Dashrath
-
సమయపాలన పాటించని టీచర్లపై కొరడా
సమయ పాలన పాటించకుండా ఇష్టానుసారంగా పాఠశాలలకు వస్తే చర్యలు తప్పవని ఇంచార్జీ ఎంఈఓ దశరథ్ ఉపాధ్యాయులకు హెచ్చరించారు. గురువారం మండలంలోని తాటిపల్లి కేజీవీబీ పాఠశాలను సందర్శించారు. సమయ పాలన పాటించని మన్సాన్పల్లి ప్రై మరీ పాఠశాల ఉపాధ్యాయుడు దుర్గప్రసాద్, మల్లారెడ్డిపేట ప్రై మరీ పాఠశాల ఉపాధ్యాయుడు అరవింద్‌కు మెమో ఇచ్చామన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచి విద్యార్థుల విద్యాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయాలన్నారు. ఉపాధ్యాయులు సమయ పాలన పాటించకుండా విద్యాభివృద్దిపై నిర్లక్ష్యంగా వ్యవహరించడం బాదాకరమని అందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తాటిపల్లి సర్పంచ్ అల్లం నవాజ్‌రెడ్డి, కేజీవీబీ పాఠశాల ప్రిన్సిపాల్ కవిత పాల్గొన్నారు. -
మా మనోజ్‌ను... సరిగ్గా ఇలానే చూడాలనుకున్నా!
- మోహన్‌బాబు ‘‘ఏ చిత్రానికైనా దర్శకుడే కెప్టెన్. దశరథ్ నిగర్వి. మా సంస్థలో మనోజ్‌తో ‘శ్రీ’ చిత్రం చేశాడు. ఇన్ని రోజులుగా మనోజ్‌ను నేను ఎలాంటి పాత్రలో చూడాలనుకున్నానో ఈ చిత్రంలో సరిగ్గాఅలాంటి పాత్రలో కనిపించనున్నాడు’’ అని మంచు మోహన్‌బాబు అన్నారు. మంచు మనోజ్, రెజీనా జంటగా బేబీ త్రిష సమర్పణలో సురక్ష్ ఎంటర్టైన్మెంట్స్ ఇండియా ప్రై.లి. పతాకంపై దశరథ్ దర్శకత్వంలో మల్కాపురం శివకుమార్ నిర్మించిన చిత్రం ‘శౌర్య’. వేదా కె. స్వరపరచిన ఈ చిత్రం పాటలు హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. మోహన్‌బాబు బిగ్ సీడీ, దర్శకుడు బి.గోపాల్ పాటల సీడీ ఆవిష్కరించారు. ‘‘దశరథ్ సాఫ్ట్ డెరైక్టర్. తన తమ్ముడు వేదాను సంగీత దర్శకునిగా పరిచయం చేస్తున్నాడు. ఈ చిత్రం మనోజ్ కెరీర్లో బెస్ట్‌గా నిలిచిపోతుంది’’ అని దర్శకుడు శ్రీవాస్ తెలిపారు. దశరథ్ మాట్లాడుతూ -‘‘ఇదొక లవ్‌స్టోరీ కమ్ థ్రిల్లర్. రెగ్యులర్ ప్రేమకథలకు భిన్నంగా ఉండే ప్రేమ కథా చిత్రం. నిర్మాత శివకుమార్‌గారు ఈ చిత్రంతో నాకు మంచి మిత్రుడయ్యారు. మనోజ్ లేకుంటే ఈ చిత్రం ఇంత బాగా వచ్చుండేది కాదు. రెజీనా చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్’’ అని చెప్పారు. ఈ వేడుకలో శ్రీమతి మంచు నిర్మల, ఎమ్మెల్యే ‘రసమయి’ బాలకిషన్, బ్రహ్మానందం, దర్శకులు ఎన్.శంకర్, చంద్ర మహేష్, నిర్మాతలు శైలేంద్రబాబు, బెక్కెం వేణుగోపాల్, సంగీత దర్శకుడు ఆర్పి పట్నాయక్, గొట్టిముక్కల పద్మారావు, చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. ‘‘ఏ చిత్రానికైనా దర్శకుడే కెప్టెన్. దశరథ్ నిగర్వి. మా సంస్థలో మనోజ్‌తో ‘శ్రీ’ చిత్రం చేశాడు. ఇన్ని రోజులుగా మనోజ్‌ను నేను ఎలాంటి పాత్రలో చూడాలనుకున్నానో ఈ చిత్రంలో సరిగ్గాఅలాంటి పాత్రలో కనిపించనున్నాడు’’ అని మంచు మోహన్‌బాబు అన్నారు. మంచు మనోజ్, రెజీనా జంటగా బేబీ త్రిష సమర్పణలో సురక్ష్ ఎంటర్టైన్మెంట్స్ ఇండియా ప్రై.లి. పతాకంపై దశరథ్ దర్శకత్వంలో మల్కాపురం శివకుమార్ నిర్మించిన చిత్రం ‘శౌర్య’. వేదా కె. స్వరపరచిన ఈ చిత్రం పాటలు హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. మోహన్‌బాబు బిగ్ సీడీ, దర్శకుడు బి.గోపాల్ పాటల సీడీ ఆవిష్కరించారు. ‘‘దశరథ్ సాఫ్ట్ డెరైక్టర్. తన తమ్ముడు వేదాను సంగీత దర్శకునిగా పరిచయం చేస్తున్నాడు. ఈ చిత్రం మనోజ్ కెరీర్లో బెస్ట్‌గా నిలిచిపోతుంది’’ అని దర్శకుడు శ్రీవాస్ తెలిపారు. దశరథ్ మాట్లాడుతూ -‘‘ఇదొక లవ్‌స్టోరీ కమ్ థ్రిల్లర్. రెగ్యులర్ ప్రేమకథలకు భిన్నంగా ఉండే ప్రేమ కథా చిత్రం. నిర్మాత శివకుమార్‌గారు ఈ చిత్రంతో నాకు మంచి మిత్రుడయ్యారు. మనోజ్ లేకుంటే ఈ చిత్రం ఇంత బాగా వచ్చుండేది కాదు. రెజీనా చాలా హార్డ్ వర్కింగ్ పర్సన్’’ అని చెప్పారు. ఈ వేడుకలో శ్రీమతి మంచు నిర్మల, ఎమ్మెల్యే ‘రసమయి’ బాలకిషన్, బ్రహ్మానందం, దర్శకులు ఎన్.శంకర్, చంద్ర మహేష్, నిర్మాతలు శైలేంద్రబాబు, బెక్కెం వేణుగోపాల్, సంగీత దర్శకుడు ఆర్పి పట్నాయక్, గొట్టిముక్కల పద్మారావు, చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. -
కొత్త కొత్తగా...
‘‘ఇందులో నాది చాలా మంచి క్యారెక్టర్. ఇదొక డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ. భవిష్యత్తులో మనోజ్‌తో మరిన్ని సినిమాలు చేయాలనుకుంటున్నా’’ అని రెజీనా చెప్పారు. మంచు మనోజ్, రెజీనా జంటగా దశరథ్ దర్శకత్వంలో బేబి త్రిష సమర్పణలో శివకుమార్ మల్కాపురం నిర్మిస్తున్న ‘శౌర్య’ సాంగ్ టీజర్ ఆవిష్కరణ శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది. ఇదొక థ్రిల్లింగ్ లవ్‌స్టోరీ అని, చిత్రీకరణ మొత్తం పూర్తయిందని దశరథ్ తెలిపారు. నిర్మాత మాట్లాడుతూ - ‘‘ ‘సూర్య వర్సెస్ సూర్య’ తర్వాత మా సంస్థలో వస్తున్న సినిమా ఇది. ఇందులో మనోజ్ చాలా కొత్త కొత్తగా కనబడతారు. జనవరిలో పాటలను, చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని చెప్పారు. నందు, మధుమణి, శివారెడ్డి, జీవీ తదితరులు ఈ కార్యక్రమంలో మాట్లాడారు. ఈ చిత్రానికి సంగీతం: వేదా, కెమెరా: మల్హర్‌భట్ జోషి. -
మారేడ్‌పల్లిలో మళ్లీ అలజడి
అరెస్టుకు భయపడి రౌడీషీటర్ ఆత్మహత్యాయత్నం ఠాణాపై దాడి ఘటనలో పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు హైదరాబాద్: పోలీస్ స్టేషన్‌పై దాడి ఘటనలో సీసీఎస్, టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టులను వేగవంతం చేశారు. దాడికి పాల్పడినవారిలో ఇప్పటికే 48 మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మంగళవారం తెల్లవారు జామున మరికొందరిని అదుపులోకి తీసుకున్నారు. స్టేషన్‌పై దాడికి కారకులైన రౌడీషీటర్ దశరథ్, ఎమ్మార్పీఎస్ నేత సాయితో పాటు మరికొందరిని పోలీసులు పట్టుకున్నారు. రాత్రి 2 గంటలకు లాలాగూడలోని ఓ ఇంట్లో ఆశ్రయం పొందుతున్న రౌడీషీటర్ దశరథ్ను అదుపులోకి తీసుకుంటుండగా క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇది గమనించిన టాస్క్‌ఫోర్స్ సిబ్బంది.. దశరథ్ను సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మారేడ్‌పల్లి పోలీస్ స్టేషన్‌పై దాడి ఘటనలో దశరథ్ పరోక్షంగా సహకరించారని పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం దశరథ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, మరో 24 గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేమని వైద్యులు చెబుతున్నారు. గతంలోనూ ఆత్మహత్యాయత్నం మారేడ్‌పల్లికి చెందిన దశరథ్పై 1989 లోనే పోలీసులు రౌడీషీట్ తెరిచారు. తర్వాత అతడిలో మార్పు రావడంతో 2001లో రౌడీషీట్ నుంచి అతడి పేరును తొలగించారు. కొన్నాళ్ల తర్వాత దశరథ్ ఓ హత్య కేసులో నిందితుడిగా తేలడంతో మళ్లీ రౌడీషీట్ తెరిచారు. అయితే అప్పటి నుండి తనపై రౌడీషీట్‌ను తొలగించాలని దశరథ్ ప్రయత్నిస్తున్నాడు. పోలీసులు వేధిస్తున్నారంటూ ఆత్మహత్యాయత్నానికి కూడా పాల్పడ్డాడు. మరోసారి బలవన్మరణానికి అనుమతివ్వాలంటూ హెచ్ఆర్సీని ఆశ్రయించి సంచలనం సృష్టించాడు. కాగా, పోలీసు స్టేషన్‌పై దాడి కేసులో పోలీసులు అమాయకులను సైతం అరెస్టు చేసి వేధింపులకు గురిచేస్తున్నారని, తక్షణమే అమాయకులను విడుదల చేయాల్సిందిగా ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్యే సాయన్న డిమాండ్ చేశారు. ఈ మేరకు వారు మంగళవారం నగర కమిషనర్ మహేందర్‌రెడ్డిని కలసి విన్నవించారు. సీపీని కలిసిన వారిలో టీడీపీ నేతలు టీఎన్ శ్రీనివాస్, డీఆర్ శ్రీనివాస్, కొండయ్య చౌదరి తదితరులున్నారు. -
సో మచ్ టు సే...సంతోషం
సినిమా వెనుక స్టోరీ - 3 లంచ్ బ్రేక్. బెనర్జీ, దశరథ్ ఇద్దరూ భోంచేస్తున్నారు. మధ్యలో ఏవో పిచ్చాపాటీ కబుర్లు. ‘‘నీ దగ్గర కథలేమైనా ఉన్నాయా?’’ యథాలాపంగా అడిగారు బెనర్జీ. ‘‘ఓ... చాలా ఉన్నాయ్ సార్. మీరు చేతులు వాష్ చేసుకు రండి. ఇప్పటికిప్పుడు ఓ కథ చెప్తా’’ అన్నాడు దశరథ్.‘నువ్వు-నేను’ షూటింగ్ స్పాట్ అది. తేజ డెరైక్టర్. దశరథ్ అసిస్టెంట్ రైటర్ కమ్ అసోసియేట్ డెరైక్టర్. నటుడు బెనర్జీకి ఇండస్ట్రీలో పరిచయాలెక్కువ. టాలెంట్‌ను ఎంకరేజ్ చేసే గుణమున్నవాడు కాబట్టి, దశరథ్‌ని తీసుకెళ్లి నిర్మాతలు కేఎల్ నారాయణ, ఎస్. గోపాలరెడ్డిలకు పరిచయం చేశాడు. వాళ్లిద్దరూ కలసి పెట్టిన దుర్గా ఆర్ట్స్ టాప్ బేనర్. ‘క్షణక్షణం, హలో బ్రదర్, దొంగాట, ఇంట్లో ఇల్లాలు-వంటింట్లో ప్రియురాలు’ అన్నీ సూపర్ హిట్సే. వాళ్లు మంచి స్టోరీ కోసం వెతుకుతున్నారు. దశరథ్ వచ్చాడు... ‘వన్ హౌస్’ కథ చెప్పాడు. సింగిల్ సిట్టింగ్‌లో ఓకే. స్మాల్ బడ్జెట్... సింగిల్ లొకేషన్... థర్టీ డేస్ షూటింగ్... హీరో తరుణ్ ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. కాల్ షీట్స్ ఫుల్ టైట్. ఫోర్ మంత్స్ తర్వాతే షూటింగ్ పెట్టుకోవాలి. అందుకే మధ్య మధ్యలో ‘నువ్వు-నేను’ వర్క్‌కు అటెండ్ అవుతున్నాడు దశరథ్. కేఎల్ నారాయణ, గోపాలరెడ్డిలకు ఈ సినిమాతో పాటు ఇంకో సినిమా కూడా లైన్లో ఉంది. నాగార్జున డేట్స్ రెడీ. కానీ కథే లేదు. ఎవరెవరో రైటర్స్ వస్తున్నారు... చెబుతున్నారు... వెళుతున్నారు. దశరథ్ దగ్గర ఓ యాక్షన్ కథ ఉంది. ఈ ఇద్దరికీ చెప్పాడు. నచ్చేసింది. స్థలం దొరికితే ఇల్లు కట్టడం ఎంతసేపు! నాగార్జున దగ్గరకు కథ వెళ్లింది. అంతా ఓకే. కానీ డైలమా. షాజీ కైలాస్ డెరైక్షన్‌లో ‘శ్రీరామ్’ అనే యాక్షన్ సినిమా కమిటయ్యాడు నాగ్. ఒకేసారి రెండు యాక్షన్ సినిమాలంటే కష్టం. ‘‘ఏదైనా ఫ్యామిలీ కథ ఉంటే చూడమనండి’’ చెప్పాడు నాగ్. హీరో చెప్పాడంటే ఇక తిరుగేముంది! దశరథ్, రైటర్ గోపీమోహన్ క్లోజ్ ఫ్రెండ్స్. ఇద్దరూ ఓ రెస్టారెంట్లో కూర్చున్నారు. ‘‘గోపీ! ఇది మనకు గోల్డెన్ చాన్స్. నాగార్జున గారికి అర్జంట్‌గా మంచి ఫ్యామిలీ కథ చేయాలి మనం’’ చెప్పాడు దశరథ్ ఉద్వేగంగా. ఇద్దరూ ఏవేవో అనుకున్నారు. ఆ రాత్రి దశరథ్‌కి నిద్ర పట్టలేదు. నాగ్‌కి మంచి కథ చేయాలి. ‘హమ్ దిల్ దే చుకే హై సనమ్’ హిందీ సినిమా గుర్తొచ్చింది. అందులో అజయ్ దేవగణ్ క్యారెక్టరైజేషన్ ఎక్స్లెంట్. అలా ఉండాలి నాగ్ క్యారెక్టరైజేషన్. బుర్రలో లైట్స్ ఆన్. వారంలో లైన్ రెడీ. నాగ్‌కి చెబితే ఫ్లాట్. ఎస్... తనకు రైట్ టైమ్‌లో రైట్ సబ్జెక్ట్. పూర్తి స్క్రిప్టు చేయమని నాగ్ ఆదేశం.దశరథ్ ఆ పనిలో ఉన్నాడు. మొత్తానికి బౌండ్ స్క్రిప్ట్ రెడీ. నాగ్ మళ్లీ విన్నాడు. కానీ ఏం మాట్లాడలేదు. నచ్చలేదా? దశరథ్‌లో డౌట్. ‘నువ్వు - నేను’ కోసం ‘గాజువాక పిల్లా...’ పాట షూట్ చేస్తున్నారు. బోలెడంత మంది స్టూడెంట్స్... హంగామా. దశరథ్ చాలా బిజీగా ఉన్నాడు. అసోసియేట్ కదా! ‘‘ప్లీజ్ కాల్ మీ అర్జంట్’’ అంటూ గోపాలరెడ్డి దగ్గర నుంచీ పేజర్ మెసేజ్. లంచ్ బ్రేక్‌లో కాల్ చేశాడు దశరథ్. ‘‘కంగ్రాట్స్! నాగార్జున గారికి కథ బాగా నచ్చేసింది. నిన్నే డెరైక్ట్ చేయమంటున్నారు’’ చెప్పారు గోపాలరెడ్డి. దశరథ్ ఉలిక్కిపడ్డాడు. ‘‘ఏంటి సార్... మీరనేది?’’ ‘‘అవును దశరథ్! నాగార్జునగారు ఆగస్టు నుంచి డేట్లు కూడా ఇచ్చేశారు. నువ్వు రెడీ అవ్వు’’ అన్నారు గోపాలరెడ్డి. దశరథ్‌కి కాళ్లూ చేతులూ ఆడడం లేదు. ఏదో అనుకుంటే, ఇంకేదో అవుతోంది. తనకిది నిజంగా బంపర్ ఆఫరే! మరి తరుణ్ సినిమా? ‘‘లేదు లేదు... తరుణ్‌తో మేం మాట్లాడతాం. నీకేమీ ఇబ్బంది ఉండదు’’ అని గోపాలరెడ్డి భరోసా ఇచ్చారు. అయినా దశరథ్‌లో టెన్షన్ తగ్గలేదు. ‘‘సార్..! నాగార్జున లాంటి పెద్ద హీరోతో ఇప్పటికిప్పుడు సినిమా అంటే కష్టం. నా వల్ల కాదు. కథ వరకూ తీసుకోండి... ఇచ్చేస్తాను’’ అని చెప్పేశాడు.నాగార్జున దాకా వెళ్లింది విషయం. ఆయనకు దశరథ్ మీద ఫుల్ కాన్ఫిడెన్స్. తానెంతమంది కొత్త డెరైక్టర్లను చూడలేదు! మొదట్లో ఇలానే బెరుకు ఉంటుంది. ‘‘దశరథ్ రియల్ ప్రాబ్లమేంటో కనుక్కోండి’’ - మళ్లీ నాగ్ ఆదేశం. ‘‘నా మీద నాకు కాన్ఫిడెన్స్ రావాలి. నవంబర్ అయితే ఓకే. ఈలోగా నేనూ రెడీ అవుతా’’ అని చెప్పేశాడు దశరథ్. నాగ్ లాంటి స్టార్ హీరో అన్నాళ్లు ఆగుతాడా? కానీ ఆగాడు. కథ అంతలా నచ్చేసింది మరి. టైటిల్ కూడా బాగా కుదిరింది. ‘సంతోషం’. గోపీమోహన్ పెట్టాడు. ఇద్దరు హీరోయిన్లు కావాలి. ‘లగాన్’ ట్రయిలర్ రిలీజైంది ఫ్రెష్‌గా. ‘రాధా కైసాన జలే...’ అంటూ హీరోయిన్ గ్రేసీసింగ్ కవ్విస్తోంది. గ్రేసీ అయితే గ్రేస్‌ఫుల్‌గా ఉంటుందనిపించింది దశరథ్కు. ఈలోగా ‘లగాన్’ రిలీజై, బ్లాక్‌బస్టర్ అయిపోయింది. గ్రేసీకి పెద్ద క్రేజ్. అంత సులువుగా డేట్లు దొరుకుతాయా? దొరికేశాయ్. కథ నచ్చేసింది మరి! మరి ఇంకో హీరోయిన్? రకరకాల ఆప్షన్లు. ఈ వెతుకులాట ఇలా ఉండగా పబ్లిసిటీ డిజైనర్ కృష్ణ ఆఫీసుకెళ్లాడు దశరథ్. ఏదో పోస్టర్ డిజైన్ చేస్తున్నాడు కృష్ణ. ఉషాకిరణ్ మూవీస్ వాళ్ల సినిమా ‘ఇష్టం’. హీరోయిన్ కొత్తమ్మాయి. క్యూట్‌గా ఉంది. కొత్తావకాయలా ఉంది. కానీ మరీ టీనేజ్ గాళ్లా కనబడుతోంది. నాగ్ పక్కన సూటవుతుందా? ఫొటోసెషన్ పెట్టారు. అంతా ఓకే. సెకండ్ హీరోయిన్గా శ్రీయ సెలక్ట్. ఈ సినిమాలో ఓ స్పెషల్ క్యారెక్టర్ ఉంది. ఇంట్రస్టింగ్ యాక్టర్ ఎవరైనా కావాలి. ప్రభుదేవా పేరు సూచించారు గోపాలరెడ్డి. అతనుంటే సెకండాఫ్‌లో మంచి డాన్స్ సాంగ్ కూడా పెట్టొచ్చని ఐడియా. ప్రభుదేవా ఓకే అన్నాడు. త్రివిక్రమ్, చంద్రసిద్ధార్థ్, ఆర్పీ పట్నాయక్, దశరథ్, సునీల్... వీళ్లంతా ఓ గ్యాంగ్. సోమాజీగూడా ‘ట్రైలక్’ రెస్టారెంట్... వీళ్ల అడ్డా. అక్కడే వీళ్ల కెరీర్‌కు బీజాలు పడ్డాయి మరి. ఆర్పీ, దశరథ్ అక్కడే కూర్చుని పాటల గురించి మాట్లాడుకునేవారు. చంద్రసిద్ధార్థ్ రాగానే ‘‘ చందూ బాయ్..! పదండి గండిపేటకు వెళ్దాం’’ అని తొందరపెట్టేసేవారు. ఆ గ్యాంగ్‌లో చంద్రసిద్ధార్థ్ ఒక్కడికే కారు. మిగతా వాళ్లందరికీ బైక్‌లు. ఆ ట్రావెలింగ్‌లోనే మ్యూజిక్ సిట్టింగ్స్. ఓ సిట్యుయేషన్లో ఇంగ్లిషు పాట పెడదామనుకున్నారు. ఆర్పీ ఏదో ట్యూన్ చెబుతున్నాడు. కారు డ్రైవ్ చేస్తున్న చంద్రసిద్ధార్థ్ చాలా క్యాజువల్‌గా ‘సో మచ్ టు సే...’ అంటూ పాడేస్తున్నాడు. ‘‘ఈ పాట ఎందులోది?’’ అడిగాడు ఆర్పీ. ‘‘నువ్వు కట్టిన ట్యూన్‌కి నేను క్యాజువల్‌గా లిరిక్ చెప్పానంతే’’ అని భుజాలెగరేశాడు చంద్రసిద్ధార్థ్. ఆర్పీ చిన్నపిల్లాడిలా సంబరపడిపోతూ ‘‘చందూ గారూ..! ఈ ఇంగ్లిషు పాట మీరే రాయలి’’ అన్నాడు. అలా డెరైక్టర్ చంద్రసిద్ధార్థ్తో ఆ ఇంగ్లిషు పాట రాయించేశారు స్క్రిప్ట్ బాగా వచ్చింది. కానీ క్లైమాక్స్ ఏదో కొడుతోంది. డైలాగ్స్‌లో ఇంకా ఏదో నింపాలి. దశరథ్‌కి త్రివిక్రమ్ గుర్తొచ్చాడు. చిన్న మీటింగ్. క్లైమాక్స్ ప్యాట్రన్ చెప్పాడు దశరథ్. పెన్నూ పేపర్ పట్టుకోకుండా త్రివిక్రమ్ ఒక ఫ్లోలో డైలాగులు చెప్పేశాడు. అదిరింది... క్లైమాక్స్ అదిరింది. దశరథ్‌కి కాన్ఫిడెన్స్ వచ్చేసింది. 2001 నవంబర్ 15. ఊటీలో ఫస్ట్ షాట్ తీశారు. షూటింగ్ స్పీడ్‌గా సాగుతోంది. నాగార్జున, గ్రేసీసింగ్ మీద పాట. రాజు సుందరం కొరియోగ్రఫీ. ఆర్పీ వేడివేడిగా పాట చేసుకొచ్చాడు. ‘‘గల గల గోదారిలా... కిలకిలా రావే చెలి...’’ అంటూ పాట ప్లే అవుతోంది.రాజు సుందరం మొహం చిట్లించాడు. ‘‘ఛా... ఇదేం పల్లవి... నాకు నచ్చలేదు...’’. దశరథ్ గుండెల్లో రాయిపడింది. ఇదేంట్రా బాబూ... కొరియోగ్రాఫర్‌కి కూడా పాట నచ్చాలా? ఏం చెయ్యాలి? తప్పదు. రాజు సుందరం టాప్ కొరియోగ్రాఫర్ కదా! ఆర్పీకి, దశరథ్‌కి ఒకటే రూమ్. ఇద్దరూ రాత్రంతా నిద్రపోలేదు. కొత్త పల్లవి కావాలి. లిరిక్ రైటర్ కులశేఖర్‌కి కాల్ చేస్తే అవుటాఫ్ కాలింగ్ ఏరియా. ఇద్దరూ ఆ మాటా ఈ మాటా అనుకుంటూ పల్లవి రాసేశారు. ‘‘దేవుడే దిగివచ్చినా స్వర్గమే నాకిచ్చినా షాజహాన్ తిరిగొచ్చినా తాజ్‌మహల్ రాసిచ్చినా ఇప్పుడీ సంతోషం ముందర చిన్నబోతాయి అన్నీ కదరా...’’ రాజు సుందరం పల్లవి విని అదిరిందన్నాడు. సునీల్ ఫ్రెండు కాబట్టి మంచి క్యారెక్టర్ ఇవ్వాలి. కానీ ఏదో కొడుతోంది. సునీల్‌తో అదే చెప్పాడు దశరథ్. ‘‘అయితే ఓ పని చేద్దామా? నేను ప్రభుదేవాకు డాన్సు నేర్పించే సీన్ క్రియేట్ చెయ్. బల్బు పెడుతున్నట్టు, ట్యాప్ తిప్పుతున్నట్టు స్టెప్స్ నేర్పిస్తా... ఎలా ఉంది ఐడియా’’ అన్నాడు సునీల్. అందరికీ నచ్చేసింది. అప్పటికప్పుడు అనుకుని అప్పటికప్పుడు తీసేశారు సీన్. 2002 మే 9. ‘సంతోషం’ రిలీజ్. సూపర్‌హిట్ టాక్. ఇది కలో, నిజమో దశరథ్‌కి ఇంకా అర్థం కావడం లేదు. ఏదో ట్రాన్స్‌లోనే ఉన్నాడతను. వరసపెట్టి ఫోన్లు.. మెసేజ్‌లు... గ్రీటింగ్స్... బొకేలు... ఆ రోజు మధ్యాహ్నం ఇంట్లో లంచ్ చేస్తున్నాడు దశరథ్. ఫోన్ మోగింది. ‘‘కంగ్రాట్స్’’... అవతల మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్. ఆయన చెప్పాడంటే తిరుగే ఉండదు. దశరథ్ మనసు నిండిపోయింది... సంతోషంతో! - పులగం చిన్నారాయణ మీ ఫ్యూచర్ టీచర్: ‘నేను ఒక మనిషిని చంపాను’ ఈ వాక్యాన్ని భవిష్యత్ కాలం లో చెప్పండి. చింటూ: మీరు జైలుకు వెళతారు. వెరీ ఇంట్రెస్టింగ్ ఠి నాగార్జునకు ‘సంతోషం’తో ఉత్తమ నటునిగా నంది అవార్డు లభించింది. చిరంజీవి (‘ఇంద్ర’ సినిమా)తో కలసి ఈ పురస్కారాన్ని పంచుకున్నారు. ఇలా ఇద్దరు నటులకు కలిపి, ఉత్తమ నటునిగా నంది అవార్డు ఇవ్వడం ఇదే ఫస్ట్ టైమ్. తరుణ్‌తో చేద్దామనుకున్న ‘వన్ హౌస్’ స్క్రిప్టుతో ఆ తర్వాత గోపీమోహన్ డెరైక్షన్ చేయాలనుకున్నారు. ఉదయ్‌కిరణ్‌ను హీరోగా అనుకున్నారు. కుదర్లేదు.