కట్‌రీనా | new fashion show to Katrina Kaif | Sakshi
Sakshi News home page

కట్‌రీనా

Published Thu, Dec 28 2017 11:43 PM | Last Updated on Sat, Dec 30 2017 7:41 PM

new fashion show to Katrina Kaif - Sakshi

కత్తెరతో కట్‌ చేసి 
కాస్ట్యూమ్‌ కుట్టి తొడిగితే... 
కత్తికి దుస్తులేసినట్టుంటుంది 
‘కత్తి’రీనా!
అందుకేనేమో అందరూ ఆమెను 
కత్తిలా ఉంటుందంటారు! 
మేం ఒప్పుకోం. 
కత్తెరతో కట్‌ చేసినట్లుగా ఉంటుంది కత్రినా!

డ్రెస్సింగ్‌లో టాప్‌ అండ్‌ బాటమ్‌ బ్లాక్‌ డ్రెస్‌ ఎప్పుడూ పవర్‌ఫుల్‌ గానూ, కాన్ఫిడెంట్‌గానూ కనిపిస్తుంది. బ్లాక్‌ స్కర్ట్‌ మీదకు అదే రంగు టీ షర్ట్‌ ధరించడం వల్ల లుక్‌ ఆకర్షణీయంగా మారింది.

 బ్రౌన్‌ కలర్‌ లెహంగా మీద మల్టీకలర్‌ హ్యాండ్‌ ఎంబ్రాయిడరీ గ్రాండ్‌గా మారింది. లెహంగా కలర్‌ నెటెడ్‌ దుపట్టా, చాక్లెట్‌ కలర్‌ ప్లెయిన్‌ బ్లౌజ్‌ జత చేయడంతో వేడుకలో క్లాస్‌ లుక్‌ వచ్చేసింది. 

ప్రింటెడ్‌ జార్జెట్‌ మెటీరియల్‌తో రూపుదిద్దుకున్న లాంగ్‌ స్లీవ్స్, ఫ్లోర్‌ లెంగ్త్‌ గౌన్‌ ఇది. పాశ్చాత్య వేడుకలకు, క్యాజువల్‌ మీటింగ్స్‌లో ఈ స్టైల్‌ అట్రాక్ట్‌ చేస్తుంది. ఓపెన్‌ స్లీవ్స్, లేస్‌ డిజైన్‌ మరింత ఆకర్షణీయంగా మారింది.

ప్యాచ్, ఎంబ్రాయిడరీ వర్క్‌తో తీర్చిదిద్దిన లాంగ్‌ స్కర్ట్‌ సంప్రదాయాన్ని చూపుతుంది. డిజైనర్‌ బ్లౌజ్‌ స్టైల్‌ని వైబ్రెంట్‌గా మార్చింది. టాప్, బాటమ్‌లలో ఇలా ఏదో ఒక వెస్ట్రన్‌ టచ్‌ జత చేస్తే పార్టీలో హైలైట్‌ అవ్వాల్సిందే!

ఇది మల్టీకలర్‌ సింగిల్‌ పీస్‌ మ్యాక్సీ డ్రెస్‌. కింది భాగం హెచ్చుతగ్గులుగా, ఎక్కువ ఫ్రిల్స్‌గా రావడంతో ఈ డ్రెస్‌ ఆకట్టుకునేలా మారింది. సింపుల్‌ గెట్‌ టుగెదర్స్‌కి స్టైలిష్‌ డ్రెస్‌గా కితాబులను అందజేస్తుంది.

ప్లెయిన్‌ రెడ్‌ జార్జెట్‌ శారీకి అంచు, పల్లూను గ్రాండ్‌గా ఎంబ్రాయిడరీ చేశారు. అక్కడక్కడా జరీబుటీను జత చేశారు. అంచు రంగు బెనారస్‌ బ్లౌజ్‌ను ధరించడంతో ప్రత్యేకంగా కనిపిస్తోంది.

మోకాలికి మీదుగా ఉండే ఈ వైట్‌ ఫ్రాక్‌ను భుజం మీదుగా అమర్చిన ఫ్లవర్‌ డిజైన్, బాటమ్‌ అంచులలో ఉండే వ్యత్యాసం అందంగా మార్చింది. పాశ్చాత్య పార్టీలకు ఈ తరహా డ్రెస్సింగ్‌ బాగా నప్పుతుంది.

భార్గవి కూనమ్‌
డిజైనర్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement