మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికల్లో అధ్యక్ష పీఠానికి జరిగిన ఎన్నికల్లో మంచు విష్ణు, ప్రకాశ్ రాజ్‌పై విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో ప్రాంతం, జాతీయ వాదాన్ని తెర మీదకు తీసుకొచ్చినందుకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకాశ్ రాజ్ ప్రకటించారు. ఈ క్రమంలో తన రాజీనామాపై ప్రకాశ్ రాజ్ తాజా ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణుకు వాట్సప్‌లో సమాచారం అందించారు.
చదవండి: ‘మా’ సభ్యత్వానికి ప్రకాశ్ రాజ్ రాజీనామా
ఈ మేరకు ఆయన మెసేజ్ చేస్తూ ‘‘మా’ ఎన్నికల్లో నీవు సాధించిన అద్భుత విజయానికి అభినందనలు విష్ణు. ‘మా’ను నడిపించేందుకు అవసరమైన శక్తి నికు కలగాలని ఆశిస్తున్నా. ఆల్ ది బెస్ట్. ‘మా’ సభ్యత్వానికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నా. దయచేసి నా నిర్ణయాన్ని ఆమోదించండి. నాన్-మెంబర్‌గా నీకు అన్ని విధాలా సాయం చేస్తా.. థ్యాంక్యూ... ప్రకాశ్‌రాజ్’’ అని మెసేజ్ పంపారు. దీనిపై మంచు విష్ణు స్పందిస్తూ.. మీ నిర్ణయం పట్ల నేను సంతోషంగా లేను అంకుల్ అంటూ రాసుకొచ్చారు. ‘అంకుల్ మీరు నాకంటే వయసులో చాలా పెద్దవారు. గెలుపు, ఓటములు అనేవి ఒకే నాణేనికి ఉండే రెండు ముఖాలు. రెండింటిని మనం సమానంగా చూడాలి’ అని అన్నారు.
చదవండి: MAA Elections 2021 Results: అది నా దురదృష్టం: ప్రకాశ్ రాజ్ ఆవేదన
అలాగే ‘మీరు మా కుటుంబంలో ఒక భాగం. అది మీకు కూడా తెలుసు. ప్లీజ్ మీరు భావోద్యేగానికి లోనవకండి. నాకు మీ సలహాలు, సూచనలు అవసరం, మనిద్దరం కలిసి పనిచేయాలని నేను కోరుకుంటున్నా. త్వరలోనే మిమ్మల్ని కలుస్తాను. దీనిపై చర్చించుకుందాం. అప్పటి వరకు మీరు తొందర పడకండి’ అంటూ సమాధానం ఇచ్చాడు. కాగా ప్రాంతీయత ఆధారంగా ‘మా’ ఎన్నికల పోలింగ్ జరిగిందని, ఇక ఇలాంటి అసోసియేషన్‌లో సభ్యుడిగా ఉండాలని లేదంటూ ప్రకాశ్ రాజ్ భావోద్యేగానికి లోనైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మా ప్రాథమిక సభ్యత్వానికి తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment