హృతిక్ రహస్యం తెలిసిపోయింది | Sylvester Stallone inspired me, says Hrithik Roshan | Sakshi
Sakshi News home page

హృతిక్ రహస్యం తెలిసిపోయింది

Published Tue, Jul 7 2015 2:55 PM | Last Updated on Sun, Sep 3 2017 5:04 AM

హృతిక్ రహస్యం తెలిసిపోయింది

హృతిక్ రహస్యం తెలిసిపోయింది

ముంబై: నలభై ఏళ్లు దాటినా అద్భుతరీతిలో తన శరీరాకృతిని కాపాడుకోవడం వెనకున్న రహస్యాన్ని రివీల్ చేశాడు బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్. చిన్నప్పటినుంచి తను ఎంతగానో ఆరాధించే హాలీవుడ్ యాక్షన్ హీరో సిల్వెస్టర్ స్టాలోన్ అందించిన స్ఫూర్తితోనే ఇది సాధ్యమయిందని మంగళవారం ట్విట్టర్ లో వెల్లడించాడు.

'నిన్న (జులై 6) నా అభిమాన హీరో (సిల్వెస్టర్) బర్త్ డే. ప్రతిరోజు నన్నునాకు నేను కొత్తగా, మరింత దృఢంగా మారేలా స్టాలోన్ నన్ను ఇన్స్పైర్ చేశారు. అందుకోసం ఆయనకు కేవలం థ్యాంక్స్ చెబితే సరిపోదనుకుంటా' అని పేర్కొన్నాడు. ప్రస్తుతం అశుతోష్ గోవారికర్ రూపొందిస్తున్న 'మొహంజదారో' సినిమాలో హృతిక్ లీడ్రోల్ చేస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement