల్

Published Sun, Nov 3 2024 2:35 PM | Last Updated on Sun, Nov 3 2024 3:18 PM

Job Seeker Send Letter And Impresses Top Swiggy Executive

సాధారణంగా ఉద్యోగం కోసం అప్లై చేయాలంటే.. ఎవరైనా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటారు. టెక్నాలజీ బాగా పెరిగిన తరుణంలో జాబ్ కోసం లెటర్స్ పంపించడం వంటివి ఎప్పుడో కనుమరుగైపోయాయి. కానీ ఇటీవల ఓ వ్యక్తి ఉద్యోగం కోసం లెటర్ పంపించినట్లు తెలిసింది. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

ఏఐను ఉపయోగించి రెజ్యూమ్‌లు తయారు చేస్తున్న ఈ కాలంలో.. ఒక వ్యక్తి పోస్ట్ ద్వారా డిజైనర్ ఉద్యోగానికి అప్లై చేస్తూ ఓ లెటర్ రాసి స్విగ్గీ డిజైన్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ 'సప్తర్షి ప్రకాష్'కు పంపించారు. లేఖను అందుకున్న తరువాత ఆయన ఆశ్చర్యానికి గురయ్యారు. లెటర్ ఫోటోలను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు.

ఫోటోలను ఎక్స్ ఖాతాలో షేర్ చేస్తూ.. భౌతికంగా ఒక లేఖను స్వీకరించాను. డిజిటల్ యుగంలో స్కూల్ డేస్ గుర్తు చేశారు. ప్రస్తుతం డిజైనర్ ఉద్యోగానికి సంస్థలో ఎటువంటి ఓపెనింగ్స్ లేదు. కానీ దయ చేసిన నాకు ఈమెయిల్ చేయండి. నేను మీ ఆలోచనను చూడాలనుకుంటున్నాను. డిజైన్ ఓపెనింగ్స్ గురించి ఎవరికైనా తెలిస్తే.. తెలియజేయండి అంటూ స్విగ్గీ డిజైన్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ ట్వీట్ చేశారు.

ఇదీ చదవండి: రూ.123 కోట్లు విరాళం: ఎవరీ షన్నా ఖాన్..

ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లలో కొందరు ఉద్యోగార్ధుల సృజనాత్మకత & నిబద్ధతను తెగ పొగిడేస్తున్నారు. ఈ డిజిటల్ యుగంలో కాగితాన్ని ఉపయోగించి ఉద్యోగానికి పోస్ట్ చేయడం.. చూడటానికి రిఫ్రెష్‌గా ఉందని ఒకరు వెల్లడించారు. ఇలా ఒక్కొక్కరు తమకు తోచిన విధంగా కామెంట్స్ చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement