సమయ పాలన పాటించకుండా ఇష్టానుసారంగా పాఠశాలలకు వస్తే చర్యలు తప్పవని ఇంచార్జీ ఎంఈఓ దశరథ్ ఉపాధ్యాయులకు హెచ్చరించారు.
సమయ పాలన పాటించకుండా ఇష్టానుసారంగా పాఠశాలలకు వస్తే చర్యలు తప్పవని ఇంచార్జీ ఎంఈఓ దశరథ్ ఉపాధ్యాయులకు హెచ్చరించారు. గురువారం మండలంలోని తాటిపల్లి కేజీవీబీ పాఠశాలను సందర్శించారు. సమయ పాలన పాటించని మన్‌సాన్‌పల్లి ప్రై మరీ పాఠశాల ఉపాధ్యాయుడు దుర్గప్రసాద్, మల్లారెడ్డిపేట ప్రై మరీ పాఠశాల ఉపాధ్యాయుడు అరవింద్‌కు మెమో ఇచ్చామన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచి విద్యార్థుల విద్యాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయాలన్నారు. ఉపాధ్యాయులు సమయ పాలన పాటించకుండా విద్యాభివృద్దిపై నిర్లక్ష్యంగా వ్యవహరించడం బాదాకరమని అందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తాటిపల్లి సర్పంచ్ అల్లం నవాజ్‌రెడ్డి, కేజీవీబీ పాఠశాల ప్రిన్సిపాల్ కవిత పాల్గొన్నారు.