'సల్మాన్.. మనం ఇద్దరూ ఓ సినిమా చేయాలి' | Should do an action film together: Stallone tweets to Salman | Sakshi
Sakshi News home page

'సల్మాన్.. మనం ఇద్దరూ ఓ సినిమా చేయాలి'

Published Sat, May 23 2015 12:55 PM | Last Updated on Sun, Sep 3 2017 2:34 AM

'సల్మాన్.. మనం ఇద్దరూ ఓ సినిమా చేయాలి'

'సల్మాన్.. మనం ఇద్దరూ ఓ సినిమా చేయాలి'

ముంబై: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, హాలీవుడ్ స్టార్ సిల్వస్టర్ స్టాలిన్ ఒకర్నొకరు ప్రశంసించుకున్నారు. 'అద్భుత ప్రతిభ ఉన్న భారత సూపర్ స్టార్' అంటూ సల్మాన్కు స్టాలిన్ కితాబిచ్చారు. ఇద్దరం కలసి ఓ యాక్షన్ సినిమా చేయాలని స్టాలిన్ ట్వీట్ చేశారు.

అంతకుముందు సల్మాన్ తన ఫాలోయర్లను ఉద్దేశిస్తూ హాలీవుడ్ స్టార్ సిల్వస్టర్ స్టాలిన్ను ఫాలో కావాలని ట్వీట్ చేశారు. 'స్టాలిన్ మీ హీరోకే హీరో' అంటూ సల్మాన్ ట్విటర్లో పేర్కొన్నారు. ట్విటర్లో సల్మాన్కు కోటి 20 లక్షల మంది ఫాలోయర్లున్నారు. స్టాలిన్ సల్మాన్కు కృతజ్ఞతలు చెబుతూ ఇద్దరం కలసి ఓ సినిమా చేయాలని ఉందని ట్వీట్ చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement