‘రాంబో’రాజ్ సిల్వెస్టర్ స్టాలోన్‌కి వైఫ్ బ్రిజిట్టే నియల్సెన్ నుంచి సర్టిఫికేట్ వచ్చేసింది. ‘‘ఎవరితోనూ మా ఆయన అసభ్యంగా ప్రవర్తించలేదు. అవన్నీ కట్టు కథలే’’ అని స్టేట్‌మెంట్ ఇచ్చారామె. అసలెందుకు బ్రిజిట్టే తన భర్తని ఎందుకు వెనకేసుకు రావాల్సి వచ్చిందంటే... 1986లో (స్టాలోన్‌కి 40 ఏళ్ల వయసున్నప్పుడు) లాస్ వేగాస్‌లో 16 ఏళ్ల అమ్మాయిపై బాడీగార్డుతో కలసి అఘాయిత్యం చేశారనే వార్త తాజాగా బయటకొచ్చింది. ‘‘అఘాయిత్యం చేశాక స్టాలోన్ ‘మనం పెళ్లైన వాళ్లమే కదా. నిజం చెప్పినా నమ్మరేమోనని ఆ అమ్మాయి ఎవరికీ చెప్పలేదు.
ఒకవేళ చెప్పిందో... తల పగిలేలా కొడదాం’’ అని బాడీగార్డ్‌తో చెప్పినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడయిందని ‘డైయిలీ మెయిల్’ సంస్థ పేర్కొంది. ‘‘మాకప్పుడే (1986లో) పెళ్లైంది. నేను ఆయన్ను విడిచి ఒక్క క్షణం కూడా ఉండేదాన్ని కాదు. రాత్రి ఎనిమిదిన్నరకు షూటింగ్ టైమ్‌లో ఘటన జరిగిందని వాళ్లు చెబుతున్నారు. కానీ, అప్పట్లో డే టైమ్‌లో షూటింగ్ జరిగింది. ఆయన యాక్ట్ చేస్తుంటే... షూటింగులో నేను ఆయన్నే చూస్తుండేదాన్ని.
డిన్నర్ తర్వాత మా రూమ్‌కి వెళ్లేవాళ్లం. హోటల్ రూమ్‌లో ఆయనతో నేను తప్ప ఎవరూ లేరు. చేయని తప్పుకు సిల్వెస్టర్ స్టాలోన్, ఆయన ఫ్యామిలీ మెంబర్స్ ఎన్నో నిందలు పడుతున్నారు’’ అని బ్రిజిట్టే పేర్కొన్నారు. మాజీ భర్తకు బ్రిజిట్టే ఇచ్చిన మద్దతు చూసి హాలీవుడ్ జనాలు నోరెళ్లబెట్టారు. ఎందుకంటే... వీళ్లు కలిసున్నది రెండేళ్లే. 1985లో పెళ్లైతే... 87లో విడాకులు తీసుకున్నారు. కానీ, స్టాలోన్ తప్పు చేశాడని ఆరోపించిన టైమ్‌లో ఆమె వైఫ్ మరి! ఏది ఏమైనా... ‘రాంబో’ సిరీస్‌తో అమెరికాలోనూ, ఇండియా లోనూ, ప్రపంచ వ్యాప్తంగానూ ప్రేక్షకుల్లో ఎంతో పేరు తెచ్చుకున్న సిల్వెస్టర్ స్టాలోన్‌కి 71 ఏళ్ల వయసులో ఇది ఇబ్బందికరమైన పరిస్థితే!!
Comments
Please login to add a commentAdd a comment