మనోజ్ ఫేవరెట్ రెస్టారెంట్ ఎక్కడో తెలుసా..? | Manchu Manoj Favorite breakfast Place | Sakshi
Sakshi News home page

మనోజ్ ఫేవరెట్ రెస్టారెంట్ ఎక్కడో తెలుసా..?

Published Wed, Jul 27 2016 9:30 AM | Last Updated on Mon, Sep 4 2017 6:35 AM

మనోజ్ ఫేవరెట్ రెస్టారెంట్ ఎక్కడో తెలుసా..?

మనోజ్ ఫేవరెట్ రెస్టారెంట్ ఎక్కడో తెలుసా..?

యంగ్ హీరో మంచు మనోజ్ మంచి భోజన ప్రియుడు. అందుకే ఫిజిక్ కోసం నోరు కట్టేసుకొని కూర్చోకుండా కాస్త పుష్టిగానే భోంచేస్తాడు ఈ యువ నటుడు. షూటింగ్ల నిమిత్తం రకరకాల ప్రాంతాలు తిరిగే మనోజ్కు అన్నింటికీ బాగా నచ్చిన రెస్టారెంట్ మాత్రం మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉంది. ప్రస్తుతం వైజాగ్లో షూటింగ్లో పాల్గొంటున్న ఈ యువ నటుడు తన ఫేవరెట్ రెస్టారెంట్లో టిఫిన్ చేశాడు.

ఈ విషయాన్ని తన అభిమానులతో షేర్ చేసుకున్న మనోజ్, తనకు అంత రుచికరమైన వంటలను అందించిన వ్యక్తిని కూడా అభిమానులకు పరిచయం చేశాడు. ఆమెతో కలిసి దిగిన ఫోటోను ట్విట్టర్ పేజ్లో షేర్ చేశాడు. వైజాగ్లోని వెంకటాద్రి వంటిల్లులో టిఫిన్ చేయటం తనకు ఎంతో ఇష్టమంటూ ట్వీట్ చేశాడు మనోజ్. ఇటీవల ఎటాక్, శౌర్య సినిమాలతో నిరాశపరిచిన మనోజ్ ప్రస్తుతం ఓ కామెడీ ఎంటర్ టైనర్ లో నటిస్తున్నాడు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement