'శౌర్య' మూవీ రివ్యూ | Shourya Movie Review | Sakshi
Sakshi News home page

'శౌర్య' మూవీ రివ్యూ

Published Fri, Mar 4 2016 12:35 PM | Last Updated on Sun, Sep 3 2017 7:00 PM

'శౌర్య' మూవీ రివ్యూ

'శౌర్య' మూవీ రివ్యూ

టైటిల్ : శౌర్య
జానర్ : క్రైమ్ థ్రిల్లర్
తారాగణం : మంచు మనోజ్, రెజీనా, ప్రకాష్ రాజ్, నాగినీడు, సుబ్బరాజు
సంగీతం : వేద
దర్శకత్వం : దశరథ్
నిర్మాత : మల్కాపురం శివకుమార్


కరెంటు తీగ లాంటి హిట్ సినిమా తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న మంచు మనోజ్ సరికొత్త అవతారంలో శౌర్యగా ఆడియన్స్ ముందుకు వచ్చాడు. ఎక్కువగా ఎనర్జిటిక్ రోల్స్లోనే కనిపించిన మనోజ్, ఈ సినిమాలో డీసెంట్ లుక్తో, సెటిల్డ్ పర్ఫామెన్స్తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. ఇప్పటి వరకు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్స్ మాత్రమే తీసిన దర్శకుడు దశరథ్ కూడా ఈ సినిమాతో రూటు మార్చే ప్రయత్నం చేశాడు. తొలిసారిగా ఓ క్రైమ్ థ్రిల్లర్తో అభిమానుల మెప్పించడానికి ప్రయత్నించాడు. మనోజ్ లుక్ తో పాటు ప్రమోషన్ పరంగా ఆకట్టుకున్న శౌర్య థియేటర్స్కు వచ్చిన ఆడియన్స్ను ఆ స్ధాయిలో థ్రిల్ చేశాడా..?

కథ :
శౌర్య( మంచు మనోజ్), నేత్ర (రెజీనా) చాలా కాలంగా ప్రేమించుకుంటుంటారు. వీరి పెళ్లికి నేత్ర తండ్రి సత్యమూర్తి(నాగినీడు), బాబాయి కృష్ణమూర్తి(సుబ్బరాజు) ఒప్పుకోలేదన్న కారణంతో తన గోల్ను కూడా వదులుకొని యుకె వెళ్లి సెటిల్ అవ్వాలని ప్లాన్ చేసుకుంటారు. అందుకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసుకున్న శౌర్య, చివరిసారిగా నేత్ర మొక్కు చెల్లించటం కోసం శివరాత్రి జాగరం చేయటానికి ఆమె సొంత ఊరికి వస్తారు. ఇద్దరు నిద్రపోయిన సమయంలో నేత్ర మీద హత్యా ప్రయత్నం జరుగుతుంది.

శౌర్య పక్కన ఉండగానే ఎవరో నేత్ర గొంతుకోసి పారిపోతారు. ఆ నేరం, ఆమెతోనే ఉన్న శౌర్య మీద పడుతుంది. నేత్ర తండ్రి ఎంపీ కావటంతో పోలీసులు కూడా ఈ కేసును సీరియస్గా తీసుకుంటారు. ఇంతకీ నేత్ర మీద హత్యా ప్రయత్నం చేసింది ఎవరు..? ఆ కేసు శౌర్య మీదకు ఎందుకు వచ్చింది..? శౌర్య ఈ కేసు నుంచి బయటపడి అసలు నేరస్థులను ఎలా పట్టించాడు..? అన్న అంశాన్ని ఆసక్తి కరమైన మలుపులతో, థ్రిల్లింగ్ ట్విస్ట్ లతో తెరకెక్కించారు.
 
నటీనటులు :
ప్రతీ సినిమాలో ఎంతో ఎనర్జిటిక్ గా కనిపించే మనోజ్ ఈ సినిమాతో సెటిల్డ్ పర్ఫామెన్స్తో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్లో తనదైన నటనతో సినిమాకు ప్రాణం పోశాడు. పాజిటివ్, నెగెటివ్ రెండు యాంగిల్స్ను పర్ఫెక్ట్గా చూపించి సినిమాకు ప్లస్ అయ్యాడు. రెజీనా కూడా తన పాత్ర మేరకు ఆకట్టుకుంది. నాచురల్ యాక్టింగ్తో కథను ముందుకు నడిపించింది. ఇక పోలీస్ ఆఫీసర్ పాత్రలో ప్రకాష్ రాజ్ మరోసారి తన మార్క్ చూపించాడు. హీరో పాత్రకు ధీటుగా పోలీస్ ఆఫీసర్ కృష్ణ ప్రసాద్ పాత్రలో ఆకట్టుకున్నాడు. ఇతర పాత్రల్లో నాగినీడు, సుబ్బరాజు, శియాజీ షిండేలు తమ పరిధి మేరకు మెప్పించే ప్రయత్నం చేశారు. ఫస్ట్ హాఫ్లో ప్రభాస్ శీను కామెడీ బాగా వర్క్ అవుట్ అయ్యింది.



సాంకేతిక నిపుణులు :
మంచి కథను ఆసక్తికర మలుపులతో రాసుకున్న దర్శకుడు దశరథ్, ఆ కథను తెర మీదకు తీసుకురావటంలో కాస్త తడబడినట్టుగా అనిపించింది. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ అంతా స్లోగా నడవటంతో థ్రిల్లర్ సినిమాను చూస్తున్న ఫీలింగ్ కలగదు. ఆ లోటును కవర్ చేస్తూ సెకండాఫ్లో కథలో వేగం పెంచటంతో పాటు మంచి ట్విస్ట్లతో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా క్లైమాక్స్తో ఆడియన్స్కు మంచి సినిమా చూశామన్న ఫీలింగ్ కలిగించాడు. వేదా అందించిన పాటలు పెద్దగా ఆకట్టుకోకపోయినా, నేపథ్య సంగీతం మాత్రం బాగానే వచ్చింది. ఎడిటింగ్, సినిమాటోగ్రఫిలు పరవాలేదు. సినిమాకు కీలకమైన ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం ఆశించిన స్థాయిలో లేవు.

ప్లస్ పాయింట్స్ :
కథ
క్లైమాక్స్
మంచు మనోజ్, ప్రకాష్ రాజ్

మైనస్ పాయింట్స్ :
ఫస్ట్ హాఫ్ స్లో నారేషన్
పాటలు
ప్రొడక్షన్ వాల్యూస్

 

- సతీష్ రెడ్డి, ఇంటర్ నెట్ డెస్క్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement