వారం ముందే సిల్వస్టర్ స్టాలెన్ చిత్రం ఇంటర్నెట్ లో లీక్
వారం ముందే సిల్వస్టర్ స్టాలెన్ చిత్రం ఇంటర్నెట్ లో లీక్
Published Mon, Jul 28 2014 1:20 PM | Last Updated on Sat, Sep 2 2017 11:01 AM
లాస్ ఎంజెలెస్: అత్తారింటికి దారేది చిత్రానికి ఎదురైన అనుభవమే సిల్వెస్టర్ స్టాలెన్ నటించిన 'ది ఎక్స్ పాండాబుల్స్ 3' సినిమాకు ఎదురైంది. విడుదలకు వారం రోజుల ముందే 'ది ఎక్స్ పాండాబుల్స్ 3' చిత్రం ఆన్ లైన్ లో లీకవ్వడం హాలీవుడ్ లో సంచలనం రేపుతోంది.
పైరసీ వెబ్ సైట్ల ద్వారా కేవలం 24 గంటల్లోనే ఆన్ లైన్ లో ఇప్పటికే 189000 మంది డౌన్ లోడ్ చేసుకున్నట్టు వివరాలు అందాయని డిస్టిబ్యూటర్ వెరైటీ లైయన్స్ గేట్ మీడియాకు వెల్లడించారు. పైరసీ కాపీ క్లారిటీ అస్పష్టంగా ఉందని నెటిజన్లు కామెంట్స్ పోస్ట్ చేశారు.
జూలై 23 తేది బుధవారం నుంచి గురువారం టొరెంటో షేరింగ్ సైట్స్ పైరసీ కాపీలు లభ్యమయ్యాయని చిత్ర నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రంలో సిల్వస్టర్ స్టాలెన్ జాసన స్టాథమ్, అంటానియో బాండెరస్, జెల్ లీ, ఆర్నాల్డ్ ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్, మెల్ గిబ్సన్ తదితరులు నటించారు.
2009లో ఎక్స్-మెన్ ఆరిజిన్స్ చిత్రం కూడా లీకైంది. తాజాగా లీకైన 'ది ఎక్స్ పాండాబుల్స్ 3' సుమారు 15 మిలియన్ల మంది డౌన్ లోడ్ చేసుకున్నారని ఫాక్స్ డిస్టిబ్యూటర్ కంపెనీ తెలిపింది.
Advertisement
Advertisement