Rambo
-
కొత్త జీవితం.. ఆడపిల్ల భారమా?!
ఆడపిల్లనా?! తీసేయ్... పారేయ్... వదిలేయ్.. ఈ మాటలు భారతావనిలో ఇంకా ఇంకా వినపడుతూనే ఉన్నాయి. వదిలేసినా.. పారేసినా.. ఆడపిల్ల .. తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుంటూనే ఉంది. సమాజంలో తన ఉనికిని చాటుతూనే ఉంది. అచ్చం జ్యోతి లా. కన్నతల్లి పారేసిన చెత్త కుప్పలో నుంచి వచ్చిన జ్యోతి మరికొందరు ఆడపిల్లల కళ్లల్లో ఆశాకిరణాలు నింపుతోంది. బీహార్ రాజధాని పట్నాలో పంతొమ్మిదేళ్ల క్రితం ఆడపిల్ల భారమనుకొని, పుట్టిన వెంటనే ఆ పసికందును చెత్త కుప్పలో పడేసిందో తల్లి. గుక్కపట్టి ఏడుస్తున్న పసిబిడ్డ రోదనలు విన్న భిక్షకురాలు కరీదేవి ఆ బిడ్డను తీసుకుంది. పదేళ్లు తనతో తిప్పుతూ పెంచింది. ఆమెతోపాటు భిక్షమెత్తుకుంటూ, చెత్తను సేకరిస్తూ పెద్దదయ్యింది ఆ పాప. ఇప్పుడు కెఫేలో ఉద్యోగం చేసుకుంటూ, తన కాళ్ల మీద తను జీవిస్తూ, 12వ తరగతి చదువుతోంది. చిన్నవయసు నేర్పిన పాఠాలతో కొత్త జీవితాన్ని నిర్మించుకుంటున్న ఆ అమ్మాయి పేరు జ్యోతి. ఇప్పుడు 19 ఏళ్లు. అనాథలైన పిల్లలు ఎవరైనా జంక్షన్లలో కనిపిస్తే అక్కడి పోలీసులు జ్యోతిని ఉదాహరణగా చూపిస్తున్నారు. ఆమెను స్ఫూర్తిగా తీసుకొని, జీవితాన్ని బాగుచేసుకోమని చెబుతున్నారు. జ్యోతి తను నడిచొచ్చిన దారుల గురించి చెబుతూ, సమాజాన్ని కొన్ని ప్రశ్నలు అడుగుతోంది.. ఒక మాంసపు ముక్కనా?! ‘‘నేను దాదాపు పదేళ్లు అడుక్కున్నాను. నా ఒంటికి చెత్త అంటుకోని క్షణం లేదు. రోడ్డు మీద ఎన్నో ఏళ్ల రాత్రులు గడిపాను. నేను ఆడపిల్లను కాబట్టి ఓ మాంసపు ముక్కలా చెత్తలో పడేశారు. అదే, అబ్బాయి అయితే ఇంత అవమానం జరిగి ఉండేది కాదు. మా అమ్మ నన్ను ఎందుకు పారేసిందో నాకు తెలియదు. నన్ను తన పొత్తిళ్లలోకి తీసుకుంది కరీదేవి అమ్మ. భిక్షాటన చేసుకుంటూ బతికేది. మా పాట్నా జంక్షన్ లో రోడ్డుపక్కన నన్ను చూసుకోవడం మొదలుపెట్టినప్పుడే ఇదంతా నాకు తెలిసింది. పదేళ్లు అదే పాట్నా జంక్షన్ లో నేనూ భిక్షాటన చేశాను. చెత్తను సేకరించాను. ఈ మధ్యలో కరీదేవి అమ్మ చనిపోయింది. అప్పటినుంచి ఆమె కొడుకు రాజ్దేవ్ పాశ్వాన్ నన్ను పెంచాడు. ఈ ఇద్దరు లేకపోతే నేను ఈ రోజున ఇలా ఉండేదాన్నే కాదు. ఏడుపుతోనే రోజెందుకు మొదలయ్యేది?! పదేళ్లు భిక్షాటన చేస్తూ చెత్తను సేకరించాను. ఆ అనుభవాలు నానుంచి ఎప్పటికీ దూరం కావు. అది అప్పుడు నా పని. చలి, ఎండా, వాన ఏ కాలమైనా చెత్తలో తిరగాలి. దొరికిన దానితో కడుపు నింపుకోవాలి. చెత్తలో పండు ముక్క కనిపించినప్పుడల్లా దానికోసం నా తోటి పిల్లలంతా పోట్లాడుకునేవాళ్లం. రైలులో సీసాలు తీయడం. రోజంతా భిక్షాటన చేస్తూ కూడబెట్టిన డబ్బుతో జీవనం. కరీదేవి అమ్మ పోయాక ఆమె కొంగు కూడా దూరమయ్యింది. గుడి బయట పడుకుంటే తెల్లవారు జామున 4 గంటల ప్రాంతంలో పూజారి వచ్చి, ముఖాన నీళ్లు చల్లి లేపేసేవాడు. ఏడుస్తూ మేలుకునేదాన్ని. అప్పటినుండి ఉదయం పని మొదలయ్యేది. సమాజానికి కూడా చిన్నచూపెందుకు?! చలికాలంలో ఎముకలు కొరికేసే చలి. చెత్తకుప్పల దగ్గర ఉండే టెంట్లలాంటి ఇళ్లలో ఎలుకలు. ఎవరైనా దయతలిచి దుప్పటి ఇస్తే అవి ఎలుకలు కొరికేసేవి. చిరుగుల దుప్పటితో ఏళ్లు గడిచిపోయేవి. ఆడపిల్ల అనే శిక్ష నన్ను కన్నవాళ్లే కాదు సమాజం కూడా వేసింది. జంక్షన్ లో భిక్షాటన చేసే మనుషుల అకృత్యాలను చూసి భయపడి పారిపోయిన సంఘటనలు ఎన్నో. వయసు చిన్నదే అయినా అనుభవాలు పెద్దదాన్ని చేశాయి. సంజీవని దొరకకపోతే..! స్థానిక రాంబో హోమ్ ఫౌండేషన్ నా దుస్థితిని మార్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు క్రీడలు, ఆటలు చదవడం నేర్పించారు. అంతకుముందు చదువు అనే విషయం కూడా నాకు తెలియదు. ఆ ఇంటిని మొదటిసారి చూసి షాక్ అయ్యాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇల్లు అంటే ఎలా ఉంటుందో తెలిసింది. అలంకరించిన గదులు, బొమ్మలు చూశాను. నాలాంటి పిల్లలను ఇంకొంతమందిని కలుసుకున్నాను. దీంతో నన్ను వదిలేసిన తల్లి తిరిగి దొరికినంత సంబరంగా అనిపించింది. కొత్త స్నేహితులు కూడా దొరికారు. రోజంతా పెన్ను, పేపర్‌తో ఉండిపోయేదాన్ని. చదువువొక్కటే నా జీవితాన్ని మార్చేస్తుందని నాకనిపించింది. చిన్నతనంలో పట్నా జంక్ష¯Œ లో చదువుకోవడానికి వెళుతున్న నా ఈడు పిల్లలను చూసి, నాకు కూడా చదువుకోవాలనే కోరిక ఉండేది. అది తీరే కలేనా అనుకున్నాను. కానీ, నా కల నెరవేరేరోజు వచ్చింది. అక్షరాలు నేర్పించి, ఆరో తరగతి లో చేర్చారు ఫౌండేషన్ నిర్వాహకులు. మూడు నెలల కోర్స్... సంస్థ ద్వారా పాఠశాలకు వెళ్లాను. అక్కడున్న టీచర్లు చెప్పినవి శ్రద్ధగా విన్నాను. అయితే, ఎక్కువ రోజులు బడిలో కూర్చోలేదు. ఓపెన్‌గానే పదవతరగతి పరీక్ష రాసి పాసయ్యాను. ఇప్పుడు 12 వ తరగతి చదువుతున్నాను. చదువుతోపాటు లెమన్ కేఫ్‌లో పనిచేస్తున్నాను. కేఫ్‌లో పనిచేసే ముందు మూడు నెలల మార్కెటింగ్ కోర్సు కూడా చేశాను. ఆ తర్వాత సేల్స్‌గర్ల్‌గా ఆరునెలలు పనిచేశాను. ‘కేఫ్’ మేనేజర్ ప్రస్తుతం నేను బీహార్‌లోని లెమన్ కేఫ్‌కి మేనేజర్‌గా పనిచేస్తున్నాను. చదువుతోపాటు, ఉద్యోగమూ చేసుకుంటున్నాను. నా జీతంలో సగం డబ్బును నన్ను చదివించిన సంస్థకు విరాళంగా ఇస్తున్నాను. ఒకప్పుడు నేను పెరిగిన పట్నా జంక్షన్ మీదుగా అప్పుడప్పుడు వెళుతుంటాను. అక్కడ పోలీసులు నన్ను గుర్తుపట్టి, ఆప్యాయంగా పలకరిస్తారు. చదువు ఎలా సాగుతోందని, ఎలా ఉన్నావంటూ అడుగుతుంటారు. అక్కడ భిక్షాటన చేసే పిల్లలు ఎవరైనా ఉంటే చాలు .. పిలిచి మరీ నన్ను చూపించి వారికి పరిచయం చేస్తారు. ‘ఒకప్పుడు మీలాగే ఈ జ్యోతి ఉండేది. ఇప్పుడు చూడండి ఎలా మారిపోయిందో. మీరూ ఈ జ్యోతిలా తయారవ్వాలి. ఇలా భిక్షాటన చేయొద్దు. అందుకు, ఎక్కడుండాలో మేం చెబుతాం...’ అంటూ వారికి మంచి మాటలు చెబుతారు. నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. చెత్తకుప్పలో ఓ మాంసం ముక్క అనుకొని పడేసిన ఈ ఆడపిల్ల చనిపోలేదు. కానీ, ప్రతిరోజూ చస్తూ బతికింది. ఇప్పుడున్న ఈ జీవితంలో ఆడపిల్లల కోసం మంచిపని చేసే విధంగా మలుచుకోవాలని ఉంది. ఆ విధంగానే కృషి చేస్తున్నాను’’ అంటూ వివరిస్తుంది జ్యోతి. ‘ఆడపిల్ల అంటే ఎందుకంత చిన్నచూపు?’ అని ప్రశ్నించే జ్యోతిలాంటి అమ్మాయిలందరికీ సమాజం ఏం సమాధానం చెబుతుంది?! -
ప్రభాస్ ఆ సినిమాలో నటించడం లేదంట
ముంబై: గత కొన్ని రోజులుగా హిందీ రీమేక్ ‘రాంబో’లో టైగర్ ష్రాఫ్‌కు బదులుగా ప్రభాస్ నటిస్తున్నట్లు వార్తలు బాలీవుడ్లోనే కాక టాలీవుడ్‌లోనూ షికార్లు కొడుతున్నాయి. సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో టైగర్ ష్రాఫ్ కథానాయకుడిగా ‘రాంబో’ సినిమా చేస్తున్నట్లు మూడేళ్ల క్రితం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే కొన్ని కారణాల వల్ల ‘రాంబో’ చిత్రం లో టైగర్ నటించడం లేదని వస్తున్న వార్తలకు చెక్ పెడుతూ ష్రాఫ్ క్లారిటీ ఇచ్చాడు. ‘రాంబో’ చిత్రంలో తానే లీడ్ రోల్ పోషిస్తున్నట్లు పేర్కొన్న ష్రాఫ్ డేట్స్ కుదరక తనకు బదులుగా మరొక హీరోను తీసుకున్నట్లు వస్తున్న వార్తలు పుకార్లని తెలిపాడు. అలాగే చిత్ర దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్ కూడా ప్రభాస్‌ను రాంబో కోసం సంప్రదించినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని, ఎందుకంటే తను ఇంకా రాంబో యూనిట్‌తో టచ్‌లోనే ఉన్నట్లు తెలిపాడు. ప్రస్తుతం తను వరుస సినిమాలతో బిజీగా ఉన్న మాట వాస్తవమే అలాగే దర్శకుడు సిద్దార్థ్ కూడా షారఖ్ ఖాన్ హీరోగా ‘పఠాన్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ క్రమంలో సిద్దార్థ్ కూడా ఖాళీ లేకపోవడం కారణంతో రాంబో సినిమా కొంచం సమయం పడుతోంది తప్ప మరే కారణం లేదని వివరణ ఇచ్చాడు. సిల్వెస్టర్ స్టలోన్ హీరోగా నటించిన ‘రాంబో’ చిత్రానికి రిమేక్. ఈ చిత్రం హాలీవుడ్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. మరి బాలీవుడ్లో ఏ రేంజ్ హిట్ అవుతుందో చూడాలి. ( చదవండి: 6 ఏళ్ల తర్వాత అమితాబ్‌తో స్క్రీన్ షేర్ చేసుకోనున్న దీపికా ) -
దర్శకుడు మారారు
హాలీవుడ్ హీరో సిల్వెస్టర్ స్టాలోన్ సూపర్ హిట్ చిత్రం ‘రాంబో’ను కండలు తిరిగిన యంగ్ హీరో టైగర్ ష్రాఫ్‌తో హిందీలో రీమేక్ చేయాలనుకున్నారు దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్. అయితే తాజాగా ఈ చిత్రాన్ని సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేయడంలేదని ప్రకటన విడుదల చేశారు. ప్రముఖ దర్శకుడు డేవిడ్ ధావన్ తనయుడు, హీరో వరుణ్ ధావన్ సోదరుడు రోహిత్ ధావన్ ‘రాంబో’ను డైరెక్ట్ చేయనున్నారు. ప్రస్తుతం షారుక్‌తో ఓ సినిమా చేసే ప్లాన్‌లో ఉన్నారు దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్. దీంతో ఈ సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చిందట. కార్తీక్ ఆర్యన్‌తో ‘అల వైకుంఠపురములో’ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయనున్నారు రోహిత్ ధావన్. ఈ సినిమా తర్వాత ‘రాంబో’ని తెరకెక్కిస్తారు. ఈలోగా ‘హీరో పంతీ 2’ చిత్రాన్ని పూర్తి చేస్తారు టైగర్. 2021 చివర్లో ‘రాంబో’ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. -
నేను బతికే ఉన్నా! : సూపర్‌స్టార్
లాస్ఏంజిలిస్: సోషల్ మీడియా పుణ్యమా అని బతికున్న సెలబ్రిటీలను చనిపోయినట్లుగా ప్రచారం చేస్తున్నారు. ఇలా పలువురు సెలబ్రిటీలు బతికుండగానే వాళ్లు ఇక లేరంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరగగా... మళ్లీ సెలబ్రిటీలే ఏదో ఒక వేదికగా మేం క్షేమంగానే ఉన్నాం. ఎలాంటి ప్రమాదం జరగలేదు. బతికే ఉన్నామని చెప్పుకునే పరిస్థితులు తలెత్తుతున్నాయి. తాజాగా హాలీవుడ్ సూపర్ స్టార్ సిల్వెస్టర్ స్టాలోన్(71) చనిపోయినట్టు సోషల్ మీడియాలో వార్త చక్కర్లు కొట్టింది. ఇంటర్నెట్లో షేర్ అయిన ఫొటోలో హెయిర్ తక్కువగా ఉన్నాయనీ, ఆయనకు క్యాన్సర్ వచ్చి చనిపోయాడని జోరుగా ప్రచారం సాగింది. దీంతో స్టాలోన్ అభిమానుల్లో ఆందోళన మొదలైంది. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు ఆయనే స్వయంగా రంగంలోకి దిగారు. ‘‘ఇలాంటి వదంతులు పట్టించుకోవద్దు. నేను క్షేమంగా ఉన్నాను. సంతోషంగా, ఆరోగ్యంగా ఉన్న నేను.. ఇంకా పంచ్‌లు కొడుతున్నానంటూ’’ ట్వీటర్లో పేర్కొన్నారు. దీంతో ఆ రూమర్లకు ఫుల్స్టాప్ పడింది. సిల్వెస్టర్ సోదరుడు ఆ వదంతులపై స్పందిస్తూ... ఇలాంటి వార్తలను పుట్టించి, పోస్ట్ చేసే వారికి సొసైటీలో స్థానం ఉండకూడదని ట్వీట్ చేశాడు. స్టాలోన్‌పై ఇలాంటి వదంతులు రావడం ఇదేం మొదటిసారి కాదు. 2016లో బ్రిటీష్ మీడియా ఈ హాలీవుడ్ హీరో చనిపోయాడనీ కథనాన్ని ప్రచురించింది. చివరిగా స్టాలోన్ తన తాజా చిత్రం ‘క్రూడ్ 2’ ప్రమోషన్లో భాగంగా సోషల్ మీడియాలో ఆదివారం ఒక పోస్ట్ చేశాడు. కానీ అంతలోనే ఆయన చనిపోయారంటూ వదంతులు పుట్టుకొచ్చాయి. -
ఒకేసారి మూడు సినిమాలు చేస్తున్నాడు
శౌర్య, ఎటాక్ సినిమాలతో నిరాశపరిచిన యంగ్ హీరో మంచు మనోజ్, వరుస సినిమాలతో అభిమానులను అలరించడానికి రెడీ అవుతున్నాడు. గత సినిమాల అనుభవంతో రాబోయే సినిమాల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. యంగ్ హీరోలందరూ కమర్షియల్ ఫార్మాట్ లో సినిమాలో చేస్తుంటే మనోజ్ మాత్రం కొత్తగా ట్రై చేస్తున్నాడు. ఇప్పటికే సన్నాఫ్ పెదరాయుడు, రాంబో సినిమాల్లో నటిస్తున్న మనోజ్ ఈ రెండు సినిమాలతో పాటు మరో సినిమాను కూడా సెట్స్ మీదకు తీసుకు వచ్చాడు. తమిళ సినిమా రావణదేశం కు దర్శకత్వం వహించిన అజయ్ డైరెక్షన్ లో సినిమాను ప్రారంభించాడు. ఈ మూడు సినిమాల షూటింగ్ లలో పాల్గొంటున్న మనోజ్, వెంట వెంటనే రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నాడు. మరి ఈ సినిమాలైన మనోజ్ ను సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తాయేమో చూడాలి. -
ప్రైవసీ కావాలంటూ స్టార్ హీరో ఆందోళన!
ముంబయి బాంబు పేలుళ్ల కేసులో పుణె ఎరవాడ జైలులో శిక్ష అనుభవించి విడుదలైన బాలీవుడ్ హీరో సంజయ్ దత్. ఇకనుంచి తాను ఎవరికోసమూ సినిమా చేయనని చెప్పిన సంజయ్.. హాలీవుడ్ మూవీ రీమేక్ కోసం కసరత్తులు మొదలుపెట్టాడు. హాలీవుడ్ హీరో సిల్వెస్టర్ స్టాలోన్ నటించిన రాంబో మూవీని హిందీలో సంజయ్ చేస్తున్నాడు. ఈ మూవీలో చాలా యాక్షన్ సీన్లలో హీరో చాలా సీరియస్ పాత్రలో కనిపించాలి. గతంలో మాదిరిగా ఫిట్ గా కనిపించేందుకు సంజయ్ చెమటోడుస్తున్నాడు. అందులో భాగంగా సంజయ్ మూవీ కోసం శిక్షణ తీసుకుంటున్నాడు. ఎలా చిక్కిందో ఏమో గానీ, గ్లోవ్స్ తో సంజయ్ ఉన్న ఓ ఫొటో లీక్ అయింది. ఇక అంతే సంజయ్ కాస్త అప్ సెట్ అయ్యాడు. సినీ ఇండస్ట్రీ వ్యక్తులకు కాస్త ప్రైవసీ కావాలని, ప్రతి విషయంలో మా వెంట పడాలని భావించరాదని సూచించాడు. తన ఫొటోలు తీసి లీక్ చేస్తే, అభిమానులు అంచనాలతో అక్కడికి వస్తారని భావిస్తున్నట్లు చెప్పాడు. షైఫు కనిష్క శర్మ వద్ద సంజయ్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. వచ్చే నెలలో ఈ మూవీ షూటింగ్ స్టార్ కానుంది. ప్రి ప్రొడక్షన్ పనులు అన్నీ ముగిసినట్లు కథనాలు వస్తున్నాయి. తన పాలీ హిల్ ఇంట్లో గుట్టుగా సినిమా కోసం కసరత్తులు చేస్తున్న సంజయ్.. మమ్మల్ని ఇలా వదిలేయండీ, అభిమానులకు డైవర్ట్ చేసి వారు ఇక్కడికి వచ్చేలా చేసి తనకు, మూవీ యూనిట్ కు ఇబ్బందికర వాతావరణాన్ని సృష్టించవద్దని విజ్ఞప్తిచేశాడు. జైలు నుంచి తిరిగొచ్చాక ఆయన కాస్త మూడ్ ఆఫ్ లో ఉన్న విషయం మరోసారి వెల్లడైందని బాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. -
బాలీవుడ్ రాంబోగా హృతిక్
రాంబో పాత్రను సినీ అభిమానులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. హాలీవుడ్ యాక్షన్ స్టార్ సిల్వస్టర్ స్టాలోన్ హీరోగా నటించిన ఈ ఐకానిక్ పాత్ర, ప్రపంచ వ్యాప్తంగా విశేష ఆదరణ సొంతం చేసుకుంది. ఇప్పటికే నాలుగు భాగాలుగా రిలీజ్ అయిన ఈ హాలీవుడ్ సీరీస్ త్వరలో ఇండియన్ స్క్రీన్ మీద సందడి చేయనుంది. బాలీవుడ్ దర్శకుడు సిద్దార్థ్ ఆనంద్, రాంబో సినిమాను హిందీలో రీమేక్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే రాంబో సినిమా రీమేక్ రైట్స్ సొంతం చేసుకున్న సిద్దార్థ్, ఇండియన్ వర్షన్‌కు కావాల్సిన మార్పులు చేసే పనిలో ఉన్నాడు. అయితే ఇప్పటి వరకు ఈ రీమేక్‌లో హీరోగా ఎవరు నటిస్తారన్న విషయంలో ఎలాంటి ప్రకటన చేయలేదు. తాజా సమాచారం ప్రకారం బాలీవుడ్ మ్యాన్లీ హీరో హృతిక్ రోషన్ ఈ సినిమాలో హీరోగా నటించడానికి అంగీకరించాడు. ఇప్పటికే సిద్దార్థ్ ఆనంద్ దర్శకత్వంలో హాలీవుడ్ మూవీ నైట్ అండ్ డే హిందీ రీమేక్ బ్యాంగ్ బ్యాంగ్‌లో హీరోగా నటించిన హృతిక్ మరోసారి అదే దర్శకుడితో హాలీవుడ్ రీమేక్‌కు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం పీరియాడిక్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న మొహంజోదారో చిత్రంలో నటిస్తున్న హృతిక్, త్వరలోనే రాంబో రీమేక్‌పై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. -
'రాంబో'గా మంచు మనోజ్
స్టార్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చి సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న యంగ్ హీరో మంచు మనోజ్. తన ఎనర్జీతో సినిమా రేంజ్‌ను పెంచే ఈ కుర్ర హీరో ప్రస్తుతం శౌర్య సినిమాతో ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. తన రెగ్యులర్ యాక్టింగ్ స్టైల్‌కు భిన్నంగా ఈ సినిమాలో కాస్త సెటిల్డ్‌గా కనిపించనున్నాడట. ఈ సినిమాతో పాటు మనోజ్ హీరోగా రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన థ్రిల్లర్ మూవీ ఎటాక్ కూడా త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతోంది. మనోజ్ , ఈ రెండు సినిమాల తరువాత చేయబోయే సినిమాను కూడా కన్ఫామ్ చేశాడు. తన ఫిజిక్‌తో పాటు ఎనర్జీకి తగ్గట్టుగా రాంబో అనే పవర్ఫుల్ టైటిల్‌తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు మనోజ్. రమేష్ పుప్పాల నిర్మించనున్న ఈ సినిమా ద్వారా సాగర్ పసల దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ సినిమాకు సంభందించి మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు. -
బుల్లితెరపై రాంబో
హాలీవుడ్ స్క్రీన్ మీద మోస్ట్ సక్సెస్ ఫుల్ సీరీస్లలో ఒకటైన రాంబో త్వరలో బుల్లితెర మీద సందడి చేయనుంది. సిల్వస్టర్ స్టాలోన్ హీరోగా తెరకెక్కిన ఈ యాక్షన్ సినిమా సీరీస్‌ను టీవీ సీరియల్‌గా రూపొందించడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సీరీస్‌కు రాంబో ఫిలింస్‌లో హీరోగా నటించిన స్టాలోన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నాడు. సినిమా తరహాలో కాకుండా ఈ టీవీ సీరియల్లో ఎక్కువగా ఫ్యామిలీ డ్రామా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా రాంబో, అతని కొడుకు మధ్య అనుబంధం నేపథ్యంలో కథా కథనాలు రెడీ చేస్తున్నారు. సినిమా సీరీస్‌లో ఎక్కడా రాంబోకు కొడుకు ఉన్నట్టు చూపించలేదు. కేవలం టీవీ సీరీస్ కోసమే ఈ కథను రెడీ చేస్తున్నారు. 1982లో తొలిసారిగా రాంబోగా కనిపించిన సిల్వస్టర్ స్టాలోన్, ఆ తరువాత నాలుగు భాగాల్లో అదే పాత్రలో కనిపించి మెప్పించాడు. ఈ సీరీస్ తోనే యాక్షన్ స్టార్‌గా భారీ ఇమేజ్ను సొంతం చేసుకున్నాడు. రాంబోతో పాటు ద ఎక్స్‌పాండబుల్స్ సీరీస్‌ను కూడా టీవీ షోగా రూపొందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు స్టాలోన్. -
బాంబులను ఇట్టే పట్టేస్తుంది...!
పేరు : రాంబో వయస్సు : 10 ఏళ్లు (మేల్) పుట్టింది : సికింద్రాబాద్‌ల పెరిగింది : రాయగడలో పట్టింది : 100కు పైగా బాంబులు బరువు : 35 కిలోలు రంగు : నలుపు రిటైరైన స్నిపర్ డాగ్ రాంబో రైల్వేలో 10 ఏళ్ల సర్వీసు పూర్తి రూ. 17,100కు వేలం వేసిన ఆర్పీఎఫ్ విశాఖపట్నం సిటీ : ఆ కుక్క బాంబ్లను వెతికిపట్టడంలో దిట్ట. కొండా కోనల్లో బాంబులు పాతాళంలో పాతినా సులువుగా పట్టేయగల నేర్పరి. వాసన పసిగట్టిందో బాంబ్ స్క్వాడ్లకు కూడా దొరకని బాంబులను కాలితో వెలికితీసి మరీ చూపించగల శునకమది. వాల్తేరు రైల్వే పరిధిలోని రాయగడ కేంద్రంగా 10 ఏళ్లకు పైగా సర్వీసు పూర్తి చేసుకున్న ఆ రాంబో అనే పేరుగల స్నిఫర్ డాగ్‌ను రైల్వే రక్షక దళ కమాండర్ కార్యాలయంలో ఇటీవల వేలం పెట్టారు. ఈ వేలానికి హాజరైన పలువురు జంతు ప్రేమికులు తమకు కావాల్సిన రేటుకు కోట్ చేశారు. నగరానికి చెందిన మహ్మద్ ఎంఎం బాషా అనే జంతుప్రేమికుడు ఆ శునకానికి రూ. 17,100కు కొనుక్కున్నాడు. సోమవారం ఆర్పీఎఫ్ అధికారులు ఆ కుక్కను బాషా కుటుంబీకులకు అప్పగించారు. సికింద్రాబాద్ బొగాడి కెన్నల్స్‌లో 10 ఏళ్ల క్రితం రాంబోను రూ. 10,500కు వాల్తేరు రైల్వే రైల్వే రక్షక దళం కొనుగోలు చేసింది. అప్పటి నుంచి 9 మాసాల పాటు శిక్షణ ఇచ్చారు. ఓ మాస్టర్‌కు నెలకు రూ. 30 వేల జీతం ఇచ్చి కుక్కకు బాంబ్లను తనిఖీ చేసే తర్ఫీదునిచ్చారు. శిక్షణానంతరం దండకారణ్యంలోనే రాంబో డాగ్ సర్వీసు మొత్తం పూర్తి చేసుకుంది.