Sylvester Stallone
-
దర్శకుడు మారారు
హాలీవుడ్ హీరో సిల్వెస్టర్ స్టాలోన్ సూపర్ హిట్ చిత్రం ‘రాంబో’ను కండలు తిరిగిన యంగ్ హీరో టైగర్ ష్రాఫ్‌తో హిందీలో రీమేక్ చేయాలనుకున్నారు దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్. అయితే తాజాగా ఈ చిత్రాన్ని సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేయడంలేదని ప్రకటన విడుదల చేశారు. ప్రముఖ దర్శకుడు డేవిడ్ ధావన్ తనయుడు, హీరో వరుణ్ ధావన్ సోదరుడు రోహిత్ ధావన్ ‘రాంబో’ను డైరెక్ట్ చేయనున్నారు. ప్రస్తుతం షారుక్‌తో ఓ సినిమా చేసే ప్లాన్‌లో ఉన్నారు దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్. దీంతో ఈ సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చిందట. కార్తీక్ ఆర్యన్‌తో ‘అల వైకుంఠపురములో’ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయనున్నారు రోహిత్ ధావన్. ఈ సినిమా తర్వాత ‘రాంబో’ని తెరకెక్కిస్తారు. ఈలోగా ‘హీరో పంతీ 2’ చిత్రాన్ని పూర్తి చేస్తారు టైగర్. 2021 చివర్లో ‘రాంబో’ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. -
సూపర్ హీరోకి కరోనా ఎఫెక్ట్
కరోనా దెబ్బకు సూపర్ హీరో కాస్తా వెనక్కి తగ్గాడు. రెండు వారాల పాటు తన యూనిట్‌ని ఇంటిపట్టున ఉంచాలనుకున్నాడు. ప్రముఖ హాలీవుడ్ నటుడు సిల్వెస్టర్ స్టాలోన్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న సూపర్ హీరో మూవీ ‘సమారిటన్’. ఈ చిత్రం షూటింగ్ గత వారం జార్జియాలో జరిగింది. అయితే కోవిడ్ 19 ఎఫెక్ట్‌కి ఈ సూపర్ హీరో చిత్రం షూటింగ్‌కి బ్రేక్ ఇచ్చారు. రెండు వారాల తర్వాత పరిస్థితి బాగుంటే అప్పుడు షూటింగ్ మొదలుపెట్టాలనుకుంటున్నారు. ఇందులో సిల్వెస్టర్ స్టాలోన్ పారిశుధ్య కార్మికుడి పాత్ర చేస్తున్నారు. ఆయన ఓ నిర్మాత కూడా. ఓవర్లార్డ్ జూలియస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్ 1న రిలీజ్ చేయాలనుకుంటున్నారు. -
యాక్షన్ స్టార్‌పై రేప్ కేసు..కోర్టు రివ్యూ
లాస్ ఏంజిల్స్: హాలీవుడ్ యాక్షన్ సూపర్ స్టార్ సిల్వస్టర్ స్టాలోన్(71) పై నమోదైన లైంగిక దాడి కేసును జిల్లా లైంగిక నేరాల దర్యాప్తు బృందం తిరగదోడింది. ఈ మేరకు లాస్ ఏంజిల్స్ జిల్లా కోర్టు కేసును సమీక్షించనుందని కోర్టు ప్రతినిధి బుధవారం ప్రకటించారు. స్టాలోన్ తనపై 1990లో లైంగిక దాడికి పాల్పడ్డాడని ఓ మహిళ గత డిసెంబర్లో కేసు పెట్టింది. 27 ఏళ్ల క్రితం చోటుచేసుకున్న ఈ ఘటనపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. లైంగిక దాడి కేసును కోర్టు సమీక్షించనుందన్న వార్తలపై స్టాలోన్ తరపు ప్రతినిధులు ఇంకా స్పందించలేదు. ఆయన తరపు న్యాయవాది మార్టిన్ సింగర్ గతంలో మాట్లాడుతూ.. ‘డిసెంబరులో స్టాలోన్‌పై లైంగిక దాడిపై కేసు నమోదైంది. ఫిర్యాదుపై విచారణ చేపట్టామని సాంటా మోనికా పోలీసులు తెలిపారు. ఈ ఫిర్యాదుపై స్టాలోన్ న్యాయ పోరాటం చేస్తార’ని పేర్కొన్నారు. అయితే విచారణలో పురోగతి లేకపోవడంతో కేసు చతికిల పడిందనుకున్న తరుణంలో కేసుపై కోర్టు సమీక్షకు సిద్ధపడడం పట్ల స్టాలోన్ ఎలా స్పందిస్తారో చూడాలి. 1976లో ‘రాకీ’ చిత్రంతో స్టాలోన్ హాలీవుడ్లో యాక్షన్ సూపర్ స్టార్‌గా ఎదిగిన సంగతి తెలిసిందే. అయితే, లైంగిక దాడులపై గళం విప్పుతూ మొదలైన ‘మీ టూ’ ఉద్యమం స్ఫూర్తితో గత 8 నెలలుగా హాలీవుడ్ రంగంలోని మహిళా ప్రముఖులు స్పందిస్తున్నారు. తమపై జరిగిన లైంగిక దాడులపై కేసులు పెట్టి ప్రతీకారం తీర్చుకుంటున్నారు. ఇప్పటికే నిర్మాత హార్వే విన్స్టన్ లైంగిక దాడిపై ఆరోపణలు ఎదుర్కొంటుండగా, కమెడియన్ బిల్ కాస్బీ 2004లో ఓ మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడన్న కారణంగా జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. -
దిగ్గజ నటుడి తప్పిదం
సాక్షి, సినిమా : సోషల్ మీడియాలో చేసే పోస్ట్‌లు ఆచీ తూచీ చేయకపోతే.. ట్రోలింగ్ చేసేందుకు జనాలు సిద్ధంగా ఉంటారు. సరిగ్గా హాలీవుడ్ దిగ్గజం సిల్వెస్టర్ స్టాలోన్(71)కు అలాంటి పరిస్థితే ఎదురైంది. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన రేస్-3 చిత్రానికి సంబంధించి ఈ మధ్య వరుసగా లుక్కులతో పోస్టర్లను వదులుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్టాలోన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో చిత్ర యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పే యత్నం చేశారు. ఈ క్రమంలో చిత్రంలో మరో పాత్రధారి బాబీ డియోల్ ఫోటోను షేర్ చేసి టాలెంటెడ్ హీరో సల్మాన్‌కు ఖాన్‌కు బెస్ట్ విషెస్ అంటూ సందేశం ఉంచాడు. అంతే ఇక ట్రోలింగ్ బాబులు వాళ్ల పనితనం చూపిస్తూ ఈ సీనియర్ హీరోను ఎగతాళి చేస్తున్నారు. చిత్రానికి ప్రమోషన్ చేస్తే చేశారుగానీ.. ఇలా కనీస పరిజ్ఞానం లేకుండా పోస్ట్ ఎలా చేస్తారంటూ ఏకీపడేస్తున్నారు. కోట్లాది అభిమానులు ఉన్న సల్మాన్ ఎవరో స్టాల్లోన్కు తెలీదా? అంటూ కొందరు.. కనీసం సల్మాన్ పోస్ట్ చేసిన ఫోటో చూసైనా స్టాల్లోన్ ఫోటో పెట్టి ఉంటే బాగుండేది కదా అంటూ మరికొందరు సలహాలిస్తున్నారు. ఏదిఏమైనా స్టాలోన్ ఇప్పటిదాకా ఆ పోస్ట్‌ను మాత్రం డిలీట్ చేయలేదు. The very best wishes to very talented film hero SALMAN KHAN For his next film RACE 3 !@beingsalmankhan A post shared by Sly Stallone (@officialslystallone) on Mar 21, 2018 at 1:25pm PDT -
నేను బతికే ఉన్నా! : సూపర్‌స్టార్
లాస్ఏంజిలిస్: సోషల్ మీడియా పుణ్యమా అని బతికున్న సెలబ్రిటీలను చనిపోయినట్లుగా ప్రచారం చేస్తున్నారు. ఇలా పలువురు సెలబ్రిటీలు బతికుండగానే వాళ్లు ఇక లేరంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరగగా... మళ్లీ సెలబ్రిటీలే ఏదో ఒక వేదికగా మేం క్షేమంగానే ఉన్నాం. ఎలాంటి ప్రమాదం జరగలేదు. బతికే ఉన్నామని చెప్పుకునే పరిస్థితులు తలెత్తుతున్నాయి. తాజాగా హాలీవుడ్ సూపర్ స్టార్ సిల్వెస్టర్ స్టాలోన్(71) చనిపోయినట్టు సోషల్ మీడియాలో వార్త చక్కర్లు కొట్టింది. ఇంటర్నెట్లో షేర్ అయిన ఫొటోలో హెయిర్ తక్కువగా ఉన్నాయనీ, ఆయనకు క్యాన్సర్ వచ్చి చనిపోయాడని జోరుగా ప్రచారం సాగింది. దీంతో స్టాలోన్ అభిమానుల్లో ఆందోళన మొదలైంది. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు ఆయనే స్వయంగా రంగంలోకి దిగారు. ‘‘ఇలాంటి వదంతులు పట్టించుకోవద్దు. నేను క్షేమంగా ఉన్నాను. సంతోషంగా, ఆరోగ్యంగా ఉన్న నేను.. ఇంకా పంచ్‌లు కొడుతున్నానంటూ’’ ట్వీటర్లో పేర్కొన్నారు. దీంతో ఆ రూమర్లకు ఫుల్స్టాప్ పడింది. సిల్వెస్టర్ సోదరుడు ఆ వదంతులపై స్పందిస్తూ... ఇలాంటి వార్తలను పుట్టించి, పోస్ట్ చేసే వారికి సొసైటీలో స్థానం ఉండకూడదని ట్వీట్ చేశాడు. స్టాలోన్‌పై ఇలాంటి వదంతులు రావడం ఇదేం మొదటిసారి కాదు. 2016లో బ్రిటీష్ మీడియా ఈ హాలీవుడ్ హీరో చనిపోయాడనీ కథనాన్ని ప్రచురించింది. చివరిగా స్టాలోన్ తన తాజా చిత్రం ‘క్రూడ్ 2’ ప్రమోషన్లో భాగంగా సోషల్ మీడియాలో ఆదివారం ఒక పోస్ట్ చేశాడు. కానీ అంతలోనే ఆయన చనిపోయారంటూ వదంతులు పుట్టుకొచ్చాయి. -
మా ఆయన బంగారం.. ఆ పని చేయలేదు!
‘రాంబో’రాజ్ సిల్వెస్టర్ స్టాలోన్‌కి వైఫ్ బ్రిజిట్టే నియల్సెన్ నుంచి సర్టిఫికేట్ వచ్చేసింది. ‘‘ఎవరితోనూ మా ఆయన అసభ్యంగా ప్రవర్తించలేదు. అవన్నీ కట్టు కథలే’’ అని స్టేట్మెంట్ ఇచ్చారామె. అసలెందుకు బ్రిజిట్టే తన భర్తని ఎందుకు వెనకేసుకు రావాల్సి వచ్చిందంటే... 1986లో (స్టాలోన్‌కి 40 ఏళ్ల వయసున్నప్పుడు) లాస్ వేగాస్‌లో 16 ఏళ్ల అమ్మాయిపై బాడీగార్డుతో కలసి అఘాయిత్యం చేశారనే వార్త తాజాగా బయటకొచ్చింది. ‘‘అఘాయిత్యం చేశాక స్టాలోన్ ‘మనం పెళ్లైన వాళ్లమే కదా. నిజం చెప్పినా నమ్మరేమోనని ఆ అమ్మాయి ఎవరికీ చెప్పలేదు. ఒకవేళ చెప్పిందో... తల పగిలేలా కొడదాం’’ అని బాడీగార్డ్‌తో చెప్పినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడయిందని ‘డైయిలీ మెయిల్’ సంస్థ పేర్కొంది. ‘‘మాకప్పుడే (1986లో) పెళ్లైంది. నేను ఆయన్ను విడిచి ఒక్క క్షణం కూడా ఉండేదాన్ని కాదు. రాత్రి ఎనిమిదిన్నరకు షూటింగ్ టైమ్‌లో ఘటన జరిగిందని వాళ్లు చెబుతున్నారు. కానీ, అప్పట్లో డే టైమ్‌లో షూటింగ్ జరిగింది. ఆయన యాక్ట్ చేస్తుంటే... షూటింగులో నేను ఆయన్నే చూస్తుండేదాన్ని. డిన్నర్ తర్వాత మా రూమ్‌కి వెళ్లేవాళ్లం. హోటల్ రూమ్‌లో ఆయనతో నేను తప్ప ఎవరూ లేరు. చేయని తప్పుకు సిల్వెస్టర్ స్టాలోన్, ఆయన ఫ్యామిలీ మెంబర్స్ ఎన్నో నిందలు పడుతున్నారు’’ అని బ్రిజిట్టే పేర్కొన్నారు. మాజీ భర్తకు బ్రిజిట్టే ఇచ్చిన మద్దతు చూసి హాలీవుడ్ జనాలు నోరెళ్లబెట్టారు. ఎందుకంటే... వీళ్లు కలిసున్నది రెండేళ్లే. 1985లో పెళ్లైతే... 87లో విడాకులు తీసుకున్నారు. కానీ, స్టాలోన్ తప్పు చేశాడని ఆరోపించిన టైమ్‌లో ఆమె వైఫ్ మరి! ఏది ఏమైనా... ‘రాంబో’ సిరీస్‌తో అమెరికాలోనూ, ఇండియా లోనూ, ప్రపంచ వ్యాప్తంగానూ ప్రేక్షకుల్లో ఎంతో పేరు తెచ్చుకున్న సిల్వెస్టర్ స్టాలోన్‌కి 71 ఏళ్ల వయసులో ఇది ఇబ్బందికరమైన పరిస్థితే!! -
బతికే ఉన్నానని సూపర్ స్టార్ చెప్పినా..
తాను ఇంకా బతికే ఉన్ననని, తనపై అలాంటి వదంతులు ప్రచారం చేయొద్దని ఓ హీరో సోషల్ మీడియా ద్వారా విజ్ఞప్తిచేశాడు. అతడు మరెవరో కాదు హాలీవుడ్ సూపర్ స్టార్ సిల్వెస్టర్ స్టాలోన్. గతవారం ఆయన చనిపోయాడన్న వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేసింది. అభిమానులు ముద్దుగా పిలుచుకునే పేరు 'రాంబో'. ఆ సిరీస్ లో స్టాలోన్ తీసిన సినిమాలు చూసి ఎంతో మంది ఆయన అభిమానులుగా మారిపోయారన్న విషయం తెలిసిందే. ఎవరో ఆకతాయి రాంబో చనిపోయాడని గత వారం ప్రచారం చేశాడు. రాంబో చనిపోయాడంటూ భిన్న కథనాలు రావడంతో తన కూతురు సోఫియా స్టాలోన్ తో కలిసి డిన్నర్ చేసిన సందర్భంగా దిగిన ఫొటోను మూడు రోజుల కిందట పోస్ట్ చేశాడు. అయినా ఆయనపై దుష్ప్రచారం ఆగలేదు. తాజాగా మరోసారి రాంబో చనిపోయాడని కొందరు ట్విట్టర్లో పోస్ట్ చేశారు. స్టాలోన్ చనిపోయాడని చెప్పగానే మా అమ్మ ఏడుపు స్టార్ట్ చేసిందని సారా హైలిన్ అనే యువతి ట్వీట్ చేసింది. ఆయన చనిపోయాడన్న వార్త నిజం కాదని లార్డ్ కమెట్ ట్వీట్ చేయగా, ఇలాంటి వార్తలను ప్రచారం చేయోద్దని మరో ట్విట్టర్ యూజర్ కార్నర్ మండిపడ్డాడు. Well sir I must admit I wasn't expecting to see "started the Slyvester Stallone online death hoax" as a point on your resume but here we are — Connor (@Conbard) 6 September 2016 i told my mom sylvester stallone died and she actually started crying and now i feel bad — sar (@sarahhyellin) 6 September 2016 Ok people I read someone said Stallone died....Pfft he isn't dead his career is. — Lord Comet (@LordComet) 6 September 2016 -
బాలీవుడ్ రాంబోగా హృతిక్
రాంబో పాత్రను సినీ అభిమానులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హాలీవుడ్ యాక్షన్ స్టార్ సిల్వస్టర్ స్టాలోన్ హీరోగా నటించిన ఈ ఐకానిక్ పాత్ర, ప్రపంచ వ్యాప్తంగా విశేష ఆదరణ సొంతం చేసుకుంది. ఇప్పటికే నాలుగు భాగాలుగా రిలీజ్ అయిన ఈ హాలీవుడ్ సీరీస్ త్వరలో ఇండియన్ స్క్రీన్ మీద సందడి చేయనుంది. బాలీవుడ్ దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్, రాంబో సినిమాను హిందీలో రీమేక్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే రాంబో సినిమా రీమేక్ రైట్స్ సొంతం చేసుకున్న సిద్దార్థ్, ఇండియన్ వర్షన్‌కు కావాల్సిన మార్పులు చేసే పనిలో ఉన్నాడు. అయితే ఇప్పటి వరకు ఈ రీమేక్‌లో హీరోగా ఎవరు నటిస్తారన్న విషయంలో ఎలాంటి ప్రకటన చేయలేదు. తాజా సమాచారం ప్రకారం బాలీవుడ్ మ్యాన్లీ హీరో హృతిక్ రోషన్ ఈ సినిమాలో హీరోగా నటించడానికి అంగీకరించాడు. ఇప్పటికే సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో హాలీవుడ్ మూవీ నైట్ అండ్ డే హిందీ రీమేక్ బ్యాంగ్ బ్యాంగ్‌లో హీరోగా నటించిన హృతిక్ మరోసారి అదే దర్శకుడితో హాలీవుడ్ రీమేక్‌కు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం పీరియాడిక్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న మొహంజోదారో చిత్రంలో నటిస్తున్న హృతిక్, త్వరలోనే రాంబో రీమేక్‌పై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. -
'రాజకీయాల్లోకి రాకుండా నా భార్య అడ్డుకుంది'
లండన్: హాలీవుడ్లో భారీ మాస్ ఇమేజ్ ఉన్న యాక్షన్ హీరో సిల్వెస్టర్ స్టాలోన్. 'రాంబో' సిరీస్ సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ఈ కండల వీరుడు తన మిత్రుడు ఆర్నాల్డ్ షార్గ్నెజ్జర్ దారిలో నడుస్తూ రాజకీయాల్లోకి రావాలని భావించాడు. ఆయనలాగే తాను కూడా అమెరికా ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించాడు. అయితే చివరిన నిమిషంలో భార్య అడ్డుచెప్పడంతో ఆ నిర్ణయాన్ని మానుకున్నాడు. రాజకీయాల్లో చేరడం ఏమంతా మంచి నిర్ణయం కాదని, దానికన్నా ఎప్పటిలాగే సినిమాలు చేస్తూ ఉండటమే మేలని భార్య తనను ఒప్పించిందని స్టాలోన్ వెల్లడించాడు. 'నేను రాజకీయాల్లో చేరే విషయమై నువ్వేమనుకుంటున్నావని నా భార్యను అడిగాను. 'నీకు ఏమైనా వెర్రా? ఇప్పటివరకు చాలా బావున్నావు. నిన్ను ప్రజలు ఎన్నుకోబోరు. ప్రజలతో జయజయధ్వానాలు చేయించుకోవాలన్న నెరవేరని కోరిక ఏది నీకు లేదు' అని ఆమె కాస్ల్ పీకింది' అని స్టాలోన్ చెప్పినట్టు 'డిజిటల్ స్పై' తెలిపింది. -
బుల్లితెరపై రాంబో
హాలీవుడ్ స్క్రీన్ మీద మోస్ట్ సక్సెస్ ఫుల్ సీరీస్లలో ఒకటైన రాంబో త్వరలో బుల్లితెర మీద సందడి చేయనుంది. సిల్వస్టర్ స్టాలోన్ హీరోగా తెరకెక్కిన ఈ యాక్షన్ సినిమా సీరీస్‌ను టీవీ సీరియల్‌గా రూపొందించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సీరీస్‌కు రాంబో ఫిలింస్‌లో హీరోగా నటించిన స్టాలోన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నాడు. సినిమా తరహాలో కాకుండా ఈ టీవీ సీరియల్లో ఎక్కువగా ఫ్యామిలీ డ్రామా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా రాంబో, అతని కొడుకు మధ్య అనుబంధం నేపథ్యంలో కథా కథనాలు రెడీ చేస్తున్నారు. సినిమా సీరీస్‌లో ఎక్కడా రాంబోకు కొడుకు ఉన్నట్టు చూపించలేదు. కేవలం టీవీ సీరీస్ కోసమే ఈ కథను రెడీ చేస్తున్నారు. 1982లో తొలిసారిగా రాంబోగా కనిపించిన సిల్వస్టర్ స్టాలోన్, ఆ తరువాత నాలుగు భాగాల్లో అదే పాత్రలో కనిపించి మెప్పించాడు. ఈ సీరీస్ తోనే యాక్షన్ స్టార్‌గా భారీ ఇమేజ్ను సొంతం చేసుకున్నాడు. రాంబోతో పాటు ద ఎక్స్‌పాండబుల్స్ సీరీస్‌ను కూడా టీవీ షోగా రూపొందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు స్టాలోన్. -
హృతిక్ రహస్యం తెలిసిపోయింది
ముంబై: నలభై ఏళ్లు దాటినా అద్భుతరీతిలో తన శరీరాకృతిని కాపాడుకోవడం వెనకున్న రహస్యాన్ని రివీల్ చేశాడు బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్. చిన్నప్పటినుంచి తను ఎంతగానో ఆరాధించే హాలీవుడ్ యాక్షన్ హీరో సిల్వెస్టర్ స్టాలోన్ అందించిన స్ఫూర్తితోనే ఇది సాధ్యమయిందని మంగళవారం ట్విట్టర్ లో వెల్లడించాడు. 'నిన్న (జులై 6) నా అభిమాన హీరో (సిల్వెస్టర్) బర్త్ డే. ప్రతిరోజు నన్నునాకు నేను కొత్తగా, మరింత దృఢంగా మారేలా స్టాలోన్ నన్ను ఇన్స్పైర్ చేశారు. అందుకోసం ఆయనకు కేవలం థ్యాంక్స్ చెబితే సరిపోదనుకుంటా' అని పేర్కొన్నాడు. ప్రస్తుతం అశుతోష్ గోవారికర్ రూపొందిస్తున్న 'మొహంజదారో' సినిమాలో హృతిక్ లీడ్‌రోల్ చేస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని సమకూర్చుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్. -
'సల్మాన్.. మనం ఇద్దరూ ఓ సినిమా చేయాలి'
ముంబై: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, హాలీవుడ్ స్టార్ సిల్వస్టర్ స్టాలిన్ ఒకర్నొకరు ప్రశంసించుకున్నారు. 'అద్భుత ప్రతిభ ఉన్న భారత సూపర్ స్టార్' అంటూ సల్మాన్‌కు స్టాలిన్ కితాబిచ్చారు. ఇద్దరం కలసి ఓ యాక్షన్ సినిమా చేయాలని స్టాలిన్ ట్వీట్ చేశారు. అంతకుముందు సల్మాన్ తన ఫాలోయర్లను ఉద్దేశిస్తూ హాలీవుడ్ స్టార్ సిల్వస్టర్ స్టాలిన్‌ను ఫాలో కావాలని ట్వీట్ చేశారు. 'స్టాలిన్ మీ హీరోకే హీరో' అంటూ సల్మాన్ ట్విటర్లో పేర్కొన్నారు. ట్విటర్లో సల్మాన్‌కు కోటి 20 లక్షల మంది ఫాలోయర్లున్నారు. స్టాలిన్ సల్మాన్‌కు కృతజ్ఞతలు చెబుతూ ఇద్దరం కలసి ఓ సినిమా చేయాలని ఉందని ట్వీట్ చేశారు. -
సల్మాన్ అభిమాన హీరో ఎవరో తెలుసా?
ముంబై: హిందీ సినీ ప్రేక్షకులనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా అభిమానుల మనసు దోచుకున్న బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్. మరి ఈ కండల వీరుడికి అభిమాన హీరో ఎవరో తెలుసా? బజరంగీ భాయిజాన్ సినిమాతో ప్రేక్షకులకు మరోసారి దగ్గరవుతున్న సల్లూభాయ్.. శుక్రవారం ఉదయం తన అభిమానులతో ఒక ట్వీట్‌ను పంచుకున్నాడు. ఒక హాలీవుడ్ హీరోని ఫాలో కమ్మంటూ తన అభిమానులకు సలహా ఇచ్చాడు. ''మీరు ఎవరినైనా ఫాలో అవ్వాలనుకుంటే హాలీవుడ్ హీరోని ఫాలో కండి.. ఎందుకంటే ఆయన మీ అభిమాన హీరోకి అభిమాన హీరో. ఆయనే సిల్విస్టర్ స్టాలోన్'' అంటూ ట్వీట్ చేశాడు బాలీవుడ్ కండల వీరుడు. హిట్ అండ్ రన్ కేసులో బెయిల్ లభించడంతో మంచి ఊపుమీదున్న సల్మాన్.. ప్రస్తుతం బజరంగీ భాయిజాన్ తదితర సినిమాల షూటింగ్ పనుల్లో మునిగి తేలుతున్నాడు. పనిలోపనిగా ట్విట్టర్‌తో కూడా అలరిస్తున్నాడు. దాంతో.. సల్మాన్ ఫేవరెట్ హీరో సిల్వస్టర్ స్టాలోన్ అన్నమాట అని అనుకుంటున్నారట ఆయన అభిమానులు!! Agar kisi ko follow karna hai? Bahar ka... inko follow karo @TheSlyStallone Aapke Hero ka hero Sylvester Stallone — Salman Khan (@BeingSalmanKhan) May 21, 2015 -
శునకంపై విశ్వాసం!
శునకం మనిషికి అత్యంత విశ్వాసపాత్రమైన జంతువు. ఇలాంటి జంతువుపై కొందరు మనుషుల్లో ఎంతో విశ్వాసం ఉంటుంది. అపారమైన ప్రేమ ఉంటుంది. అలాంటి వారిలో ఒకరు హాలీవుడ్ సుప్రసిద్ధనటుడు సిల్వెస్టర్ స్టాలోన్. తన కెరీర్ ఆరంభంలో తన పెంపుడు కుక్క గురించి పడ్డ తపన చాలా గొప్పది. ఆ మూగజీవి విషయంలో ఆయన వ్యవహరించిన తీరు అబ్బురమనిపిస్తుంది. ఫుడ్డుకు లాటరీ కొడుతున్న దశలో సిల్వెస్టర్ స్టాలోన్‌కు ఒక పెంపుడు కుక్క ఉండేది. సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న రోజుల్లో ఒకసారి చేతిలో ఉన్న డబ్బుఅయిపోయింది. ఇదే సమయంలో ఒక వ్యక్తి స్టాలోన్ పెంపుడుకుక్కను కొంటానని ముందుకు వచ్చాడు! అవసరం స్టాలోన్‌తో ఆ శునకాన్ని అమ్మించింది. రోజులు గడిచాయి.. అవకాశాలు కలిసి వచ్చాయి. స్టాలోన్‌కు మంచి సినిమా అవకాశం వచ్చింది. హీరో తనే, దర్శకుడు తనే! అడ్వాన్స్‌గా వేల డాలర్లు చేతిలో వచ్చి పడ్డాయి. ఆ డబ్బు చేతిలోకి రాగానే ఈ హీరో చేసిన మొదటి పని... తన శునకాన్ని కొనుకొన్న వ్యక్తిని కలవడం. తన పెట్‌ను తనకు తిరిగి ఇవ్వమని, ఎంత డబ్బయినా ఇస్తానని బతిమిలాడాడు. అవతలి వ్యక్తి స్టాలోన్‌కు తన పెట్ డాగ్ మీద ఉన్న ప్రేమను క్యాష్ చేసుకొన్నాడు. 50 డాలర్లకు కొన్న శునకాన్ని స్టాలోన్కే తిరిగి 15వేల డాలర్లకు అమ్మాడు. తన తొలి సంపాదనగా వచ్చిన మొత్తం డబ్బును అతడికిచ్చి తన శునకాన్ని తెచ్చుకున్నాడు. తర్వాతి కాలంలో తన సినిమాల్లో కూడా ఆ శునకాన్ని నటింపజేశాడు ఈ దర్శకహీరో! -
డేటింగ్ వద్దని చెప్పినా.. నా కూతుళ్లు వినలేదు
లండన్: డేటింగ్‌కు అనుమతించబోవద్దని తన కూతుళ్లకు ఇప్పటికే చెప్పానని ప్రముఖ హాలీవుడ్ నటుడు సిల్వెస్టర్ స్టాలోన్ అన్నారు. 40 సంవత్సరాలు వచ్చేవరకు అలాంటి పనులకు అంగీకరించవద్దని తాను సలహా ఇచ్చానని అయితే, ఈ విషయంపై అంతా తనపై గొడవపడి తన మాట వినలేదని అన్నారు. ఎక్స్‌పాండబుల్ వంటి బ్లాక్ బ్లస్టర్ హిట్ చిత్రాల్లోనటించిన ఆయన తనకు సోఫియా(18), సిస్టీన్ (16), స్కార్లెట్ (13) అనే ముగ్గురు కూతుర్లు ఉన్నారని చెప్పారు. నాలుగేళ్ల క్రితమే ఓ అబ్బాయి తన పెద్దమ్మాయిని డేటింగ్‌కు పిలిస్తే తండ్రిగా అనుమతించేందుకు నిరాకరించానని చెప్పారు. '40 సంవత్సరాలు దాటేవరకు డేటింగ్‌కు అనుమతించవద్దని నేను నాముగ్గురు కూతుర్లకు చెప్పాను. సోఫియాకు పద్నాలుగేళ్ల వయసున్నప్పుడు ఓ అబ్బాయి డేటింగ్కోసం అడిగాడు. ఒక తండ్రి స్థానంలో ఉండి నేను అనుమతించలేకపోయాను. కానీ, నా కూతురు నా మాట వినలేదు. చివరికి ఆమె బాయ్ ఫ్రెండ్‌కు నేను షేక్ హ్యాండ్ ఇవ్వాల్సి వచ్చింది. అయితే జాగ్రత్తలు కూడా చెప్పాను' అని ఆయన వివరించారు. -
ఆ పోటాపోటీయే మా ఎదుగుదలకు కారణం!
హాలీవుడ్ స్టార్ ఆర్నాల్డ్ ష్వార్జ్‌నెగర్, సిల్వెస్టర్ స్టాలెన్లకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నాయి. ఈ ఇద్దరూ నటించిన చిత్రాల జాబితా చెప్పాలంటే చాలానే ఉంది. ఆర్నాల్డ్ చేసిన ‘ది టెర్మినేటర్’, సిల్వెస్టర్ స్టాలెన్ చేసిన ‘రాంబో’ చిత్రాలను చూస్తే.. వీళ్లు ఏ స్థాయి నటులో అర్థమవుతుంది. మంచి యాక్షన్ హీరోలుగా పేరు తెచ్చుకున్న ఈ ఇద్దరూ 1980ల్లో పోటాపోటీగా సినిమాలు చేసేవాళ్లు. ఈ విషయాన్ని స్వయంగా ఆర్నాల్డే చెప్పారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆర్నాల్డ్ గతాన్ని నెమరువేసుకున్నారు. ముఖ్యంగా సిల్వెస్టర్ స్టాలెన్కూ, తనకూ మధ్య ఉన్న పోటీ గురించి చెబుతూ - ‘‘మాలో ఎవరు ఎక్కువ సినిమాలు చేస్తున్నారు? అనే విషయం నుంచి సినిమాల్లో ఎవరు ఎక్కువమంది విలన్లను చంపాం? ఎంత కొత్తగా చంపాం? అని చెక్ చేసుకునేవాళ్లం. ఫిట్నెస్ విషయంలో కూడా పోటీయే. ఎవరి సినిమా ఎక్కువ వసూలు చేసిందో చూసుకునేవాళ్లం. మా మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండేది కాదు. ఒకరినొకరు బాగా ద్వేషించుకునేవాళ్లం. పరిపక్వత లేకనే ఆ ద్వేషం. 1990లలో ఇద్దరికీ మానసిక పరిపక్వత పెరగడంతో స్నేహితులమయ్యాం. అయితే.. ఒక్కటి మాత్రం నిజం. మా మధ్య ఉన్న పోటీతత్త్వమే మా అభివృద్ధికి తోడ్పడింది. శత్రువులుండడం చాలా ముఖ్యం. ఆ శత్రువును ఢీ కొనడానికి పరుగులుపెడతాం, కష్టపడతాం. ఫలితంగా పైకొస్తాం. మా విషయంలో జరిగింది అదే’’ అని చెప్పారు. -
వారం ముందే సిల్వస్టర్ స్టాలెన్ చిత్రం ఇంటర్నెట్ లో లీక్
లాస్ ఎంజెలెస్: అత్తారింటికి దారేది చిత్రానికి ఎదురైన అనుభవమే సిల్వెస్టర్ స్టాలెన్ నటించిన 'ది ఎక్స్ పాండాబుల్స్ 3' సినిమాకు ఎదురైంది. విడుదలకు వారం రోజుల ముందే 'ది ఎక్స్ పాండాబుల్స్ 3' చిత్రం ఆన్ లైన్ లో లీకవ్వడం హాలీవుడ్ లో సంచలనం రేపుతోంది. పైరసీ వెబ్ సైట్ల ద్వారా కేవలం 24 గంటల్లోనే ఆన్ లైన్ లో ఇప్పటికే 189000 మంది డౌన్ లోడ్ చేసుకున్నట్టు వివరాలు అందాయని డిస్టిబ్యూటర్ వెరైటీ లైయన్స్ గేట్ మీడియాకు వెల్లడించారు. పైరసీ కాపీ క్లారిటీ అస్పష్టంగా ఉందని నెటిజన్లు కామెంట్స్ పోస్ట్ చేశారు. జూలై 23 తేది బుధవారం నుంచి గురువారం టొరెంటో షేరింగ్ సైట్స్ పైరసీ కాపీలు లభ్యమయ్యాయని చిత్ర నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రంలో సిల్వస్టర్ స్టాలెన్ జాసన స్టాథమ్, అంటానియో బాండెరస్, జెల్ లీ, ఆర్నాల్డ్ ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్, మెల్ గిబ్సన్ తదితరులు నటించారు. 2009లో ఎక్స్-మెన్ ఆరిజిన్స్ చిత్రం కూడా లీకైంది. తాజాగా లీకైన 'ది ఎక్స్ పాండాబుల్స్ 3' సుమారు 15 మిలియన్ల మంది డౌన్ లోడ్ చేసుకున్నారని ఫాక్స్ డిస్టిబ్యూటర్ కంపెనీ తెలిపింది. -
జాన్ రాంబో మళ్లీ వస్తున్నాడు!
ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన ‘రాంబో’ యాక్షన్ సిరీస్ సినిమాల గురించి ప్రత్యేకంగా వివరించనవసరంలేదు. సిల్వెస్టర్ స్టాలోన్‌ను హాలీవుడ్ సూపర్ స్టార్ చేసిన సినిమాలు అవి. రాంబో పాత్రను స్టాలోన్ మొదటిసారి పోషించిన చిత్రం ‘ఫస్ట్ బ్లడ్’. 1982లో ఈ చిత్రం విడుదలైంది. ఇందులో ఆయన చేసిన పోరాట దృశ్యాలు చూసి, ప్రేక్షకులు థ్రిల్ అయిపోయారు. ఈ చిత్రానికి లభించిన ఆదరణతో ఆ తర్వాత మరో మూడు రాంబో సిరీస్ చిత్రాల్లో నటించారు స్టాలోన్. ఆ విధంగా ఇప్పటివరకు నాలుగు సిరీస్‌లు వచ్చాయి. నాలుగోది 2008లో విడుదలైంది. ఈ నాలుగు రాంబో చిత్రాలకు మంచి ఆదరణ లభించింది. ఈ నేపథ్యంలో ఐదోసారి రాంబోగా కనబడటానికి స్టాలోన్ సిద్ధమయ్యారు. ఈ చిత్రంలో నటించడంతో పాటు స్క్రీన్‌ప్లే కూడా ఆయనే సమకూరుస్తున్నారు. మొదటిసారి జాన్ రాంబో పాత్ర చేసినప్పుడు స్టాలోన్ వయసు దాదాపు 36 ఏళ్లు. ఇప్పుడాయన వయసు 67. మరి.. ఈ వయసులో పూర్తి స్థాయి యాక్షన్ రోల్ చేయడం అంటే చిన్న విషయం కాదు. ఆ విషయం స్టాలోన్‌కి తెలియకేం కాదు. కానీ, తన అభిమానులను నిరుత్సాహపరచకూడదనే పట్టుదలతో ఈ సినిమా కోసం వర్కవుట్లు చేస్తున్నారట స్టాలోన్. -
లక్ష్యం: తన జీవితానికి తనే స్కిప్టు రాసుకున్నాడు
కొంతమందికి జీవితంలో ఒకటే లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్యాన్ని చేరుకొనే వరకూ వారు విశ్రమించరు. ఎన్ని దుర్భర పరిస్థితులు ఎదుర్కొన్నా వారు తమ లక్ష్యసాధన విషయంలో వెనక్కుతగ్గరు. అలా వెనక్కు తగ్గని వ్యక్తే... ప్రఖ్యాత హాలీవుడ్ నటుడు, రచయిత, దర్శకుడు సిల్వెస్టర్ స్టాలోన్. అవి 1970ల నాటి రోజులు... వర్షంలో లాస్ఏంజెలెస్ నగరం మెరిసిపోతోంది. హాలీవుడ్‌కు వేదిక అయిన ఆ నగరానికి చాలా రోజుల తర్వాత వచ్చాడు ఆ యువకుడు. అతడి పేరు స్టాలోన్. చిన్న చిన్న తుంపర్లు పడుతున్న ఉదయం పూట రోడ్డుపై తన పెంపుడు కుక్కతో కలిసి నడుచుకొంటూ వెళుతున్న తనను పట్టించుకోని జనాలను చూస్తుంటే అతడికి నవ్వు ముంచుకొస్తోంది. తను ఎప్పటికైనా పెద్దస్టార్ను అవుతానని, అంతర్జాతీయ స్థాయిలో గొప్ప పేరు ప్రఖ్యాతులను సంపాదించుకొంటానని అతడికి తెలుసు. ఆ ఆత్మవిశ్వాసంలోంచి వచ్చినది ఆ నవ్వు. ఉన్న ఫలంగా అతడు హాలీవుడ్‌కి రావడానికి కారణం మహ్మద్ అలీ! అంతకు కొన్ని రోజుల క్రితమే అమెరికన్ బాక్సింగ్ చరిత్రలో కొత్త సూర్యుడిలా ఉదయించాడు మహ్మద్ అలీ. అండర్‌డాగ్‌గా బరిలోకి దిగి డిఫెండింగ్ ఛాంపియన్ అయిన వెపనర్ను ఓడించాడు అలీ. ఆ మ్యాచ్‌ను లైవ్‌లో చూసిన లక్షలాది మందిలో స్టాలోన్ ఒకడు. అందరూ అలీని చూసి అబ్బురపడుతుంటే, అతడి విజయం స్ఫూర్తిగా ఒక సినిమా స్క్రిప్ట్‌ను రెడీ చేశాడు స్టాలోన్. అది ప్రపంచ సినీ చరిత్రపై గొప్ప ప్రభావం చూపగల స్క్రిప్ట్ అని స్టాలోన్‌కు అవగాహన ఉంది. అందుకే ఆ సినిమాకు తనే దర్శకత్వం వహించాలి, తనే హీరోగా ఉండాలనేది అతడి ఉద్దేశం. ఒకే దెబ్బకు రెండు పిట్టలు. హాలీవుడ్లో తన పేరు వ కాబోయే హీరోగారి ఆలోచనలు ఇలా ఉంటే... అతడి స్టోరీ లైన్‌ను విన్న నిర్మాతలు మాత్రం పెదవి విరచసాగారు. ఒకటి కాదు రెండు కాదు.. అనేక ప్రొడక్షన్ హౌస్‌ల దగ్గరకు వెళ్లి కథను వినిపించిన ఎవ్వరూ మెచ్చలేదు. సినిమాగా రూపొందించడానికి పెట్టుబడి పెడతామని అనలేదు. అనాథలా పెరిగి, సొంత కష్టంతో సంపాదించుకొన్న సొమ్మంతా ఖర్చయిపోయింది. లాస్ఏంజెలెస్ వచ్చిన కొన్ని వారాల తర్వాత ఒక లిక్కర్ హౌస్ ముందు వచ్చి నిలబడ్డాడు. లోపలకు వె ళదామంటే డబ్బుల్లేవు. అటుగా వెళుతున్న ఒక సీనియర్ సిటిజన్ చూపు స్టాలోన్ దగ్గరున్న పెంపుడి కుక్కపై పడింది. ‘అమ్ముతావా?’ అని అడిగాడు! 50 డాలర్లు ఇస్తాననాన్నడు. అమెరికన్లకు పెట్ అంటే ఎంతో ప్రేమ. స్టాలోన్ కూడా మనస్తత్వం విషయంలో సగటు అమెరికన్. ఆ శునకాన్ని అమ్ముకోవడం అంటే అంతకన్నా పతనస్థితి లేదని భావించాడు. అయితే తను అదే స్థితిలో ఉన్నానని గ్రహించాడు. శునకాన్ని అమ్మేశాడు! మళ్లీ ప్రొడ క్షన్ హౌస్ చుట్టూ చక్కర్లు. ఈ సారి పరిస్థితి కొంచెం సానుకూలంగా కనిపించింది. మీరు రాసిన స్క్రిప్ట్ఇస్తే లక్ష డాలర్లు ఇస్తానని ఆఫర్ చేశాడు ఒక నిర్మాత! పెట్‌ను 50 డాలర్లకు అమ్ముకొన్న మనిషికి ఒక్కసారిగా లక్ష డాలర్ల ఆఫర్వస్తే... హాలీవుడ్‌కి రచయితగా పరిచయం చేస్తాను అని హామీ ఇస్తే... ఒక్కసారిగా ఎగిరి గంతేయాలి. అయితే స్టాలోన్ అలా చేయలేదు. తన స్క్రిప్ట్‌కు తనే హీరో, అది సినిమాగా రూపొందితే స్క్రీన్‌పై తనే కనపడాలి. ఇదే విషయాన్ని ఆ నిర్మాతకు చెప్పాడు! అతడు నవ్వుకొన్నాడు..! స్టాలోన్ కోరికను చూసి అలా వికటాట్ట హాసం చేసిన నిర్మాతల సంఖ్య క్రమంగా పెరుగుతూ వస్తోంది. నాలుగు లక్షల డాలర్లు ఇస్తాం.. స్క్రిప్ట్మాకు అప్పజెప్పు అని కోరిన వాళ్లూ ఉన్నారు. అయినా స్టాలోన్ లొంగలేదు! తన స్క్రిప్ట్‌కు తనే హీరో. తినడానికి తిండిలేని దశలో కూడా లక్ష్యం విషయంలో అతడి మొండితనానికి మొదట ఆశ్చర్యపోయిన ఒక నిర్మాతకు తర్వాత ముచ్చటేసింది. నిన్నే హీరోగా పెడతాను. మరి ఇచ్చే డబ్బు నాలుగు లక్షల డాలర్లు కాదు పాతికవేల డాలర్లే అన్నాడు. ఆనందంగా ఆ ప్రతిపాదనకు ఓకే చెప్పి, అడ్వాన్స్ తీసుకొని రోడ్డు మీదకు వచ్చాడు. తన శునకాన్ని కొన్న సీనియర్ సిటిజన్ అడ్రస్ అతడి మనసులో ఉంది. స్టాలోన్‌కు ఆ పెట్‌పై ఉన్న ప్రేమను తన అవకాశంగా తీసుకొన్నాడు ఆ సీనియర్ సిటిజన్. ఫలితంగా 50 డాలర్లకు అమ్మిన కుక్కపిల్లను 15,000 డాలర్లు చెల్లించి దాన్ని వెనక్కు తెచ్చుకొన్నాడు స్టాలోన్. స్టాలోన్, ఆ కుక్కపిల్ల ఇద్దరూ అనందంగా బయటకు వచ్చారు. ఇద్దరూ కలిసి ఒక సినిమాలో కూడా కనిపించారు. ఆ సినిమానే ‘రాఖీ’. బాక్సర్ అలీ స్ఫూర్తితో సిల్వస్టర్ స్టాలోన్ తయారు చేసుకొని, హీరోగా తెరకెక్కించిన స్క్రిప్ట్. అంత వరకూ హాలీవుడ్ చరిత్రలోని ఎన్నో రికార్డులను తుడిచిపెట్టింది ఆ సినిమా. స్టాలోన్‌ను స్టార్‌ను చేసింది. ఉత్తమ చిత్రంగా అకాడమీ అవార్డును అందుకొంది. ఎంతకష్టంలోనైనా రాజీ పడక పోరాడితే ఫలితం ఉంటుందనడానికి స్టాలోన్ జీవితానికి మించిన ఉదాహరణ ఉండదేమో! - జీవన్ రెడ్డి.బి