కత్రినా కైఫ్‌ చేతికి నల్లటి ప్యాచ్‌ .. బాలీవుడ్‌ బ్యూటీకి ఏమైంది? | Katrina Kaif Sports A Black Patch On Her Arm At Airport | Sakshi
Sakshi News home page

కత్రినా కైఫ్‌ చేతికి నల్లటి ప్యాచ్‌ .. బాలీవుడ్‌ బ్యూటీకి ఏమైంది?

Published Sun, Oct 6 2024 10:18 AM | Last Updated on Sun, Oct 6 2024 11:27 AM

Katrina Kaif Sports A Black Patch On Her Arm At Airport

బాలీవుడ్‌ బ్యూటీ కత్రినా కైఫ్‌కి ఏమైంది? ఆమె చేతికి ఉన్న నల్లటి ప్యాచ్‌ ఏంటి? అనేదానిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. చీరకట్టులో ఇటీవల ఎయిర్‌ పోర్టులో కనిపించిన కత్రినాని తమ కెమెరాల్లో బంధించేందుకు ఫొటోగ్రాఫర్లు పోటీపడ్డారు. వారి ఉత్సాహం చూసిన ఆమె కూడా ఫొటోలకు తనదైన శైలిలో పోజులిచ్చారు. ఈ క్రమంలోనే ఆమె కుడి చేతికి ఉన్న నల్లటి ప్యాచ్‌ అందరి దృష్టినీ ఆకర్షించింది. దానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు వైరల్‌గా మారాయి.

ఆమె చేతికున్న ప్యాచ్‌పై కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కత్రినా ఆరోగ్యానికి ఏమైంది? ఏదైనా అనారోగ్య సమస్య వచ్చిందా? అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే రక్తంలో చక్కెర స్థాయిలను పర్యవేక్షించడానికి ఉపయోగించే డయాబెటిస్‌ ప్యాచ్‌ అయి ఉంటుందని తెలుస్తోంది. నిరంతర గ్లూకోజ్‌ మానిటర్లు అని కూడా పిలిచే ఇలాంటి ప్యాచ్‌లను మధుమేహం (షుగర్‌) ఉండే వ్యక్తులు పెట్టుకుంటారట. ఇది పెట్టడం వల్ల చేతి వేలును సూదితో గుచ్చి రక్త పరీక్ష చేసుకునే అవసరం ఉండదనీ, రోజంతా గ్లూకోజ్‌ స్థాయిలను ట్రాక్‌ చేయడంలో ఈ ప్యాచ్‌ ఉపయోగపడుతుందని సమాచారం. ఇక ఆ బ్లాక్‌ ప్యాచ్‌ ఆల్ట్రాహుమాన్‌ వంటి ఫిట్‌నెస్‌ ట్రాకర్‌ కావచ్చు.. ఇది బ్లడ్‌ షుగర్, హార్ట్‌ బీట్‌ రేటు, నిద్ర విధానాలను కూడా పర్యవేక్షిస్తుందంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. మరి.. కత్రినా చేతికి ఉన్న ఆ నల్లటి ప్యాచ్‌ ఎందుకు? అనేది ఆమె చెబితేనే తెలుస్తుంది.  

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement