secreat
-
బరువు తగ్గాలనుకుంటున్నారా? మీరు ఊహించని, బ్రహ్మాండమైన చిట్కా!
ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం ఇలా ఏదైనా సరే.. చకా చకా పది నిమిషాల్లో పూర్తి చేసేయడం మీకు అలవాటా? నిదానంగా, నెమ్మదిగా తినే టైం లేదంటూ ఏ పూటకాపూట భోజనాన్ని హడావిడిగా లాగించేస్తుంటారా? అయితే మీరీ విషయాన్ని తెలుసుకోవాల్సిందే. పని ఒత్తిడి, సమయం లేకపోవడమో, కారణంగా ఏదైనా గానీ వేగంగా ఆహారం తింటే బరువు పెరగడంతోపాటు, అనేక ఇతర సమస్యలు తప్పవంటున్నారు నిపుణులు. మనం తినే ఆహారంలోని పోషకాలు శరీరానికి పూర్తిగా అందాలన్నా, చక్కగా జీర్ణం కావాలన్నా ఆహారాన్ని బాగా నమిలి తినాలి. ఆహారం నమల కుండా మింగటం వల్ల ఆహారం జీర్ణం కాక జీర్ణక్రియ సమస్యలు, మలబద్దక సమస్యలు తలెత్తుతాయి. అంతేకాదు తొందర, తొందరగా భోజనం చేసే వారిలో షుగర్ లెవెల్స్ పెరిగి, మధుమేహం, ఊబకాయం సమస్య వచ్చే ప్రమాదం కూడా పొంచి ఉంది. నెమ్మదిగా తినడం మీరు ఊహంచలేని ఎక్కువ ప్రయోజనాలనే అందిస్తుంది. అధిక బరువు, దాని వల్ల వచ్చే ప్రమాదాలు తగ్గుతాయి. జీర్ణ రసాలు సరిగ్గా విడుదలయ్యేందుకు సాయ పడుతుంది. ఆహారంలోని అన్ని పోషకాలు శరీరానికి అందేలా చేస్తుంది. ఫలితంగా, ఆరోగ్యకరమైన, సంతోషకరమైన బాడీ మన సొంతమతుందిబరువు తగ్గడం: బరువు తగ్గించుకునే క్రమంలో డైటింగ్, వ్యాయామం మాత్రమే కాదు. మనం పెద్దగా పట్టించుకోని అంశం ఏమిటంటే ఆహారాన్ని సరిగ్గా నమలడం. దీంతో మన లక్ష్యంలో మరి కొన్ని కేజీల బరువు తగ్గవచ్చు. అవును, మీరు చదివింది నిజమే.నెమ్మదిగా తినడం అంటే క్యాలరీల వినియోగాన్ని నియంత్రించడమే. దీని వలన జీర్ణక్రియ మెరుగుపడి పోషకాల శోషణను మెరుగుపరుస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి.బరువు తగ్గడంలో నమలడం ఎలా సహాయపడుతుంది?ఆహారాన్ని సరిగ్గా నమలడం జీర్ణక్రియ సక్రమంగా జరగడం మమాత్రమే కాదు , డా మెదడుకు ఆకలి , సంపూర్ణతను ప్రభావితం చేసే సంకేతాలను పంపుతుంది. నిదానంగా , పూర్తిగా నమిలే వ్యక్తులు తక్కువ తినడానికి ఇష్టపడతారని అధ్యయనాలు నిరూపించాయి. ఇది కాలక్రమేణా బరువు తగ్గడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అపెటైట్ జర్నల్‌లో ప్రచురించబడిన ఒక అధ్యయనం ప్రకారం, ప్రతీ ముద్దను 40 సార్లు నమిలిన పాల్గొనేవారు 15 సార్లు మాత్రమే నమిలే వారితో పోలిస్తే 12 శాతం తక్కువ కేలరీలు వినియోగిస్తారు. ఆకలిని నియంత్రించే గ్రెలిన్ అనే హార్మోన్, సంతృప్తిని నియంత్రించే లెప్టిన్ హార్మోన్. ఎంత ఎక్కువ నమలితే, అంత అతిగా తినడాన్ని అడ్డుకుంటాయి. ఫలితంగా కడుపు నిండిన భావన తొందరగా కలుగుతుంది.మైండ్‌ఫుల్ ఈటింగ్ అకాడెమీ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ డైటెటిక్స్ జర్నల్‌లో ప్రచురించినదాని ప్రకారం శ్రద్ధగా ఆహారాన్ని నమలడం, ఇష్టపూర్వకంగా ఆస్వాదించడం చాలా అవసరం. ఉరుగుల ప్రపంచంలో స్థిమితంగా కూచొని నాలుగుముద్దలు తినే పరిస్థితి కరువవుతోంది. అందుకే చాలా మంది గబా గబా ఇంత లాగించేసి ఆఫీసులకు పరుగులుతీస్తారు. మరికొంతమంది ప్రయాణంలోనో, టీవీ చూస్తూనో, ఫోన్, కంప్యూటర్ చూస్తూనో తింటే, పరధ్యానంలో నియంత్రణ లేకుండానే ఎక్కువ తినేస్తారు. ఇలా చేయడం వల్ల అజీర్ణం, అసౌకర్యం, ఉబ్బరం లాంటి సమస్యలొస్తాయి. నమిలి తినడం వల్ల బరువు తగ్గే క్రమంలో తీసుకునే ఆహారం, కేలరీల మీద శ్రద్ద పెరుగుతుంది. దీంతో మనం అనుకున్నదాని ప్రకారం బరువు తగ్గడం, స్లిమ్‌గా మారడం మరింత సులవవుతుంది. మరో ప్రయోజనం ఒత్తిడి తగ్గుతుంది. ఆహారాన్ని జాగ్రత్తగా నమలడం వల్ల పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది. -
బీథోవెన్ డీఎన్ఏలో అంతుచిక్కని రహస్యాలు?
జర్మనీకి చెందిన అలనాటి స్వరకర్త లుడ్విగ్ వాన్ బీథోవెన్ సింఫనీ, పియానో, వయెలెన్ మొదలైన వాటితో మ్యూజిక్ కంపోజ్ చేయడంలో ఎంతో పేరొందారు. తాజాగా ఆయన జుట్టు నుంచి సేకరించిన డిఎన్ఏపై జరిపిన విశ్లేషణ అతనికి సంబంధించిన పలు రహస్యాలను వెల్లడించింది. బీథోవెన్ దీర్ఘకాలం పాటు అనారోగ్యంతో బాధపడుతూ 1827లో కన్నుమూశారు. అతను వినికిడి లోపం, కాలేయ వ్యాధి, ఉదర సంబంధిత వ్యాధులు, అతిసారంతో బాధపడ్డాడు. బీథోవెన్ తన చివరి రోజుల్లో తన మూలాల గురించి జనానికి సవివరంగా తెలియజేయమని తన సోదరులను కోరారు. డీఎన్ఏ విశ్లేషణ కోసం.. జర్మనీ, యూకేల నుండి వచ్చిన పరిశోధకుల బృందం బీథోవెన్ జుట్టుకు సంబంధించిన డీఎన్ఏను విశ్లేషించింది. బీథోవెన్ డీఎన్ఏని అతని బంధువులుగా భావిస్తున్నవారి డీఎన్ఏతో సరిపోల్చారు. అలాగే అతని ఇప్పుటి బంధువులు ఎవరో తెలుసుకునేందుకు పలు రికార్డులను కూడా పరిశీలించారు. హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్తో మృతి బీథోవెన్ జుట్టు నమూనాలలో ఒకటి బీథోవెన్కి చెందినది కాదని, గుర్తు తెలియని మహిళ నుండి వచ్చినదని పరిశోధకులు కనుగొన్నారు. బీథోవెన్ మరణం బహుశా హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ వల్ల సంభవించి ఉండవచ్చునని కూడా వారు కనుగొన్నారు. హెపటైటిస్ వ్యాధి అతని కాలేయాన్ని దెబ్బతీసింది. ఇతర అవయవాల పనితీరుపై ప్రభావం చూపింది. బీథోవెన్ విషప్రయోగం వల్ల మరణించారనే మునుపటి నమ్మకానికి విరుద్ధమైన ఫలితం వచ్చింది. తండ్రులు వేరా? బీథోవెన్కు చెందిన ‘వై’ క్రోమోజోమ్ అతని తండ్రి తరపు బంధువులతో సరిపోలడం లేదని పరిశోధకులు కనుగొన్నారు. అతని వంశవృక్షంలో తండ్రులు వేరుగా ఉండే అవకాశం ఉందని ఉందని కూడా వారు తెలిపారు. అంటే అతని పూర్వీకులలో ఒకరు వారి వంశానికి చెందిన తండ్రి కాకుండా వేరే వ్యక్తి అయివుంటాడని, అతని ద్వారా బీథోవెన్ జన్మించి ఉండవచ్చని కూడా పరిశోధకులు చెబుతున్నారు. -
రోబో కంటికి అబ్బురపరచే పిరమిడ్ రహస్యాలు!
ఈజిప్టులోని గిజాలో గల గ్రేట్ పిరమిడ్ లోపల ఏముందో మనకు తెలియజేసేందుకు ఒక రోబోట్ దాని లోపలికి ప్రవేశించి పలు రహస్యాలను బయటపెట్టింది. మానవీయంగా సాధ్యమయ్యే దానికంటే ఈ రోబో ఇప్పుడు అనేక కొత్త ఆవిష్కరణలను మనముందుకు తీసుకుచ్చింది. ఒక ఆధునిక రోబో గ్రేట్ పిరమిడ్లోకి వెళ్లడం ద్వారా పురాతన నాగరికతపై నూతన విండోను సమర్థవంతంగా తెరిచింది. గ్రేట్ పిరమిడ్.. అంటే అతిపెద్ద ఈజిప్షియన్ పిరమిడ్. కైరో శివార్లలోని ఈ పిరమిడ్ ఈ ప్రాంతాన్ని పరిపాలించిన రాజవంశంలోని నాలుగవ పాలకుడు ఫారో ఖుఫు సమాధి అని చెబుతుంటారు. ఈ పిరమిడ్ సుమారు 4,500 ఏళ్ల క్రితం నిర్మితమయ్యిందని చరిత్ర చెబుతోంది. ప్రపంచంలోని ఏడు వింతలలో ఒకటిగా పేరొందిన ఈపిరమిడ్ చాలా వరకు చెక్కుచెదరకుండా ఉంది. తాజాగా క్వీన్స్ ఛాంబర్‌కు చెందిన పురావస్తు శాస్త్రవేత్తలు.. తమ తవ్వకాలతో గ్రేట్ పిరమిడ్ ఆఫ్ గిజా అన్వేషణ దిశగా ముందుకుసాగారు. తమ తవ్వకాల ద్వారా వారు పిరమిడ్లోకి 40-డిగ్రీల కోణంలో పైకి చేరుకోలేకపోయారు. దీంతో వారి అన్వేషణకు పెద్ద ఆటంకం ఏర్పడింది. అయితే లీడ్స్‌లోని రోబోటిక్స్ ప్రొఫెసర్ రాబ్ రిచర్డ్సన్, అతని బృందం 2010లో ఈ సవాలును స్వీకరించారు. హాంకాంగ్ దంతవైద్యుడు, పరిశోధకుడు డాక్టర్ ట్జే చుయెన్గ్ పిరమిడ్‌లోని షాఫ్ట్ను నావిగేట్ చేయడానికి. పిరమిడ్లోపలి పైభాగానికి చేరుకోవడానికి ఎవరైనా రోబోట్‌ను డిజైన్ చేస్తే బాగుంటుందని భావించాడు. ఎట్టకేలకు యూకేకి చెందిన శాస్త్రవేత్త దాదాపు ఐదు సంవత్సరాల కృషితో అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి రోబోను రూపొందించారు. పరిశోధనల్లో పాల్గొన్న ప్రొఫెసర్ రిచర్డ్సన్ మాట్లాడుతూ పిరమిడ్ లోనికి ప్రవేశించే రోబో చాలా తేలికగా ఉండాలనే ఉద్దేశంతో దానిని ఐదు కిలోలకు తగ్గించామన్నారు. తరువాత పాసేజ్వే ద్వారా రోబోట్‌ను సున్నితంగా తరలించే వ్యవస్థను అభివృద్ధి చేశామన్నారు. ఈ రోబో పిరమిడ్ లోపలి భాగానికి ఏమాత్రం నష్టం కలిగించకుండా ప్రత్యేకమైన ఫుటేజ్‌లను అందించింది. పిరమిడ్ లోపలి గదికి సంబంధించిన ఫొటోలను అందించింది. ఈ రోబో కెమెరా ఒక విచిత్రమైన రాయికి సంబంధించిన ఫొటోనుపంపింది. అయితే పిరమిడ్‌లోని షాఫ్ట్ (స్థూపాకారం) ఉద్దేశం ఎవరికీ తెలియదు. ఇది గాలి కోసం ఏర్పాటు చేసిన బిలం కావచ్చని ప్రొఫెసర్ రిచర్డ్సన్ వివరించారు. ఈ స్థూపాకారంలో 50 మీటర్లు ముందుకుసాగాక ముగింపు దగ్గర తదుపరి యాక్సెస్‌ను నిరోధించడానికి ఒక రాయిని ఉంచారు. ఆ రాయి దేనిని అడ్డుకుంటుందో తమకు అర్థం కాలేదన్నారు. దీని ప్రయోజనం ఏమిటనేది మిస్టరీగా మిగిలిపోయిందని రిచర్డ్సన్ తెలిపారు. కాగా ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్ విలియం వెస్ట్‌వే ఈ చారిత్రాత్మక ప్రాజెక్టపై ఒక సినిమా తీశారు. ఈ సినిమా పురాతన నాగరికతకు చెందిన అనేక అంశాలను వెలుగులోకి తెచ్చింది. రోబోటిక్ ఇంజనీరింగ్ సాయంతో పిరమిడ్‌లోని రహస్యాలు ఎలా వెల్లడయ్యాయో ఈ చిత్రం వెల్లడిస్తుందని వెస్ట్‌వే తెలిపారు. -
ఇజ్రాయెల్ నీలి నక్షత్రం రహస్యం ఏమిటి? వారిని ఎలా కాపాడుతుంది?
ఇజ్రాయెల్ జెండాలో మనకు కనిపించే నీలిరంగు నక్షత్రాన్ని డేవిడ్ నక్షత్రం అని అంటారు. 14వ శతాబ్దం మధ్యకాలం నుండి యూదులు తమ జెండాపై ఈ గుర్తును ఉపయోగించడం మొదలుపెట్టారు. ఇజ్రాయెల్- హమాస్ మధ్య యుద్ధం కారణంగా చాలామంది ఇజ్రాయెల్‌తో పాటు యూదుల గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. ఇందుకోసం వారు ఇంటర్నెట్లో శోధిస్తున్నారు. ఇదేవిధంగా కొందరు జుడాయిజం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. అందుకే ఇప్పుడు మనం ఇజ్రాయెల్ జెండాపై ఉన్న నీలి నక్షత్రం గురించి తెలుసుకుందాం. ఈ గుర్తును ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ గుర్తుతో వారి చరిత్రకు విడదీయరాని అనుబంధం ఉంది. ఇజ్రాయెల్ జెండాలో కనిపించే నీలిరంగు నక్షత్రాన్ని డేవిడ్ నక్షత్రం అని చెబుతారు. 14వ శతాబ్దం నుండి యూదులు ఈ గుర్తును తమ జెండాపై ముద్రిస్తున్నారు. తరువాతి కాలంలో అది యూదుల మత చిహ్నంగా మారింది. దీనితో పాటు 1896 సంవత్సరంలో జియోనిస్ట్ ఉద్యమం ప్రారంభమైనప్పుడు ఈ జెండాను చేతబట్టారు. యూదులు అధికారికంగా 1948, అక్టోబర్ 28న దీనిని ఇజ్రాయెల్ జెండాగా స్వీకరించారు. భూమిపై ప్రళయం వచ్చినప్పుడు ఈ నక్షత్రం తమను కాపాడుతుందని యూదు మతానికి చెందిన ప్రజలు గాఢంగా నమ్ముతారు. అందుకే ఈ నక్షత్రాన్ని డేవిడ్ షీల్డ్ అని కూడా అంటారు. చరిత్రకారులు ఈ నక్షత్రాన్ని 3500 సంవత్సరాల క్రితమే యూదులు స్వీకరించారని భావిస్తారు. హిబ్రూ, ఇజ్రాయెల్ బానిసలు తాము ఈజిప్టు బానిసత్వం నుండి విముక్తి పొందినప్పుడు ఈ నక్షత్రాన్ని స్వీకరించారు. ఈ నక్షత్రాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే అది నక్షత్రం కాదని, రెండు త్రిభుజాల కలయిక అని అనిపిస్తుంది. కిందునున్న త్రిభుజం డేవిడ్ రాజు చిహ్నం అని, పైన కనిపించేది డేవిడ్ పట్టుకున్న డాలు అని చెబుతారు. ఇది కూడా చదవండి: భారత రైతులు ఇజ్రాయెల్‌పై ఎందుకు ఆధారపడుతున్నారు? -
సోషల్ మీడియాలో అన్నీ షేర్ చేసుకుంటున్నారా? మీకంటూ ప్రైవేట్ లైఫ్ లేదా?
ఇంటి గుట్టు లంకకు చేటు అని సామెత. అంటే ఇంట్లో ఉండవలసిన సమాచారాన్ని అవతలి వారికి చేరవేయడం వల్ల అది ఆ ఇంటికంతటికీ అనర్థదాయకం అన్నమాట. జీవితంలో ప్రతి ఒక్కరికి ఎంతో కొంత గోప్యత ఉండాలి. అది పాటించకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. దాన ధర్మాల విషయంలో కూడా కుడి చేతితో చేసిన దానం ఎడమ చేతికి తెలియనివ్వ కూడదనేవారు. మూడోకంటికి తెలియకుండా అని కూడా తరచు వాడేవారు. గోడకు చెవులుంటాయి కనుక కాస్త చూసుకుని మాట్లాడటం మంచిది అనేవారు. జీవితాన్ని కనీసం కొంతవరకైనా గోప్యంగా ఉంచుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసుకుందాం. ఇప్పుడున్నంత ఓపెన్‌గా ఒకప్పుడు ఉండేది కాదు ఏ విషయమైనా. దురదృష్టవశాత్తూ సోషల్ మీడియా చొచ్చుకు వచ్చినప్పటి నుంచి అంతా బహిరంగమే అయిపోయింది. చిన్నవారి నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ తమ జీవితాన్ని పబ్లిక్‌గా మార్చేసుకుంటున్నారు. ప్రతి విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ప్రైవసీని కోల్పోతున్నారు. దానివల్ల చిక్కుల్లో పడుతున్నారు. గోప్యత అంటే..? గోప్యత అంటే ఏదయినా ఒక ముఖ్యమైన సమాచారాన్ని రహస్యంగా ఉంచడం లేదా బహిర్గతం చేయకుండా ఉండటం. గోప్యత అనేది కేవలం ఆ సమాచారాన్ని బయటకు పొక్కకుండా రహస్యంగా ఉంచే చర్య. పాటించడం ఎలా? రహస్య విషయాలను చర్చిస్తున్నప్పుడు ఎవరూ వినలేదని నిర్ధారించుకోండి. పనిని సాధించడానికి అవసరమైన కనీస సమాచారాన్ని మాత్రమే భాగస్వామ్యం చేయండి. కొంతమంది నిపుణులు... వైద్యులు, న్యాయవాదులు, అకౌంటెంట్లతో సహా వారి వృత్తిపరమైన స్థానం ద్వారా వ్యక్తులు లేదా సంస్థల గురించి సమాచారాన్ని పొందుతారు. ఉదాహరణకి వైద్యులకు వారి రోగుల పరిస్థితులు, చికిత్సల వివరాలు తెలుసు ∙న్యాయవాదులకు వీలునామాలు, కోర్టు కేసుల వివరాల గురించి తెలుసు, వాటిలో కొన్ని చట్టం ద్వారా రక్షించబడవచ్చు; ∙ట్యాక్స్ కన్సల్టెంట్లు తమ ఖాతాదారుల పన్ను, ఆదాయం గురించి తెలుసుకుంటారు. ఇవన్నీ తమకు తెలిసినప్పటికీ ఆయా వృత్తి నిపుణులు తరచు వృత్తిపరమైన ప్రవర్తనా నియమావళితో ΄ాటు అధికారిక చట్టపరమైన అవసరాలకు కట్టుబడి ఉంటారు. ఉండాలి కూడా. ఎందుకు అవసరం? మానసిక ఆరోగ్యానికి, వ్యక్తి ఎదుగుదలకు చాలా ముఖ్యమైన వాటిలో గోప్యత కూడా ఒకటి.. ఎవరినైనా విశ్వసించడం లేదా వారికి రహస్యాలు చెప్పడం అనేది గోప్యతను బయట పెట్టుకోవడమే. ఎందుకంటే గోప్యత అంటే రహస్యంగా ఉంచవలసిన సమాచారం. దీనిని బహిరంగ పరచుకోవడం అంటే తమకు తామే నష్టాన్ని కొని తెచ్చుకోవడమే! జీవితాన్ని గోప్యంగా ఉంచుకున్నప్పుడు ఆలోచనలు, భావాలు, అనుభవాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించే అవకాశం లభిస్తుంది. ఇది మన విశ్వాసాన్ని మరింత పెంచుతుంది. మన వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవడానికి సాయపడుతుంది. సమాజంలో గౌరవం లభిస్తుంది! వ్యక్తిగత జీవితాన్ని గోప్యంగా ఉంచుకోవడం వల్ల ప్రశాంతత, స్థిరత్వం లభిస్తాయి. ఇవి మనల్ని మనం అర్థం చేసుకోవడంలో సహాయపడతాయి. మనలోని నెగటివ్ ఆలోచనల నుంచి ఉపశమనం పొందుతాము. ఇది మన మనోధైర్యాన్ని, స్థైర్యాన్ని పెంచి జీవితాన్ని సానుకూలం చేస్తుంది. జీవితాన్ని కాస్తంత గోప్యంగా ఉంచుకున్నప్పుడు మనలోని సున్నితత్వాన్ని మనం అనుభవిస్తాం. దీనివల్ల మన ఆలోచనలు, భావాలు మనతోనే కనెక్ట్ అవుతాయి. ఇది ఇతరుల పట్ల సున్నితంగా వ్యవహరించడానికి సహాయపడుతుంది. మన చుట్టూ ఉన్న వారిని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. వ్యాపారంలో, ఉద్యోగంలో గోప్యత పాటించడం వల్ల స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మన జీవితాన్ని మనమే నిర్ణయించుకోవచ్చు. మనపై ఎవరూ పెత్తనం చెలాయించడానికి అవకాశం ఉండదు. దీనివల్ల ఆత్మవిశ్వాసం బలపడుతుంది. మానసిక ఆరోగ్యం, ఎదుగుదల బాగుంటుంది. గోప్యత లోపించిన మన ప్రార్థనలు, దానధర్మాలు, ఉపవాస దీక్షలు వ్యర్థమే అని చెప్పవచ్చు. అవి ఈనాడు బహిరంగ ప్రచార వేదికలయ్యాయి, వాటివల్ల బోలెడు పేరు ప్రఖ్యాతులైతే వస్తాయేమో కాని వాటి అసలు ఫలాలు, ఆశీర్వాదాలు మాత్రం లభించవు. ఇతరులకు ఒక చేతితో చేసే సహాయం, మరో చేతికి తెలియకూడదని, అదంతా రహస్యంగా జరగాలని మతగ్రంథాల ఆదేశం. మనం మన పొరుగువారికి, పేదలకు చేసే సహాయం లేదా ధర్మం ఎంత రహస్యంగా ఉంటే దానివల్ల దేవుని ఆశీర్వాదాలు మనకు అంత ధారాళంగా ప్రతిఫలంగా లభిస్తాయని బైబిల్ చెబుతుంది. ఇది ఏ మతంలోనైనా వర్తిస్తుంది. చివరగా... గోప్యంగా ఉండమన్నారు కదా అని వైద్యుల వద్దకు వెళ్లినప్పుడు మీ జబ్బులను మాత్రం గోప్యంగా ఉంచకండి. డాక్టర్ల వద్ద అన్నీ చెప్పుకోవడం మంచిది. -
భూమిపై ఎలియన్స్?.. ప్రకంపనలు పుట్టిస్తున్న నిఘా విభాగం మాజీ అధికారి వాదన!
ఇతర గ్రహాల నుండి వచ్చిన మనుషులు మన భూమిపై నివసిస్తున్నారా? గ్రహాంతరవాసుల ఉనికి గురించి ఎప్పటికప్పుడు అనేక వాదనలు వినిపిస్తుంటాయి. అమెరికాకు చెందిన కొందరితో గ్రహాంతరవాసులకు ప్రత్యక్ష సంబంధం ఉందని కూడా అంటుంటారు. అయితే ఈ వాదనకు సంబంధించి ఇప్పటి వరకు స్పష్టమైన ఆధారాలు లభ్యంకాలేదు. రివర్స్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్‌ను దాచిపెట్టి.. తాజాగా అమెరికా మాజీ ఇంటెలిజెన్స్ అధికారి గ్రహాంతరవాసులకు సంబంధించిన మరో వాదన వినిపించారు. ఇది మరోసారి గ్రహాంతరవాసుల ఉనికికి ఆజ్యం పోస్తున్నది. రిటైర్డ్ మేజర్ డేవిడ్ గ్రుష్.. కాంగ్రెస్‌లో మాట్లాడుతూ ఎగిరే వస్తువులను కనుగొనడానికి రూపొందించిన రివర్స్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్‌ను అమెరికా దాచిపెడుతోందని ఆరోపించారు. అయితే పెంటగాన్.. గ్రుష్ వాదనలను కొట్టివేసింది. కాగా ఎగిరే వస్తువుల విషయంలో అమెరికా అన్ఐడెంటిఫైడ్ ఏరియల్ ఫెనోమినా(యూఏపీ) అనే పదాన్ని ఉపయోగిస్తుందని గ్రుష్.. హౌస్ ఓవర్‌సైట్ సబ్‌కమిటీకి తెలిపారు. ఇది రహస్యమైన విమానాలు, వస్తువులు, చిన్న ఆకుపచ్చ మనుషుల అధ్యయనం గురించి తెలియజేస్తుంది. ‘అది జాతీయ భద్రతా అంశం’ ఇటీవల డెమొక్రాట్లు,రిపబ్లికన్లు యూఏపీని జాతీయ భద్రతా అంశంగా నొక్కిచెప్పారు. టాస్క్‌ఫోర్స్ మిషన్‌కు సంబంధించిన అన్ని అత్యంత క్లాసిఫైడ్ ప్రోగ్రామ్‌లను మూఏపీ సాయంతో గుర్తించాలని ప్రభుత్వ టాస్క్‌ఫోర్స్ అధిపతి తనను 2019లో కోరినట్లు గ్రుష్ వివరించారు. ఆ సమయంలో గ్రుష్ జాతీయ నిఘా కార్యాలయానికి పలు వివరాలు అందజేశారు. ఈ సమయంలో బహుళ-దశాబ్దాల యూఏపీ క్రాష్ ఆవిష్కరణ గురించి తనకు తెలియజేశారని, దానిపై రివర్స్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్‌ను అమలు చేయడం గురించి కూడా సమాచారం ఉందని గ్రుష్ చెప్పారు. అయితే అప్పట్లో తాను దీని గురించి మరిన్ని వివరాలు చెప్పడానికి నిరాకరించాననన్నారు. ‘గ్రహాంతరవాసుల గురించి యూఎస్‌కు తెలుసు’ ఇతర గ్రహాలపై జీవం గురించి యూఎస్ ప్రభుత్వం దగ్గర ఏదైనా సమాచారం ఉందా అని అడిగిన ప్రశ్నకు, 1930ల నుండి మానవేతర కార్యకలాపాలు లేదా గ్రహాంతరవాసుల గురించి యూఎస్‌కు తెలుసని ఆయన అన్నారు. అయితే గ్రుష్ చేసిన ఈ వాదనలను పెంటగాన్ ఖండించింది. డిఫెన్స్ డిపార్ట్మెంట్కు చెందిన స్యూ గోఫ్ ఒక ప్రకటనలో గ్రుష్ వాదనలు సరైనవని నిరూపించడానికి దర్యాప్తు సమయంలో ఎటువంటి సమాచారం లభ్యం కాలేదన్నారు. మరొక గ్రహంపై జీవి ఉనికి, రివర్స్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ నకు సంబంధించిన వివరాలు యూఎస్ దగ్గర లేవని పేర్కొంది. ఇది కూడా చదవండి: పెంచిన పాము కాటేస్తే.. సరిగ్గా పాక్ దుస్థితి ఇదే -
సముద్రపు దొంగల ఒంటికన్ను సీక్రెట్ ఇదే..!
సముద్రపు దొంగలకు సంబంధించిన కథలు ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి. చాలామంది ఈ కథలంటే చెవికోసుకుంటారు. ఈ కథలకు దశాబ్ధాల చరిత్ర ఉంది. సముద్రపు దొంగల చిత్రాలు కూడా ఎంతో విచిత్రంగా ఉంటాయి. వీరు టోపీ ధరించడంతోపాటు నల్లని ప్యాంటు వేసుకోవడాన్ని మనం గమనించే ఉంటాం. ముఖ్యంగా ముఖానికి ఒక పట్టీ ఉంటుంది. అది ఒక కంటిని కప్పివేస్తూ ఉంటుంది. దీని వెనుక అనేక కథనాలు ఉన్నాయి. ఆ కామెడీ టీవీ సిరీస్‌లో.. దీనిని ఫ్యాషన్ అని కొందరు చెబుతుంటారు. కొన్ని కథలలో ఆ సముద్రపు దొంగకు ఒక కంటికి గాయమయ్యిందని, లేదా ఆ కన్ను లేదని అందుకే అలా పట్టీ కట్టుకున్నట్లు చెబుతారు. స్పాంజ్‌బాబ్ స్క్వేర్ప్యాంట్లు అనే అమెరికన్ కామెడీ టీవీ సిరీస్‌లోని సముద్రపు దొంగ పాత్రకు చిన్నప్పటి నుంచి ఒక కన్నువుండదు. దీంతో అతను తన కంటికి పట్టీ కట్టుకుంటాడు. అయితే సముద్రపు దొంగల పాత్రలన్నింటికీ కంటికి పట్టీ ఉండదు. పైరేట్స్ ఆఫ్ ది కరీబియన్ మూవీ సిరీస్‌లోని సముద్రపు దొంగల కంటికీ పట్టీ ఉండదు. స్ఫూర్తిగా నిలిచిన క్యారెక్టర్ అరేబియా గల్ఫ్‌లో రహ్మాహ్ ఇబ్న్ జాబిర్ అల్-జల్హామీ అనే సముద్రపు దొంగ తన దృష్టిని ఒకే చోట నిలిపి ఉండాలనే ఉద్దేశంలో ఒక కంటికి గంతలు కట్టుకునేవాడని చెబుతారు. ఈ తరహా పాత్రలు, చిత్రాలను సృష్టించడానికి చిత్రకారులు.. రహ్మాహ్ ఇబ్న్ జాబిర్ అల్-జల్హామీను ప్రేరణగా తీసుకుని ఉండవచ్చని చెబుతారు. శాస్త్రీయ కోణంలో.. శాస్త్రీయంగా చూస్తే మన కళ్ళు అకస్మాత్తుగా చీకటి లేదా కాంతిని చూడాల్సి వచ్చినప్పుడు అవి సర్దుబాటు చేయడానికి ప్రయత్నిస్తాయి. అకస్మాత్తుగా చీకటి పడినప్పుడు, మన కంటిలోని కనుబొమ్మ విస్తరిస్తుంది. తద్వారా ఎక్కువ కాంతి లోపలికి ప్రవేశిస్తుంది. కానీ ఆ కాంతి చీకటిలో చూడటానికి సరిపోదు. అప్పుడు రోడాప్సిన్ అనే రసాయనం విచ్ఛిన్నమై మన మెదడుకు నరాల ద్వారా సందేశాలను పంపుతుంది. అప్పుడు మసక చీకటిలో కూడా కళ్లు కొంతమేరకు చూడగలుగుతాం. సముద్రపు దొంగలు చీకటిలో చూసేందుకు ఒక కంటిని, వెలుతురులో చూసేందుకు మరో కంటిని సిద్ధంగా ఉంచుతారట. సముద్రపు దొంగలు ఒక కంటికి పట్టీ కట్టడంవలన మసక చీకటిలో వారు సరిగ్గా చూడటానికి ఎక్కువసేపు వేచి ఉండాల్సిన అవసరం ఉండదట. మసక చీకటిలో చూసేందుకు వారు ఒక కంటికి ఉన్న పట్టీని తొలగించి, దానిని మరొక కంటికి దానిని అమరుస్తారుట. ఇది కూడా చదవండి: ‘అయ్యా.. నేను బతికే ఉన్నాను.. డెత్ సర్టిఫికెట్ ఇప్పించండి’ -
ఏది ఇంపు?.. ఏది కంపు?.. సీక్రెట్ వెనుక సింపుల్ లాజిక్!
వాసన అనేది మన జీవితంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కొన్ని పదార్థాలను వాసన చూసి, అదేమిటో గుర్తుపట్టవచ్చు. ఒక్కోసారి వాసనను పసిగట్టి ప్రమాదాలను కూడా నివారించవచ్చు. ఇంటిలోని విద్యుత్ వైర్ ఏదైనా ఓవర్‌హీట్ అయినప్పుడు దాని నుంచి వాసన వస్తుంది. దానిని వెంటనే పసిగడితే పెను ప్రమాదాన్ని తప్పించుకోవచ్చు. కొన్ని వాసననలు మనం ఎంతగానో ఇష్టపడుతుంటాం. ఉదాహరణకు తొలకరి చినుకులు పడుతున్నప్పడు మట్టి నుంచి వచ్చే సువాసన అద్భుతంగా ఉంటుందని కొందరు చెబుతుంటారు. పెట్రోల్ వాసన, కొత్త పుస్తకాల వాసనను ఇష్టపడేవారు కూడా అధికంగానే ఉంటారు. కొందరు అయోడెక్స్, నెయిల్ పాలిష్ వాసనలను ఇష్టపడుతుంటారు. అయితే కొందరికి ఏ వాసనలు నచ్చుతాయో అవే మరికొందరికి అస్సలు నచ్చవు. ఇలా ఎందుకు జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. వాసనల వెనుకనున్న సైన్స్ ఏమిటో ఇప్పుడు గ్రహిద్దాం. సువాసన, దుర్వాసనల వెనుక.. ప్రముఖ శాస్త్రవేత్త రేచల్ ఎస్ హర్జ్ రాసిన The Scent of Desire పుస్తకంలో ఏ వాసన అయినా బాగుందని, బాగోలేదని విభజించలేమన్నారు.అయితే మనం వాసన పీల్చుకునేటప్పుడు కలిగే ఎక్స్పీరియన్స్ ప్రకారం అది బాగుందని, లేదా బాగోలేదని చెబుతుంటామన్నారు. మనం మానసిక భావోద్వేగాల మధ్య ఉన్నప్పుడు ఏదైనా స్మెల్ బాగుందనో లేదా బాగోలేదనో చెబుతుంటాం. దీనిప్రకారం చేస్తూ మనం ఎమోషన్స్‌కు దూరంగా ఉన్నప్పుడు ఏ వాసన అయినా మనకు సాధరణంగానే అనిపిస్తుంది. ఈ పుస్తకంలో పేర్కొన్న వివరాల ప్రకారం మనకు పాజిటివ్ ఫీల్ కలిగించిన వాసనలను మనం ఇష్టపడుతుంటాం. కొత్త దుస్తులు, కొత్త పుస్తకాలు మొదలైన వాటి వాసన ఈ కోవలోకే వస్తుంది. కొందరు విచిత్రమైన వాసనలను ఇష్టపడుతుంటారు. అంతమాత్రాన వారిని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ప్రతీవాసనను ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్వీకరిస్తారు. అందుకే కొందరికి సువాసన అనిపించేది మరికొందరికి నచ్చదు. ఇది కూడా చదవండి: దేశంలో నేటికీ రైళ్లు నడవని రాష్ట్రం అది.. భారీ నెట్వర్క్ ఉన్నా.. -
Secret Places In The World: భూమిపై మనం వెళ్ళడానికి నిషేధించబడిన టాప్ 10 ప్రదేశాలు
-
ఫ్రెంచ్ ఫ్రైస్.. ఆ పేరు ఎలా వచ్చిందంటే..
ఆలూ అనేది ఎంతటి గొప్ప దుంపకూర అంటే దీనిని ఏ వంటకంలోనైనా వినియోగించవచ్చు. అలాగే దీనితో ప్రత్యేకమైన వంటకాలు కూడా చేయవచ్చు. పైగా దీనిని ఇష్టపడనివారంటూ ఎవరూ ఉండరు. అయితే ఆలూ అనగానే ముందుగా చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ గుర్తుకువస్తాయి. పిల్లలు మొదలుకొని పెద్దల వరకూ వీటిని ఎంతో ఇష్టంగా తింటారు. పైగా వీటిని తయారు చేయడం కూడా ఎంతో సులభం. అయితే ఆలూతో చేసే ఈ వంటకాన్ని ఫ్రెంచ్ ఫ్రైస్ అని ఎందుకు అంటారో మీకు తెలుసా? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రెంచ్ ఫ్రైస్ అనే పేరు వినగానే మనకు ఫ్రాన్స్ గుర్తుకువస్తుంది. అయితే దీనికి ఫ్రాన్స్‌తో ఎటువంటి సంబంధం లేదని తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఫ్రెంచ్ ఫ్రైస్ మొదట అమెరికాలో పుట్టింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం 17వ శతాబ్ధపు చివరిలో వేయించిన ఆలూని స్పెయిన్‌కు చెందిన కొందరు నిపుణులు దక్షిణ అమెరికా తీసుకువచ్చారట. తరువాత అది యూరప్ చేరిందట. దీని తరువాత ఆలూ ఫ్రాన్స్‌లో ఫేమస్ అయ్యిందట. వీటిని తొలుత ‘పోమ్ దె తెరె ఫ్రిట్’ లేదా ‘ఫ్రయిడ్ పొటాటో’ అని అనేవాట. మొదటి ప్రపంచ యుద్ధంలో బెల్జియం సేన అధికారిక భాష ఫ్రాన్సీన్సీ. ఆ సమయంలో అమెరికా సైనికులు వాటిని ఫ్రెంచ్ ఫ్రైస్ అని పిలిచేవారట. ఈ పదం అమెరికాలో ఎంతో ఫేమస్ అయ్యింది. అదే పేరు ఈ వంటకానికి స్థిరపడిపోయింది. ఫ్రాన్స్‌లోని పలు ప్రాంతాల్లో వీటిని పోమ్ ఫ్రిట్ లేదా ఫ్రిట్ అని పిలుస్తుంటారు. కెనడాలో ఫ్రెంచ్ ఫ్రెస్ను మసాలా గ్రేవీ, వెన్నతో కూడిన పెరుగులో వేసుకుని ఇష్టంగా తింటారట. -
గోప్యత హక్కు కాదా?!
కొన్ని అంశాలపై జరిగే చర్చలు ఊహించని మలుపు తిరుగుతాయి. అనుద్దేశిత లక్ష్యంవైపు సాగుతాయి. అంతవరకూ ఎజెండాలో లేని కొత్త విషయాలను వెలుగు లోకి తెస్తాయి. ఆధార్ కార్డు చట్టబద్ధతపై సుప్రీంకోర్టు ముందు దాదాపుగా పూర్తయిన విచారణలో ఇప్పుడు అలాంటి పరిణామమే చోటుచేసుకుంది. చడీ చప్పుడూ లేకుండా, చట్టపరమైన ప్రాతిపదిక లేకుండా జన జీవితాల్లోకి తొమ్మిదేళ్ల క్రితం ప్రవేశించిన ఆధార్ కార్డు సంగతిని తేల్చడానికి సర్వోన్నత న్యాయస్థానం సమాయత్తం కాగా... అసలు గోప్యత అనేది పౌరుల ప్రాథమిక హక్కు కాదని వాదించి అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ అందరినీ నివ్వెరపరిచారు. ఆధార్ కార్డు జారీ చేయడం కోసం సేకరించే వేలిముద్రలు, ఐరిస్ గుర్తింపు వగైరాలన్నీ పౌరుల గోప్యతను దెబ్బతీస్తాయని, ఇది ప్రాథమిక హక్కులకు భంగకరమని దాఖలైన పిటిషన్లపై ముకుల్ రోహత్గీ ఈ వాదన చేశారు. పౌర స్వేచ్ఛలో గోప్యత భాగం కానప్పుడు అసలు ఆ స్వేచ్ఛకు అర్ధమేమిటని జస్టిస్ జాస్తి చలమేశ్వర్ నేతృత్వం లోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం సూటిగా ప్రశ్నించింది. పౌరుల జీవించే హక్కుకూ, స్వేచ్ఛకూ పూచీపడుతున్న రాజ్యాంగంలోని 21వ అధికరణ లోనే గోప్యతగా ఉండే హక్కు అంతర్లీనంగా ఉన్నదని ధర్మాసనం ఈ సందర్భంగా వ్యక్తం చేసిన అభిప్రాయం ఎన్నదగ్గది. గోప్యత ప్రాథమిక హక్కు కాదనడం ద్వారా ఆధార్ కార్డు కోసం పౌరులనుంచి బయోమెట్రిక్ డేటాను సేకరించడంలో హక్కుల ఉల్లంఘన జరగలేదని, పౌరుల వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడలేదని కేంద్ర ప్రభు త్వం చెప్పదల్చుకున్నదని స్పష్టమవుతోంది. ఈ కేసులో ధర్మాసనం ఏం తీర్పునిస్తుందో ఇంకా వేచి చూడాల్సి ఉన్నా రోహత్గీ చేసిన వాదనలోని మూలాలను ఒకసారి పరిశీలించాలి. 1954లో ఒకసారి, 1964లో ఒకసారి విస్తృత ధర్మాసనాలు గోప్యత ప్రాథమిక హక్కు కాదని తీర్పులి చ్చాయని ఆయన చెప్పారు. గోప్యత పౌరుల ప్రాథమిక హక్కని 1970 తర్వాత వెలువరించిన తీర్పులన్నీ ఇద్దరూ లేదా ముగ్గురు న్యాయమూర్తులుండే ధర్మాసనా లే ఇచ్చాయని రోహత్గీ వాదన. కనుక ఈ గోప్యత అంశాన్ని మరో విస్తృత ధర్మాస నానికి అప్పగించాలన్నది ఆయన సూచన. వాస్తవానికి 1954లో గోప్యతకు సంబం ధించి ఎనిమిదిమంది న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పు సందర్భం వేరు. ఇంట్లో సోదాలు నిర్వహించి, విలువైన పత్రాలను, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకోవ డాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై తీర్పునిస్తూ గోప్యత ప్రాథమిక హక్కు కాదని సర్వోన్నత న్యాయస్థానం చెప్పింది. 1964నాటి కేసు కూడా ఇలాంటిదే. తన ఇంటికి తరచు పోలీసులు రావడం, తన గురించి చుట్టుపక్కల అందరినీ అడిగి తెలుసుకోవడంవల్ల గోప్యతకు భంగం కలుగుతున్నదని, 21వ అధిక రణ ప్రకారం ఇది హక్కుల ఉల్లంఘనవుతుందని యూపీకి చెందిన ఖరక్‌సింగ్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశాడు. అయితే దీన్ని తోసిపుచ్చిన ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనం గోప్యత అనేది ప్రాథమిక హక్కుగా రాజ్యాంగం చెప్పలేదని తీర్పునిచ్చింది. ఈ రెండు సందర్భాలూ నేర చరిత్ర కలిగిన వ్యక్తులకు సంబంధించిన కేసులు. సాధా రణ పౌరులకుండే హక్కుల గురించి, వాటికుండే రాజ్యాంగబద్ధత గురించి మాట్లాడుకోవాల్సిన సందర్భంలో రోహత్గీ ఈ కేసులను ప్రస్తావించారు. మన రాజ్యాంగంలో ఉండే ప్రాథమిక హక్కులు తిరుగులేనివేమీ కాదు. వాటికి సహేతుకమైన పరిమితులున్నాయి. అలాగే... విస్తృత ధర్మాసనాలే చెప్పినా ఆ తీర్పులు సమీక్షకు అతీతమైనవి కాదు. మారిన కాలమాన పరిస్థితులు కొత్త ఆలోచనలకు తావిస్తాయి. మన అవగాహననే మారుస్తాయి. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులకు వివిధ సందర్భాల్లో సుప్రీంకోర్టు చెప్పిన భాష్యం ఆ రాజ్యాం గాన్ని మరింత సమున్నతం చేసింది. నిజానికి ఆధార్ కార్డు వ్యవహారంలో సేకరించే బయోమెట్రిక్ డేటా అన్యుల చేతుల్లో పడకుండా పకడ్బందీ చర్యలు తీసుకున్నామని, ఆ డేటాను భద్రపరిచే సర్వర్లు దుర్భేద్యమైనవని కేంద్రం చెప్పగలిగి ఉంటే వేరుగా ఉండేది. ఆ విషయం లో ప్రభుత్వానికే అంత నమ్మకం లేకపోవడం వల్ల కావొచ్చు.... అలాంటి డేటా తీసుకోవడం ప్రాథమిక హక్కుల ఉల్లంఘన ఎలా అవుతుందన్న వాదన మొద లెట్టింది. మరో విధంగా చెప్పాలంటే ఆధార్ ఉంటే తప్ప దిక్కూ మొక్కూ లేని స్థితిలో పడే పౌరులకు రాజ్యాంగపరంగా ఎలాంటి హ క్కూ ఉండబోదని చెప్పినట్ట యింది. ఒక సమస్యనుంచి బయటపడటం కోసం కేంద్ర ప్రభుత్వం మరో పెద్ద సమస్యను ముందుకు తెచ్చింది. ఆధార్‌ను పోలిన కార్యక్రమాలను లోగడ అమెరి కా, బ్రిటన్లు కూడా చేపట్టాయి. ‘నో టు ఐడీ’ పేరిట బ్రిటన్‌లో ఆరేళ్లపాటు సాగిన ఉద్యమం ఫలించి అంతవరకూ సేకరించిన పౌరుల డేటాను ధ్వంసం చేస్తున్నట్టు 2010లో కామెరాన్ ప్రభుత్వం ప్రకటించింది. అమెరికా సైతం ఈ విషయంలో కొన్ని పరిమితులు విధించుకుంది. సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోయి, ఎంతో భద్రమైనవనుకున్న అమెరికా రక్షణ శాఖ సర్వర్లలోకి సైతం చొరబడి డేటాను తస్క రించే పరిస్థితులు ఏర్పడిన ప్రస్తుత తరుణంలో ఆధార్ పేరిట సేకరిస్తున్న డేటాకు సమకూర్చిన రక్షణలేమిటో కేంద్రం చెప్పగలిగితే బాగుండేది. విద్యార్థికి ఫీజు రీయింబర్స్మెంట్ వర్తింపజేయడం మొదలుకొని రైతుల రుణమాఫీ వరకూ అన్నిం టికీ ఆధార్ కార్డే మూలమని మన ప్రభుత్వాలు ఊదరగొడుతున్న తీరు ఎంతో ప్రమాదకరమైనది. ఆధార్ లేకపోతే ఇకపై ఊపిరి తీసుకోవడం కూడా కష్టమని అనుకునేంతగా ఈ ప్రచారం సాగుతున్నది. దాన్ని మొదలు పెట్టినప్పుడు ఆనాటి ప్రధాని మన్మోహన్సింగ్ దాన్నొక గుర్తింపు కార్డుగా మాత్రమే చెప్పారని గుర్తుంచు కుంటే ఇప్పుడు ప్రభుత్వాలు పెడుతున్న ఆంక్షలు ఆశ్చర్యం కలిగిస్తాయి. రోహత్గీ అంటున్నట్టు గోప్యత అనే హక్కు రాజ్యాంగ అధికరణల్లో అంతర్లీనం గా అయినా లేకపోతే దాన్ని కల్పించాల్సిన నైతిక బాధ్యత పాలకులకు ఉంటుంది. అప్పుడు మాత్రమే ఆధార్ కార్డు కోసం సేకరించే డేటా దుర్వినియోగమయ్యే పక్షంలో కారకులపై తీసుకునే చర్యలేమిటో...పౌరుల గోప్యతకు అధికారంలో ఉన్న వారినుంచిగానీ, ప్రైవేటు వ్యక్తులనుంచి గానీ ముప్పువాటిల్లిన సందర్భాల్లో స్వీయ రక్షణకు రాజ్యాంగపరంగా పౌరులకుండే వెసులుబాటేమిటో స్పష్టత చేకూరు తుంది. ఆ తర్వాతే ఆధార్ అయినా, మరొకటైనా అమలు కావాలి. -
హృతిక్ రహస్యం తెలిసిపోయింది
ముంబై: నలభై ఏళ్లు దాటినా అద్భుతరీతిలో తన శరీరాకృతిని కాపాడుకోవడం వెనకున్న రహస్యాన్ని రివీల్ చేశాడు బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్. చిన్నప్పటినుంచి తను ఎంతగానో ఆరాధించే హాలీవుడ్ యాక్షన్ హీరో సిల్వెస్టర్ స్టాలోన్ అందించిన స్ఫూర్తితోనే ఇది సాధ్యమయిందని మంగళవారం ట్విట్టర్ లో వెల్లడించాడు. 'నిన్న (జులై 6) నా అభిమాన హీరో (సిల్వెస్టర్) బర్త్ డే. ప్రతిరోజు నన్నునాకు నేను కొత్తగా, మరింత దృఢంగా మారేలా స్టాలోన్ నన్ను ఇన్స్పైర్ చేశారు. అందుకోసం ఆయనకు కేవలం థ్యాంక్స్ చెబితే సరిపోదనుకుంటా' అని పేర్కొన్నాడు. ప్రస్తుతం అశుతోష్ గోవారికర్ రూపొందిస్తున్న 'మొహంజదారో' సినిమాలో హృతిక్ లీడ్‌రోల్ చేస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్.