మంచు హీరో బిజీ అవుతున్నాడు
ఇటీవల ఎటాక్ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చిన మంచు మనోజ్. నెక్ట్స్ సినిమా విషయంలో గ్యాప్ తీసుకున్నాడు. ఎటాక్ రిలీజ్ అయి చాలా రోజులు అవుతున్న ఇంతవరకు నెక్ట్స్ సినిమాను ప్రారంభించలేదు. అయితే శుక్రవారం మనోజ్ పుట్టిన రోజు సందర్భంగా ఫ్యూచర్ ప్రాజెక్ట్ విషయంలో క్లారిటీ ఇచ్చాడు. కాస్త బ్రేక్ తీసుకున్న మనోజ్ వరుసగా మూడు సినిమాలకు కమిట్ అయ్యాడు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ సినిమాలపై త్వరలోనే అఫీషియల్ ఎనౌన్స్మెంట్ కు రెడీ అవుతున్నాడు.
త్వరలో మనోజ్ చేయబోయే సినిమాకు వెరైటీ టైటిల్ను ఫిక్స్ చేశారు. సీతా మహాలక్ష్మీ పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమాకు మధర్ ఆఫ్ రాంబో అనే ట్యాగ్ లైన్ను యాడ్ చేశారు. ఈ సినిమాతో సాగర్ ప్రసన్న దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమా తరువాత కూడా సత్యా కె, అజయ్ ఆండ్ర్యీ అనే మరో ఇద్దరు కొత్త దర్శకులతో సినిమాలకు రెడీ అవుతున్నాడు.