'రాంబో'గా మంచు మనోజ్ | Manchu Manoj Next movie Rambo | Sakshi
Sakshi News home page

'రాంబో'గా మంచు మనోజ్

Published Sun, Feb 21 2016 12:01 PM | Last Updated on Sun, Sep 3 2017 6:07 PM

'రాంబో'గా మంచు మనోజ్

'రాంబో'గా మంచు మనోజ్

స్టార్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చి సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న యంగ్ హీరో మంచు మనోజ్. తన ఎనర్జీతో సినిమా రేంజ్ను పెంచే ఈ కుర్ర హీరో ప్రస్తుతం శౌర్య సినిమాతో ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. తన రెగ్యులర్ యాక్టింగ్ స్టైల్కు భిన్నంగా ఈ సినిమాలో కాస్త సెటిల్డ్గా కనిపించనున్నాడట. ఈ సినిమాతో పాటు మనోజ్ హీరోగా రామ్గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన థ్రిల్లర్ మూవీ ఎటాక్ కూడా త్వరలో రిలీజ్కు రెడీ అవుతోంది.

మనోజ్ , ఈ రెండు సినిమాల తరువాత చేయబోయే సినిమాను కూడా కన్ఫామ్ చేశాడు. తన ఫిజిక్తో పాటు ఎనర్జీకి  తగ్గట్టుగా రాంబో అనే పవర్ఫుల్ టైటిల్తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు మనోజ్. రమేష్ పుప్పాల నిర్మించనున్న ఈ సినిమా ద్వారా సాగర్ పసల దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ సినిమాకు సంభందించి మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement