నటుడు సిల్వెస్టర్ స్టాలోన్ (ఫైల్ ఫొటో)
లాస్‌ఏంజిలిస్: సోషల్ మీడియా పుణ్యమా అని బతికున్న సెలబ్రిటీలను చనిపోయినట్లుగా ప్రచారం చేస్తున్నారు. ఇలా పలువురు సెలబ్రిటీలు బతికుండగానే వాళ్లు ఇక లేరంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరగగా... మళ్లీ సెలబ్రిటీలే ఏదో ఒక వేదికగా మేం క్షేమంగానే ఉన్నాం. ఎలాంటి ప్రమాదం జరగలేదు. బతికే ఉన్నామని చెప్పుకునే పరిస్థితులు తలెత్తుతున్నాయి.
తాజాగా హాలీవుడ్ సూపర్ స్టార్ సిల్వెస్టర్ స్టాలోన్(71) చనిపోయినట్టు సోషల్ మీడియాలో వార్త చక్కర్లు కొట్టింది. ఇంటర్‌నెట్‌లో షేర్ అయిన ఫొటోలో హెయిర్ తక్కువగా ఉన్నాయనీ, ఆయనకు క్యాన్సర్ వచ్చి చనిపోయాడని జోరుగా ప్రచారం సాగింది. దీంతో స్టాలోన్ అభిమానుల్లో ఆందోళన మొదలైంది. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు ఆయనే స్వయంగా రంగంలోకి దిగారు. ‘‘ఇలాంటి వదంతులు పట్టించుకోవద్దు. నేను క్షేమంగా ఉన్నాను. సంతోషంగా, ఆరోగ్యంగా ఉన్న నేను.. ఇంకా పంచ్‌లు కొడుతున్నానంటూ’’ ట్వీటర్‌లో పేర్కొన్నారు. దీంతో ఆ రూమర్లకు ఫుల్‌స్టాప్ పడింది.
సిల్వెస్టర్ సోదరుడు ఆ వదంతులపై స్పందిస్తూ... ఇలాంటి వార్తలను పుట్టించి, పోస్ట్ చేసే వారికి సొసైటీలో స్థానం ఉండకూడదని ట్వీట్ చేశాడు. స్టాలోన్‌పై ఇలాంటి వదంతులు రావడం ఇదేం మొదటిసారి కాదు. 2016లో బ్రిటీష్ మీడియా ఈ హాలీవుడ్ హీరో చనిపోయాడనీ కథనాన్ని ప్రచురించింది. చివరిగా స్టాలోన్ తన తాజా చిత్రం ‘క్రూడ్ 2’ ప్రమోషన్‌లో భాగంగా సోషల్ మీడియాలో ఆదివారం ఒక పోస్ట్ చేశాడు. కానీ అంతలోనే ఆయన చనిపోయారంటూ వదంతులు పుట్టుకొచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment