సల్మాన్ అభిమాన హీరో ఎవరో తెలుసా? | Salman Khan's hero is Sylvester Stallone | Sakshi
Sakshi News home page

సల్మాన్ అభిమాన హీరో ఎవరో తెలుసా?

Published Fri, May 22 2015 4:27 PM | Last Updated on Wed, Apr 3 2019 9:02 PM

సల్మాన్  అభిమాన హీరో ఎవరో తెలుసా? - Sakshi

సల్మాన్ అభిమాన హీరో ఎవరో తెలుసా?

ముంబై: హిందీ సినీ ప్రేక్షకులనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా అభిమానుల మనసు దోచుకున్న బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్. మరి ఈ కండల వీరుడికి అభిమాన హీరో ఎవరో తెలుసా? బజరంగీ భాయిజాన్ సినిమాతో ప్రేక్షకులకు మరోసారి దగ్గరవుతున్న సల్లూభాయ్.. శుక్రవారం ఉదయం తన అభిమానులతో ఒక ట్వీట్ను పంచుకున్నాడు. ఒక హాలీవుడ్ హీరోని ఫాలో కమ్మంటూ తన అభిమానులకు సలహా ఇచ్చాడు.  

''మీరు ఎవరినైనా ఫాలో అవ్వాలనుకుంటే హాలీవుడ్ హీరోని ఫాలో కండి.. ఎందుకంటే ఆయన మీ అభిమాన హీరోకి అభిమాన హీరో. ఆయనే సిల్విస్టర్ స్టాలోన్'' అంటూ ట్వీట్ చేశాడు బాలీవుడ్ కండల వీరుడు.

హిట్ అండ్ రన్ కేసులో బెయిల్ లభించడంతో మంచి ఊపుమీదున్న సల్మాన్.. ప్రస్తుతం బజరంగీ భాయిజాన్ తదితర  సినిమాల షూటింగ్ పనుల్లో మునిగి తేలుతున్నాడు. పనిలోపనిగా ట్విట్టర్తో కూడా అలరిస్తున్నాడు. దాంతో.. సల్మాన్ ఫేవరెట్ హీరో సిల్వస్టర్ స్టాలోన్ అన్నమాట అని అనుకుంటున్నారట ఆయన అభిమానులు!!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement