ప్యాచ్ వర్క్‌తో... మ్యాచ్ వర్క్!
రీయూజ్
గుజరాతీ, రాజస్థాన్ వాల్ హ్యాంగింగ్స్ చాలా కళాత్మకంగా ఉంటాయి. వీటిని ఇళ్లలో గోడల మీద అలంకరించుకుంటాం. అలాగే హోటల్స్ పెద్ద పెద్ద గోడల మీద అలంకరించి ఉండటం మనం చూస్తుంటాం. ఈ ప్రాంతానికే ప్రత్యేకమైన హ్యాండ్ ఎంబ్రాయిడరీ వర్క్‌చేసిన బెడ్ కవర్స్ కూడా చాలా అందంగా ఉంటాయి. గోడల మీద, బెడ్ మీద మాత్రమే కాకుండా ఈ ఫ్యాబ్రిక్‌ను బేస్‌గా తీసుకొని కొత్తరకం డిజైనరీ డ్రెస్సులను మనకు మనంగానే రూపొందించుకోవచ్చు.
ప్యాచ్‌ల మాయాజాలం
గుజరాతీ ప్యాచ్‌వర్క్ ఎంబ్రాయిడరీకి రంగురంగుల కాటన్ ప్యాబ్రిక్స్‌ను ఎంచుకుంటారు. వీటిని మందపాటి రంగుదారంతో కలిపి కుడతారు. అలాగే అద్దాలను, పూసలను ఉపయోగించి చేసిన అల్లికలు కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ ప్యాచ్‌కి వెనకాల లైనింగ్‌గా మరో కాటన్ మెటీరియల్‌కూడా వాడతారు. దీంతో ఈ మెటీరియల్ చాలా స్టిఫ్‌గా ఉంటుంది. వీటితో మోడ్రన్ జాకెట్స్, సంప్రదాయ స్కర్ట్స్, టాప్స్ డిజైన్ చేసుకోవచ్చు.
బేస్ డిజైన్
జాకెట్ లేదా స్కర్ట్, షల్వార్.. కి మొత్తం ఇదే ఫ్యాబ్రిక్‌ను వాడాల్సిన అవసరం లేదు. చేతులకు లేదా అంచులకు ఈ ఫ్యాబ్రిక్‌ను వాడితే కొత్తగా, చాలా అందంగా మీ డ్రెస్ మారిపోతుంది. హ్యాంగింగ్స్, బెడ్ కవర్స్ కొన్నాళ్లు వాడాక వీటిని తీసేయాలనుకుంటే ఆ డిజైన్స్‌లో కొంత భాగాన్ని ఇలా ప్యాచులుగా తీసుకొని డ్రెస్సులకు వేసుకోవచ్చు.
- మంగారెడ్డి, ఫ్యాషన్ డిజైనర్