talasani srinvas yadav
-
విష్ణు ప్రమాణ స్వీకారం, చిరంజీవికి అందని ఆహ్వానం!
Manchu Vishnu MAA President: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల్లో గెలిచి అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్న మంచు విష్ణు, గెలిచిన కార్యవర్గ సభ్యులు ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్లో పదవి ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమానికి తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా రానున్నారు.. అలాగే నందమూరు బాలకృష్ణను సైతం విష్ణు ప్రత్యేకంగా ఆహ్వానించారు. చదవండి: ప్రమాణ స్వీకారం తర్వాత బాలకృష్ణతో భేటీ అయిన మోహన్ బాబు, విష్ణు కాగా శుక్రవారం నందమూరి బాలకృష్ణ ఇంటికి వెళ్లి ఆయనతో అరగంట పాటు మోహన్ బాబు, విష్ణులు చర్చించిన సంగతి తెలిసిందే. అలాగే.. సినీ పెద్దలు పరుచూరి బ్రదర్స్, కైకాల సత్యనారాయణ, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందంను కలిసి ప్రమాణా స్వీకార మహోత్సవానికి రావాలని విష్ణు కోరారు. అయితే సినిమా పెద్దలను ఆహ్వానించిన విష్ణు.. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవిని ఆహ్వానించనట్లుగా తెలుస్తోంది. ఇంతకు ముందు కౌంటింగ్ రోజున.. త్వరలో చిరంజీవిని వ్యక్తిగతంగా కలుస్తానని మంచు విష్ణు చెప్పిన సంగతి విదితమే. చదవండి: ‘మా’ కుటుంబాన్ని ఒక చోట చేర్చమని సూచించారు: మంచు విష్ణు కానీ ఈ కార్యక్రమానికి మెగా ఫ్యామిలీకి చెందిన ఎవరిని విష్ణు ఆహ్వానించనట్లుగా సమాచారం. ఇక గురువారం విష్ణు సోదరుడు మంచు మనోజ్, పవన్ కల్యాణ్‌ను ఓ సినిమా సెట్లో కలిశారు. అక్కడ పవన్ అరగంట పాటు చర్చిన మనోజ్ విష్ణు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాల్సిందిగా పవన్‌ను కోరినట్లు వార్తలు వినిపించాయి. అయితే దీనిపై విష్ణు టీం కానీ, పవన్ టీం కాని స్పష్టత ఇవ్వలేదు. అసోసియేషన్ అభివృద్ధి కోసం అందరినీ కలుపుకొని వెళ్తానన్నా మంచు విష్ణు.. ప్రకాష్ రాజ్, అతని ప్యానెల్లో గెలిచిన సభ్యులకు ప్రమాణ స్వీకారానికి రావాలని ఫోన్లో ఆహ్వాన సందేశం పంపారు. అలాగే ప్రతి మా సభ్యుడికి మా కార్యాలయం మెసెజ్ ద్వారా ఆహ్వానం పంపింది. -
‘మంత్రులు తలసాని, గంగులకు గుట్కా ఎక్కడి నుంచి వచ్చింది’
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం నిషేధించిన మత్తు పదార్థాలు తింటున్న రాష్ట్ర మంత్రులపై సీఎం కేసీఆర్ చర్యలు తీసుకోవాలని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. నిర్లజ్జగా చట్టాన్ని ఉల్లంఘించి గుట్కా తింటున్న బ్యాచ్‌తో బంగారు తెలంగాణ సాధిస్తారా అని ఆయన ప్రశ్నించారు. గుట్కా తింటూ అడ్డంగా దొరికి పోయిన మంత్రులను తక్షణమే కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వ చేతకాని తీరుతో ఇప్పటికే హైదరాబాద్ డ్రగ్స్‌కు అడ్డాగా మారిందని మండిపడ్డారు. రాష్ట్రంలో సొగాకు, గుట్కాను నిషేధించారని, మరి అవి మంత్రులకు ఎలా దొరికాయో తెలియజేయాలని ధ్వజమెత్తారు. డీజీపీ మహేందర్ రెడ్డి, సీపీ అంజనీకుమార్ వెంటనే గుట్కా తిన్న మంత్రులపై చట్టపరంగా కేసులు నమోదు చేయాలని శ్రవణ్ డిమాండ్ చేశారు. కాగా తెలంగాణ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, గంగుల కమలాకర్‌కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఎవరూ చూడకుండా రహస్యంగా చేతుల్లో ఏదో పదార్థాన్ని పంచుకుంటూ చాటుగా తినడం ఈ వీడియోలో కనిపిస్తుంది. అయితే అది గుట్కా అని సోషల్ మీడియలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే మంత్రులు గుట్కా తింటున్నారని ఆ వీడియోను దాసోజు శ్రవణ్ ట్విటర్లో పోస్ట్ చేశారు. ‘తెలంగాణలో పొగాకు, గుట్కా బ్యాన్ చేసిండ్రు కదా. మరి ఈ మంత్రులకు యెట్లా దొరికింది? ఎవరు స్మగుల్ చేస్తుండ్రు? ఎట్లా సప్లై చేస్తుండ్రు?బందు బెట్టిన గుట్కాను, బాజాప్తాగా తింటున్న మంత్రులపై పోలీసులు క్రిమినల్ కేసులు పెట్టాల్నా లేదా?’ అంటూ దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు. -
ఏప్రిల్ 29న గొల్ల, కురుమల సభ
సాక్షి, హైదరాబాద్: గొల్ల, కురుమల సంక్షేమానికి కృషిచేస్తున్న సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపేందుకు ఏప్రిల్ 29న హైదరాబాద్‌లో భారీ బహిరంగసభ నిర్వహించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ తెలిపారు. ఆదివారం జరిగిన గొల్ల, కురుమల ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గొర్రెల షెడ్ల నిర్మాణానికి ప్రభుత్వం 90 శాతం సబ్సిడీపై నిధులిస్తుందని పేర్కొన్నారు. 31 జిల్లాల్లో గొల్ల, కురుమల భవన నిర్మాణాలకు నిధులు మంజూరు చేసేందుకు కృషిచేస్తానని హామీనిచ్చారు. సభ విజయవంతానికి ఒక సమన్వయ కమిటీని కూడా ఏర్పాటు చేస్తామన్నారు. జన సమీకరణ కోసం ఏప్రిల్ మొదటి వారంలో జిల్లాల్లో పర్యటిస్తానని తెలిపారు. సమావేశంలో గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య చైర్మన్ రాజయ్యయాదవ్, కురుమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మల్లేశం, అఖిల భారత యాదవ మహాసభ అధ్యక్షుడు రవీందర్‌యాదవ్, ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ పాల్గొన్నారు. సీఎం దృష్టికి కురుమల సమస్యలు కురుమల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్తానని మంత్రి జోగురామన్న అన్నారు. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కురుమ మహావేదిక ఆవిర్భావ సభ జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ... రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన కులాలు, సంచార జాతుల అభివృద్ధికి ప్రత్యేక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశామని అన్నారు. అత్యంత వెనుకబడిన కురుమలను ఎంబీసీల్లో చేర్చాలని కేంద్ర మాజీ మంత్రి దత్తాత్రేయ డిమాండ్ చేశారు. -
'గవర్నర్ నరసింహన్ ను తప్పించాలి'
హైదరాబాద్: టీడీపీ ఎమ్మెల్యే గా ఎన్నికైన తలసాని శ్రీనివాస్ యాదవ్ టీఆర్ఎస్ కేబినెట్ లో మంత్రిగా ఉండటం రాజ్యాంగ విరుద్ధమని మర్రి శశిధర్ రెడ్డి మరోసారి అభిప్రాయపడ్డారు. ఈ మేరకు గవర్నర్ నరసింహన్ ను తప్పించాలంటూ మూడు రోజుల క్రితమే కేంద్రానికి లేఖ రాశారు. మంత్రి తలసానిని గవర్నర్ బర్తరఫ్ చేయకపోవడం విధులను సరిగా నిర్వహించకపోవడమేనని ఆ లేఖలో పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షించేందుకు నరసింహన్ ను గవర్నర్ పదవి నుంచి తప్పించాలని కేంద్రాన్ని కోరారు.. టీడీపీ ఎమ్మెల్యే తలసాని టీఆర్ఎస్ కేబినెట్ లో మంత్రిగా ఉండటం రాజ్యాంగ విరుద్ధమని.. విధుల్లో విఫలమైన గవర్నర్ ను తప్పించాలని పేర్కొన్నారు.