
సముద్రపు దొంగలకు సంబంధించిన కథలు ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి. చాలామంది ఈ కథలంటే చెవికోసుకుంటారు. ఈ కథలకు దశాబ్ధాల చరిత్ర ఉంది. సముద్రపు దొంగల చిత్రాలు కూడా ఎంతో విచిత్రంగా ఉంటాయి. వీరు టోపీ ధరించడంతోపాటు నల్లని ప్యాంటు వేసుకోవడాన్ని మనం గమనించే ఉంటాం. ముఖ్యంగా ముఖానికి ఒక పట్టీ ఉంటుంది. అది ఒక కంటిని కప్పివేస్తూ ఉంటుంది. దీని వెనుక అనేక కథనాలు ఉన్నాయి.
ఆ కామెడీ టీవీ సిరీస్‌లో..
దీనిని ఫ్యాషన్ అని కొందరు చెబుతుంటారు. కొన్ని కథలలో ఆ సముద్రపు దొంగకు ఒక కంటికి గాయమయ్యిందని, లేదా ఆ కన్ను లేదని అందుకే అలా పట్టీ కట్టుకున్నట్లు చెబుతారు. స్పాంజ్బాబ్ స్క్వేర్ప్యాంట్లు అనే అమెరికన్ కామెడీ టీవీ సిరీస్‌లోని సముద్రపు దొంగ పాత్రకు చిన్నప్పటి నుంచి ఒక కన్నువుండదు. దీంతో అతను తన కంటికి పట్టీ కట్టుకుంటాడు. అయితే సముద్రపు దొంగల పాత్రలన్నింటికీ కంటికి పట్టీ ఉండదు. పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్ మూవీ సిరీస్‌లోని సముద్రపు దొంగల కంటికీ పట్టీ ఉండదు.
స్ఫూర్తిగా నిలిచిన క్యారెక్టర్
అరేబియా గల్ఫ్‌లో రహ్మాహ్ ఇబ్న్ జాబిర్ అల్-జల్హామీ అనే సముద్రపు దొంగ తన దృష్టిని ఒకే చోట నిలిపి ఉండాలనే ఉద్దేశంలో ఒక కంటికి గంతలు కట్టుకునేవాడని చెబుతారు. ఈ తరహా పాత్రలు, చిత్రాలను సృష్టించడానికి చిత్రకారులు.. రహ్మాహ్ ఇబ్న్ జాబిర్ అల్-జల్హామీను ప్రేరణగా తీసుకుని ఉండవచ్చని చెబుతారు.
శాస్త్రీయ కోణంలో..
శాస్త్రీయంగా చూస్తే మన కళ్ళు అకస్మాత్తుగా చీకటి లేదా కాంతిని చూడాల్సి వచ్చినప్పుడు అవి సర్దుబాటు చేయడానికి ప్రయత్నిస్తాయి. అకస్మాత్తుగా చీకటి పడినప్పుడు, మన కంటిలోని కనుబొమ్మ విస్తరిస్తుంది. తద్వారా ఎక్కువ కాంతి లోపలికి ప్రవేశిస్తుంది. కానీ ఆ కాంతి చీకటిలో చూడటానికి సరిపోదు. అప్పుడు రోడాప్సిన్ అనే రసాయనం విచ్ఛిన్నమై మన మెదడుకు నరాల ద్వారా సందేశాలను పంపుతుంది. అప్పుడు మసక చీకటిలో కూడా కళ్లు కొంతమేరకు చూడగలుగుతాం. సముద్రపు దొంగలు చీకటిలో చూసేందుకు ఒక కంటిని, వెలుతురులో చూసేందుకు మరో కంటిని సిద్ధంగా ఉంచుతారట. సముద్రపు దొంగలు ఒక కంటికి పట్టీ కట్టడంవలన మసక చీకటిలో వారు సరిగ్గా చూడటానికి ఎక్కువసేపు వేచి ఉండాల్సిన అవసరం ఉండదట. మసక చీకటిలో చూసేందుకు వారు ఒక కంటికి ఉన్న పట్టీని తొలగించి, దానిని మరొక కంటికి దానిని అమరుస్తారుట.
ఇది కూడా చదవండి: ‘అయ్యా.. నేను బతికే ఉన్నాను.. డెత్ సర్టిఫికెట్ ఇప్పించండి’
Comments
Please login to add a commentAdd a comment