సినీ పెద్దలందరితో కలిసి మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ‘మా’ అభివృద్ధికి పాటుపడతానని ‘మా’ నూతన అధ్యక్షుడు మంచు విష్ణు అన్నారు. ఇటీవల జరిగిన ‘మా’ ఎన్నికల్లో ప్రకాశ్‌రాజ్‌పై గెలిచి అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్న మంచు విష్ణు గురువారం బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారిగా నటుడు బాలకృష్ణను కలిసిన సంగతి తెలిసిందే. అధ్యక్ష పదవికి బాధ్యతలు చేపట్టిన తర్వాత విష్ణు.. రాజీనామాలపై ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారా? అని ఆసక్తిగా చూస్తున్న క్రమంలో బాలకృష్ణను కలిసి అందరికి ట్విస్ట్ ఇచ్చారు.
చదవండి: ‘రాత్రి గెలిచి ఉదయమే ఎలా ఓడిపోయామో’
ఈ భేటీలో ‘మా’ అభివృద్ధి, శాశ్వత భవన నిర్మాణం, సినీ పరిశ్రమలో చోటు చేసుకున్న అంశాలపై బాలయ్యతో విష్ణు చర్చినట్లు తెలుస్తోంది. అయితే ‘మా’ ఎన్నికల్లో తనకు మద్దతుగా నిలిచిన బాలకృష్ణకు కృతజ్ఞతలు తెలిపి ఆయన ఆశీర్వాదం తీసుకున్నట్లు భేటీ ఆనంతరం మీడియాతో విష్ణు వెల్లడించారు. ఈ సందర్భంగా మంచు విష్ణు మీడియాతో మాట్లాడుతూ.. ‘నాకు మద్దతుగా నిలిచిన బాలకృష్ణను కలిసి ఆశీర్వాదం తీసుకున్నా. ఈ ఎన్నికల్లో ఆయన నాకు మొదటి నుంచి సపోర్ట్ చేశారు. త్వరలోనే చిరంజీవిని కలుస్తా’ అని తెలిపారు.
చదవండి: ‘మహా సముద్రం’ మూవీ రివ్యూ
ఇక ‘ఈ నెల 16న మా అధ్యక్ష పదవి నేను, నా ప్యానల్ ఎన్నికల అధికారి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయనున్నాం. ఆ తర్వాత ఈసీతో చర్చించి రాజీనామాలపై నిర్ణయం తీసుకుంటా. సినీ పెద్దలందరిని కలుపుకుని ముందుకు వెళ్తాను’ అంటూ చెప్పుకొచ్చారు. ‘నాకు మద్దతుగా నిలిచిన బాలయ్య అన్నకు ధన్యవాదాలు. ఈ రోజు ఆయనను కలిసి కృతజ్ఞతలు తెలిపాను. ఆయన ‘మా’ కోసం ఎప్పుడు ముందుంటానని హామీ ఇచ్చారు. అలాగే ‘మా’ కుటుంబాన్ని ఒకచోట చేర్చమని ఆయన నాకు సూచించారు’ అంటూ మంచు విష్ణు తన ట్వీట్‌లో రాసుకొచ్చారు.
Thank you to Bala anna for his support. Met and expressed my gratitude. He also assured that he will always be there for MAA and advised me to concentrate on bringing the MAA family together; which is my agenda right now. 💪🏽❤️🙏 pic.twitter.com/eFpGr8Nqvx
— Vishnu Manchu (@iVishnuManchu) October 14, 2021
Comments
Please login to add a commentAdd a comment