డేటింగ్ వద్దని చెప్పినా.. నా కూతుళ్లు వినలేదు | I told my three daughters they weren't allowed to date, says Sylvester Stallone | Sakshi
Sakshi News home page

డేటింగ్ వద్దని చెప్పినా.. నా కూతుళ్లు వినలేదు

Published Wed, Apr 15 2015 12:02 PM | Last Updated on Sun, Sep 3 2017 12:20 AM

డేటింగ్ వద్దని చెప్పినా.. నా కూతుళ్లు వినలేదు

డేటింగ్ వద్దని చెప్పినా.. నా కూతుళ్లు వినలేదు

లండన్: డేటింగ్కు అనుమతించబోవద్దని తన కూతుళ్లకు ఇప్పటికే చెప్పానని ప్రముఖ హాలీవుడ్ నటుడు సిల్వెస్టర్ స్టాలోన్ అన్నారు. 40 సంవత్సరాలు వచ్చేవరకు అలాంటి పనులకు అంగీకరించవద్దని తాను సలహా ఇచ్చానని అయితే, ఈ విషయంపై అంతా తనపై గొడవపడి తన మాట వినలేదని అన్నారు. ఎక్స్పాండబుల్ వంటి బ్లాక్ బ్లస్టర్ హిట్ చిత్రాల్లోనటించిన ఆయన తనకు సోఫియా(18), సిస్టీన్ (16), స్కార్లెట్ (13) అనే ముగ్గురు కూతుర్లు ఉన్నారని చెప్పారు.

నాలుగేళ్ల క్రితమే ఓ అబ్బాయి తన పెద్దమ్మాయిని డేటింగ్కు పిలిస్తే తండ్రిగా అనుమతించేందుకు నిరాకరించానని చెప్పారు.  '40 సంవత్సరాలు దాటేవరకు డేటింగ్కు అనుమతించవద్దని నేను నాముగ్గురు కూతుర్లకు చెప్పాను. సోఫియాకు పద్నాలుగేళ్ల వయసున్నప్పుడు ఓ అబ్బాయి డేటింగ్కోసం అడిగాడు. ఒక తండ్రి స్థానంలో ఉండి నేను అనుమతించలేకపోయాను. కానీ, నా కూతురు నా మాట వినలేదు. చివరికి ఆమె బాయ్ ఫ్రెండ్కు నేను షేక్ హ్యాండ్ ఇవ్వాల్సి వచ్చింది. అయితే జాగ్రత్తలు కూడా చెప్పాను' అని ఆయన వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement