MAA Elections 2021: Manchu Vishnu Oath Ceremony On October 16th As MAA President - Sakshi
Sakshi News home page

MAA Oath Ceremony: విష్ణు ప్రమాణ స్వీకారం, చిరంజీవికి అందని ఆహ్వానం!

Published Sat, Oct 16 2021 10:34 AM | Last Updated on Sat, Oct 16 2021 12:34 PM

MAA Elections 2021: Manchu Vishnu Oath Ceremony On October 16th As MAA President - Sakshi

Manchu Vishnu MAA President: మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(మా) ఎన్నికల్లో గెలిచి అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్న మంచు విష్ణు, గెలిచిన కార్యవర్గ సభ్యులు ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్‎లో పదవి ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమానికి తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ముఖ్య అతిథిగా రానున్నారు.. అలాగే నందమూరు బాలకృష్ణను సైతం విష్ణు ప్రత్యేకంగా ఆహ్వానించారు.

చదవండి: ప్రమాణ స్వీకారం తర్వాత బాలకృష్ణతో భేటీ అయిన మోహన్‌ బాబు, విష్ణు

కాగా శుక్రవారం నందమూరి బాలకృష్ణ ఇంటికి వెళ్లి ఆయనతో అరగంట పాటు మోహన్ బాబు, విష్ణులు చర్చించిన సంగతి తెలిసిందే. అలాగే.. సినీ పెద్దలు పరుచూరి బ్రదర్స్, కైకాల సత్యనారాయణ, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం‏ను కలిసి ప్రమాణా స్వీకార మహోత్సవానికి రావాలని విష్ణు కోరారు. అయితే సినిమా పెద్దలను ఆహ్వానించిన విష్ణు.. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మెగాస్టార్‎ చిరంజీవిని ఆహ్వానించనట్లుగా తెలుస్తోంది. ఇంతకు ముందు కౌంటింగ్ రోజున.. త్వరలో చిరంజీవిని వ్యక్తిగతంగా కలుస్తానని మంచు విష్ణు చెప్పిన సంగతి విదితమే.

చదవండి: ‘మా’ కుటుంబాన్ని ఒక చోట చేర్చమని సూచించారు: మంచు విష్ణు

కానీ ఈ కార్యక్రమానికి మెగా ఫ్యామిలీకి చెందిన ఎవరిని విష్ణు ఆహ్వానించనట్లుగా సమాచారం. ఇక గురువారం విష్ణు సోదరుడు మంచు మనోజ్‌, పవన్‌ కల్యాణ్‌ను ఓ సినిమా సెట్‌లో కలిశారు. అక్కడ పవన్‌ అరగంట పాటు చర్చిన మనోజ్‌ విష్ణు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాల్సిందిగా పవన్‌ను కోరినట్లు వార్తలు వినిపించాయి. అయితే దీనిపై విష్ణు టీం కానీ, పవన్‌ టీం కాని స్పష్టత ఇవ్వలేదు. అసోసియేషన్ అభివృద్ధి కోసం అందరినీ కలుపుకొని వెళ్తానన్నా మంచు విష్ణు.. ప్రకాష్ రాజ్, అతని ప్యానెల్‏లో గెలిచిన సభ్యులకు ప్రమాణ స్వీకారానికి రావాలని ఫోన్‏లో ఆహ్వాన సందేశం పంపారు. అలాగే ప్రతి మా సభ్యుడికి మా కార్యాలయం మెసెజ్‌ ద్వారా ఆహ్వానం పంపింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement