మా మనోజ్‌ను... సరిగ్గా ఇలానే చూడాలనుకున్నా! | Manchu Manoj's 'Shourya' audio launch | Sakshi
Sakshi News home page

మా మనోజ్‌ను... సరిగ్గా ఇలానే చూడాలనుకున్నా!

Published Tue, Feb 2 2016 1:00 AM | Last Updated on Sun, Sep 3 2017 4:46 PM

మా మనోజ్‌ను... సరిగ్గా ఇలానే చూడాలనుకున్నా!

మా మనోజ్‌ను... సరిగ్గా ఇలానే చూడాలనుకున్నా!

- మోహన్‌బాబు
‘‘ఏ చిత్రానికైనా దర్శకుడే కెప్టెన్. దశరథ్ నిగర్వి. మా సంస్థలో మనోజ్‌తో ‘శ్రీ’ చిత్రం చేశాడు. ఇన్ని రోజులుగా మనోజ్‌ను నేను ఎలాంటి పాత్రలో చూడాలనుకున్నానో ఈ చిత్రంలో సరిగ్గాఅలాంటి పాత్రలో కనిపించనున్నాడు’’ అని మంచు మోహన్‌బాబు అన్నారు. మంచు మనోజ్, రెజీనా జంటగా బేబీ త్రిష సమర్పణలో సురక్ష్ ఎంటర్‌టైన్‌మెంట్స్ ఇండియా ప్రై.లి. పతాకంపై దశరథ్ దర్శకత్వంలో మల్కాపురం శివకుమార్ నిర్మించిన చిత్రం ‘శౌర్య’. వేదా కె. స్వరపరచిన ఈ చిత్రం పాటలు హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. మోహన్‌బాబు బిగ్ సీడీ, దర్శకుడు బి.గోపాల్ పాటల సీడీ ఆవిష్కరించారు. ‘‘దశరథ్ సాఫ్ట్ డెరైక్టర్. తన తమ్ముడు వేదాను సంగీత దర్శకునిగా పరిచయం చేస్తున్నాడు.

ఈ చిత్రం మనోజ్ కెరీర్‌లో బెస్ట్‌గా నిలిచిపోతుంది’’ అని దర్శకుడు శ్రీవాస్ తెలిపారు. దశరథ్ మాట్లాడుతూ -‘‘ఇదొక లవ్‌స్టోరీ కమ్ థ్రిల్లర్. రెగ్యులర్ ప్రేమకథలకు భిన్నంగా ఉండే ప్రేమ కథా చిత్రం. నిర్మాత శివకుమార్‌గారు ఈ చిత్రంతో నాకు మంచి మిత్రుడయ్యారు. మనోజ్ లేకుంటే ఈ చిత్రం ఇంత బాగా వచ్చుండేది కాదు. రెజీనా చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్’’ అని చెప్పారు. ఈ వేడుకలో శ్రీమతి మంచు నిర్మల, ఎమ్మెల్యే ‘రసమయి’ బాలకిషన్, బ్రహ్మానందం, దర్శకులు ఎన్.శంకర్, చంద్ర మహేష్, నిర్మాతలు శైలేంద్రబాబు, బెక్కెం వేణుగోపాల్, సంగీత దర్శకుడు ఆర్‌పి పట్నాయక్, గొట్టిముక్కల పద్మారావు, చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement