Patch
-
కత్రినా కైఫ్ చేతికి నల్లటి ప్యాచ్ .. బాలీవుడ్ బ్యూటీకి ఏమైంది?
బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్‌కి ఏమైంది? ఆమె చేతికి ఉన్న నల్లటి ప్యాచ్ ఏంటి? అనేదానిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. చీరకట్టులో ఇటీవల ఎయిర్ పోర్టులో కనిపించిన కత్రినాని తమ కెమెరాల్లో బంధించేందుకు ఫొటోగ్రాఫర్లు పోటీపడ్డారు. వారి ఉత్సాహం చూసిన ఆమె కూడా ఫొటోలకు తనదైన శైలిలో పోజులిచ్చారు. ఈ క్రమంలోనే ఆమె కుడి చేతికి ఉన్న నల్లటి ప్యాచ్ అందరి దృష్టినీ ఆకర్షించింది. దానికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు వైరల్‌గా మారాయి.ఆమె చేతికున్న ప్యాచ్‌పై కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కత్రినా ఆరోగ్యానికి ఏమైంది? ఏదైనా అనారోగ్య సమస్య వచ్చిందా? అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే రక్తంలో చక్కెర స్థాయిలను పర్యవేక్షించడానికి ఉపయోగించే డయాబెటిస్ ప్యాచ్ అయి ఉంటుందని తెలుస్తోంది. నిరంతర గ్లూకోజ్ మానిటర్లు అని కూడా పిలిచే ఇలాంటి ప్యాచ్‌లను మధుమేహం (షుగర్) ఉండే వ్యక్తులు పెట్టుకుంటారట. ఇది పెట్టడం వల్ల చేతి వేలును సూదితో గుచ్చి రక్త పరీక్ష చేసుకునే అవసరం ఉండదనీ, రోజంతా గ్లూకోజ్ స్థాయిలను ట్రాక్ చేయడంలో ఈ ప్యాచ్ ఉపయోగపడుతుందని సమాచారం. ఇక ఆ బ్లాక్ ప్యాచ్ ఆల్ట్రాహుమాన్ వంటి ఫిట్నెస్ ట్రాకర్ కావచ్చు.. ఇది బ్లడ్ షుగర్, హార్ట్ బీట్ రేటు, నిద్ర విధానాలను కూడా పర్యవేక్షిస్తుందంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. మరి.. కత్రినా చేతికి ఉన్న ఆ నల్లటి ప్యాచ్ ఎందుకు? అనేది ఆమె చెబితేనే తెలుస్తుంది. -
సముద్రపు దొంగల ఒంటికన్ను సీక్రెట్ ఇదే..!
సముద్రపు దొంగలకు సంబంధించిన కథలు ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి. చాలామంది ఈ కథలంటే చెవికోసుకుంటారు. ఈ కథలకు దశాబ్ధాల చరిత్ర ఉంది. సముద్రపు దొంగల చిత్రాలు కూడా ఎంతో విచిత్రంగా ఉంటాయి. వీరు టోపీ ధరించడంతోపాటు నల్లని ప్యాంటు వేసుకోవడాన్ని మనం గమనించే ఉంటాం. ముఖ్యంగా ముఖానికి ఒక పట్టీ ఉంటుంది. అది ఒక కంటిని కప్పివేస్తూ ఉంటుంది. దీని వెనుక అనేక కథనాలు ఉన్నాయి. ఆ కామెడీ టీవీ సిరీస్‌లో.. దీనిని ఫ్యాషన్ అని కొందరు చెబుతుంటారు. కొన్ని కథలలో ఆ సముద్రపు దొంగకు ఒక కంటికి గాయమయ్యిందని, లేదా ఆ కన్ను లేదని అందుకే అలా పట్టీ కట్టుకున్నట్లు చెబుతారు. స్పాంజ్‌బాబ్ స్క్వేర్ప్యాంట్లు అనే అమెరికన్ కామెడీ టీవీ సిరీస్‌లోని సముద్రపు దొంగ పాత్రకు చిన్నప్పటి నుంచి ఒక కన్నువుండదు. దీంతో అతను తన కంటికి పట్టీ కట్టుకుంటాడు. అయితే సముద్రపు దొంగల పాత్రలన్నింటికీ కంటికి పట్టీ ఉండదు. పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్ మూవీ సిరీస్‌లోని సముద్రపు దొంగల కంటికీ పట్టీ ఉండదు. స్ఫూర్తిగా నిలిచిన క్యారెక్టర్ అరేబియా గల్ఫ్‌లో రహ్మాహ్ ఇబ్న్ జాబిర్ అల్-జల్హామీ అనే సముద్రపు దొంగ తన దృష్టిని ఒకే చోట నిలిపి ఉండాలనే ఉద్దేశంలో ఒక కంటికి గంతలు కట్టుకునేవాడని చెబుతారు. ఈ తరహా పాత్రలు, చిత్రాలను సృష్టించడానికి చిత్రకారులు.. రహ్మాహ్ ఇబ్న్ జాబిర్ అల్-జల్హామీను ప్రేరణగా తీసుకుని ఉండవచ్చని చెబుతారు. శాస్త్రీయ కోణంలో.. శాస్త్రీయంగా చూస్తే మన కళ్ళు అకస్మాత్తుగా చీకటి లేదా కాంతిని చూడాల్సి వచ్చినప్పుడు అవి సర్దుబాటు చేయడానికి ప్రయత్నిస్తాయి. అకస్మాత్తుగా చీకటి పడినప్పుడు, మన కంటిలోని కనుబొమ్మ విస్తరిస్తుంది. తద్వారా ఎక్కువ కాంతి లోపలికి ప్రవేశిస్తుంది. కానీ ఆ కాంతి చీకటిలో చూడటానికి సరిపోదు. అప్పుడు రోడాప్సిన్ అనే రసాయనం విచ్ఛిన్నమై మన మెదడుకు నరాల ద్వారా సందేశాలను పంపుతుంది. అప్పుడు మసక చీకటిలో కూడా కళ్లు కొంతమేరకు చూడగలుగుతాం. సముద్రపు దొంగలు చీకటిలో చూసేందుకు ఒక కంటిని, వెలుతురులో చూసేందుకు మరో కంటిని సిద్ధంగా ఉంచుతారట. సముద్రపు దొంగలు ఒక కంటికి పట్టీ కట్టడంవలన మసక చీకటిలో వారు సరిగ్గా చూడటానికి ఎక్కువసేపు వేచి ఉండాల్సిన అవసరం ఉండదట. మసక చీకటిలో చూసేందుకు వారు ఒక కంటికి ఉన్న పట్టీని తొలగించి, దానిని మరొక కంటికి దానిని అమరుస్తారుట. ఇది కూడా చదవండి: ‘అయ్యా.. నేను బతికే ఉన్నాను.. డెత్ సర్టిఫికెట్ ఇప్పించండి’ -
ప్రధాని నమ్మకంపై దెబ్బకొట్టాడు! ఇక అతనితో పొత్తు పెట్టుకోం!
బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌పై ఆ రాష్ట్ర బిజేపీ చీఫ్ సంజయ్ జైస్వాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. అతనితో పోత్తుకు ఆస్కారమే లేదని కరాఖండీగా చెప్పారు. తమ కార్యకర్తలకు కూడా ఈ విషయాన్ని స్పష్టం చేసినట్లు చెప్పారు. నార్త్ బీహార్ జిల్లా దర్భంగాలో రెండు రోజుల పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ముగిసిన తదుపరి జైస్వాల్ ఈ వ్యాఖ్యలు చేశారు. నితీష్‌కు ఒక పెండ్యులమ్ మాదిరి ఊగిసలాడే అలవాటు ఉందని ఎద్దేవా చేశారు. అతనికి మళ్లీ మోసం చేసే అవకాశం ఇవ్వమని చెప్పారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్న నితీష్ పార్టీ జేడీయూ ఆ తదనంతరం అతని ఆర్జేడీ మహాఘట్‌బంధన్‌తో పోత్తు పెట్టుకుని మరీ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. నితీశ్‌కు సరైన ప్రజాదరణ లేనందువల్లే 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కవ సంఖ్యలో సీట్లను గెలుపించుకోలేకపోయిందని అన్నారు. వాస్తవానికి ఆ ఎన్నికల్లో బీజేపీ ఏ అధిక స్థానాలను గెలుచుకుందన్నారు. కానీ ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానానికి కట్టుబడి ఉదారతను చూపిస్తే..కూమార్ మరోసారి సీఎం పదవిని చేపట్టి ఆస్వాదించగలిగారు. ఐతే ఆయన తనకు అలవాటైన ద్రోహం అనే అస్త్రంతో తమ నమ్మకాన్ని వమ్ము చేశాడని ఆరోపణలు చేశారు. కాగా నితిశ్ కుమార్ మాజీ సన్నిహితుడు ఆర్సీపీ సాయంతో జేడీయూని చీల్చేందుకు యత్నిస్తుందంటూ బీజేపీని దుయ్యబట్టారన్నారు. అలాగే చిరాగ్ పాశ్వాన్ లోక్ జనశక్తి పార్టీ జేడీయూకి వ్యతిరేకంగా బీజేపీ పార్టీ తిరుగుబాటుదారులను నిలబెట్టి..అసెంబ్లీ ఎన్నికల్లో విధ్వంసానికి పాల్పడిందంటూ జేడీయూ పార్టీ ఆరోపణలు చేసిందన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలనే కృత లక్ష్యంతో ఉందని పునరుద్ఘాటించారు. అలాగే ఈరోజు నితీష్ గురువు జార్జ్ ఫెర్నాండెజ్ జన్మదినం. నిజానికి నితీశ్‌్ అతన్ని కూడా మోసం చేయడానికి వెనుకాడడు, ఎవరినైనా మోసం చేయగలడు అదే అతని నైజం అంటూ జైశ్వాల్ నితీశ్ విమర్శలతో విరుచుకుపడ్డారు. (చదవండి: రాహుల్.. ప్రధాని మోదీ వల్లే అంత ప్రశాంతంగా జెండా ఎగరేశావ్!’) -
ప్యాచ్ వర్క్‌తో... మ్యాచ్ వర్క్!
రీయూజ్ గుజరాతీ, రాజస్థాన్ వాల్ హ్యాంగింగ్స్ చాలా కళాత్మకంగా ఉంటాయి. వీటిని ఇళ్లలో గోడల మీద అలంకరించుకుంటాం. అలాగే హోటల్స్ పెద్ద పెద్ద గోడల మీద అలంకరించి ఉండటం మనం చూస్తుంటాం. ఈ ప్రాంతానికే ప్రత్యేకమైన హ్యాండ్ ఎంబ్రాయిడరీ వర్క్చేసిన బెడ్ కవర్స్ కూడా చాలా అందంగా ఉంటాయి. గోడల మీద, బెడ్ మీద మాత్రమే కాకుండా ఈ ఫ్యాబ్రిక్‌ను బేస్‌గా తీసుకొని కొత్తరకం డిజైనరీ డ్రెస్సులను మనకు మనంగానే రూపొందించుకోవచ్చు. ప్యాచ్‌ల మాయాజాలం గుజరాతీ ప్యాచ్‌వర్క్ ఎంబ్రాయిడరీకి రంగురంగుల కాటన్ ప్యాబ్రిక్స్ను ఎంచుకుంటారు. వీటిని మందపాటి రంగుదారంతో కలిపి కుడతారు. అలాగే అద్దాలను, పూసలను ఉపయోగించి చేసిన అల్లికలు కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ ప్యాచ్‌కి వెనకాల లైనింగ్‌గా మరో కాటన్ మెటీరియల్కూడా వాడతారు. దీంతో ఈ మెటీరియల్ చాలా స్టిఫ్‌గా ఉంటుంది. వీటితో మోడ్రన్ జాకెట్స్, సంప్రదాయ స్కర్ట్స్, టాప్స్ డిజైన్ చేసుకోవచ్చు. బేస్ డిజైన్ జాకెట్ లేదా స్కర్ట్, షల్వార్.. కి మొత్తం ఇదే ఫ్యాబ్రిక్‌ను వాడాల్సిన అవసరం లేదు. చేతులకు లేదా అంచులకు ఈ ఫ్యాబ్రిక్‌ను వాడితే కొత్తగా, చాలా అందంగా మీ డ్రెస్ మారిపోతుంది. హ్యాంగింగ్స్, బెడ్ కవర్స్ కొన్నాళ్లు వాడాక వీటిని తీసేయాలనుకుంటే ఆ డిజైన్స్‌లో కొంత భాగాన్ని ఇలా ప్యాచులుగా తీసుకొని డ్రెస్సులకు వేసుకోవచ్చు. - మంగారెడ్డి, ఫ్యాషన్ డిజైనర్