దర్శకుడు మారారు | Rohit Dhawan to direct Tiger Shroff in Rambo remake | Sakshi
Sakshi News home page

దర్శకుడు మారారు

Published Sat, Aug 29 2020 2:36 AM | Last Updated on Sat, Aug 29 2020 2:36 AM

Rohit Dhawan to direct Tiger Shroff in Rambo remake - Sakshi

‘రాంబో’లో..టైగర్‌ ష్రాఫ్‌

హాలీవుడ్‌ హీరో సిల్వెస్టర్‌ స్టాలోన్‌ సూపర్‌ హిట్‌ చిత్రం ‘రాంబో’ను కండలు తిరిగిన యంగ్‌ హీరో టైగర్‌ ష్రాఫ్‌తో హిందీలో రీమేక్‌ చేయాలనుకున్నారు దర్శకుడు సిద్ధార్థ్‌ ఆనంద్‌. అయితే తాజాగా ఈ చిత్రాన్ని సిద్ధార్థ్‌ ఆనంద్‌ డైరెక్ట్‌ చేయడంలేదని ప్రకటన విడుదల చేశారు. ప్రముఖ దర్శకుడు డేవిడ్‌ ధావన్‌ తనయుడు, హీరో వరుణ్‌ ధావన్‌ సోదరుడు రోహిత్‌ ధావన్‌ ‘రాంబో’ను డైరెక్ట్‌ చేయనున్నారు.

ప్రస్తుతం షారుక్‌తో ఓ సినిమా చేసే ప్లాన్‌లో ఉన్నారు దర్శకుడు సిద్ధార్థ్‌ ఆనంద్‌. దీంతో ఈ సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చిందట. కార్తీక్‌ ఆర్యన్‌తో ‘అల వైకుంఠపురములో’ చిత్రాన్ని హిందీలో రీమేక్‌ చేయనున్నారు రోహిత్‌ ధావన్‌. ఈ సినిమా తర్వాత ‘రాంబో’ని తెరకెక్కిస్తారు. ఈలోగా ‘హీరో పంతీ 2’ చిత్రాన్ని పూర్తి చేస్తారు టైగర్‌. 2021 చివర్లో ‘రాంబో’ సినిమా సెట్స్‌ మీదకు వెళ్లనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement