కొత్త కొత్తగా... | 'Shaurya' song teaser innovation | Sakshi
Sakshi News home page

కొత్త కొత్తగా...

Dec 26 2015 12:50 AM | Updated on Sep 3 2017 2:34 PM

కొత్త కొత్తగా...

కొత్త కొత్తగా...

ఇందులో నాది చాలా మంచి క్యారెక్టర్. ఇదొక డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ.

‘‘ఇందులో నాది చాలా మంచి క్యారెక్టర్. ఇదొక డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ. భవిష్యత్తులో మనోజ్‌తో మరిన్ని సినిమాలు చేయాలనుకుంటున్నా’’ అని రెజీనా చెప్పారు. మంచు మనోజ్, రెజీనా జంటగా దశరథ్ దర్శకత్వంలో బేబి త్రిష సమర్పణలో శివకుమార్ మల్కాపురం నిర్మిస్తున్న ‘శౌర్య’ సాంగ్ టీజర్ ఆవిష్కరణ శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది. ఇదొక థ్రిల్లింగ్ లవ్‌స్టోరీ అని, చిత్రీకరణ మొత్తం పూర్తయిందని దశరథ్ తెలిపారు. నిర్మాత మాట్లాడుతూ - ‘‘ ‘సూర్య వర్సెస్ సూర్య’ తర్వాత మా సంస్థలో వస్తున్న సినిమా ఇది.

ఇందులో మనోజ్ చాలా కొత్త కొత్తగా కనబడతారు. జనవరిలో పాటలను, చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అని చెప్పారు. నందు, మధుమణి, శివారెడ్డి, జీవీ తదితరులు ఈ కార్యక్రమంలో మాట్లాడారు. ఈ చిత్రానికి సంగీతం: వేదా, కెమెరా: మల్హర్‌భట్ జోషి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement