New fashion
-
హామ్స్టెక్ కొత్త డిజైన్లు.. ఎంబ్రాయిడరీ వర్క్ కాంబినేషన్లో..
పున్నమి వెన్నెల వెలుగు పాల నురగలా ఉంటుంది. ఆకాశం నీలంగా ఉంటుంది. ఈ రెండింటి కాంబినేషన్‌కి తారల కాంతుల ఎంబ్రాయిడరీ జతగా చేరితే చూడచక్కని కళ కళ్లకు కడుతుంది. అది సల్వార్ సెట్ అయినా.. పలాజో కట్ అయినా చీరకట్టు అయినా టాప్ టు బాటమ్ వెలుగులు విరజిమ్ముతాయి. కరోనా కాలంనుంచి ఇప్పుడిప్పుడే ప్రపంచం ఊపిరి పీల్చుకుంటోంది. సృజనాత్మకత కొత్తగా ముస్తాబు అవుతోంది. ప్లెయిన్ కాటన్, సిల్క్, క్రేప్.. క్లాత్‌ను అధునాతనమైన డిజైన్లతో మెరిపించవచ్చని చూపుతున్నారు నవ డిజైనర్లు. ఎంబ్రాయిడరీ, అప్లిక్, మిర్రర్ వర్క్, మోటిఫ్స్, క్లే అండ్ వాల్ ఆర్ట్, పెయింటింగ్.. ఈ అన్నింటి కాంబినేషన్‌తో హామ్స్టెక్ నవ డిజైనర్ల చేతుల్లో రూపుదిద్దుకున్నాయి. భారతీయ సంస్కృతి, శాస్త్రీయ నృత్య రూపాలు, స్థానిక తెగల జీవనం, శిల్పాలు, దేవాలయాల నిర్మాణం.. ఇవన్నీ అంతర్లీనంగా దుస్తులపై కనిపిస్తే ఎలా ఉంటాయో ఈ డిజైన్స్‌లో తీర్చిదిద్దారు. చదవండి: Punam Rai: ఆడపిల్లంటే ఇలా ఉండాలి.. సమాజం అంత అందమైనదేం కాదు!! -
కుర్తా కుచ్చిళ్లు
చీరకట్టులో ఓ కొత్త స్టైల్ కుర్తా–కుచ్చిళ్లు. చీరను కుచ్చిళ్లుగా మడిచి ... బ్లౌజ్‌ను కుర్తాగా ధరించి... పల్లూను దుపట్టాలా సింగారిస్తే... చూపులకు చక్కగా స్టైల్‌కి సూపర్బ్‌గా... సౌకర్యంలో సుందరంగా... సందర్భమేదైనా, వేడుక ఏదైనా చీరను మించిన ఎవర్గ్రీన్ డ్రెస్ లేదన్నది నేటితరమూ ఒప్పుకుంటున్న మాట. అయితే, ఒకప్పటిలా కాకుండా చీరకట్టులో ఇప్పుడు ఎన్నో మార్పులు వచ్చాయి. పవిటను తీరొక్కతీరుగా అలంకరించడం నిన్నటి మాట. బ్లౌజ్ పార్ట్‌ని భిన్నమైన టాప్స్‌తో చీరకు జత చేయడం నేటి మాట అయ్యింది. అవి నవతరం మెచ్చేలా స్టైలిష్ లుక్‌తో పాటు సంప్రదాయతను చాటేలా ఉండటం ప్రధానంగా కనిపిస్తోంది. షార్ట్ లేదా లాంగ్ కుర్తా – చీర కాంబినేషన్ లేదా లాంగ్ జాకెట్–చీర, షర్ట్ స్టైల్ –చీర.. ఇలా ఈ స్టైల్స్ ఆధునిక కాలం అమ్మాయిలను బాగా ఆకట్టుకుంటున్నాయి. ప్రత్యేక సందర్భాలలో ఈ కుర్తా లేదా కుర్తీ చీరకట్టు మరింత ప్రత్యేకతను చాటుతోంది. చీరకట్టులో కుర్తీ శారీ నేటి కాలానికి తగినట్టు స్టైలిష్‌గా ఉండటంతో ఆకట్టుకుంటోంది. పైగా సౌకర్యవంతంగా ఉంటుంది.కుర్తా శారీ ఎంపికలో రెండు భిన్న రంగులను ఎంచుకోవాలి. అలాగే ఫ్యాబ్రిక్లోనూ మార్పులు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. అంచుతో కూడిన ప్లెయిన్ శారీ అయితే తెల్లటి కుర్తా టాప్‌గా ధరిస్తే చాలు మంచి కాంబినేషన్ అవుతుంది. ∙ప్రింటెడ్ శారీకి ప్లెయిన్ కుర్తా పర్ఫెక్ట్ ఎంపిక. చీరకట్టులోనే కొత్తదనం కనిపిస్తుంది కాబట్టి ఇతరత్రా ఆభరణాల అలంకరణ అవసరం లేదు. సింపుల్‌గా చెవులకు జూకాలను ధరిస్తే సరిపోతుంది. క్రోషెట్ లేదా లేస్ ఫ్యాబ్రిక్ కుర్తాలు కూడా బ్లౌజ్ పార్ట్ (కుర్తా టాప్)కి బాగా నప్పుతాయి. షార్ట్ కుర్తీ వేసుకున్నప్పుడు అంచులు తగిలేలా పవిటను తీయాలి. అలాగే లాంగ్ కుర్తా (నీ లెంగ్త్) ధరించిన్నప్పుడు పవిటను కుర్తా అంచులను తగిలేలా సెట్ చేస్టే స్టైలిష్ లుక్‌తో ఆకట్టుకుంటుంది. షార్ట్ లేదా లాంగ్ కుర్తీలను చీర మీదకు ధరించడం వల్ల ఫార్మల్ లుక్‌తో ఆకట్టుకుంటారు. ప్రత్యేక∙సభలు, సమావేశాలకూ ఈ లుక్ నప్పుతుంది. – కీర్తిక, డిజైనర్ -
పెళ్లి బొమ్మలు
బొమ్మల పెళ్లిలో పిల్లల కేరింతలే బాజాభజంత్రీలు.పిల్లలు పెరిగి పెద్దయ్యాక జరిగే పెళ్లిళ్లలో ఆ బొమ్మలే ఆకర్షణగా నిలిస్తే..?ఇప్పుడు ట్రెండ్ అదే!రాధాకృష్ణులు, లక్ష్మీదేవి, గొల్లభామలు, కిన్నెరలు...ఎంబ్రాయిడరీ ద్వారా పెళ్లి వస్త్రాలపై కొలువు తీరుతున్నారు. ఇదిగో ఇలా అక్షింతలు అందుకుంటున్నారు. ముచ్చటైన చిత్ర కళ చీర కొంగు మీద ఒదిగిపోతే అచ్చమైన జరీ జిలుగులకు జాకెట్టు కాన్వాస్‌గా మారితే సంప్రదాయ వేడుక విన్నూత కళను నింపుకుంటుంది. చిత్రకళ సొగసు, ఎంబ్రాయిడరీ జిలుగులు జత చేరి మెరిసిపోతుంటే పట్టు రెపరెపల మధ్య వాటిని పట్టేసుకుంటే ప్రతీ కట్టూ ప్రత్యేకతను నింపుకోకుండా ఉండగలదా...! పల్లకిలో పెళ్లికూతురు సన్నాయి రాగాలాపన.. బాజా భజింత్రీల చప్పుళ్ల మధ్య.. అలంకరించిన పల్లకిలో కోటి కలల కొత్త జీవితాన్ని మోసుకుంటూ పెళ్లికూతురు మండపానికి వస్తుంటే చూడ్డానికి రెండు కళ్లు చాలవు. ఆ కళని చీర కొంగుమీదనో లేదంటో బ్లౌజ్ మీదనో చూపితే చూపుల దారాలు అల్లిబిల్లిగా అల్లుకుపోవాల్సిందే! రాధాకృష్ణుల ప్రేమ కావ్యం యుగాలు దాటినా ఆ అందం వన్నె తగ్గదు. అందుకే ఆ ప్రేమను డిజైనర్లు ఇలా ఆకట్టుకునేలా ఆవిష్కరిస్తున్నారు. ఫ్యాబ్రిక్ పెయింట్‌తో రాధాకృష్ణుల బొమ్మలు గీసి, లతలు, పువ్వులను జరీతో సింగారించారు. మరికొన్ని జరీ, పూసలతోనే రాధాకృష్ణుల బొమ్మలు కుట్టుతో ఆకట్టుకుంటున్నాయి. కోటగుమ్మాలు రాజస్థానీ మొఘల్ ఘనత చీర అంచుల్లోనూ, కొంగులోనూ మెరిసిపోవడంతో పాటు జాకెట్టు పైనా ఘన తను చాటుతుంది. కోట గొమ్మాలను జరీ దారాలు, కుందన్ మెరుపులతో సింగారిస్తున్నారు. అప్సరసలు పెళ్లి, పేరంటాలకు ఇంకాస్త నిండుతనాన్ని, పూజా కార్యక్రమాలకు మరింత గాఢతను హారాలతో పాటు ఎంబ్రాయిడరీ కూడా అప్పరసల నాట్యకళతో లక్ష్మీ కళ ఉట్టిపడుతుంది. చీరలు, బ్లౌజ్‌ల మీద ఎంబ్రాయిడరీ కళ ప్రతీసారి కొత్త హంగులతో ఆశ్చర్యపరుస్తూనే ఉంది. మొన్నటి వరకు పూసలు దారాలతో పువ్వులు, లతలు అల్లేస్తే ఇప్పుడు ఏకంగా మనుషుల బొమ్మలనే తీరుగా డిజైన్ చేస్తున్నారు. చిత్రలిపి, ఎంబ్రాయిడరీతో కనువిందు చేస్తున్నారు. -
ప్యారీనా
ప్యారీ అంటే ప్రియమైనదే కాదు అందమైనది అని కూడా! వెస్ట్ర్టన్ వేర్ వేసినా సంప్రదాయ ఓణీ చుట్టినా ఇంపుగా శారీ కట్టినా కరీనా ప్యారీనా అనకుండా ఉండతరమా!! ►ఇది సింగిల్ పీస్ మ్యాక్సీ డ్రెస్. నడుము దగ్గర నుంచి మరో లేయర్ తీసుకురావడంతో ఈ డ్రెస్ అందం పెరిగింది. లాంగ్ స్లీవ్స్ దీనికి ప్రధాన ఆకర్షణ. ►షరారా డ్రెస్ మీద ఫైన్ జర్దోసీ వర్క్ చేశారు. ప్యాంట్‌కి ఫ్లోరల్ ప్రింటెడ్ లేయర్ వేసి, దాని మీద నెటెడ్ ఫ్యాబ్రిక్‌ని స్కర్ట్‌లా తీసుకున్నారు. ఈ నెట్ స్కర్ట్‌కి చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చేలా ఎంబ్రాయిడరీ వర్క్ చేశారు. ముదురు బూడిద రంగు (ఎలిఫెంట్ కలర్) అవడంతో క్లాస్‌గా కనిపిస్తోంది. ►సింపుల్ అండ్ గ్రేస్‌గా కనిపిస్తున్న ఈ లుక్ అంతా చీరలోని డిజిటల్ ప్రింట్ వల్లే వచ్చింది. మబ్బుల దొంతర వచ్చేలా నలుపు, తెలుపు కాంబినేషన్ ప్రింట్‌తో ఈ శారీని డిజైన్ చేశారు. సాయంకాలపు పార్టీలకు ఈ స్టైల్ శారీస్ బాగా నప్పుతాయి. ►ప్రింటెడ్ డ్రెసెస్‌తో మ్యాజిక్ చేయడం కరీనా స్టైల్లా కనిపిస్తుంది. అందుకే ఈమె ఫ్యాషన్ ఖాతాలో ప్రింటెడ్ డ్రెస్సులు ఎక్కువగా కనిపిస్తాయి. నీ లెంగ్త్ ప్రింటెడ్ ఫ్రాక్ సాయంకాలపు వేడుకలకు స్టైలిష్ లుక్‌ని తీసుకువస్తాయి. ►డిజిటల్ ప్రింట్‌తో మెరిపించిన డిజైన్ చేసిన స్కర్ట్ అండ్ టాప్. దీనికి ప్రధాన ఆకర్షణ వెడల్పాటి బెల్ట్. అలలు అలలుగా ఆకట్టుకుంటున్న ప్రింట్‌కి మధ్య వెడల్పాటి బెల్ట్‌తో పూర్తి లుక్‌ని మార్చేశారు. ఫ్యాన్సీ చెవి జూకాలు స్టైల్‌ని మరింత స్టైలిష్‌గా మార్చేశాయి. ►వెల్వెట్ బ్లౌజ్ మీద థ్రెడ్ ఎంబ్రాయిడరీ చేసి, జార్జెట్ ఫ్యాబ్రిక్ లాంగ్ స్లీవ్స్‌ని జత చేశారు. వెల్వెట్ లెహంగా మీద సన్–మూన్ కాన్సెప్ట్ వచ్చేలా మోటివ్స్ని థ్రెyŠ ఎంబ్రాయిడరీ వర్క్ చేశారు. దీంతో ఈ గెటప్‌కి గ్రాండ్ లుక్ వచ్చింది. ►ఇది పూర్తి బ్రైడల్ డ్రెస్. వెల్వెట్ బ్లౌజ్ మీద జువెల్రీ ఎంబ్రాయిడరీ వర్క్ దీనికి ప్రధాన ఆకర్షణ. ఎంబ్రాయిడరీ చేసిన నెటెడ్ దుపట్టా, గ్రాండ్‌గా తీర్చిదిద్దిన లెహంగా ధరిస్తే సంప్రదాయ వేడుకలకు అద్భుతమైన కళ వచ్చేసినట్టే. భార్గవి కూనమ్ డిజైనర్ -
కట్రీనా
కత్తెరతో కట్ చేసి కాస్ట్యూమ్ కుట్టి తొడిగితే... కత్తికి దుస్తులేసినట్టుంటుంది ‘కత్తి’రీనా! అందుకేనేమో అందరూ ఆమెను కత్తిలా ఉంటుందంటారు! మేం ఒప్పుకోం. కత్తెరతో కట్ చేసినట్లుగా ఉంటుంది కత్రినా! ►డ్రెస్సింగ్‌లో టాప్ అండ్ బాటమ్ బ్లాక్ డ్రెస్ ఎప్పుడూ పవర్ఫుల్ గానూ, కాన్ఫిడెంట్‌గానూ కనిపిస్తుంది. బ్లాక్ స్కర్ట్ మీదకు అదే రంగు టీ షర్ట్ ధరించడం వల్ల లుక్ ఆకర్షణీయంగా మారింది. ► బ్రౌన్ కలర్ లెహంగా మీద మల్టీకలర్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ గ్రాండ్‌గా మారింది. లెహంగా కలర్ నెటెడ్ దుపట్టా, చాక్లెట్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ జత చేయడంతో వేడుకలో క్లాస్ లుక్ వచ్చేసింది. ►ప్రింటెడ్ జార్జెట్ మెటీరియల్‌తో రూపుదిద్దుకున్న లాంగ్ స్లీవ్స్, ఫ్లోర్ లెంగ్త్ గౌన్ ఇది. పాశ్చాత్య వేడుకలకు, క్యాజువల్ మీటింగ్స్‌లో ఈ స్టైల్ అట్రాక్ట్ చేస్తుంది. ఓపెన్ స్లీవ్స్, లేస్ డిజైన్ మరింత ఆకర్షణీయంగా మారింది. ►ప్యాచ్, ఎంబ్రాయిడరీ వర్క్‌తో తీర్చిదిద్దిన లాంగ్ స్కర్ట్ సంప్రదాయాన్ని చూపుతుంది. డిజైనర్ బ్లౌజ్ స్టైల్‌ని వైబ్రెంట్‌గా మార్చింది. టాప్, బాటమ్‌లలో ఇలా ఏదో ఒక వెస్ట్రన్ టచ్ జత చేస్తే పార్టీలో హైలైట్ అవ్వాల్సిందే! ►ఇది మల్టీకలర్ సింగిల్ పీస్ మ్యాక్సీ డ్రెస్. కింది భాగం హెచ్చుతగ్గులుగా, ఎక్కువ ఫ్రిల్స్గా రావడంతో ఈ డ్రెస్ ఆకట్టుకునేలా మారింది. సింపుల్ గెట్ టుగెదర్స్కి స్టైలిష్ డ్రెస్‌గా కితాబులను అందజేస్తుంది. ►ప్లెయిన్ రెడ్ జార్జెట్ శారీకి అంచు, పల్లూను గ్రాండ్‌గా ఎంబ్రాయిడరీ చేశారు. అక్కడక్కడా జరీబుటీను జత చేశారు. అంచు రంగు బెనారస్ బ్లౌజ్‌ను ధరించడంతో ప్రత్యేకంగా కనిపిస్తోంది. ►మోకాలికి మీదుగా ఉండే ఈ వైట్ ఫ్రాక్ను భుజం మీదుగా అమర్చిన ఫ్లవర్ డిజైన్, బాటమ్ అంచులలో ఉండే వ్యత్యాసం అందంగా మార్చింది. పాశ్చాత్య పార్టీలకు ఈ తరహా డ్రెస్సింగ్ బాగా నప్పుతుంది. భార్గవి కూనమ్ డిజైనర్ -
ఊ... లలలా... కాజోల్ ఇలా...
వయసుతో పాటు అందం పెరగాలంటే.. హుందాగా ఉండాలి. హుందాతనాన్ని మించిన అందం దుస్తులకు ఇంకెక్కడ దొరుకుతుంది.. దిష్టి తగిలేలా కనబడటం లేదా కాజోల్! అందుకేనేమో ఆ పేరు పెట్టారు.. కాటుక అని! ►సాధారణంగా ఉంటూనే అసాధారణంగా ఇలా రెడీ అవ్వచ్చు. ప్లెయిన్ బ్రౌన్ స్కర్ట్ మీదకు, ప్లెయిన్ ట్రెంచ్ కోట్ ధరించే ఈ స్టైల్ ఇండోవెస్ట్రన్, గెట్ టు గెదర్, బర్త్‌డే వంటి ఈవెనింగ్ పార్టీలకు బాగా నప్పుతుంది. ►సంప్రదాయ వేడుకలకు సింపుల్‌గా రెడీ అవాలంటే ఈ తరహా డిజైనర్ దుస్తులు బాగా నప్పుతాయి. లాంగ్ కుర్తీకి అంచు భాగం ధోతీ స్టైల్, రంగు హుందాతనాన్ని తీసుకువచ్చింది. ►లాంగ్ ఫ్రంట్ ఓపెన్ కుర్తీ. సైడ్స్ ఎంబ్రాయిడరీ వర్క్‌తో మెరిపించి, మిగతా అంతా సింపుల్‌గా డిజైన్ చేశారు. దీనికి బాటమ్‌గా షిమ్మర్ లెగ్గింగ్ లేదా లాంగ్ స్కర్ట్ ధరిస్తే పార్టీలకు బాగా నప్పుతుంది. ►శారీ మీదకు ఓవర్ కోట్, సన్నని బెల్ట్‌తో ఈ స్టైల్ తీసుకురావచ్చు. అయితే శారీ, జాకెట్ రెండూ పూర్తి కాంట్రాస్ట్‌లో ఉండాలి. బాందినీ ప్రింట్ శారీ, పైన మెటాలిక్ ఆప్లిక్ వర్క్ చేసిన జాకెట్ ధరిస్తే సూపర్ పవర్ ఉమన్‌లా కనిపిస్తారు. ►ఇది క్యాజువల్ లుక్. నలభైలలో ఉన్న అతివలకు హుందాగానూ, గ్రాండ్‌గా అనిపించే ఈ లుక్‌కి ప్లెయిన్ కుర్తా, పలాజో ప్యాంట్స్ ఎంపిక చేసుకొని, ఎంబ్రాయిడరీ వర్క్ చేసిన దుపట్టా ధరిస్తే చాలు. ►బ్లాక్ కలర్ ఎప్పుడూ ఫంక్షన్లలో రిచ్‌గా ఉంటుంది. దీనికి కొంచెం అదనపు హంగులు అద్దడానికి నెట్ ఫ్యాబ్రిక్ మీద సీక్విన్ వర్క్ చేశారు. సింపుల్ బ్లౌజ్ వేయడంతో రిచ్ లుక్ వచ్చేసింది. భార్గవి కూనమ్ డిజైనర్ -
నవరాత్రి వేడుకల్లో నయా జోష్
-
సంజె కాంతుల్లో...సౌందర్య రాగం!
ముస్తాబు వేసవి సాయంత్రాలలో మల్లెల గుబాళింపులే కాదు వేడుకల వాతావరణమూ ఆహ్లాదపరుస్తూ ఉంటుంది. చిన్నాపెద్దా గెట్ టు గెదర్లు, పాశ్చాత్యశైలి పార్టీలు ఇప్పుడు మన సంస్కృతిలో భాగమైపోవడంతో పార్టీకి తగ్గ వేషధారణ కూడా ముఖ్యమైంది. కొత్త కొత్త ఫ్యాషన్ల కోసం వెతుకులాట సాధారణమైంది.కొంచెం పాశ్చాత్యం... ఇంకొంచెం సంప్రదాయం... రెండింటి మేళవింపును ఇష్టపడే యువతరం కోరుకునే దుస్తుల పరిచయమే ఈ ముస్తాబు. 1- ఎరుపు, పువ్వుల కాంబినేషన్లో ఆకర్షణీయంగా కనిపిస్తున్న ఈ పొడవాటి గౌన్ బర్త్ డే, వీకెండ్ పార్టీలలో అదుర్స్ అనిపిస్తుంది. కింద పువ్వుల ప్రింట్లు ఉన్న క్రేప్ మెటీరియల్‌ను ఉపయోగించారు. నడుము, పై భాగాన్ని కలుపుతూ కర్దానా బెల్ట్‌ను ఉపయోగించారు. పైన వి నెక్ ఉన్న బ్లౌజ్‌కు ఎరుపు రంగు షిఫాన్ ఫ్యాబ్రిక్‌ను వాడారు. 2- వారాంతపు పార్టీలో చూపులను కట్టిపడేసే పొడవాటి గౌన్ ఇది. స్కర్ట్ భాగానికి షిఫాన్ ఫ్యాబ్రిక్, బ్లౌజ్ భాగానికి బ్లాక్ వెల్వెట్ వాడారు. నడుము భాగాన్ని చుట్టి ఉన్న బెల్ట్‌పై శాటిన్ రిబ్బన్‌తో వర్క్ చేశారు. 3- సాయంకాలం పార్టీని ఆహ్లాదపరిచే రంగుల కలబోత ఈ లాంగ్ గౌన్ ప్రత్యేకత. జైపూర్ ప్రింట్ ఉన్న ఇక్కత్ సిల్క్, పైన ప్లెయిన్ షిఫాన్కు క్రాస్ షేప్ తీసుకువచ్చారు. బ్లౌజ్ పార్ట్‌కు ఇక్కత్ సిల్క్ వాడారు. స్కర్ట్ భాగంలో వాడిన ప్రింటెడ్ క్లాత్‌తో ఫ్లవర్‌ను తీర్చిదిద్ది, భుజం దగ్గర బ్రోచ్లా అమర్చారు. 4- మయూరాన్ని తలపించే నీలం రంగు పొడవాటి గౌన్ పార్టీలో ప్రత్యేకంగా నిలుస్తుంది. తెల్లటి షిఫాన్ క్లాత్‌కు డై చేయించి, పీకాక్ కలర్ తెప్పించారు. బ్లౌజ్ భాగాన్ని రాసిల్క్ చెక్స్ మెటీరియల్‌తో డిజైన్‌చేశారు. సైడ్స్ పర్పుల్ ఫ్యాబ్రిక్వాడారు. 5- తెల్లటి పొడవైన ఈ గౌను సాయంకాలపు పుట్టిన రోజు, పెళ్లిరోజు పార్టీలకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. క్రింది భాగానికి మూడు లేయర్లుగా తెల్లని నెట్ మెటీరియల్ వాడి, లైనింగ్ కోసం శాటిన్ క్లాత్‌ను జత చేశారు. పైన హై కాలర్ నెటెడ్ బ్లౌజ్‌కి క్యాప్ స్లీవ్స్ ఇచ్చి యాంటిక్ బీడ్స్, వైట్ గోల్డ్, రాక్ గోల్డ్ సీక్వెన్స్‌తో మొత్తం ఫ్లోరల్ డిజైన్ చేశారు. 6- సాయంకాలం సంగీత్, మెహెందీ, రిసెప్షన్ వంటి సంప్రదాయ వేడుకలకు ఈ ఎర్రటి పొడవాటి గౌన్ ఎందరిలో ఉన్నా ఇట్టే ఆకట్టుకుంటుంది. క్రింది భాగాన్ని మూడు లేయర్లుగా ఎక్రటి నెట్ మెటీరియల్ వాడి, లైనింగ్ కోసం శాటిన్ క్లాత్‌ను జత చేశారు. పైన బ్రొకేడ్ క్లాత్‌తో డిజైన్ చేసిన బ్లౌజ్, బోట్ నెక్ ఇచ్చి, కుడి భుజం పైన జర్దోసి వర్క్, గ్రీన్ స్టోన్స్‌తో మెరిపించారు. నడుము భాగంలో ఎరుపురంగు సిల్క్ మెటీరియల్‌తో చేసిన బెల్ట్‌ను జత చేశారు. పార్టీలో గ్రాండ్‌గా..: పాశ్చాత్య దుస్తులు ధరించినప్పుడు మేకప్ మరీ ఎక్కువ కాకూడదు. మేకప్ కనిపించీ కనిపించనట్టు ఉండాలి కేశాలంకరణ సంగతికొస్తే - హై పోనీతో కానీ, జుట్టు పూర్తిగా వదిలేయడం కానీ చేయాలి. సమకాలీన లుక్ ఉండేలా చూసుకోవాలి గౌన్లు వేసుకున్నప్పుడు హై హీల్స్, శాండల్స్ బాగా నప్పుతాయి డ్రెస్‌కు సంబంధం లేనట్టు కాకుండా యాక్ససరీస్ మ్యాచ్ అయ్యేలా చూసుకోవాలి హ్యాండ్‌బ్యాగ్ బదులు క్లచ్ లాంటివి పట్టుకుంటే లుక్ బాగుంటుంది. కర్టెసి: భార్గవి కూనమ్ ఫ్యాషన్ డిజైనర్, హైదరాబాద్ www.bar9999@gmail.com -
ఆసక్తికొక ఆకృతినిచ్చారు
కొత్త కొత్త ఫ్యాషన్లను ఎలా డిజైన్ చేస్తారు?! అందుకో కోర్సు ఉంటుంది. ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉంటారు. క్లాత్‌ని ఎలా కట్ చేసి, ఎలా కలిపి, ఎలా కుట్టాలో చెప్పేవారుంటారు. థియరీ చదివి, ప్రాక్టికల్స్‌కు వెళ్లి, కొంచెం క్రియేటివిటీ చూసిస్తే చాలు... మంచి ఫ్యాషన్ డిజైనర్ ఐపోవచ్చు. గౌరీ సౌజన్య కూడా అలాగే మంచి డిజైనర్ అయింది. అయితే ఆమెను... అందరు పిల్లల్లా ‘డిజైన్’ చేయడానికి... ఆమె పేరెంట్స్ పడిన కష్టం మాత్రం ఏ కోర్సులోనూ లేనిది! ఏ ప్రొఫెసర్లూ చెప్పలేనిది! మాటలురాని, వినికిడి శక్తి లేని కూతురిలో కాన్ఫిడెన్స్ నింపడానికి అవమానాలను కట్ చేసుకుంటూ... అనుకూలతలను కలుపుకుంటూ... అందమైన కెరీర్‌ని కుట్టిపెట్టినబేబీ, పాపారావుల అఫెక్షనేట్ డిజైనింగే.... ఈవారం మన ‘లాలిపాఠం’. హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ ఎదురుగా ఉంది నిఫ్ట్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ. శాస్త్రీయంగా రూపుదిద్దుకున్న సృజనాత్మకతకు చిరునామా ఇది. ఇన్స్టిట్యూట్ను చూడగానే ఇది సంపన్నుల చదువుల లోగిలి అనిపిస్తుంది కూడ. ఫ్యాషన్ టెక్నాలజీ కోర్సు చేయాలనే ఉత్సుకత ఉన్న సామాన్యులకు... కోర్సు ఫీజులు, ఇతర ఖర్చుల జాబితా చూసి తమలోని సృజనాత్మకత మీద నీళ్లు చల్లుకోక తప్పని పరిస్థితి. అంతకంటే ముందు ఇక్కడ చదవాలంటే గడగడా ఇంగ్లిష్ మాట్లాడగలిగి ఉండాలి. ఇవన్నీ కలిసి గ్రామీణులు, సామాన్యులు అల్లంత దూరాన నిలబడిన నేపథ్యం ఈ సంస్థది. అలాంటి నిఫ్ట్‌లో విద్యార్థులకు పట్టాల ప్రదానోత్సవం జరుగుతోంది. మరో పక్క విద్యార్థులు రూపొందించిన దుస్తులు ప్రదర్శనలో ఉన్నాయి. ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన ‘నీరూస్’ సంస్థ అధినేత దృష్టిలో పడిందొక డిజైనర్ వేర్. అంతే... దానిని తయారు చేసిన విద్యార్థికి తన సంస్థలో ఉద్యోగం ఇచ్చేశారు ఆయన. ఆ అమ్మాయి పేరే గౌరీ సౌజన్య. ఈ పరిణామంతో సౌజన్య తల్లిదండ్రులు పాపారావు, బేబీ ముఖాలు దీపావళి మతాబుల్లా వెలిగిపోయాయి. కానీ ఆ వెలుగు కూడా దీపావళి మతాబులా తాత్కాలికమే అయింది. ఉద్యోగంలో చేరిన ఇరవై రోజుల్లోనే మరో ఉద్యోగి... గౌరీ సౌజన్య తల్లి బేబీతో ‘మీ అమ్మాయి మాట్లాడలేదు, వినలేదు. కాబట్టి ఉద్యోగంలో కొనసాగించడం కష్టం’ అని చెప్పింది. శరాఘాతంలాంటి ఆ మాటను కూతురికి చెప్పింది ఆ తల్లి. ఆ చెప్పడంలో కూతురి ఆత్మవిశ్వాసం ఏ మాత్రం తగ్గకుండా జాగ్రత్తపడింది కూడ. ఇది జరిగి ఏడాది దాటింది. ఇప్పుడీ అమ్మాయి వైజాగ్‌లో ప్రభుత్వం నిర్వహిస్తున్న ఫ్యాషన్ టెక్నాలజీ డిప్లమో (డెఫ్ అండ్ డంబ్) విద్యార్థులకు పాఠాలు చెప్తోంది. ఎదుటి వాళ్లు చెప్పింది వినలేని అమ్మాయి, తాను చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పలేని అమ్మాయి ఈ కోర్సుని చక్కగా ఆకళింపు చేసుకుంది. అంతే చక్కగా మరికొంత మంది నిపుణులను తయారు చేస్తోంది. అయితే ఇలాంటి పిల్లలను పెంచడంలో తల్లిదండ్రులకు ఎదురయ్యే చేదు అనుభవాలు చాలానే ఉంటాయి. వాటి ప్రభావం తమ పాపాయి మీద పడకుండా, కనుపాపను చూసుకున్నట్లు పెంచుకున్నారు ఈ దంపతులు. అదే విషయాలను సాక్షి ఫ్యామిలీతో పంచుకున్నారు. అనుమానం నిజమైన క్షణం! ‘‘నేను వైజాగ్ టూటౌన్లో హెడ్‌కానిస్టేబుల్‌ని. మాకు ఇద్దరమ్మాయిలు. పెద్దమ్మాయి రమణికి బిటెక్ పూర్తయిన తర్వాత పెళ్లి చేశాం. రెండో అమ్మాయి గౌరీసౌజన్య. ఈ అమ్మాయి పుట్టినప్పటి నుంచి బలహీనంగానే ఉండేది. అప్పుడప్పుడూ మాకు ‘పాప బాగానే ఉందా, అసలు తనకు వినబడుతోందా లేదా’ అనే సందేహం కలిగేది. అయినా ఎప్పటికప్పుడు... ‘అలా ఎందుకవుతుందిలే, అన్నీ సక్రమంగానే ఉంటాయి’ అని మమ్మల్ని మేమే సమాధానపరుచుకునేవాళ్లం. నడక వచ్చిన తర్వాత కూడా మాట రాకపోవడంతో ఈఎన్టీ స్పెషలిస్టుని కలిశాం’’ అని ఆగారు పాపారావు. ‘‘మాఅనుమానం నిజమే అని తెలిసిన క్షణం కలిగిన ఆవేదన అంతాఇంతా కాదు. తర్వాత చాలారోజులు బంధువులు, స్నేహితులు ఏ డాక్టర్ పేరు చెబితే ఆ డాక్టరు దగ్గర చూపించాం. ఆఖరుకి రైల్లో తోటి ప్రయాణికులు సూచించిన డాక్టర్ల దగ్గరకు కూడా తీసుకెళ్లాం. పాపకు మాట రాలేదు. కానీ... దేవుడు ఒక లోపం పెట్టినప్పుడు తెలివితేటలు ఎక్కువగా ఇస్తాడంటారు కదా! అలాగే సౌజన్య లిప్ మూమెంట్స్‌ని బట్టి మనం చెప్పిన విషయాన్ని పట్టేస్తుంది. సాధారణ పిల్లలు చదివే స్కూల్లోనే చదువుకుంది. నాలుగవ తరగతి వరకు స్కూలుకి పెద్దమ్మాయితోపాటు సైకిల్ మీద వెళ్లేది, తర్వాత తనకు తాను విడిగా సైకిల్ మీద వెళ్లడం మొదలుపెట్టింది’’ అన్నారు బేబీ. పాఠాలు చెప్తే చాలని... ‘‘వైజాగ్‌లో స్కూలు యాజమాన్యం సహకరించడంతో పాప చదువుకి ఇబ్బంది రాలేదు. ఇంటర్‌కి శ్రీచైతన్యలో చేర్పించేటప్పుడు మాత్రం సవాల్ ఎదురైంది. ‘మా అమ్మాయి పెర్ఫార్మెన్స్ గురించి మీరు బాధ్యత వహించనక్కరలేదు. కాలేజ్‌కి రానిచ్చి పాఠాలు చెప్తే చాలని రిక్వెస్ట్ చేసిన తర్వాత చేర్చుకున్నారు. ఇంటర్ 67 శాతం మార్కులతో పాసయింది. ఆ తర్వాత ఏ కోర్సులకు పంపించాలని మరో ప్రశ్నార్థకం ఎదురైంది’’ అన్నారు పాపారావు. శక్తికి మించిన సాహసం! ‘‘నేను ఇంట్లో టైలరింగ్ చేసేదాన్ని. సౌజన్య చిన్నప్పటి నుంచి చేతికుట్టు, కాజాలు కుట్టడం వంటి పనుల్లో నాకు సహాయం చేస్తుండేది. కటింగ్ కూడా బాగా గమనించేది. ఇవన్నీ ఆలోచించి తనకి డ్రస్ డిజైనింగ్ కోర్సు బాగుంటుందనుకున్నాం. సౌజన్య కూడా చాలా ఇష్టపడింది. నిఫ్ట్‌లో చదివించడం మా శక్తికి మించిన పని అని తెలుస్తున్నప్పటికీ సాహసం చేశాం. నిఫ్ట్ ఎంట్రన్స్‌లో ఫిజికల్లీ హ్యాండీకాప్డ్ కోటాలో సీటు వచ్చింది. ఢిల్లీలో కౌన్సెలింగ్‌కు తీసుకెళ్లాం. పాపకు చెన్నై ఇన్స్టిట్యూట్లో సీటు వచ్చింది. అక్కడికెళ్తే ఆ డెరైక్టర్ హైదరాబాద్‌లో అయితే పరిసరాలకు త్వరగా అడ్జస్ట్ అవుతుందని హైదరాబాద్ డెరైక్టర్‌తో మాట్లాడి సీటు మార్పించారు. సౌజన్య మాకు దూరంగావెళ్లడం అదే మొదటిసారి. హోమ్‌సిక్‌తో వచ్చేస్తుందేమోనని భయపడ్డాం. కానీ చాలా నిగ్రహం ఉన్న అమ్మాయి. అమ్మాయి వైపు నుంచి ఇబ్బంది రాలేదు కానీ సంస్థ నుంచి ఎదురైంది’’ అన్నారు బేబీ. చదువు పోరాటం! ‘‘నిఫ్ట్‌లో మొదటి సెమిస్టర్లో సౌజన్యని డిస్క్వాలిఫై చేశారు. వికలాంగుల సంక్షేమశాఖ డెరైక్టర్ ఆదేశం ప్రకారం నిఫ్ట్‌లో సౌజన్యకి, మరో అబ్బాయికి స్పెషల్ కోచింగ్ ఇవ్వడం మొదలుపెట్టారు. క్లాసులో ఒక లెక్చరర్ పాఠం చెప్తుండగా సైన్ లాంగ్వేజ్ (సైగల ద్వారా సమాచారాన్ని తెలియచేయడం) మరో టీచర్ వీళ్లకు అర్థమయ్యేటట్లు చెప్పేవారు. అలా ఎనిమిది సెమిస్టర్లు కూడా మంచి మార్కులతో పూర్తిచేసింది’’ అన్నారు పాపారావు. సౌజన్యకు భవిష్యత్తు గురించిన ఆలోచనలు చాలానే ఉన్నాయన్నారు బేబీ. ‘‘స్టూడెంట్స్ అందరూ ముంబయి, ఢిల్లీ, బెంగళూరులోనూ, విదేశాల్లో అవకాశాలను చర్చించేవాళ్లు. సౌజన్యకీ విదేశాలకు వెళ్లాలనే కోరిక కలిగింది. ఇంగ్లిష్ బాగా వచ్చు కాబట్టి పరిస్థితులను సమర్థించుకోగలనని ధీమాగా ఉండేది. మేము ధైర్యం చేయకపోగా తననే కన్విన్స్ చేశాం. మామూలు పిల్లల్లా ముందుకెళ్లలేకపోతున్నానని బాధపడుతుంటుంది’’ అన్నారామె బాధగా. ఒక్క అవకాశం ఇస్తే... ‘‘సౌజన్యకి సబ్జెక్టు మీద పట్టు ఉంది. రెండేళ్లపాటు ఎక్కడైనా పనిచేస్తే ఇతరులతో ఎలా మెలగాలనే అనుభవం కూడా వస్తుంది. మొదటి ఉద్యోగం అనుభవంతో కొంచెం డీలా పడింది. ఇప్పుడు మళ్లీ హైదరాబాద్‌కి తీసుకెళ్లి ప్రయత్నిస్తే అవకాశం వస్తుందేమో అనుకుంటున్నాం. తనకి ఇష్టమైన పనిలో నిమగ్నం చేస్తే సంతోషంగా ఉంటుందని మా ఆశ. గతంలో ఒక కార్పొరేట్ కంపెనీని ‘మీరు జీతం ఇవ్వవద్దు, సౌజన్యకి నెల రోజులు టైమివ్వండి. ఆ తర్వాత కూడా మీకు పని జరుగుతోందనిపించినప్పుడే జీతం ఇవ్వండి. ఇంత జీతం కావాలన్న డిమాండ్ ఏమీ లేదు. మా పాపలో నైపుణ్యం ఉంది, ప్రదర్శించే అవకాశం ఇవ్వండి’ అని అడిగాను. కానీ కార్పొరేట్ కంపెనీల నియమాలు వేరు’’ అంటారు పాపారావు. ఫ్యాషన్ టెక్నాలజీ విద్యార్థులను ‘జీవితాన్ని అందంగా డిజైన్ చేసుకుంటున్న సృజనశీలురు’ అని సృజనాత్మకంగా ప్రశంసిస్తుంటాం. సౌజన్యలో కూడా అంత చక్కగా జీవితాన్ని డిజైన్ చేసుకునే నైపుణ్యం ఉంది. అంతటి ఆత్మవిశ్వాసం కలిగేటట్లు పెంచారు ఈ తల్లిదండ్రులు. అందుకు తగిన అవకాశాలు... ఆమె కోసమే అన్నట్లు వెతుక్కుంటూ రావాలని కోరుకుందాం. - వాకా మంజులారెడ్డి; ఫొటోలు: నవాజ్, విశాఖపట్నం కళ్లలో నీళ్లు తిరిగాయి! నిఫ్ట్‌లో పట్టా పుచ్చుకునే కార్యక్రమంలో ఆ సంస్థ డెరైక్టరు... పదికి తొమ్మిది మార్కులు తెచ్చుకున్న సౌజన్యని ప్రత్యేకంగా అభినందించారు. ‘పాపకు తల్లిదండ్రులుగా మీరిచ్చిన సపోర్టు చాలా గొప్పది’ అని ఆంతటి వ్యక్తి మా గురించి మాట్లాడుతుంటే కళ్లలో నీళ్లు తిరిగాయి. - బేబీ, సౌజన్య తల్లి