Rohit Dhawan
-
యంగ్ హీరోకు నటి టబు వార్నింగ్!
Ala Vaikunthapurramuloo Bollywood Remake: బన్నీ నటించిన హిట్ చిత్రాల్లో అల వైకుంఠపురములో ముందు వరుసలో ఉంటుంది. ఈ సినిమా సక్సెస్‌పై కన్నేసిన బాలీవుడ్ హిందీ రీమేక్ తీయడానికి రెడీ అయిన విషయం తెలిసిందే! యంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ హీరోగా, కృతి సనన్ హీరోయిన్గా 'షెహజాదా' అన్న టైటిల్‌తో దీన్ని తెరకెక్కిస్తున్నారు. తెలుగులో త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను హిందీలో రోహిత్ ధావన్ డీల్ చేస్తున్నారు. ఏక్తా కపూర్, అల్లు అరవింద్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీలో టబు పాత్రలో బాలీవుడ్ నటి మనీషా కొయిరాల నటిస్తోంది. వచ్చే ఏడాది నవంబర్ 4న రిలీజ్ కానుంది. తాజాగా హీరో కార్తీక్ దర్శకుడు రోహిత్‌తో కలిసి దిగిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ రోహిత్‌తో పనిచేయడం చాలా బాగుంది అని రాసుకొచ్చాడు. దీనికి టబు రిప్లై ఇస్తూ.. ఈ సినిమాను చాలా జాగ్రత్తగా తీయాలి అంటూ సరదాగా వార్నింగ్ ఇచ్చింది. దీనిపై కార్తీక్ ఆర్యన్ స్పందిస్తూ.. మీ సినిమాను మేము ఎంతో ప్రేమతో తీస్తున్నాం అని బదులిచ్చాడు. View this post on Instagram A post shared by KARTIK AARYAN (@kartikaaryan) -
దర్శకుడు మారారు
హాలీవుడ్ హీరో సిల్వెస్టర్ స్టాలోన్ సూపర్ హిట్ చిత్రం ‘రాంబో’ను కండలు తిరిగిన యంగ్ హీరో టైగర్ ష్రాఫ్‌తో హిందీలో రీమేక్ చేయాలనుకున్నారు దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్. అయితే తాజాగా ఈ చిత్రాన్ని సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేయడంలేదని ప్రకటన విడుదల చేశారు. ప్రముఖ దర్శకుడు డేవిడ్ ధావన్ తనయుడు, హీరో వరుణ్ ధావన్ సోదరుడు రోహిత్ ధావన్ ‘రాంబో’ను డైరెక్ట్ చేయనున్నారు. ప్రస్తుతం షారుక్‌తో ఓ సినిమా చేసే ప్లాన్‌లో ఉన్నారు దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్. దీంతో ఈ సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చిందట. కార్తీక్ ఆర్యన్‌తో ‘అల వైకుంఠపురములో’ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయనున్నారు రోహిత్ ధావన్. ఈ సినిమా తర్వాత ‘రాంబో’ని తెరకెక్కిస్తారు. ఈలోగా ‘హీరో పంతీ 2’ చిత్రాన్ని పూర్తి చేస్తారు టైగర్. 2021 చివర్లో ‘రాంబో’ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. -
మళ్లీ బడికి!
శ్రీలంక భామ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ మళ్లీ బడికి వెళుతున్నారట. ఆశ్చర్యంగా ఉందా?... ఆమె వెళుతున్నది పాఠశాలకు కాదు... యాక్టింగ్ స్కూల్‌కు. అక్షయ్‌కుమార్ ‘బ్రదర్స్’ చిత్రంలో నటి ంచిన జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఇప్పుడు ‘డిష్యుం’ అనే చిత్రంలో నటించనున్నారు. వరుణ్ ధావన్, జాన్ అబ్రహాం హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రానికి రోహిత్ ధావన్ దర్శకుడు. ఈ చిత్రంలో సంభాషణలకు చాలా ప్రాధాన్యం ఉందట. హిందీ భాష పలకడం జాక్వెలిన్‌కి కొంచెం కష్టమే. అందుకే షూటింగ్ ఆరంభించేలోపు ఆమెకు హిందీ నేర్పించాలని చిత్ర దర్శక, నిర్మాతలు అనుకున్నారట. జాక్వెలిన్‌ని వినోద్ తరణి యాక్టింగ్ స్కూల్‌కు పంపించాలని డిసైడ్ అయిపోయారట.