Shourya
-
‘పీఓకే’ను తిరిగి పొందటమే లక్ష్యం!.. రక్షణ మంత్రి హింట్
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ పర్యటనలో భాగంగా పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)పై కీలక వ్యాఖ్యలు చేశారు భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. పీఓకే ప్రజలపై పాకిస్థాన్ అకృత్యాలకు పాల్పడుతోందని, దాని పర్యావసనాలు ఎదుర్కోవలసి ఉంటుందని హెచ్చరించారు. పీఓకేను తిరిగి చేజిక్కించుకోవటమే తమ లక్ష్యమని సూత్రప్రాయంగా వెల్లడించారు. పీఓకేలోని గిల్గిత్, బాల్టిస్తాన్‌ను చేరుకున్నాకే.. జమ్ముకశ్మీర్, లద్దాఖ్ రెండు కేంద్ర పాలిత ప్రాంతాల అభివృద్ధి సాధించినట్లవుతుందన్నారు. 1947లో శ్రీనగర్‌లో భారత వైమానిక దళం అడుగుపెట్టిన రోజును పురస్కరించుకుని నిర్వహించిన శౌర్య దివాస్ కార్యక్రమంలో మాట్లాడారు. ‘జమ్ముకశ్మీర్, లద్దాఖ్ అభివృద్ధి ప్రయాణాన్ని ఇప్పడే ప్రారంభించాం. గిల్గిత్, బాల్టిస్తాన్ చేరుకున్నాకే మా లక్ష్యం నెరవేరుతుంది. పీఓకే ప్రజలపై పొరుగు దేశం అకృత్యాలకు పాల్పడుతోంది. దాని పర్యావసనాలు ఎదుర్కోక తప్పదు. ఉగ్రవాదం అనేది ఒక మతం కాదు. టెర్రరిస్టుల ఏకైక లక్ష్యం భారత్.’ అని పేర్కొన్నారు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్. 2019, ఆగస్టు 5న కేంద్ర ప్రభుత్వం ఆర్టికల్ 370ని రద్దు చేయటం ద్వారా జమ్ముకశ్మీర్ ప్రజలపై వివక్ష తొలగిపోయిందన్నారు. ఇదీ చదవండి: ముదురుతున్న వివాదం.. కేరళలో గవర్నర్ వర్సెస్ సీఎం -
ఐదోతరగతి ఆథర్ ‘శౌర్య’
గతేడాది లాక్డౌన్ .. రకరకాల కష్టాలతోపాటూ మరెన్నో జ్ఞాపకాలనూ మిగిల్చింది. ఈ సమయంలో చాలామంది తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటే.. మరికొందరు తమలో దాగున్న ప్రతిభాపాటవాలను గుర్తించి వాటిని సానబెట్టుకున్నారు. అయితే శౌర్య మిశ్రా మాత్రం మనందరికంటే కాస్త భిన్నంగా.. తనకొచ్చిన ఆలోచనలకు అక్షర రూపం ఇచ్చాడు. బీహార్‌లో పుట్టి పెరిగిన 11ఏళ్ల శౌర్య అహ్మదాబాద్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఐదోతరగతి చదువుతున్నాడు. గతేడాది కరోనా వల్ల లాక్డౌన్ విధించడంతో ఎక్కడివారు అక్కడే ఉండిపోవాల్సిన పరిస్థితి. స్కూలు మూసివేయడంతో శౌర్యకు బాగా బోర్ కొట్టేది. దీంతో తనకిష్టమైన స్పేస్బుక్స్, జర్నల్స్ చదవడంతోబాటు స్పేస్‌కు సంబంధించిన డాక్యుమెంటరీస్, చానల్స్ చూసేవాడు. స్పేస్‌కు సంబంధించిన అనేక అంశాల గురించి కాస్త దీర్ఘంగా ఆలోచించేవాడు. తన ఊహలన్నింటిని రాస్తూ రాస్తూ ఏకంగా 86 పేజీల బుక్‌ను రాశాడు. ‘స్పేస్ మాఫియా ఆన్ ది లూస్’ పేరిట పుస్తకాన్ని ప్రచురించాడు. ‘‘స్కూళ్లు మూసివేయడంతో రోజూ క్లాస్‌లు జరిగేవి కాదు. అప్పుడు నాకు బోర్ కొట్టేది. ఇంకా ఫ్రెండ్స్‌తో ఆడుకోవడానికి కూడా కుదరకపోవడంతో ఏదో కోల్పోయిన ఫీలింగ్ కలిగేది. అప్పుడు నాకు ఎంతో ఇష్టమైన స్పేస్ గురించి రకరకాలుగా ఆలోచనలు వస్తుండేవి. ఆ సమయంలోనే మా అమ్మ నన్ను ప్రోత్సహిస్తూ తన పాత సెల్‌ఫోన్ ఒకటి నాకు ఇచ్చింది. దాంతో నేను నాకు వస్తున్న కొత్త కొత్త ఆలోచనలు, ఊహలను దాని మీద రాస్తూ ఉండేవాడిని. అవన్ని ఒక బుక్‌గా తయారయ్యాయి. ఈ బుక్ రాయడం నా తొలి అనుభవం. ముఖ్యంగా ఈ బుక్‌లో స్పేస్, ఎడ్వెంచర్స్, ప్లానెట్ దొంగతనాలు వంటి అబ్బురపరిచే అంశాలు అనేకం ఉన్నాయి. భవిష్యత్‌లో నేను ఆస్ట్రోనాట్ అవ్వాలనుకుంటున్నాను. ఇందుకోసం కష్టపడి చదవడంతోపాటు నా ఊహాశక్తిని, సృజనాత్మకతను పెంపొందించుకుంటున్నాను’’ అని శౌర్య చెప్పాడు. కాగా శౌర్య 2014లో స్టోరీ టెల్లింగ్ పోటీలో పాల్గొని సర్టిఫికెట్‌ను, 2018లో నేషనల్ రుబిక్స్ క్యూబ్ చాంపియ షిప్లో గోల్డ్ మెడల్ నూ గెలుచుకున్నాడు. ఎంతో చురుకుగా ఉండే శౌర్యకు పేపర్, డిజిటల్ గ్యాడ్జెట్స్ మీద మంచి స్కెచ్‌లు గీయగల నైపుణ్యం కూడా ఉంది. ఈ విషయం గుజరాత్ సీఎం విజయ్ రుపానీకి తెలియడంతో శౌర్య ప్రతిభాపాటవాలను ఆయన అభినందిస్తూ లేఖ రాశారు. ‘‘లాక్డౌన్ కాలాన్ని చాలా బాగా ఉపయోగించుకున్నావు. చాలా ధైర్యంగా స్పేస్ ఎచీవ్‌మెంట్స్ కూడా ప్రస్తావించావు. అంతటి విపత్కర పరిస్థితులోన్లూ నీలో దాగున్న నైపుణ్యాన్ని వెలికి తీశావు’’ అని రుపానీ మెచ్చుకున్నారు. -
‘శౌర్యచక్ర’ బల్వీందర్ హత్య
అమృతసర్/చండీగఢ్: పంజాబ్‌లో తీవ్రవాదం అంతానికి పోరాడిన, శౌర్యచక్ర పురస్కార గ్రహీత బల్వీందర్ సింగ్ సంధూ దుండగుల కాల్పుల్లో చనిపోయారు. ఆయనకు కల్పించిన భద్రతను ఏడాది క్రితం రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. పంజాబ్‌లోని తరన్‌తారన్ జిల్లా బిఖివిండ్ పట్టణంలో శుక్రవారం ఉదయం 7 గంటల సమయంలో తన కార్యాలయంలో ఉన్న బల్వీందర్ సింగ్ సంధూపై బైక్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే ఆయన చనిపోయారు. తమకు ఎవరితో శత్రుత్వం లేదని, తీవ్రవాదుల ఘాతుకమే ఇదని సంధూ భార్య జగదీశ్ కౌర్ పేర్కొన్నారు. ఇప్పటివరకు తమపై 62 దాడులు జరిగాయని, తీవ్రవాదుల నుంచి ముప్పు ఉందని, భద్రత కల్పించాలని డీజీపీని పలుమార్లు అభ్యర్థించామని, అయినా వారు పట్టించుకోలేదని ఆమె ఆరోపించారు. సంధూ మృతికి ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. దోషులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. సంధూపై పాయింట్ బ్లాంక్ రేంజ్లో కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. పంజాబ్‌లో వేర్పాటువాదాన్ని అంతమొందించేందుకు బల్వీందర్ సింగ్ అలుపెరగని పోరాటం చేశారు. -
‘విరుద్ధ ప్రయోజనాల్లో’ దోవల్ కొడుకు!
న్యూఢిల్లీ: జాతీయ భద్రతా సలహాదారు(ఎన్ఎస్ఏ) అజిత్ దోవల్ కుమారుడు శౌర్యకు చెందిన ఓ సంస్థలో నలుగురు కేంద్ర మంత్రులు డైరెక్టర్లుగా ఉన్నారంటూ కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. శౌర్యకు చెందిన ఇండియా ఫౌండేషన్ సంస్థలో కేంద్ర మంత్రులు నిర్మల సీతారామన్, సురేశ్ ప్రభు, జయంత్ సిన్హా, ఎంజే అక్బర్లు సభ్యులుగా ఉన్నారని, ఇది పరస్పర విరుద్ద ప్రయోజనాలను పొందడమేనని ‘ది వైర్’ వెబ్సైట్ కథనం రాసింది. దీనిపై కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ స్పందిస్తూ..‘ అమిత్–జయ్ షాల ఎపిసోడ్ ఘన విజయం సాధించిన అనంతరం బీజేపీ ఇప్పుడు అజిత్ దోవల్– శౌర్యాల కథను కొత్తగా ప్రారంభించింది’ అని ట్వీటర్లో ఎద్దేవా చేశారు. ఈ కథనం పూర్తిగా నిరాధారమని ఇండియా ఫౌండేషన్ స్పష్టంచేసింది. నలుగురు వ్యక్తులు మంత్రులు కాకముందే తమ సంస్థలో డైరెక్టర్లుగా ఉన్నారంది. తమ సంస్థ విశ్వసనీయత, గౌరవం, వారసత్వంపై జరుగుతున్న దాడిని ఖండిస్తున్నట్లు వెల్లడించింది. ఇండియా ఫౌండేషన్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉన్న శౌర్య జెమినీ ఫైనాన్సియల్ సర్వీసెస్ అనే సంస్థను నిర్వహిస్తున్నారని ది వైర్ వెల్లడించింది. ఈ సంస్థ ఆర్గనైజేషన్ ఫర్ ఎకనమిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్(ఈసీఈడీ)సభ్యదేశాల నుంచి ఆసియా మార్కెట్లలోకి పెట్టుబడులు వచ్చేలా చూస్తుందని తెలిపింది. -
మనోజ్ ఫేవరెట్ రెస్టారెంట్ ఎక్కడో తెలుసా..?
యంగ్ హీరో మంచు మనోజ్ మంచి భోజన ప్రియుడు. అందుకే ఫిజిక్ కోసం నోరు కట్టేసుకొని కూర్చోకుండా కాస్త పుష్టిగానే భోంచేస్తాడు ఈ యువ నటుడు. షూటింగ్‌ల నిమిత్తం రకరకాల ప్రాంతాలు తిరిగే మనోజ్‌కు అన్నింటికీ బాగా నచ్చిన రెస్టారెంట్ మాత్రం మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉంది. ప్రస్తుతం వైజాగ్‌లో షూటింగ్లో పాల్గొంటున్న ఈ యువ నటుడు తన ఫేవరెట్ రెస్టారెంట్లో టిఫిన్ చేశాడు. ఈ విషయాన్ని తన అభిమానులతో షేర్ చేసుకున్న మనోజ్, తనకు అంత రుచికరమైన వంటలను అందించిన వ్యక్తిని కూడా అభిమానులకు పరిచయం చేశాడు. ఆమెతో కలిసి దిగిన ఫోటోను ట్విట్టర్ పేజ్‌లో షేర్ చేశాడు. వైజాగ్‌లోని వెంకటాద్రి వంటిల్లులో టిఫిన్ చేయటం తనకు ఎంతో ఇష్టమంటూ ట్వీట్ చేశాడు మనోజ్. ఇటీవల ఎటాక్, శౌర్య సినిమాలతో నిరాశపరిచిన మనోజ్ ప్రస్తుతం ఓ కామెడీ ఎంటర్ టైనర్ లో నటిస్తున్నాడు. Had breakfast at my all time Fav spot in vizag :) Venkatadri vantillu:) this aunty has magical handspic.twitter.com/J50hqVMJon— Manchu Manoj (@HeroManoj1) 27 July 2016 -
'శౌర్య' మూవీ రివ్యూ
టైటిల్ : శౌర్య జానర్ : క్రైమ్ థ్రిల్లర్ తారాగణం : మంచు మనోజ్, రెజీనా, ప్రకాష్ రాజ్, నాగినీడు, సుబ్బరాజు సంగీతం : వేద దర్శకత్వం : దశరథ్ నిర్మాత : మల్కాపురం శివకుమార్ కరెంటు తీగ లాంటి హిట్ సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న మంచు మనోజ్ సరికొత్త అవతారంలో శౌర్యగా ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ఎక్కువగా ఎనర్జిటిక్ రోల్స్‌లోనే కనిపించిన మనోజ్, ఈ సినిమాలో డీసెంట్ లుక్‌తో, సెటిల్డ్ పర్ఫామెన్స్తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ఇప్పటి వరకు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ మాత్రమే తీసిన దర్శకుడు దశరథ్ కూడా ఈ సినిమాతో రూటు మార్చే ప్రయత్నం చేశాడు. తొలిసారిగా ఓ క్రైమ్ థ్రిల్లర్‌తో అభిమానుల మెప్పించడానికి ప్రయత్నించాడు. మనోజ్ లుక్ తో పాటు ప్రమోషన్ పరంగా ఆకట్టుకున్న శౌర్య థియేటర్స్‌కు వచ్చిన ఆడియన్స్‌ను ఆ స్ధాయిలో థ్రిల్ చేశాడా..? కథ : శౌర్య( మంచు మనోజ్), నేత్ర (రెజీనా) చాలా కాలంగా ప్రేమించుకుంటుంటారు. వీరి పెళ్లికి నేత్ర తండ్రి సత్యమూర్తి(నాగినీడు), బాబాయి కృష్ణమూర్తి(సుబ్బరాజు) ఒప్పుకోలేదన్న కారణంతో తన గోల్‌ను కూడా వదులుకొని యుకె వెళ్లి సెటిల్ అవ్వాలని ప్లాన్ చేసుకుంటారు. అందుకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసుకున్న శౌర్య, చివరిసారిగా నేత్ర మొక్కు చెల్లించటం కోసం శివరాత్రి జాగరం చేయటానికి ఆమె సొంత ఊరికి వస్తారు. ఇద్దరు నిద్రపోయిన సమయంలో నేత్ర మీద హత్యా ప్రయత్నం జరుగుతుంది. శౌర్య పక్కన ఉండగానే ఎవరో నేత్ర గొంతుకోసి పారిపోతారు. ఆ నేరం, ఆమెతోనే ఉన్న శౌర్య మీద పడుతుంది. నేత్ర తండ్రి ఎంపీ కావటంతో పోలీసులు కూడా ఈ కేసును సీరియస్‌గా తీసుకుంటారు. ఇంతకీ నేత్ర మీద హత్యా ప్రయత్నం చేసింది ఎవరు..? ఆ కేసు శౌర్య మీదకు ఎందుకు వచ్చింది..? శౌర్య ఈ కేసు నుంచి బయటపడి అసలు నేరస్థులను ఎలా పట్టించాడు..? అన్న అంశాన్ని ఆసక్తి కరమైన మలుపులతో, థ్రిల్లింగ్ ట్విస్ట్ లతో తెరకెక్కించారు. నటీనటులు : ప్రతీ సినిమాలో ఎంతో ఎనర్జిటిక్ గా కనిపించే మనోజ్ ఈ సినిమాతో సెటిల్డ్ పర్ఫామెన్స్తో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్‌లో తనదైన నటనతో సినిమాకు ప్రాణం పోశాడు. పాజిటివ్, నెగెటివ్ రెండు యాంగిల్స్‌ను పర్ఫెక్ట్గా చూపించి సినిమాకు ప్లస్ అయ్యాడు. రెజీనా కూడా తన పాత్ర మేరకు ఆకట్టుకుంది. నాచురల్ యాక్టింగ్‌తో కథను ముందుకు నడిపించింది. ఇక పోలీస్ ఆఫీసర్ పాత్రలో ప్రకాష్ రాజ్ మరోసారి తన మార్క్ చూపించాడు. హీరో పాత్రకు ధీటుగా పోలీస్ ఆఫీసర్ కృష్ణ ప్రసాద్ పాత్రలో ఆకట్టుకున్నాడు. ఇతర పాత్రల్లో నాగినీడు, సుబ్బరాజు, శియాజీ షిండేలు తమ పరిధి మేరకు మెప్పించే ప్రయత్నం చేశారు. ఫస్ట్ హాఫ్‌లో ప్రభాస్ శీను కామెడీ బాగా వర్క్ అవుట్ అయ్యింది. సాంకేతిక నిపుణులు : మంచి కథను ఆసక్తికర మలుపులతో రాసుకున్న దర్శకుడు దశరథ్, ఆ కథను తెర మీదకు తీసుకురావటంలో కాస్త తడబడినట్టుగా అనిపించింది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ అంతా స్లోగా నడవటంతో థ్రిల్లర్ సినిమాను చూస్తున్న ఫీలింగ్ కలగదు. ఆ లోటును కవర్ చేస్తూ సెకండాఫ్‌లో కథలో వేగం పెంచటంతో పాటు మంచి ట్విస్ట్‌లతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా క్లైమాక్స్‌తో ఆడియన్స్‌కు మంచి సినిమా చూశామన్న ఫీలింగ్ కలిగించాడు. వేదా అందించిన పాటలు పెద్దగా ఆకట్టుకోకపోయినా, నేపథ్య సంగీతం మాత్రం బాగానే వచ్చింది. ఎడిటింగ్, సినిమాటోగ్రఫిలు పరవాలేదు. సినిమాకు కీలకమైన ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం ఆశించిన స్థాయిలో లేవు. ప్లస్ పాయింట్స్ : కథ క్లైమాక్స్ మంచు మనోజ్, ప్రకాష్ రాజ్ మైనస్ పాయింట్స్ : ఫస్ట్ హాఫ్ స్లో నారేషన్ పాటలు ప్రొడక్షన్ వాల్యూస్ - సతీష్ రెడ్డి, ఇంటర్ నెట్ డెస్క్. -
థ్రిల్లింగ్ లవ్‌స్టోరీ ఇది!
‘సంతోషం’, ‘సంబరం’, ‘మిస్టర్ పర్ఫెక్ట్’లతో కుటుంబ కథాచిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు దశరథ్. తాజాగా ఆయన దర్శకత్వం వహించిన చిత్రం - ‘శౌర్య’. మంచు మనోజ్, రెజీనా జంటగా మల్కాపురం శివకుమార్ నిర్మించిన ఈ చిత్రం శుక్రవారం విడుదలవుతోంది. దశరథ్ చెప్పిన ముచ్చట్లు... డిఫరెంట్ లవ్‌స్టోరీ చేయాలని ‘శ్రీ’ చిత్రం నుంచి ప్రయత్నిస్తున్నా. అది ఇప్పటికి కుదిరింది. ప్రేమికుల మధ్య భేదాభిప్రాయాలు రావడం వల్లో, తల్లితండ్రులు ఒప్పుకోకపోవడం వల్లో ప్రేమకథలు ఫెయిల్ అవుతూ ఉంటాయి. అయితే ‘శౌర్య’లో ఎవరూ ఊహించని ప్రత్యేక కోణం ఉంటుంది. ఇదొక థ్రిల్లింగ్ లవ్‌స్టోరీ. ఫైట్లుండవు. సినిమా కథ గ్రామీణ నేపథ్యంలో ఉంటుంది. ఇందులో మనోజ్ రెండు వేర్వేరు పాత్రల్లో నటించాడు. తెలుగులో ఇలాంటి కథతో సినిమా రాలేదు. ‘శ్రీ’ చిత్రం తర్వాత చాలా కాలానికి మళ్ళీ మనోజ్‌తో చేసిన చిత్రమిది. ఇప్పుడు కూడా తనలో ఎనర్జీ ఏ మాత్రమూ తగ్గలేదు. అతను ఎప్పుడూ ఏదో ఒకటి కొత్తగా ట్రై చేయాలని ప్రయత్నిస్తూనే ఉంటాడు. నా కెరీర్లో జయాలు, అపజయాలు చూశా. ఆ రెండింటినీ సమానంగా చూడడం వల్లే సంతోషంగా ఉన్నా. ప్రేక్షకులు ఎప్పుడూ కొత్తదనం కోరుకుంటారు. సినిమాలోని విషయం నచ్చితే ఆదరిస్తారు. తెలుగు సినీ పరిశ్రమలో నాకు కొద్దిమంది స్నేహితులున్నారు. దర్శకుడు వీవీ వినాయక్, హీరోలు మనోజ్, ప్రభాస్, రచయితలు కోన వెంకట్, గోపీ మోహన్, సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ మంచి స్నేహితులు. సినిమాలతో సంబంధం లేకుండా మేము రెగ్యులర్‌గా కలుస్తుంటాం. ప్రభాస్‌తో తప్పకుండా ఓ చిత్రం చేస్తా. ఆ వివరాలు త్వరలో చెబుతా. -
అప్పుడు... ఆ టైమ్‌లో... ఏడ్చేశా: రెజీనా
‘శౌర్య’ చిత్రం గురించి నాయిక రెజీనా విలేకరుల ముందు మంగళవారం మనసు విప్పింది... ♦ ఏ పాత్ర చేసినా దానికి న్యాయం చేయడానికి నా వంతు కృషి చేస్తా. గ్లామర్, డీ-గ్లామరైజ్డ్ ఏదైనా సరే చేయడానికి రెడీ. ఇందులో నా పేరు నేత్ర. నా పాత్రలో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి. ♦ ఇలాంటి పాత్ర చేయడం ఇదే మొదటి సారి. నటనకు మంచి స్కోప్ ఉన్న పాత్ర ఇది. ఓ రాజ కీయ నాయకుడి కూతుర్ని. ఒక అబ్బాయితో ప్రేమలో పడతా. అక్కడి నుంచి సినిమా అనుకోని మలుపులు తిరుగుతుంది. సోషల్ మెసేజ్ కూడా ఉంటుంది. అదేంటో సినిమాలోనే చూడాలి. ♦ మనోజ్ ఫుల్ ఎనర్జిటిక్. ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తుంటారు. దర్శకుడు దశరథ్ చాలా కూల్. ♦ ఈ మధ్యే మా కాలేజీలో ఫంక్షన్లో పాల్గొన్నా. టీచర్స్‌తో వేదిక పంచుకున్నప్పుడు ఏడ్చేశా. ♦ నాకు లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేయాలని కోరిక. లేడీ డాన్ పాత్రలు చేయాలని ఎప్పటినుంచో ఉంది. అలాంటివి అవకాశాలు వస్తే వెంటనే చేస్తాను. -
అలా మొదలైంది!
చిన్నతనం నుంచి సంగీతమంటే చాలా ఇష్టం. ముఖ్యంగా ఇళయరాజా, ఏ.ఆర్. రె హ్మాన్ స్వరాలంటే మరీ’’ అని సంగీత దర్శకుడు వేద అన్నారు. మనోజ్, రెజీనా జంటగా నటించిన ‘శౌర్య’ ద్వారా ఆయన సంగీత దర్శకునిగా పరిచయమవుతున్నారు. ప్రముఖ దర్శకుడు దశరథ్ సోదరుడు ఈయన. ‘శౌర్య’ సినిమాకి తనకు అవకాశం దక్కడం గురించీ, ఇతర విశేషాల గురించీ వేద మాట్లాడుతూ - ‘‘ఆర్థిక ఇబ్బందుల కారణంగా సంగీతం మీద దృష్టి పెట్టలేకపోయాను. పూర్తిగా చదువు మీద ఫోకస్ చేశాను. కొన్నాళ్లు సాఫ్ట్వేర్ సంస్థలో పని చేశాను. ఆ తర్వాత అనూప్ రూబెన్స్ దగ్గర రాత్రి సమయాల్లో భక్తి పాటలకు పనిచేశా. ఓసారి దేవిశ్రీ ప్రసాద్‌గారికి నా డెమో ఆల్బమ్ పంపిస్తే, ఆయన చెన్నైకు పిలిపించి, అప్రెంటిస్‌గా చేర్చుకున్నారు. నా సినీ సంగీత ప్రయాణం అలా మొదలైంది. ఆ తర్వాత చక్రిగారి దగ్గర వర్క్ చేశాను. దర్శకుడు దశరథ్ తమ్ముడిగా నాకు ‘శౌర్య’ అవకాశం రాలేదు. సినిమా అనేది కోట్ల రూపాయల వ్యాపారం. నేనెవరో చెప్పకుండానే మనోజ్‌గారికి రెండు సిచ్యుయేషన్స్‌కు తగ్గట్టు పాటలు స్వరపరిచి, వినిపించా. అవి నచ్చడంతో ఈ చిత్రానికి మ్యూజిక్ డెరైక్టర్‌గా అవకాశం వచ్చింది’’ అని చెప్పారు. -
'రాంబో'గా మంచు మనోజ్
స్టార్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చి సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న యంగ్ హీరో మంచు మనోజ్. తన ఎనర్జీతో సినిమా రేంజ్‌ను పెంచే ఈ కుర్ర హీరో ప్రస్తుతం శౌర్య సినిమాతో ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. తన రెగ్యులర్ యాక్టింగ్ స్టైల్‌కు భిన్నంగా ఈ సినిమాలో కాస్త సెటిల్డ్‌గా కనిపించనున్నాడట. ఈ సినిమాతో పాటు మనోజ్ హీరోగా రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన థ్రిల్లర్ మూవీ ఎటాక్ కూడా త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతోంది. మనోజ్ , ఈ రెండు సినిమాల తరువాత చేయబోయే సినిమాను కూడా కన్ఫామ్ చేశాడు. తన ఫిజిక్‌తో పాటు ఎనర్జీకి తగ్గట్టుగా రాంబో అనే పవర్ఫుల్ టైటిల్‌తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు మనోజ్. రమేష్ పుప్పాల నిర్మించనున్న ఈ సినిమా ద్వారా సాగర్ పసల దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ సినిమాకు సంభందించి మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు. -
మార్చి 4న ఐదు సినిమాలు
గతంలో ఒకే సమయంలో రెండు మూడు సినిమాలు కూడా రిలీజ్ చేయడానికి ఇష్టపడని తెలుగు సినిమా దర్శక నిర్మాతలు ఇప్పుడు రూట్ మార్చారు. ఒకేరోజు నాలుగైదు సినిమాలతో బరిలో దిగుతున్నారు. తెలుగు సినిమా మార్కెట్ భారీగా పెరగటంతో ఒకే రోజు ఎక్కువ సినిమాలు రిలీజ్ అయిన పరవాలేదని భావిస్తున్నారు. అయితే ఈ పోటి కారణంగా మంచి సినిమాలు కూడా కలెక్షన్ల విషయంలో కాస్త వెనకపడుతున్నాయి. మార్చి 4న మరో సారి ఇలాంటి భారీ పోటికి రంగం సిద్ధమవుతోంది. సమ్మర్ సీజన్లో స్టార్ హీరోలు తమ సినిమాలతో రెడీ అవుతుండటంతో చిన్న సినిమా నిర్మాతలు ముందుగానే తమ సినిమాలను రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. మార్చి నెలాఖరు నుంచి స్టార్ హీరోల దాడి మొదలవుతుండటంతో ఈ లోపు తమ సినిమాలను థియేటర్లలోకి తీసుకురావడానికి రెడీ అవుతున్నారు. అందుకే మార్చి 4న తెలుగు వెండితెర మీద చిన్న సినిమా పండుగ జరగనుంది. అడవి శేష్ హీరోగా తెరకెక్కుతున్న థ్రిల్లర్ మూవీ క్షణం, మంచు మనోజ్ హీరోగా దశరథ్ దర్శకత్వంలో తెరకెక్కిన శౌర్య. అలామొదలైంది ఫేం నందినీ రెడ్డి దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా రూపొందిన కళ్యాణవైభోగమే, శ్రీకాంత్ హీరోగా యాక్షన్ జానర్లో తెరకెక్కిన టెర్రర్ సినిమాలు ఒకే రోజు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. వీటితో పాటు తమిళ డబ్బింగ్ సినిమా శివగంగ కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీ అవుతోంది. మరి ఇన్ని సినిమాలు ఒకే సారి బరిలో దిగుతాయా లేక ఎవరైన వెనక్కు తగ్గుతారా చూడాలి. -
మా మనోజ్‌ను... సరిగ్గా ఇలానే చూడాలనుకున్నా!
- మోహన్‌బాబు ‘‘ఏ చిత్రానికైనా దర్శకుడే కెప్టెన్. దశరథ్ నిగర్వి. మా సంస్థలో మనోజ్‌తో ‘శ్రీ’ చిత్రం చేశాడు. ఇన్ని రోజులుగా మనోజ్‌ను నేను ఎలాంటి పాత్రలో చూడాలనుకున్నానో ఈ చిత్రంలో సరిగ్గాఅలాంటి పాత్రలో కనిపించనున్నాడు’’ అని మంచు మోహన్‌బాబు అన్నారు. మంచు మనోజ్, రెజీనా జంటగా బేబీ త్రిష సమర్పణలో సురక్ష్ ఎంటర్టైన్మెంట్స్ ఇండియా ప్రై.లి. పతాకంపై దశరథ్ దర్శకత్వంలో మల్కాపురం శివకుమార్ నిర్మించిన చిత్రం ‘శౌర్య’. వేదా కె. స్వరపరచిన ఈ చిత్రం పాటలు హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. మోహన్‌బాబు బిగ్ సీడీ, దర్శకుడు బి.గోపాల్ పాటల సీడీ ఆవిష్కరించారు. ‘‘దశరథ్ సాఫ్ట్ డెరైక్టర్. తన తమ్ముడు వేదాను సంగీత దర్శకునిగా పరిచయం చేస్తున్నాడు. ఈ చిత్రం మనోజ్ కెరీర్లో బెస్ట్‌గా నిలిచిపోతుంది’’ అని దర్శకుడు శ్రీవాస్ తెలిపారు. దశరథ్ మాట్లాడుతూ -‘‘ఇదొక లవ్‌స్టోరీ కమ్ థ్రిల్లర్. రెగ్యులర్ ప్రేమకథలకు భిన్నంగా ఉండే ప్రేమ కథా చిత్రం. నిర్మాత శివకుమార్‌గారు ఈ చిత్రంతో నాకు మంచి మిత్రుడయ్యారు. మనోజ్ లేకుంటే ఈ చిత్రం ఇంత బాగా వచ్చుండేది కాదు. రెజీనా చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్’’ అని చెప్పారు. ఈ వేడుకలో శ్రీమతి మంచు నిర్మల, ఎమ్మెల్యే ‘రసమయి’ బాలకిషన్, బ్రహ్మానందం, దర్శకులు ఎన్.శంకర్, చంద్ర మహేష్, నిర్మాతలు శైలేంద్రబాబు, బెక్కెం వేణుగోపాల్, సంగీత దర్శకుడు ఆర్పి పట్నాయక్, గొట్టిముక్కల పద్మారావు, చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. ‘‘ఏ చిత్రానికైనా దర్శకుడే కెప్టెన్. దశరథ్ నిగర్వి. మా సంస్థలో మనోజ్‌తో ‘శ్రీ’ చిత్రం చేశాడు. ఇన్ని రోజులుగా మనోజ్‌ను నేను ఎలాంటి పాత్రలో చూడాలనుకున్నానో ఈ చిత్రంలో సరిగ్గాఅలాంటి పాత్రలో కనిపించనున్నాడు’’ అని మంచు మోహన్‌బాబు అన్నారు. మంచు మనోజ్, రెజీనా జంటగా బేబీ త్రిష సమర్పణలో సురక్ష్ ఎంటర్టైన్మెంట్స్ ఇండియా ప్రై.లి. పతాకంపై దశరథ్ దర్శకత్వంలో మల్కాపురం శివకుమార్ నిర్మించిన చిత్రం ‘శౌర్య’. వేదా కె. స్వరపరచిన ఈ చిత్రం పాటలు హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. మోహన్‌బాబు బిగ్ సీడీ, దర్శకుడు బి.గోపాల్ పాటల సీడీ ఆవిష్కరించారు. ‘‘దశరథ్ సాఫ్ట్ డెరైక్టర్. తన తమ్ముడు వేదాను సంగీత దర్శకునిగా పరిచయం చేస్తున్నాడు. ఈ చిత్రం మనోజ్ కెరీర్లో బెస్ట్‌గా నిలిచిపోతుంది’’ అని దర్శకుడు శ్రీవాస్ తెలిపారు. దశరథ్ మాట్లాడుతూ -‘‘ఇదొక లవ్‌స్టోరీ కమ్ థ్రిల్లర్. రెగ్యులర్ ప్రేమకథలకు భిన్నంగా ఉండే ప్రేమ కథా చిత్రం. నిర్మాత శివకుమార్‌గారు ఈ చిత్రంతో నాకు మంచి మిత్రుడయ్యారు. మనోజ్ లేకుంటే ఈ చిత్రం ఇంత బాగా వచ్చుండేది కాదు. రెజీనా చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్’’ అని చెప్పారు. ఈ వేడుకలో శ్రీమతి మంచు నిర్మల, ఎమ్మెల్యే ‘రసమయి’ బాలకిషన్, బ్రహ్మానందం, దర్శకులు ఎన్.శంకర్, చంద్ర మహేష్, నిర్మాతలు శైలేంద్రబాబు, బెక్కెం వేణుగోపాల్, సంగీత దర్శకుడు ఆర్పి పట్నాయక్, గొట్టిముక్కల పద్మారావు, చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. -
నాన్నగారి దగ్గర నుంచి క్రమశిక్షణ..
కొవ్వూరు : సినిమా రంగంలో క్రమశిక్షణ ముఖ్యమని, నాన్న మమ్మల్ని ఎంతో క్రమశిక్షణతో పెంచారని, ఆయన పెంపకమే మా అభివృద్ధికి కారణమని ప్రముఖ సినీనటుడు మోహన్‌బాబు తనయుడు, హీరో మంచు మనోజ్ అన్నారు. హీరోగానే కాకుండా విలన్‌గా, ఇతర ప్రధాన పాత్రల్లో కూడా నటించేందుకూ తాను సిద్ధమేనని చెప్పారు. కొవ్వూరు మండలం కుమారదేవంలో శౌర్య చిత్రం షూటింగ్లో పాల్గొన్న ఆయన కొద్దిసేపు సాక్షితో ముచ్చటించారు. ప్ర: మీపై మీ నాన్నగారి ప్రభావం ఎంత జ: వృత్తిలో క్రమశిక్షణ చాలా ముఖ్యం, నాన్నగారి దగ్గర నుంచి క్రమశిక్షణతో ఉండడం నేర్చుకున్నాం. ఆయన పెంపకమే మమ్మల్ని ఇంతటి స్థితిలో నిలిపింది. ప్ర: ప్రస్తుతం మీరు నటిస్తున్న సినిమాలు జ : రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో అటాక్ చిత్రీకరణ పూర్తి చేసుకుంది. డిసెంబర్లో విడుదల అవుతుంది. ప్రస్తుతం దశరధ్ దర్శకత్వంలో శౌర్య చేస్తున్నాను. కొన్ని సినిమాలు కథలు రెడీగా ఉన్నాయి. ప్ర: మీకు ఇష్టమైన క్యారెక్టర్ జ : పోలీస్ అధికారిగా నటించడం అంటే ఎంతో ఇష్టం. నటుడిగా అన్ని పాత్రలూ చేయూలని ఉంది. హీరోగానే కాదు విలన్‌గా, ఇతర ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో కూడా నటించేందుకు సిద్ధంగా ఉన్నా. కథ కుదిరితే మరోసారి మా కుటుంబ సభ్యులతో కలిసి నటిస్తా. ప్ర : ఇప్పటి వరకు ఎన్ని సినిమాల్లో నటించారు జ : 14 సినిమాల్లో నటించాను ప్ర: మీ సినిమాల్లో మీకు అత్యంత ఇష్టం అయినా చిత్రం జ: అన్ని సినిమాల కన్నా ప్రస్తుతం నటిస్తున్న శౌర్య సినిమా ది బెస్ట్‌గా నిలుస్తుంది. ప్ర: శౌర్య సినిమా గురించి చెబుతారా జ : హీరోగా నాది, హీరోయిన్ రెజీనా, ప్రకాష్రాజ్లది ఓ వినూత్నమైన పాత్రలు. ప్రేక్షకులు కొత్త రకమైన సినిమాను చూస్తారు. దర్శకుడు దశరధ్ కొత్తదనంతో తెరకెక్కిస్తున్నారు. ప్ర: గోదావరి తీరం ఎలా ఉంది. జ: గోదావరి తీరం అంటే చాలా ఇష్టం. ఇక్కడి వంటకాలతో పాటు ప్రజల ఆప్యాయతలు ఎంతగానో నచ్చుతాయి. -
మిస్టర్ కూల్..!
మంచు మనోజ్ సినిమాలంటే యాక్షన్ అండ్ ఎంటర్టైన్ మెంట్‌కు ఢోకా ఉండదు. ‘దొంగ దొంగది’ నుంచి ‘కరెంట్ తీగ’ వరకూ ఇంచు మించు అన్ని చిత్రాల్లోనూ ఫుల్ మాస్ లుక్‌లో రఫ్ అండ్ టఫ్‌గా కనిపించారు మనోజ్. అలాంటి మనోజ్ ఇప్పుడు ‘శౌర్య’గా డిఫరెంట్ లుక్‌లో కనిపించనున్నారు. ‘సంతోషం’, ‘మిస్టర్ పర్ఫెక్ట్’ చిత్రాలతో సున్నితమైన కథాంశాలను టచ్ చేస్తూ క్లాస్ డెరైక్టర్‌గా పేరు తెచ్చుకున్న దశరథ్ దర్శకత్వంలో కూల్‌గా సాఫ్ట్‌లుక్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతున్నారాయన. సురక్ష్ ఎంటర్టైన్ మెంట్ పతాకంపై మల్కాపురం శివకుమార్ ‘శౌర్య’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రెజీనా కథానాయిక. మనోజ్ మాట్లాడుతూ-‘‘ ఈ సినిమా చిత్రీకరణ ఇప్పటికే 75 శాతం పూర్తయింది. జనవరిలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. దశరథ్ లాంటి క్లాస్ డెరైక్టర్‌తో నేను చేస్తున్న లవ్ థ్రిల్లర్ ఇది’’ అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: వేదా కె.